ప్రయాణికుల చేతివాటం... రైళ్లలో బెడ్ రోల్స్ మాయం.. రూ.104 కోట్లకు పైగా నష్టం
భారతీయ రైల్వేకు ప్రయాణికులు విస్మయం కలిగించే రీతిలో నష్టాన్ని మిగిల్చుతున్నారు. ఏసీ కోచ్‌లలో ప్రయాణిస్తూ బెడ్‌రోల్స్ వంటి వస్తువులను అపహరించి ఇళ్లకు తీసుకెళుతున్నారు. గడిచిన నాలుగేళ్లలో ఏకంగా 1.27 కోట్ల బెడ్‌రోల్ వస్తువులు చోరీకి గురైనట్లు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వెల్లడైంది. దీనివల్ల లినెన్ కాంట్రాక్టర్లకు సుమారు రూ.104.51 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి.ఈ గణాంకాల ప్రకారం 2022 జనవరి నుంచి 2026 మే మధ్య కాలంలో ఈ చోరీలు జరిగాయి. కోవిడ్ మహమ్మారి తర్వాత 2022 జనవరిలో రైల్వే శాఖ ఏసీ కోచ్‌లలో బెడ్‌రోల్ సేవలను పునరుద్ధరించింది. మాయమైన వస్తువుల జాబితాలో 46.54 లక్షల ఫేస్ టవల్స్, 41.13 లక్షల బెడ్షీట్లు, 23.59 లక్షల పిల్లో కవర్లు, 12.95 లక్షల దుప్పట్లు, అలాగే 2.76 లక్షల దిండ్లు ఉన్నాయి.దేశవ్యాప్తంగా 16 రైల్వే జోన్ల పరిధిలోని 54 డివిజన్లలో ఈ చోరీలు నమోదయ్యాయి. అత్యధికంగా బికనీర్ డివిజన్లో 25.76 లక్షల వస్తువులు మాయం కాగా, రాంచీ, ఢిల్లీ, ముంబై, జోధ్‌పూర్ వంటి డివిజన్లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు, తిరుచిరాపల్లి, పాలక్కాడ్ డివిజన్లలో ఒక్క చోరీ కూడా నమోదు కాకపోవడం గమనార్హం.బెడ్‌రోల్స్ నిర్వహణ బాధ్యతలను రైల్వే శాఖ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగిస్తుంది. వస్తువులు అపహరణకు గురైనప్పుడు ఆ నష్టాన్ని కాంట్రాక్టర్లే భరించాల్సి వస్తోంది. పలు సందర్భాల్లో రైల్వే అధికారులు ఈ నష్టాన్ని కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిల నుంచి రికవరీ చేస్తున్నారు. దీంతో కాంట్రాక్టర్లు ఆ భారాన్ని కోచ్ అటెండెంట్ల వేతనాల