పొత్తి కడుపు లోపలి పొరకు ఇన్ఫెక్షన్ సోకితే శరీరంలో కనిపించే లక్షణాలు, నిర్లక్ష్యం చేయొద్దంటున్న డాక్టర్
మన పొట్ట లోపలి భాగాల్ని, అంతర్గత అవయవాల్ని కప్పి ఉంచే ఒక సన్నని పొరను "పెరిటోనియం" (Peritoneum) అంటారు. ఈ పొరకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకి తీవ్రమైన వాపు/మంట (Inflammation) కలగడాన్ని పెరిటోనిటిస్ అంటారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. పొట్టలోని ఈ తీవ్రమైన ఇన్ఫెక్షన్ వల్ల శరీరంలో మార్పులు జరిగి "సెప్సిస్" (Sepsis) అనే ప్రాణాంతక పరిస్థితికి దారితీయొచ్చు. పెరిటోనియం రావడానికి కారణాలు, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసరంగా ఎప్పుడు డాక్టర్ని కలవాలి అన్న పూర్తి వివరాల్ని డాక్టర్ అనుపమ ఎన్.కె, (సీనియర్ కన్సల్టెంట్ - మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆస్టర్ సిఎమ్ఐ హాస్పిటల్, బెంగళూరు.) అందించారు. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.పెరిటోనిటిస్ ప్రధాన లక్షణాలు తీవ్రమైన కడుపు నొప్పి: మొదట స్వల్పంగా మొదలై, హఠాత్తుగా తీవ్రమై తగ్గకుండా ఉండే నొప్పి. నొప్పి తీవ్రతకు కూర్చోవడం కూడా కష్టమవుతుంది. కడుపు ఉబ్బరం, గట్టిపడటం: కడుపు వాచిపోయి, బిగుతుగా మారి, తాకితే తీవ్రమైన నొప్పి రావడం (Tenderness). మలబద్ధకం లేదా పేగుల స్తబ్దత (Paralytic ileus): పేగుల కదలికలు తాత్కాలికంగా ఆగిపోవడం. డీహైడ్రేషన్ లక్షణాలు: నాలుక, పెదాలు ఎండిపోవడం, వేగంగా శ్వాస తీసుకోవడం. వాపు , విపరీతమైన అలసట. వేగవంతమైన గుండె స్పందన (Fast heart rate). తీవ్రమైన జ్వరం, చలి.ప్రధాన కారణాలు (Causes) పెరిటోనిటిస్ ప్రధానంగా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల వల్ల లేదా అంతర్గత రసాయన ద్రవాలు లీక్ అవ్వడం వల్ల వస్తుంది.సెకండరీ ఇన్ఫెక్షన్లు (Secondary Infections - చాలా సాధారణం) పొట్టలోని ఇతర అవయవాలు దెబ్బతిని, వాటిలోని ఇన్ఫెక్షన్ పెరిటోనియం పొరకు పాకినప్పుడు ఇది వస్తుంది. అపెండిసైటిస్ పగిలిపోవడం పేగుల్లో రంధ్రాలు పడటం (డైవర్టికులైటిస్ లేదా IBD వల్ల). కడుపులో అల్సర్లు ముదిరి కడుపు గోడకు రంధ్రం పడటం గర్భాశయ నాళం పగలడం (Ruptured ectopic pregnancy) కడుపు శస్త్రచికిత్సల (Surgeries) వల్ల ఇన్ఫెక్షన్ రావడం లేదా ఏదైనా బలమైన