
మధ్యప్రదేశ్ జైలులో సినిమాను మించిన సీన్!
మధ్యప్రదేశ్ జైలులో సినిమాను మించిన సీన్!

మధ్యప్రదేశ్ జైలులో సినిమాను మించిన సీన్!

Adilabad: మాజీ నక్సలైట్ కుర్సంగె మోతి బాయి (రాధాక్క) కన్నుమూత ఆదిలాబాద్: విప్లవోద్యమంలో దాదాపు మూడు దశాబ్దాలపాటు పనిచేసిన కుర్సంగె మోతి బాయి (రాధాక్క) సోమవారం సాయంత్రం 6 గంటలకు ఆదిలాబాద్ రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మృతికి ఉద్యమ సహచరులు సంతాపం తెలిపారు. రాధాక్క చంద్రన్న సహచరిగా ఉన్నారు. 1984లో సీపీఐ(ఎంఎల్) పీపుల్స్ వార్‌లో చేరిన ఆమె సిర్పూర్ దళంలో సభ్యురాలిగా పనిచేశారు. 1986లో పార్టీ సభ్యత్వం పొందగా.. 1989లో ఏరియా కమిటీ సభ్యురాలిగా, 2000లో ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టారు. 2003లో దండకారణ్యానికి బదిలీపై వెళ్లి క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘానికి నాయకత్వం వహించారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమె చికిత్స కోసం దండకారణ్యం నుంచి వెళ్తుండగా పాల్వంచలో అరెస్టయ్యారు. 2013 నుంచి 2016 వరకు తెలంగాణలోని వివిధ జైళ్లలో ఉన్నారు. 2016లో విడుదలయ్యారు. అనంతరం పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో సహచరుడితో కలిసి ఉంటూ.. కొంతకాలంగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో సోమవారం మృతి చెందారు. రాధాక్క అంత్యక్రియలు సెప్టెంబరు 1న ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి రోడ్లో వాన్వాట్–మామిడిగూడ మధ్యలోని లింగూగూడలో నిర్వహించనున్నట్లు తెలిపారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’

దక్షిణాది చిత్రసీమలో తీవ్ర విషాదం నెలకొంది. ఏడు దశాబ్దాల పాటు సినీ ప్రేక్షకులను అలరించిన దిగ్గజ నటి ‘షావుకారు’ జానకి (94) వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. 1950లో ఎన్టీఆర్ సరసన ‘షావుకారు’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమె, ఆ చిత్ర విజయంతో ‘షావుకారు జానకి’గా గుర్తింపు పొందారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి అగ్ర తారలందరి సరసన మెప్పించారు. బహుభాషా ప్రావీణ్యం ఉన్న ఆమె తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకునేవారు. సినిమా రంగానికి చేసిన సేవలకు గాను 2022లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు

దక్షిణాది చిత్రసీమలో చెరగని ముద్ర వేసిన సీనియర్ దిగ్గజ నటి షావుకారు జానకి (Sankaramanchi Janaki) (94) ఇకలేరు. దక్షిణాది చిత్రసీమలో చెరగని ముద్ర వేసిన సీనియర్ దిగ్గజ నటి షావుకారు జానకి (Sankaramanchi Janaki) (94) ఇకలేరు. గత కొద్ది రోజులుగా వయోభారంతో పాటు తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమె, చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె మృతితో తెలుగు, తమిళ, కన్నడ చిత్రపరిశ్రమలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. సినీ ప్రముఖులు, అభిమానులు ఆమె మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ నివాళులర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన జానకి, విజయా వారి ఆల్ టైమ్ క్లాసిక్ చిత్రం షావుకారు (1950) ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. ఆ మొదటి సినిమా పేరే ఆమె ఇంటిపేరుగా మారి షావుకారు జానకిగా చిత్రసీమలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. దాదాపు ఏడు పదుల సుదీర్ఘ నటప్రస్థానంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. అలనాటి మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేసన్లతో కథానాయికగా ఎన్నో మరపురాని చిత్రాల్లో నటించిన ఆమె, తర్వాతి కాలంలో సహాయ, అత్త, అమ్మమ్మ పాత్రల్లోనూ తనదైన ప్రతిభను కనబరిచారు. చివరగా ఆమె అన్నీ మంచి శకునములే అనే సినిమాలో కనిపించారు. ఆమె పార్థివదేహాన్ని అభిమానులు, ప్రముఖుల నివాళుల కోసం చెన్నైలోని తేనాంపేట్ నివాసంలో ఉంచారు. ఇక జానకి మరణవార్త తెలియగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మంచు విష్ణు, రాధిక శరత్ కుమార్ సహా టాలీవుడ్, కోలీవుడ్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, నడిగర్ సంఘం ప్రతినిధులు జానకి మృతికి సంతాపం తెలుపుతూ ఆమె కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని వ్యక్తపరిచారు. ఆమె అందించిన సేవలు భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెరగని గుర్తింపును అందించిన నటీమనుల్లో ఒకరు, ప్రముఖ సీనియర్ నటి, పద్మశ్రీ పురస్కార గ్రహీత 'షావుకారు' జానకి (94) మరణించారు. గత కొంతకాలంగా వయోభారంతో పాటు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె మరణంతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. షావుకారు జానకి అసలు పేరు శంకరమంచి జానకి. ఆమె 1931 డిసెంబర్ 12న ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో జన్మించారు. చిన్నతనంలోనే రేడియో నాటికల ద్వారా కళారంగంలో ప్రవేశించిన ఆమె.. తన టాలెంట్ తో మంచి గుర్తింపు సాధించింది. 1950లో ప్రముఖ దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ తెరకెక్కించిన 'షావుకారు' చిత్రంతో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) సరసన హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యారు. తొలి చిత్రంలోనే ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో 'షావుకారు' అనేది ఆమె ఇంటిపేరుగా మారిపోయింది. ఒక్క సినిమాతోనే 'షావుకారు జానకి'గా సినీ ప్రపంచంలో సుస్థిర స్థానాన్ని ఆమె సంపాదించుకున్నారు. సుదీర్ఘమైన సినిమా ప్రయాణం చేసిన అరుదైన హీరోయిన్లలో .. షావుకారు జానకి ఒకరు.దాదాపు 70 ఏళ్ల సినీ ప్రయాణంలో ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 400కు పైగా చిత్రాలలో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, శివాజీ గణేసన్, జెమిని గణేసన్, ఎంజీఆర్, రాజ్‌కుమార్ వంటి దిగ్గజ నటులందరి సరసన హీరోయిన్ గా నటించి మెప్పించింది. షావుకారు, కన్యాశుల్కం, రోజులు మారాయి, డాక్టర్ చక్రవర్తి, మంచి మనసులు, ఉయ్యాల జంపాల, అక్కచెల్లెళ్లు, దేవుడు చేసిన మనుషులు, తాయారమ్మ బంగారయ్య, బడిపంతులు వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలు ఆమె నటనా పటిమకు నిదర్శనాలు. పౌరాణిక, సాంఘిక, హాస్య, సెంటిమెంట్.. ఇలా ఏ పాత్ర ఇచ్చినా జీవించడం ఆమె నైజం. వయసు పెరిగిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, బామ్మ పాత్రల్లోనూ మెప్పించారు. 2020లో వచ్చిన 'బిస్కోత్' చిత్రంలో ఆమె

సీనియర్ నటి జానకి కన్నుమూత చెన్నై ఆస్పత్రిలో తుది శ్వాస దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రముఖులు Sowcar Janaki: తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి మెప్పించిన దిగ్గజ నటి, పద్మశ్రీ ‘షావుకారు’ జానకి(Sowcar Janaki) (94) తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా శ్వాసకోశ మరియు వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. 1931లో రాజమహేంద్రవరంలో జన్మించిన ఆమె అసలు పేరు టేకుమళ్ల జానకి కాగా, ప్రముఖ నటి కృష్ణకుమారికి ఈమె సోదరి. 1949లో ‘రక్షా రేఖ’ సినిమాతో వెండితెరకు పరిచయమై, 1950లో వచ్చిన ‘షావుకారు’ చిత్ర విజయం తర్వాత ‘షావుకారు జానకి’గా పేరు పొందారు. Rajasthan: రాజస్థాన్‌లో సీజేపీ బృందానికి షాక్.. స్కూళ్ల పరిశీలనకు వెళ్తే గ్రామస్తుల ఆగ్రహం.. రాళ్లతో దాడి ఏడు దశాబ్దాల ప్రస్థానం.. పద్మశ్రీ పురస్కారం: సుదీర్ఘమైన సినీ ప్రస్థానంలో ఆమె సుమారు 400కి పైగా చిత్రాల్లో వైవిధ్యభరిత పాత్రలు పోషించారు. ‘వద్దంటే డబ్బు’, ‘కన్యాశుల్కం’, ‘రోజులు మారాయి’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘సంసారం ఒక చదరంగం’, ‘బాబు బంగారం’ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలలో ఆమె నటన చెరగని ముద్ర వేసింది. చివరిసారిగా ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంలో నటించిన జానకికి, భారత ప్రభుత్వం 2022లో ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. ఆమె మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు

హెచ్-సిటీ (H-CITI) ప్రాజెక్టులో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనుల కారణంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్- వే ట్రాఫిక్ విధానం అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీపీ సజ్జనార్ వన్ వే ట్రాఫిక్‌పై సర్ప్రైజ్ చెక్ నిర్వహించారు. హైదరాబాద్, ఆగస్టు 20: హెచ్-సిటీ (H-CITI) ప్రాజెక్టులో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనుల కారణంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్- వే ట్రాఫిక్ విధానం అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీపీ సజ్జనార్ వన్ వే ట్రాఫిక్‌పై సర్ప్రైజ్ చెక్ నిర్వహించారు. సామాన్యుడిలా బైక్‌పై ప్రయాణిస్తూ ట్రాఫిక్‌ను పర్యవేక్షించారు. రోడ్ నంబర్ 45 నుంచి ఫిల్మ్‌నగర్ వరకు బైక్‌పై రెండు సార్లు తిరుగుతూ ట్రాఫిక్‌ను పరిశీలించారు. జంక్షన్లలో విధుల్లో ఉన్న పోలీసులతో ట్రాఫిక్‌పై సీపీ ఆరా తీశారు. మధ్యాహ్నం కూడా మరోసారి ట్రాఫిక్ సరళిపై పర్యవేక్షించారు. వన్‌వే కారణంగా తొలి రోజు వాహనదారులు కొంత అయోమయానికి గురైనప్పటికీ.. రెండో రోజు నుంచి రాకపోకలు సాఫీగా సాగుతున్నాయని సజ్జనార్ తెలిపారు. అన్ని జంక్షన్లలో స్పష్టమైన సైన్‌బోర్డులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తగినంత మంది ట్రాఫిక్ సిబ్బందిని మోహరించినట్లు వెల్లడించారు. జీహెచ్ఎంసీ, నిర్మాణ సంస్థ సమన్వయంతో H-CITY పనులు జరుగుతున్నాయన్నారు. పనులు పూర్తయ్యే వరకు వాహనదారులు సహకారించాలని కోరారు. ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని ప్రజలకు సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ఎస్సీబీఏ సీనియర్ ఎగ్జక్యూటివ్ సభ్యుడిగా రవిశంకర్ ఎన్నిక మంత్రి పొంగులేటి క్షమాపణ చెప్పడం సిగ్గుచేటు: ఎంపీ లక్ష్మణ్

కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో ఎ1 నిందితురాలిగా బెంగుళూరు పరప్పన అగ్రహార జైలులో కస్టడీలో ఉన్న నటి పవిత్ర గౌడ జీవితంలో మరొక విషాదకర అధ్యాయం చోటుచేసుకుంది. ఆమె మొదటి భర్త సంజయ్ సింగ్ కన్నుమూసినట్లు సంచలన వార్త బయటకు వచ్చింది. అయితే, ఈ ఘోర విషాదం ఇటీవల జరిగింది కాదు. సుమారు 7 నుండి 8 నెలల క్రితమే రాజస్థాన్‌లో తుదిశ్వాస విడిచారనే వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చి పరిశ్రమ వర్గాలని, ప్రజలని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. సంజయ్ సింగ్, పవిత్ర గౌడల బంధం వెనుక పెద్ద కథే ఉంది. వీరిద్దరి ప్రయాణం 2007-2008 కాలంలో ఒకరినొకరు ప్రేమించుకోవడంతో ప్రారంభమైంది. ఆ ప్రేమ కాస్తా పెళ్లి పీటల దాకా వెళ్లి ఇద్దరూ దంపతులుగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వీరికి ఖుషీ గౌడ అనే కుమార్తె కూడా జన్మించింది. అయితే, మనస్పర్థలు మరియు వ్యక్తిగత విబేధాల కారణంగా వీరి వైవాహిక బంధం ఎక్కువ కాలం నిలవలేదు. పరస్పర అంగీకారంతో 2013లో వీరు అధికారికంగా విడాకులు తీసుకుని వేర్వేరు మార్గాల్లో పయనించడం ప్రారంభించారు. విడాకుల తర్వాత సంజయ్ సింగ్ తీవ్ర మానసిక కుంగుబాటుకు గురయ్యారని సమాచారం. విడాకుల అనంతరం ఆయన మద్యపానానికి తీవ్రంగా బానిసయ్యారాని మీడియా వర్గాలు వెల్లడించాయి. విపరీతమైన ఆల్కహాల్ అలవాటు వల్ల ఆయన కాలేయ సంబంధిత వ్యాధులకు (లవర్ కాంప్లికేషన్స్) గురయ్యారు. బెంగళూరు వదిలి రాజస్థాన్‌కు వెళ్లిన ఆయన అక్కడ కొన్ని నెలల పాటు తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు. చికిత్స ఫలించక 7 నుంచి 8 నెలల కిందటే తన స్వస్థలంలో మరణించారు. రేణుకాస్వామి హత్య కేసు విచారణ సమయంలోనే సంజయ్ సింగ్ పేరు తొలిసారిగా మీడియా ముందుకు వచ్చింది. ఆ సమయంలో పవిత్రతో తన గతాన్ని, 2013 నాటి విడాకుల వివరాలను ఆయన బహిరంగంగానే పంచుకున్నారు. ఆ తర్వాత సైలెంట్‌గా ఉండిపోయిన ఆయన మరణవార్త

జూనియర్ ఎన్టీఆర్‌కి ప్రియమైన పెంపుడు కుక్క 'బఘీరా' మృతి చెందింది. గత నాలుగేళ్లుగా తనతో పాటు కుటుంబంలో ఒకడిగా ఉన్న బఘీరాను కోల్పోవడంతో ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సోషల్ మీడియా వేదికగా బఘీరా ఫోటోలను షేర్ చేస్తూ ఎంతో భావోద్వేగమైన సందేశాన్ని రాసుకొచ్చారు తారక్. స్క్రీన్‌పై ఎంతో పవర్ ఫుల్ గా కనిపించే ఎన్టీఆర్.. తన పెంపుడు కుక్క 'బఘీరా' మృతితో ఎమోషనల్ అయ్యారు. తారక్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో బఘీరాను ఎంతో ఆప్యాయంగా హత్తుకున్న ఫోటోతో పాటు మరికొన్ని ఫోటోలను షేర్ చేస్తూ, రాసుకొచ్చిన ఆ ఎమోషనల్ వర్డ్స్ ప్రతి ఒక్కరి గుండెను పిండేస్తున్నాయి. "బఘీరా, నువ్వు నా ప్రపంచంలోకి ఒక తోడుగా వచ్చావు, నెమ్మదిగా నా కుటుంబంలో ఒకరిగా మారిపోయావు. ప్రేమ, విశ్వాసం, అల్లరి, కేవలం నువ్వు మాత్రమే ఇవ్వగలిగే ఒక ప్రత్యేకమైన కంఫర్ట్ తో నా రోజులను నింపావు. నువ్వు లేని ఈ లోటు సృష్టించిన నిశ్శబ్దం ఎంత పెద్దదో, నువ్వు మిగిల్చిన ప్రేమ కూడా అంతే గొప్పది. నన్ను ఎంచుకున్నందుకు, నా పక్కనే నడిచినందుకు, ఈ 4 సంవత్సరాల కాలాన్ని అందంగా మార్చినందుకు థ్యాంక్స్ బఘీరా. స్వేచ్ఛగా పరుగెత్తు మై లిటిల్ వన్. నిన్ను ప్రాణంగా ప్రేమించాం, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం" అంటూ ఎన్టీఆర్ రాసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెట్స్ పెంచుకునే ప్రతి ఒక్కరికీ ఈ బాధ ఎంతో బాగా అర్థమవుతుంది. ఎన్టీఆర్ షేర్ చేసిన ఆ ఎమోషనల్ నోట్ చూసి నందమూరి అభిమానులతో పాటు, సినీ ప్రముఖులు, నెటిజన్లు.. "రెస్ట్ ఇన్ పీస్ బఘీరా" అని ఎమోషనల్ కామెంట్స్ పెడుతున్నారు. చిరంజీవి డైరెక్టర్ తో నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ! రామ్ పోతినేనికి విలన్‌గా మారిన ఆ స్టార్ హీరో!

సీనియర్ సంగీత దర్శకుడు అర్జున్ అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. తెలుగు, తమిళ, కన్నడ, భోజ్ పురి భాషల్లో వందకు పైగా చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. సీనియర్ సంగీత దర్శకుడు అర్జున్ (72) అనారోగ్య కారణంగా ఆగస్ట్ 10వ తేదీ రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. అర్జున్ అసలు పేరు యు. మల్లికార్జున శర్మ. కడపలో 1954 జూలై 11న ఆయన జన్మించారు. యుక్త వయసులోనే సంగీతం మీద మక్కువతో చెన్నై చేరి జి.కె. వెంకటేశ్, చక్రవర్తి తదితర ప్రముఖ సంగీత దర్శకుల దగ్గర పనిచేశారు. ఆ తర్వాత చెన్నయ్ లో దాదాపు ఆరువందల మ్యూజిక్ ఆల్బమ్స్ కు స్వరాలు సమకూర్చారు. 2004లో హైదరాబాద్ వచ్చిన మల్లికార్జున శర్మ... అర్జున్ పేరుతో సినీ సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. తెలుగు, కన్నడ, భోజ్ పురి, తమిళ భాషల్లో వందకు పైగా చిత్రాలకు సంగీతం అందించారు. అర్జున్ శర్మ కుటుంబ సభ్యులంతా సంగీతానికే అంకితమయ్యారు. ఆయన భార్య రాణి పులోమజా దేవి గీత రచయిత్రగా చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు. అర్జున్ స్వరపర్చిన అనేక చిత్రాలకు ఆమె పాటలు రాశారు. తెలుగు సినిమాలలో అత్యధిక పాటలు రాసిన గీత రచయిత్రిగా ఆమె గుర్తింపు పొందారు. పదకొండేళ్ళ క్రితం, 2015లో రాణి పులోమజా దేవి అనారోగ్యంతో కన్నుమూశారు. వీరికి ఇద్దరు కుమారులు. అందులో ఒకరు జానకిరామ్, కాగా మరొకరు ప్రద్యోతన్. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రామ సత్యనారాయణ నిర్మించిన 'ఐస్ క్రీమ్' సినిమాతో ప్రద్యోతన్ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత బెంగళూరుకు మకాం మార్చిన ప్రద్యోతన్ ఇంతవరకూ 18 కన్నడ చిత్రాలకు సంగీతం అందించారు. మరో ఐదు చిత్రాలకు సంగీతం సమకూర్చుతున్నారు. తెలుగులో లో-బడ్జెట్ సినిమాలు నిర్మించే వారందరికీ సంగీత దర్శకుడు అర్జున్ దన్నుగా నిలిచేవారు. పరిమితమైన బడ్జెట్ లో వారి చిత్రాలకు అర్జున్ సంగీతాన్ని సమకూర్చేవారు. పోసాని 'జెంటిల్ మేన్', 'బుల్లబ్బాయ్, సర్కార్, పరంపర
Jio New Plans: దేశీయ దిగ్గజ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు పండగే. జియో తన ఓటీటీ పాస్ పోర్ట్ ఫోలియోను మరింత విస్తరించింది (Jio OTT Pass). ఇప్పటికే28 రోజుల వ్యాలిడిటి గల రూ.200 ఓటీటీ పాస్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త మరో 2 ఓటీటీ ప్లాన్లను లాంచ్ చేసింది. కొత్తగా 3 నెలలు, ఏడాది వ్యాలిడిటీతో ఈ ప్లాన్లను ప్రవేశపెట్టింది. రూ.550, రూ.2000 లతో జియో ఓటీటీ ప్లాన్లను అందిస్తోంది. వినోదం కోరుకునే యూజర్లే లక్ష్యంగా, దీర్ఘకాల సబ్స్క్రిప్షన్ కోసం ఈ ప్లాన్లను లాంచ్ చేసినట్లు జియో తెలిపింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.రూ.550 ప్లాన్ వివరాలుకొత్తగా తీసుకొచ్చిన ఈ రెండు ఓటీటీ పాస్‌లను ఆగస్టు 7 నుంచే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. రూ.550 ఓటీటీ పాస్ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 90 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. అపరిమిత 5జీ వస్తుంది. అయితే, ఇందులో వాయిస్ కాల్స్ ఉండవు. 3 నెలలు, ఏడాది వ్యాలిడిటీ ఉండే బేస్ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకున్న జియో సబ్స్క్రైబర్లకు ఈ ప్లాన్ వర్తిస్తుంది.రూ.2000 ప్లాన్ వివరాలుఈక 2000 ఓటీటీ పాస్ రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. దీంతో పాటు 365 జీబీ హైస్పీడ్ డేటా వస్తుంది. అన్లిమిటెడ్ 5జీ లభిస్తుంది. ఏడాది బేస్ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. ఇందులోనూ ఎలాంటి వాయిస్ కాల్స్ రావు. 15 ప్రీమియం ఓటీటీ యాప్‌లు, జియో టీవీలో 1000కిపైగా ఛానెళ్లు వీక్షించవచ్చని జియో తెలిపింది. ఈ ప్లాన్ల ద్వారా రూ.1500 విలువైన నెలవారీ ప్రయోజనాలను పొందొచ్చని తెలిపింది. ఈ ప్యాక్ ద్వారా యూజర్లు టీవీ, టాబ్లెట్, మొబైల్ పరికరాల్లో ప్రకటనలు లేకుండా, బ్యాక్ గ్రౌండ్ ప్లే చేస్తూ యూట్యూబ్ ప్రీమియం సైతం యాక్సెస్

ప్రపంచ ఫుట్‌బాల్ రంగాన్ని శాసించిన మహా దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ జీవితంలో తీరని శోకం అలముకుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులకు ఎనలేని ఆనందాన్ని పంచిన ఆ విలువై ఆటగాడి వెనుక నిలబడిన కొండంత అండ ఇక లేరు. మెస్సీని ఒక సామాన్య బాలుడి నుంచి ప్రపంచ ఫుట్‌బాల్ రాజకుమారుడిగా తీర్చిదిద్దడంలో అహర్నిశలు శ్రమించిన ఆయన తండ్రి జార్జ్ మెస్సీ కన్నుమూశారు. 68 ఏళ్ల వయసులో శుక్రవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు అర్జెంటీనా స్పెయిన్‌కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. అర్జెంటీనాలోని మెస్సీ స్వస్థలమైన రొసారియో నగరంలో జార్జ్ మెస్సీ కన్నుమూసినట్లు సమాచారం రావడంతో క్రీడా ప్రపంచం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. లియోనెల్ మెస్సీ ఫుట్‌బాల్ కెరీర్‌ను పునాది స్థాయి నుంచి మలచడంలో ఆయన తండ్రి జార్జ్ మెస్సీ పాత్ర అత్యంత కీలకమైనది. చిన్నతనం నుంచే కొడుకులోని అద్భుతమైన ప్రతిభను గుర్తించి, ప్రతి అడుగులోనూ కొండంత మద్దతుగా నిలిచారు. క్రమశిక్షణ, స్పష్టమైన విజన్, అమితమైన ఆప్యాయతతో తన కుమారుడిని అత్యున్నత శిఖరాలకు చేర్చడంలో జార్జ్ ఒక బలమైన స్తంభంలా నిలబడ్డారు. మెస్సీ తొలిసారిగా ఫుట్‌బాల్ ఓనమాలు దిద్దిన ప్రముఖ క్లబ్ 'న్యూవెల్స్ ఓల్డ్ బాయ్స్' సోషల్ మీడియా వేదికగా తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ సంతాపాన్ని ప్రకటించింది. 68 ఏళ్ల వయసులో రొసారియోలో జార్జ్ కన్నుమూశారని పేర్కొంటూ, మెస్సీ కుటుంబానికి తమ గాఢ సానుభూతిని తెలియజేసింది. తన కుమారుడికి చిన్నతనంలోనే న్యూవెల్స్ క్లబ్ రంగులను ప్రేమించడం నేర్పినందుకు జార్జ్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిన ఆ క్లబ్, జార్జ్ భార్య సెలియా కుచిట్టినీతో పాటు కుమారులు లియోనెల్, రోడ్రిగో, మాటియాస్, కుమార్తె మారియా సోల్‌కు తమ సంతాపాన్ని పంచుకుంది. జార్జ్ మెస్సీ గత కొంతకాలంగా తీవ్ర ఆరోగ్య సమస్యలు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఇటీవల ముగిసిన ఫిఫా ప్రపంచకప్ టోర్నీ సమయంలోనే