
సూపర్ కారుబ్రో.. నిస్సాన్ కొత్త టెక్టన్ చూశారా? ఫీచర్లు అరాచకం.. ధర ఎంతో తెలుసా
SUV మార్కెట్లోకి నిస్సాన్ టెక్టన్ లాంచ్ రూ. 10.49 లక్షల ధరకు నిస్సాన్ విడుదల అడ్వాన్స్ ఫీచర్లతో జూలై 20న డెలివరీలు Nissan Tekton Launch : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారతీయ SUV మార్కెట్లో గట్టిపోటీ నెలకొంది. కార్ల తయారీదారులు కొత్త SUV మోడల్స్ మార్కెట్లోకి దించుతున్నారు. జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటో సంస్థ నిస్సాన్ కూడా కొత్త మిడ్-సైజ్ SUV టెక్టన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కొత్త నిస్సాన్ టెక్టన్ రూ. 10.49 లక్షల ప్రారంభ ధరతో వచ్చింది. బుకింగ్‌లు ప్రారంభమైన కేవలం 11 రోజుల తర్వాత జూలై 20న డెలివరీలు కూడా మొదలయ్యాయి. భారత మార్కెట్లో లాంచ్ చేసిన నిస్సాన్ ఇతర కార్లలో బుకింగ్ డెలివరీ మధ్య ఇంత తక్కువ సమయం ఉండటం ఇదే ఫస్ట్ టైమ్ అని కంపెనీ పేర్కొంది. భారత మార్కెట్లో కొత్త నిస్సాన్ టెక్టన్ లాంచ్ : కొత్త నిస్సాన్ టెక్టన్, రెనాల్ట్ డస్టర్ మాదిరిగానే అదే ప్లాట్‌ఫామ్‌పై తయారైంది. ఈ రెండు SUV మోడల్స్ ఒకే నిర్మాణంతో డిజైన్ పూర్తిగా మారింది. ఈ SUV ఫ్రంట్ సైడ్ కంపెనీ ఫ్లాగ్షిప్ ప్యాట్రోల్ SUV మోడల్ మాదిరిగా కొత్త గ్రిల్, ఎల్ఈడీ హెడ్లైట్లు, C-ఆకారపు డీఆర్ఎల్స్, కొత్త 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ బాడీ-కలర్ టెయిల్‌గేట్ కొత్త స్టైలింగ్ స్పెషాలిటీని అందిస్తుంది. కొత్త నిస్సాన్ టెక్టాన్ ఫీచర్లు : కొత్త నిస్సాన్ టెక్టాన్ అనేక అడ్వాన్స్ ఫీచర్లతో వస్తుంది. 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్ప్లే గూగుల్ మ్యాప్స్ జెమిని సపోర్టు 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆర్కామిస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ వైర్లెస్ మ్యాగ్‌సేఫ్ ఛార్జర్ డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ పనోరమిక్ సన్‌రూఫ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఎయిర్ క్లీన్ మిషన్స్ కారులో సేఫ్టీ ఫీచర్లు ఇవే : 6
