© 2026 nimisham.in

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Nissan Tekton Price: భారతీయ మిడ్-సైజ్ SUV మార్కెట్లో దూసుకుపోయేందుకు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ ఇండియా సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. ఎంతో కాలంగా కార్ల లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త కాంపాక్ట్ SUV నిస్సాన్ టెక్టాన్ (Nissan Tekton)ను కంపెనీ అధికారికంగా మార్కెట్లోకి ఈ రోజు విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.10.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించిన్నట్లు కంపెనీ అధికారంగా వెల్లడించింది. ఈ మోడల్‌తో నిస్సాన్ సంస్థ భారత మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్తో పాటు టాటా సియెర్రా వంటి కార్లకు గట్టి పోటీని ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అద్భుతమైన డిజైన్.. నిస్సాన్ సంస్థ తన గ్లోబల్ ఫ్లాగ్షిప్ మోడల్ అయిన పెట్రోల్ SUVను దృష్టిలో పెట్టుకుని ఈ టెక్టాన్‌ను తయారు చేసిన్నట్లు తెలుస్తోంది.. అందుకే దీనిని ఆటోమొబైల్ నిపుణులు బేబీ పెట్రోల్‌గా పిలుస్తున్నాయి. ముందు భాగంలో అప్రైట్ ఫాసియా.. ఎల్-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్లు (LED DRLs)తో పాటు వెడల్పైన గ్రిల్, బోనెట్ కింద కనెక్ట్ చేసిపన లైట్‌బార్ కారుకు రోడ్ ప్రెజెన్స్‌ను, అద్భుతమైన రూపాన్ని అందిస్తాయి.. వెనుక భాగంలో రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్, సీ-షేప్డ్ కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్‌తో పాటు టెక్టాన్ బ్రాండింగ్ ఆకట్టుకుంటున్నాయి. ఈ SUV 212 mm గ్రాండ్ క్లియరెన్స్‌తో అందుబాటులోకి వచ్చింది. లగ్జరీ ఇంటీరియర్.. కారు లోపలి భాగం అద్భుతమైన టెక్నాలజీతో పాటు లగ్జరీతో అందుబాటులోకి వచ్చింది.. గూగుల్ ఇన్‌బిల్ట్ సపోర్ట్‌తో కూడిన 10.1-ఇంచుల భారీ టచ్‌స్క్రీన్
ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో పాటు 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా అద్భుతమైన పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీట్స్‌తో పాటు వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్స్ లభించబోతున్నాయి. ఇవే కాకుండా 360-డిగ్రీ కెమెరాతో పాటు 48-కలర్ యాంబియంట్ లైటింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా అందుబాటులోకి రావడం విశేషం..
శక్తివంతమైన ఇంజన్.. నిస్సాన్ టెక్టాన్ ప్రధానంగా రెండు టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది.. ఇందులో మొదటిది.. 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్.. ఇది 100 PS పవర్‌తో పాటు 160 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని కంపెనీ వెల్లడించింది. అలాగే ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక రెండవది.. 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్.. ఇది మరింత శక్తివంతమైనదిగా కంపెనీ తెలిపింది. ఇది 163 PS పవర్‌తో పాటు 280 Nm టార్క్‌ను అందిస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్, DCT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కూడా అందించిన్నట్లు తెలుస్తోంది.
5 స్టార్ రేటింగ్.. నిస్సాన్ టెక్టాన్ భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడలేదని తెలుస్తోంది.. ఇది SUV భారత్ NCAP (BNCAP) క్రాష్ టెస్టింగ్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించిందని కంపెనీ తెలిపింది.. ఇందులో బేసిక్ వేరియంట్ నుంచే 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్‌తో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) సపోర్ట్ అందుబాటులో ఉన్నాయి.. అలాగే అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ (Level 2 ADAS) ఫీచర్ కూడా టాప్ వేరియంట్లలో అందుబాటులో లభిస్తాయి..
బుకింగ్స్.. డెలివరీలు వివరాలు.. రెనాల్ట్-నిస్సాన్ అలయన్స్ RGMP ప్లాట్‌ఫారమ్‌పై తయారైన ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. జూలై 20 నుంచి కస్టమర్లకు డెలివరీలు ప్రారంభమవుతాయని నిస్సాన్ ఇండియా ప్రకటించింది. క్రెటా, సెల్టోస్, సియెర్రాల డిమాండ్ నడుస్తున్న ఈ సమయంలో మిడ్-సైజ్ SUV విభాగంలో నిస్సాన్ టెక్టాన్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సిందే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.