© 2026 nimisham.in

SUV మార్కెట్లోకి నిస్సాన్ టెక్టన్ లాంచ్ రూ. 10.49 లక్షల ధరకు నిస్సాన్ విడుదల అడ్వాన్స్ ఫీచర్లతో జూలై 20న డెలివరీలు Nissan Tekton Launch : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారతీయ SUV మార్కెట్లో గట్టిపోటీ నెలకొంది. కార్ల తయారీదారులు కొత్త SUV మోడల్స్ మార్కెట్లోకి దించుతున్నారు. జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటో సంస్థ నిస్సాన్ కూడా కొత్త మిడ్-సైజ్ SUV టెక్టన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కొత్త నిస్సాన్ టెక్టన్ రూ. 10.49 లక్షల ప్రారంభ ధరతో వచ్చింది. బుకింగ్‌లు ప్రారంభమైన కేవలం 11 రోజుల తర్వాత జూలై 20న డెలివరీలు కూడా మొదలయ్యాయి. భారత మార్కెట్లో లాంచ్ చేసిన నిస్సాన్ ఇతర కార్లలో బుకింగ్ డెలివరీ మధ్య ఇంత తక్కువ సమయం ఉండటం ఇదే ఫస్ట్ టైమ్ అని కంపెనీ పేర్కొంది. భారత మార్కెట్లో కొత్త నిస్సాన్ టెక్టన్ లాంచ్ : కొత్త నిస్సాన్ టెక్టన్, రెనాల్ట్ డస్టర్ మాదిరిగానే అదే ప్లాట్‌ఫామ్‌పై తయారైంది. ఈ రెండు SUV మోడల్స్ ఒకే నిర్మాణంతో డిజైన్ పూర్తిగా మారింది. ఈ SUV ఫ్రంట్ సైడ్ కంపెనీ ఫ్లాగ్షిప్ ప్యాట్రోల్ SUV మోడల్ మాదిరిగా కొత్త గ్రిల్, ఎల్ఈడీ హెడ్లైట్లు, C-ఆకారపు డీఆర్ఎల్స్, కొత్త 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ బాడీ-కలర్ టెయిల్‌గేట్ కొత్త స్టైలింగ్ స్పెషాలిటీని అందిస్తుంది. కొత్త నిస్సాన్ టెక్టాన్ ఫీచర్లు : కొత్త నిస్సాన్ టెక్టాన్ అనేక అడ్వాన్స్ ఫీచర్లతో వస్తుంది. 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్ప్లే గూగుల్ మ్యాప్స్ జెమిని సపోర్టు 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆర్కామిస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ వైర్లెస్ మ్యాగ్‌సేఫ్ ఛార్జర్ డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ పనోరమిక్ సన్‌రూఫ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఎయిర్ క్లీన్ మిషన్స్ కారులో సేఫ్టీ ఫీచర్లు ఇవే : 6
ఎయిర్‌బ్యాగులు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) 360 డిగ్రీల కెమెరా ISOFIX చైల్డ్ సీట్ మౌంట్ స్థాయి-2 అడాస్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు సీట్ బెల్ట్ రిమైండర్ కొత్త నిస్సాన్ టెక్టాన్ ఇండియా NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కూడా పొందింది. ఈ SUV అడల్ట్ ప్రయాణీకుల సేఫ్టీ కోసం 32కి 30.49 కిడ్స్ సేఫ్టీ కోసం 49కి 45 స్కోర్ చేసింది. Read Also : E20 Petrol Price : E20 పెట్రోల్‌పై కేంద్రం షాకింగ్ క్లారిటీ.. 5శాతం మైలేజీ తగ్గినా ధర ఎందుకు తగ్గదంటే? అసలు రీజన్ ఇదే! కొత్త నిస్సాన్ టెక్టన్ ఇంజిన్ మైలేజ్ : కొత్త నిస్సాన్ టెక్టన్ రెండు టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ : 100 PS పవర్ 166Nm టార్క్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మైలేజ్ 19.4kmpl వరకు 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ : 163 పీఎస్ పవర్ 280Nm టార్క్ మాన్యువల్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ (DCT) ఆప్షన్లు 17.8 నుంచి 18.5 కిలోమీటర్ల వరకు మైలేజ్