
జూన్ 2026 CSIR UGC NET ఫలితాలు విడుదల
జూన్ 2026 CSIR UGC NET ఫలితాలు విడుదల

జూన్ 2026 CSIR UGC NET ఫలితాలు విడుదల

జూన్ 2026 UGC NET పరీక్షకు సమాధాన కీ విడుదల

UGC NET Re-Exam Answer Key 2026 Released; సెప్టెంబర్ 13 వరకు అభ్యంతరాలు నమోదు చేసుకోండి

టీమ్ఇండియా క్రికెటర్ సంజూ శాంసన్‌కు (Sanju Samson) ఘోర అవమానం జరిగింది అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుతోంది

ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు అవకాశం కేబినెట్లో ఖాళీ అయిన 3 బెర్తుల భర్తీ అంశంపై చర్చ మంత్రివర్గ కూర్పుపై చర్చలు సాగిస్తున్నట్టు ప్రచారం Telangana Cabinet Expansion : తెలంగాణ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ అంశం మరింత హీట్ పెంచుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రస్తుత రాజకీయ పరిణామాల మధ్య వచ్చే ఆదివారం (సెప్టెంబర్ 6) నాడు తెలంగాణ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్ ఉందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. కేబినెట్ లో భారీగా మార్పులకు ఛాన్స్ : కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడంతో కేబినెట్లో ఖాళీ అయిన 3 బెర్తులను భర్తీ చేసే అంశంపై కాంగ్రెస్ నేతల్లో ఆశలను రేకిత్తిస్తోంది. ఈ కేబినెట్ విస్తరణ సమయంలో విస్తృత మార్పులకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానంతో మంత్రివర్గ కూర్పుపై చర్చలు సాగిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ముహుర్తం ఖరారైనట్టేనా? : ప్రస్తుత రాజకీయ సమీకరణాలను పరిశీలిస్తే.. ఆదివారం వరకే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ‘ముహూర్తం’ ఖరారయ్యే అవకాశంపై జోరుగా అంచనాలు పెరుగుతున్నాయి. కేవలం ఒక్కరి తొలగింపుతో ఆగకుండా ఖాళీగా ఉన్న స్థానాలు, పెండింగ్‌లో ఉన్న శాఖల విషయంలో పూర్తి రీ-అరేంజ్మెంట్ జరగవచ్చని భావిస్తున్నారు. Read Also : Telangana Cabinet Expansion : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ.. ఖాళీ బెర్తులపై ఎవరికి ఛాన్స్? వారికే బెర్త్ దక్కనుందా? : ఈ విస్తరణలో ఎవరి ఛాన్స్ ఉంటుందనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. అయినా బీసీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేల ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. అలాగే, కొందరు సీనియర్ నేతలకు, పార్టీకి సేవలతో పాటు రాజకీయ సమీకరణల ప్రభావంతో కీలక బెర్తులు దక్కే అవకాశాలపై కాంగ్రెస్ వర్గాలు

మంత్రి పదవి నుంచి తనను తొలగించడంపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సురేఖను తొలగించకపోతే తాను తప్పుకొంటానని అధిష్ఠానాన్ని రేవంత్ బెదిరించారని ఆమె వ్యాఖ్యానించారు. లోక్‌భవన్ నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడకముందే.. తన బర్తరఫ్‌ను ఆమె ధ్రువీకరించారు. ఈ సందర్భంగా టీవీ9తో మాట్లాడిన సురేఖ పలు కీలక విషయాలను వెల్లడించారు.తనను తొలగించే ముందు కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదని సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. తన వివరణ కూడా తీసుకోలేదని, రాజీనామా చేయాలని కూడా ఎవరూ చెప్పలేదన్నారు. అధిష్ఠానం నుంచి తనకు ఎలాంటి సమాచారం రాలేదని చెప్పారు. తనతో మాట్లాడి వివరణ తీసుకుని ఉండాల్సిందని అన్నారు.తనపై వేం నరేందర్‌రెడ్డి, తిరుపతి రెడ్డి, కొండల్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి కుట్ర చేశారని సురేఖ ఆరోపించారు. అయితే తదుపరి కార్యాచరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తాను తప్పు చేశాననే భావన లేదన్నారు.తన కుమార్తె కొండా సుస్మిత మాట్లాడిన మాటలను పొంగులేటి సుధాకర్‌రెడ్డి రాజకీయంగా ఉపయోగించుకున్నారని ఆరోపించారు. సుస్మిత స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని, ఆమె అభిప్రాయాలను తాము ఖండించాల్సిన అవసరం లేదన్నారు. ఆమెతో తాము మాట్లాడించలేదని స్పష్టం చేశారు.రేవంత్‌రెడ్డిని చాలామంది విమర్శిస్తున్నా.. తన విషయంలోనే ఎందుకు ఇంత తీవ్రంగా స్పందించారో సీఎం ఆత్మపరిశీలన చేసుకోవాలని సురేఖ అన్నారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడు కావాలని కోరుకున్నవారిలో తామే ముందున్నామని గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తర్వాత తాను ఎక్కువగా అభిమానించింది రేవంత్‌రెడ్డినేనని చెప్పారు.ప్రస్తుతం పార్టీ మారే ఆలోచన

బర్తరఫ్‌పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు నా కుమార్తె వ్యాఖ్యలకు నన్నెలా బాధ్యురాలిని చేస్తారు? మంత్రి పదవి నుంచి తొలగింపుపై రేవంత్‌కు సూటి ప్రశ్న నేను ఎమ్మెల్యే గా కొనసాగుతా.. నియోజకవర్గం ప్రజలకు సేవ చేస్తా Konda Surekha : తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తనను కేబినెట్ నుంచి తొలగించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయాన్ని కొండా సురేఖ తీవ్రంగా తప్పుబట్టారు. అసలు నిర్ణయం తీసుకునే ముందు కనీసం తన వివరణ తీసుకోవాల్సిందని అన్నారు. ముఖ్యంగా తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడాన్ని ఆమె సూటిగా ప్రశ్నించారు. మంత్రి పదవి నుంచి తొలగింపుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేశారు. కూతురు వ్యాఖ్యలకు తనను శిక్షించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజీనామా చేయమంటే నేనే చేసేదాన్ని : “రాజీనామా చేయమంటే నేనే చేసేదాన్ని.. నేను తప్పు చేసి ఉంటే బర్తరఫ్ చేసినా బాగుండేది. కానీ, ఎలాంటి అవకాశం ఇవ్వకుండా తొలగించడం బాధాకరం” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి ఒక ఆభరణం మాత్రమేనని, గతంలోనూ పదవికి తన చేతులతోనే రాజీనామా చేసిన సందర్భం ఉందని కొండా సురేఖ గుర్తుచేశారు. తాను పార్టీని కానీ, ప్రభుత్వాన్ని కానీ విమర్శించలేదని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్‌లోనే పలువురు నేతలు పార్టీపై, అగ్రనేతలపై విమర్శలు చేసిన సందర్భాలను ప్రస్తావించారు. తన విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించారని విమర్శించారు. Read Also : Konda Surekha : పదవి ఉంది.. పవర్ లేదు! హైకమాండ్‌కు కొండా సురేఖ సంచలన లేఖ ఆ నేత వ్యాఖ్యలపై చర్యలేంటి? : మరోవైపు, పార్టీలో ఇతర నేతల వివాదాస్పద వ్యాఖ్యలపై అధిష్ఠానం తీసుకున్న చర్యలపై కూడా కొండా సురేఖ ప్రశ్నించారు. ప్రభుత్వ పనితీరుపైనా కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు సంతోషంగా ఉన్నారా అనే విషయాన్ని

ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ) చైర్మన్‌గా మోహిత్ జైన్ ఎన్నికయ్యారు. బెన్నెట్ కోల్మన్ అండ్ కో లిమిటెడ్ (బీసీసీఎల్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (పబ్లిషింగ్), బోర్డు... న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ) చైర్మన్‌గా మోహిత్ జైన్ ఎన్నికయ్యారు. బెన్నెట్ కోల్మన్ అండ్ కో లిమిటెడ్ (బీసీసీఎల్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (పబ్లిషింగ్), బోర్డు సభ్యుడిగా ఉన్న మోహిత్ జైన్ 2026-27 సంవత్సరానికి గాను ఏబీసీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో 43 ఏళ్ల తర్వాత బీసీసీఎల్‌కు చెందిన ప్రతినిధి మరోసారి ఏబీసీ చైర్మన్ పదవిని చేపట్టినట్లయింది. ప్రింట్ మీడియా రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న మోహిత్ జైన్.. ప్రచురణ, వ్యాపార కార్యకలాపాలు, పరిశ్రమ వ్యవహారాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. కెమికల్ ఇంజనీరింగ్‌తో పాటు ఎంబీఏ చదివిన జైన్.. 2021-22లో ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) అధ్యక్షుడిగా సేవలందించారు. రెండు దశాబ్దాలకు పైగా ఐఎన్ఎ్సతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ప్రపంచ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ గ్లోబల్ సూపర్వైజరీ బోర్డులోనూ మోహిత్ జైన్ మూడేళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్ దక్షిణాసియా విభాగం బోర్డు వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. కాగా, ఏబీసీ డిప్యూటీ చైర్మన్‌గా విక్రమ్ సఖుజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

ఉజ్జయిని: శ్రావణ, భాద్రపద మాసాల్లో ఉజ్జయిని మహాకాళి (Ujjain Mahakal) అమ్మవారి వార్షిక ఉత్సవాలను తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఈసారి వేడుకల్లో అధునాతన సాంకేతికత ప్రతిబింబించేలా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో మానవ రూపంలో ఉన్న ఓ రోబో (Humanoid Robot) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒంటికాలితో గెంతుతూ స్కూల్‌కు ఏడేళ్ల చిన్నారి.. ఇందౌర్‌కు చెందిన ఓ ప్రైవేటు సంస్థ రూపొందించిన మానవ ఆకారంలో ఉన్న ఓ రోబోను వార్షిక ఉత్సవాలకు తీసుకొచ్చారు. అది స్థానిక రామ్ ఘాట్‌కు చేరుకోగానే అక్కడున్న పూజారులు దాని చేతికి కంకణం, మెడకు రుద్రాక్ష మాలతోపాటు కాషాయ కండువాను కప్పారు. దీంతో ఆ రోబో కొత్త ఆకారం సంతరించుకుంది. అంతేకాదు.. సంస్కృత మంత్రాలు పఠించిన ఆ మమరమనిషి అక్కడికి వచ్చిన భక్తులతో ముచ్చటించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. లఖ్‌నవూలో మాజీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ నివాసం సమీపంలో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో రూన్ నదిలో చిక్కుకున్న ఇద్దరిని ఆర్మీ హెలికాప్టర్ రక్షించింది

బాలీవుడ్లో ఒక సినిమా థియేటర్లలో ఆశించిన విజయం సాధించకపోయినా, ఓటీటీలో దాని తలరాత మారిపోవచ్చు. దీనికి తాజా ఉదాహరణ ఈ సినిమానే. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందని ఈ స్పై-యాక్షన్ చిత్రం, ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన వెంటనే ఈ చిత్రం ట్రెండింగ్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. స్టార్ హీరోయిన్ ఉన్నప్పటికీ ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో దుమ్మురేపుతుంది. శివ్ రావైల్ దర్శకత్వం వహించిన 'ఆల్ఫా', YRF స్పై యూనివర్స్‌లో ఒక ముఖ్యమైన భాగం. ఈ చిత్రం 2026 జూలై 3న థియేటర్లలో విడుదలైంది. ఆలియా భట్ , శర్వరి వాఘ్ అనే ఇద్దరు నటీమణులు నటించిన ఈ చిత్రం, ఈ స్పై యూనివర్స్‌లో మొట్టమొదటి మహిళా-కేంద్రీకృత స్పై-థ్రిల్లర్. అయితే, ఇంత పెద్ద తారాగణం , భారీ యాక్షన్ ఉన్నప్పటికీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ చిత్రంలో ఆలియా, షర్వరిలతో పాటు బాబీ డియోల్, అనిల్ కపూర్, హృతిక్ రోషన్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. అందుకే 'ఆల్ఫా' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, థియేటర్లలో దాని ప్రదర్శన తర్వాత, సినిమా విజయంపై సందేహాలు తలెత్తాయి. ఇప్పుడు, 'ఆల్ఫా' డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో తన సత్తా చాటడం ప్రారంభించింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన తర్వాత, ప్రేక్షకుల నుండి మంచి స్పందనను పొందుతూ ట్రెండింగ్ జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది. థియేటర్లలో విఫలమైన తర్వాత ఓటీటీ 'ఆల్ఫా'కు రెండో అవకాశం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద విఫలమైనంత మాత్రాన ఒక సినిమా పూర్తిగా ఫ్లాప్ అయినట్లు కాదని 'ఆల్ఫా' మరోసారి స్పష్టం చేసింది. తరచుగా, థియేటర్లలో ప్రేక్షకులను చేరుకోలేని చిత్రాలను ఓటీటీలో భారీ సంఖ్యలో చూస్తున్నారు. 'ఆల్ఫా' ప్రస్తుత ప్రజాదరణ దీనికి ఒక ఉదాహరణ. ఈ చిత్రంలో ఆలియా భట్ 'సీత' అనే పవర్ ఫుల్ పెంపుడు

ఆ హీరో ఫ్యాన్స్ మీరున్న సిటీలో మీ కళ్ళ ముందు ఉండే ఉంటారు.. అచ్చు ఆ హీరోలాగానే హెయిర్ స్టైల్, డ్రెస్, ఫేస్ కట్స్ తో 24 అవర్స్ ఆన్ మై హీరో యాటిట్యూడ్ అనేలా ఉండటం కూడా ఆ హీరో ఫ్యాన్స్ నైజం. కానీ ఆ హీరో సుమారు 270 చిత్రాల్లో చేస్తే 180కి పైగా ప్లాప్స్. పైగా ముప్పై ఏళ్ల పాటు సరైన సోలో హిట్ లేదు. నిజం సైతం నిజామా అని ఆశ్చర్యపోయినా కూడా ఇది నిజమే. కానీ తన క్రేజ్, స్టార్డమ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఆయనే భారతీయ సినీ యవనికపై 'డిస్కో డాన్సర్'గా ముద్ర వేసుకున్న హీరో మిథున్ చక్రవర్తి. . 1976లో ప్రముఖ దర్శకుడు మృణాల్ సేన్ తెరకెక్కించిన 'మృగయ' అనే క్లాసిక్ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన మిథున్, తొలి సినిమాతోనే ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత 1982లో వచ్చిన 'డిస్కో డాన్సర్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించారు. అప్పట్లోనే ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆ కాలపు అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అక్కడ నుంచి మిథున్ ఇండియాలోనే మోస్ట్ డిమాండింగ్ స్టార్లలో ఒకరిగా మారారు. అయితే కాలం మారే కొద్దీ కథల ఎంపికలో వేగం, క్వాలిటీ కంటే క్వాంటిటీకే ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. 90ల కాలంలో ఏడాదికి పదుల సంఖ్యలో, తక్కువ బడ్జెట్ మరియు వేగంగా పూర్తయ్యే సినిమాల్లో నటిస్తూ రికార్డులు క్రియేట్ చేశారు. దీనివల్ల ఆయన ఖాతాలో ఓటములు ఎక్కువగా చేరుతూ వచ్చాయి. 1993 నుంచి 1998 మధ్యకాలంలోనే ఆయన నటించిన 33 చిత్రాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. అలా తన మొత్తం కెరీర్లో 350కి పైగా చిత్రాల్లో నటించగా, ఏకంగా 180కి పైగా సినిమాలు తీవ్రమైన డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. దాదాపు 30 ఏళ్ల పాటు బాక్సాఫీస్

ఏపీలో రెండున్నరేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ తనదైన శైలిలో పాలన సాగిస్తోంది. సీఎం చంద్రబాబు కూడా గతానికి భిన్నంగా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. కేబినెట్లో మంత్రులు కూడా తనతో పోటీ పడాలని ఆయన పదే పదే చెప్తుంటారు. అయితే ఆయన కేబినెట్లో తనతో పాటు కుమారుడు లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రమే ఎక్కువగా ఫోకస్ అవుతుంటారు. మిగతా మంత్రుల పాత్ర నామమాత్రమే అన్న విమర్శలు వినిపిస్తుంటాయి. ఇదే విషయం తాజాగా మరోసారి రుజువైంది.పోలవరం లోపాల పుట్ట- హైకోర్టు ముందు స్వయంగా వాదించబోతున్న మాజీ ఐపీఎస్ ..!పోలవరం కుడి కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు నీళ్లు విడుదల చేసే కార్యక్రమాన్ని ఇవాళ సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధాన పత్రికల్లో ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో సీఎం చంద్రబాబుతో పాటు ప్రధాని మోడీ, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలు మాత్రమే ఉన్నాయి. సాగునీటిపారుదల ప్రాజెక్టు ప్రారంభోత్సవం అయినా ఆ శాఖను చూస్తున్న జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఫొటో మాత్రం లేదు. దీనిపై చంద్రబాబు మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్, మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) వ్యంగాస్త్రాలు సంధించారు. Bhogapuram Airport: భోగాపురం క్రెడిట్ వారిదే ? ఆధారాలతో తేల్చేసిన మాజీ ఇంటెల్ ఛీఫ్ ..!ముఖ్యమంత్రి గారూ,.. మీరు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తప్పించి కాబినెట్ లోని మంత్రులందరూ నామమాత్రులే అనేది లోక విదితం అంటూ ఏబీ వెంకటేశ్వరావు ఇవాళ ట్వీట్ చేశారు. అయినా ఏదో సంప్రదాయాలంటూ ఉంటాయి కదా!

కొన్నేళ్లుగా మహిళల క్రికెట్‌కు ఆదరణ విపరీతంగా పెరిగింది. దీంతో ఉమెన్ క్రికెటర్స్ సంపాదన కూడా ఎన్నో రెట్లు పెరిగింది… స్టార్ క్రికెటర్లు కొందరు కోట్లలో ఆదాయం పొందుతున్నారు. కేవలం మ్యాచ్‌లు ఆడటమే కాదు బ్రాండ్ ఎండార్స్మెంట్లు, విదేశీ లీగ్‌లు, సోషల్ మీడియా ద్వారా కూడా మెన్ క్రికెటర్స్ స్థాయిలో ఉమెన్ క్రికెటర్లు సంపాదిస్తున్నారు. మరి ప్రస్తుతం ప్రపంచంలోని టాప్ 5 సంపన్న మహిళా క్రికెటర్లు ఎవరు? ఇందులో ఇండియన్స్ ఎంతమంది? ఎవరి సంపద ఎంత? ఇలాంటి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. 1. ఎల్లీస్ పెర్రీ (ఆస్ట్రేలియా) – రూ.120 కోట్లు ఆస్ట్రేలియా ఆల్-రౌండర్ ఎల్లీస్ పెర్రీ ప్రపంచంలోనే అత్యంత ధనిక ఉమెన్ క్రికెటర్ గా గుర్తింపు పొందారు. ఈమె మొత్తం ఆస్తి విలువ సుమారు రూ.120 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కాంట్రాక్ట్ తో పాటు ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (WBBL) ద్వారా బాగానే ఆర్జిస్తున్నారు పెర్రీ. ఇక అడిడాస్ (Adidas) వంటి పెద్ద బ్రాండ్లతో ఒప్పందాలను కలిగివున్నారు... ఇలా ఎండార్స్మెంట్స్ ద్వారా కూడా రెండుచేతులా సంపాదిస్తున్నారు... ఇవే ఈమె ప్రధాన ఆదాయ వనరు అని చెప్పవచ్చు. 2. మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా) – రూ.75 కోట్లు ఆస్ట్రేలియాకే చెందిన మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ ధనిక క్రికెటర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పినా ఈమె ఆదాయం మాత్రం తగ్గలేదు... ఆస్తి విలువ దాదాపు రూ.75 కోట్లు ఉంటుందని అంచనా. టీ20 లీగ్‌లు, కామెంటరీ ద్వారా ఇప్పటికీ లానింగ్ బాగానే సంపాదిస్తున్నారు. భారత మహిళల క్రికెట్లో 'లేడీ సూపర్‌స్టార్' గా గుర్తింపుపొందారు మిథాలీ రాజ్... ఇలా మంచి పేరుతో పాటు డబ్బులు కూడా సంపాదించారు. వరల్డ్ రిచ్చెస్ట్ ఉమెన్స్ క్రికెటర్ల జాబితాలో మిథాలి మూడో స్థానంలో నిలిచారు.. ఇండియన్ క్రికెటర్స్ లో అయితే ఈమే టాప్. రిటైర్మెంట్ తర్వాత కూడా

1996లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ ప్రయాణం ప్రారంభమైంది. 'తొలిప్రేమ', 'తమ్ముడు', 'బద్రి', 'ఖుషి' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో టాలీవుడ్లో తిరుగులేని ఇమేజ్ను, సొంత మేనరిజమ్స్‌తో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు పవన్. దాదాపు 30 ఏళ్ల సినీ కెరీర్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా నిలిచారు. పలు నివేదికల ప్రకారం ఆయన ఒక్కో సినిమాకు ₹50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం. 2008లో చిరంజీవి స్థాపించిన 'ప్రజారాజ్యం' పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా రాజకీయారంగేట్రం చేసిన పవన్.. 2014లో 'జనసేన' పార్టీని స్థాపించారు. 2019 ఎన్నికల్లో ఓటములు ఎదురైనా కుంగిపోకుండా, ప్రజా సమస్యలపై నిలకడగా పోరాడారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమితో కలిసి పోటీ చేసిన జనసేన, పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్ సాధించింది. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించిన పవన్ కళ్యాణ్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ తన మార్క్ చూపిస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం, పవన్ కళ్యాణ్ దగ్గర ₹165 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి. అలాగే దాదాపు ₹65.76 కోట్ల అప్పులు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. అయితే, మీడియా నివేదికల ప్రకారం ఆయన మొత్తం బ్రాండ్ వ్యాల్యూ, సినిమాలు, స్థిరాస్తుల మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుంటే నెట్‌వర్త్ దాదాపు ₹450 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. హైదరాబాద్‌లో ఆయనకు విలువైన స్థిరాస్తులతో పాటు ఒక ఫామ్‌హౌస్ కూడా ఉంది. వాహనాల పట్ల ఇష్టమున్న పవన్ గ్యారేజీలో మెర్సిడెస్ బెంజ్ జీ-క్లాస్ (Mercedes-Benz G-Class), ఆడి క్యూ7 (Audi Q7), బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 (BMW X5), టయోటా ల్యాండ్ క్రూజర్ వంటి పలు హై టెక్నాలజీ కలిగిన లగ్జరీ కార్లు ఉన్నాయి. ప్రస్తుతం ఒకవైపు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా

మన భూగోళంపై ఉష్ణోగ్రతలు ఊహించని రీతిలో మండిపోతున్నాయి. ఇన్నాళ్లూ మనం అనుకున్న ప్రమాద ఘంటికలు దాదాపు దగ్గరపడ్డాయి. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే భూమి సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితిని దాటేస్తుందని ఐక్యరాజ్యసమితి (యుఎన్ఈపీ) సరికొత్త నివేదిక ద్వారా అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. పారిస్ ఒప్పందం పెట్టుకున్న లక్ష్యం దాటిపోతుండటం ఖాయమని తేలిన నేపథ్యంలో.. ఇకపై ఉష్ణోగ్రతల పెంపుదల వ్యవధిని ఎంత తగ్గించగలమనే దానిపైనే ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాలని పిలుపునిచ్చింది. లక్ష్యం దాటినా సరే.. ధైర్యం కోల్పోకుండా ఉష్ణోగ్రతలను మళ్లీ తగ్గించే దిశగా పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది.ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు దాటిపోయే కాలాన్ని వీలైనంత తక్కువగా, చిన్నదిగా మార్చడమే ఇప్పుడు మన ముందున్న ఏకైక మార్గమని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ తేల్చిచెప్పారు. ఈ వేసవిలో నమోదైన దారుణమైన ఎండలు, భయంకరంగా వ్యాపించిన అడవుల కార్చిచ్చు, ఆకస్మిక వరదలే భవిష్యత్తులో భూమి ఎంత దారుణంగా మారబోతోందో చెప్పే నమూనా అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 1.5 డిగ్రీలు దాటడమంటే ప్రపంచం అక్కడితో అంతమైపోతుందని కాదని, అయితే ప్రతి అర డిగ్రీ పెరుగుదల మానవాళిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఐరాస స్పష్టం చేసింది.వాతావరణంలో ముంచుకొస్తున్న విపత్తులుఒకవేళ ఉష్ణోగ్రత పెరుగుదల 1.8 డిగ్రీలకు చేరుకుంటే మాత్రం కోలుకోలేని నష్టాలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తుపానులు, కరువులు తీవ్రతరం కావడం, ఆహారం-తాగునీటి కొరత ఏర్పడటం, మంచు పర్వతాలు కరిగి సముద్ర మట్టాలు పెరగడం వంటివి తీర ప్రాంత ప్రజలను శరణార్థులుగా మార్చే ప్రమాదం ఉందన్నారు. ప్రపంచంలో అత్యంత వినాశకరమైన రీతిలో అమెజాన్ అడవులు దెబ్బతినడం, సముద్ర ప్రవాహాలు మారిపోవడం వంటి సంచలన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది.విశ్వంలో మరో రెండు కొత్త గ్రహాలు.. శాస్త్రవేత్తల మైండ్ బ్లాకింగ్ న్యూస్!బొగ్గు, పెట్రోల్ వినియోగానికి చెక్.. కార్బన్ నిర్మూలన తప్పనిసరి!భూమి ఉష్ణోగ్రతను మళ్లీ సాధారణ

ప్రపంచ ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా భారత మార్కెట్లో తన మౌలిక వసతులను వేగంగా ఏర్పాటు చేస్తోంది. ప్రధాన నగరాల్లో ఛార్జింగ్ నెట్‌వర్క్‌తో పాటు విక్రయానంతర సేవలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 20 ‘సూపర్ ఛార్జర్ల’ను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పింది. అలాగే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కొత్తగా 'టెస్లా-అప్రూవ్డ్ బాడీ షాప్' (టీఏబీ), సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది. అహ్మదాబాద్‌లో కొత్త సదుపాయం ప్రారంభోత్సవం సందర్భంగా టెస్లా ఇండియా కంట్రీ హెడ్ శరద్ అగర్వాల్ మాట్లాడుతూ.. అహ్మదాబాద్‌లో తెరిచిన ఈ సెంటర్ భారత్‌లో కంపెనీకి చెందిన 7వ బాడీ షాప్, సర్వీస్ సెంటర్ అని స్పష్టం చేశారు. ఇప్పటికే గురుగ్రామ్, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, పుణె, ముంబై నగరాల్లో టెస్లా తమ సర్వీస్ సెంటర్లను నిర్వహిస్తోంది. గుజరాత్ పరిధిలోని వినియోగదారులకు ఒరిజినల్ స్పేర్ పార్ట్స్, శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులతో బాడీ రిపేర్, కొలిజన్ రిపేర్ సేవలను ఇది అందిస్తుంది. టెస్లా వాహనాలకు షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ అవసరం చాలా స్వల్పమని అగర్వాల్ పేర్కొన్నారు. సింహభాగం సాంకేతిక సమస్యలను ‘రిమోట్ డయాగ్నోసిస్’ (సాఫ్ట్వేర్ ఆధారిత తనిఖీ) ద్వారానే పరిష్కరించవచ్చని, 24/7 సర్వీస్ అసిస్టెన్స్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో మోడల్ Y రెండు వేరియంట్లను అందుబాటులో ఉంచారు. మోడల్ వై ఆర్డబ్ల్యూడీ ధర సుమారుగా రూ.51.89 లక్షలు, మోడల్ వైఎల్ రూ.61.99 లక్షలుగా ఉంది. ఇదీ చదవండి: సెప్టెంబర్‌లో విడుదలయ్యే టాప్ స్మార్ట్ఫోన్లు ఇవే.. ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు) తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు) హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు) అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పాలనకు సంబంధించిన కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని సంతరించుకుంది.విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ భేటీలో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న కేబినెట్ విస్తరణతో పాటు, నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం ఆమోదం కోసం ఆయన వేణుగోపాల్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.ఇదే సమయంలో పార్టీలో క్రమశిక్షణకు సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి క్రమశిక్షణ సంఘం జారీ చేసిన షోకాజ్ నోటీసులు, వారు సమర్పించిన వివరణలపై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. వీరిపై తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి అధిష్ఠానం అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి కోరినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది

అరవింద సమేత చిత్రంలో 5 రూపాయల కారణంగా ఎంత హింస జరిగిందో అందరికి తెలుసు. అయితే ఈ కథలో 5 నిమిషాలు వల్ల ఓ వ్యక్తి మహా కుబేరుడిగా మారారు. ఏకంగా 5 లక్షల కోట్ల రూపాయలను ఆయన సంపాదించేశారు. ఇంటర్నెట్ డెస్క్: రోజుకు 5 నిమిషాలే పని చేయాలి.. నెలకు 10 వేల డాలర్లు ( దాదాపు 9 లక్షల రూపాయలు) సంపాదించాలి. ఇది కొంచెం అతిగా అనిపిస్తోందా.. కానీ ఓ వ్యక్తి ఇది సాధ్యమని భావించారు. ప్రతిరోజూ 5 నిమిషాల పనితో నెలకు లక్షలు గడించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఆయనను చూసి తోటి వారే నవ్వుకున్నారు. ఇవేమీ పట్టించుకోని ఆయన డబ్బు సంపాదించడం కోసం రోజులో 5 నిమిషాలు ఆలోచించేవారు. అలా ఓ రోజు ఒక కొత్త పరికరం కనిపెట్టాలన్న ఆలోచన ఆయనకు తట్టింది. ఆయనే మసయోషి సన్. సాఫ్ట్‌బ్యాంక్ వ్యవస్థాపకుడిగా టెక్నాలజీ రంగానికి ఆయన సుపరిచితులు. 2026 సెప్టెంబరు నాటికి ఆయన సంపద అక్షరాల 5.3 లక్షల కోట్లు. తాను యువకుడిగా ఉన్నప్పుడు ఈ 5 నిమిషాల సవాలును ఆయనకు ఆయనే విసురుకున్నారు. ఇలా నిర్ణీత సమయంలోనే ఓ ఆవిష్కరణ చేయాలని పూనుకున్నారు. మసయోషి.. కొందరు పరిశోధకులు, ప్రొఫెసర్ల సహాయంతో ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌లేటర్ పరికరాన్ని కనిపెట్టారు. ఆ పరికరాన్ని జపాన్‌కు చెందిన ఓ సంస్థకు 1.7 మిలియన్ డాలర్లకు విక్రయించారు. ఈ విధంగా సన్ ప్రయాణానికి తొలి అడుగు పడింది. ఆ తరువాత ఆయన జపాన్ నుంచి వీడియో గేమ్ యంత్రాలను అమెరికాకు తీసుకొచ్చి రెస్టారెంట్లకు అమ్మేవారు. ఈ వ్యాపారంలో ఆయనకు 1.5 మిలియన్ డాలర్ల లాభం వచ్చింది. 5 నిమిషాల ఆలోచన వచ్చిన 18 నెలల్లోనే 3.2 మిలియన్ డాలర్లు ఆర్జించారు. జపాన్‌లో ఉంటున్న సన్‌కు అమెరికా వెళ్లాలని ఓ సన్నిహితుడు సలహా ఇచ్చారు. ఇంగ్లీష్ నేర్చుకోవాలని, కంప్యూటర్లపై పట్టు తెచ్చుకోవాలని ప్రోత్సహించారు. దీంతో అమెరికా వచ్చిన సన్

రవితేజ ఇరుముడి సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. రెండు వారాలు గడిచినా హౌస్‌ఫుల్స్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ హక్కులను దక్కించుకుంది. థియేట్రికల్ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదిరినప్పటికీ, సెప్టెంబర్ 18 తర్వాతే ఓటీటీ రిలీజ్ ఉండవచ్చని తెలుస్తోంది

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం అతిపెద్ద కీలక అడుగు ముందుకు వేసింది. రాష్ట్రంలోని 13,278 గ్రామపంచాయతీల పరిధిలోని 1,33,128 వార్డులకు గాను మొత్తం 1,36,326 పోలింగ్ స్టేషన్లతో తుది జాబితాను అధికారికంగా విడుదల చేసింది. జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా ఎన్నికల అధికారుల ఆమోదంతో ఈ ప్రక్రియను పూర్తయినట్లు స్పష్టం చేశారు. స్థానిక పోరుకు సంబంధించి అత్యంత ముఖ్యమైన పోలింగ్ కేంద్రాల ప్రక్రియ పూర్తి కావడంతో త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ తుది జాబితా రూపకల్పన వెనుక ఒక స్పష్టమైన టైమ్‌లైన్ మరియు నిబంధనావళిని ఎన్నికల సంఘం పక్కాగా అమలు చేసింది. ఆగస్టు 12న సర్క్యులర్ జారీతో ప్రారంభమైన ఈ ప్రక్రియలో ఆగస్టు 23న డ్రాఫ్ట్ జాబితా వెలువడింది. ఆగస్టు 26 వరకు అందిన అభ్యంతరాలు మరియు సూచనలను పరిశీలించిన తర్వాతే ఈ సెప్టెంబర్ 1న తుది జాబితా ఖరారైంది. ప్రతి వార్డుకు కనీసం ఒక కేంద్రం ఉండేలా ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా అదనపు స్టేషన్లను సైతం అధికారులు సిద్ధం చేశారు. 2021లో ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం 2026 ఏప్రిల్‌తో ముగియడంతో రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నిర్వహించడం అనివార్యంగా మారింది. దీంతో కొన్ని చోట్ల ఉన్న కోర్టు కేసులు, సరిహద్దుల మార్పులు, పట్టణ పరిధుల విస్తరణ లాంటి అడ్డంకులను దాటుకుంటూ ఈసీ వేగంగా చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేతా కలెక్టర్లు మరియు అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ ఏర్పాట్లను పరుగులు తీస్తున్నారు. పోలింగ్ కేంద్రాల ప్రకటనతో ఇక నోటిఫికేషన్, నామినేషన్ల ప్రక్రియకు మార్గం సుగమమైంది. రాజకీయంగా కూడా స్థానిక పోరు వేడి తీవ్రస్థాయికి చేరింది. ఫలితంగా అధికార టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్నికలను త్వరితగతిన పూర్తి చేయాలని భావిస్తుండగా, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్ని స్థానాల్లో పోటీకి కేడర్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న కాలంలో.. వినూత్న ఆవిష్కరణలు, ప్రయోగాలు నిత్యకృత్యంగా మారాయి. అయితే కొత్తదనం ఎంత ఆసక్తికరంగా ఉన్నా.. భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఊహించని పరిణామాలు తప్పవు. పాకిస్థాన్‌లో జరిగిన ఈ ఘటన అందుకు ఓ ఉదాహరణ. పాకిస్తాన్లో టెక్నాలజీ ప్రయోగం కాస్తా.. పోలీస్ వ్యాన్‌ను ఢీకొట్టే ఘటనగా మారింది. ఇంటర్నెట్ కనెక్షన్ ఒక్కసారిగా తెగిపోవడంతో రిమోట్ కంట్రోల్‌తో నడుస్తున్న ఓ ఆటోమేటిక్ కారు అదుపు తప్పి నేరుగా పోలీస్ వ్యాన్‌ను ఢీకొట్టింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని డీ-చౌక్ వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయి నవ్వులు పూయిస్తోంది. ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెక్నాలజీని ప్రదర్శిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడి జర్నలిస్టు మహ్మద్ ఆలిజా కారులో ముందు సీట్లో కూర్చొని దాని ప్రత్యేకతలను వివరిస్తున్నారు. అబ్బొట్టాబాద్కు చెందిన టెక్నాలజీ ఔత్సాహికుడు ఇహ్సాన్ జాఫర్ రూపొందించిన ఈ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెక్నాలజీపై రిపోర్టు చేసేందుకు తాను అక్కడికి వెళ్లినట్లు ఆలిజా వెల్లడించారు. కారు ముందుకు కదులుతుండగా.. ఒక్కసారిగా రిమోట్ ద్వారా నియంత్రించే స్టీరింగ్ స్పందించడం ఆపేసింది. పరిస్థితిని గమనించిన ఆలిజా వెంటనే హ్యాండ్‌బ్రేక్ వేసేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. కారు వేగంగా ముందుకు దూసుకెళ్లి అక్కడే ఉన్న పోలీస్ వ్యాన్‌ను ఢీకొట్టింది. కనెక్షన్ కట్.. కారు కంట్రోల్ ఔట్! ఈ కారును ఇంటర్నెట్, శాటిలైట్ కనెక్షన్ల సాయంతో రిమోట్‌గా నియంత్రిస్తున్నట్లు ఆలిజా తెలిపారు. అయితే ప్రయోగం జరుగుతున్న సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్ తెగిపోవడంతో కారు నియంత్రణ కోల్పోయిందని చెప్పారు. అదృష్టవశాత్తూ ఘటన జరిగిన సమయంలో అక్కడ ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అదే కారు రద్దీగా ఉండే రోడ్డుపై అదుపు తప్పి ఉంటే పరిస్థితి తీవ్రంగా ఉండేదని ఆలిజా పేర్కొన్నారు. అయితే పోలీసులు ఎలా స్పందించారో అనేది మాత్రం ఆయన వివరించలేదు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్

సెప్టెంబర్ మొదటి వారంలో వినోదాన్ని అందించడానికి వివిధ డిజిటల్ వేదికలు సిద్ధమయ్యాయి. ఈ వారం సెప్టెంబర్ 1 నుండి 6 వరకు ప్రేక్షకులను అలరించేందుకు విభిన్న కథాంశాలతో కూడిన సినిమాలు మరియు సిరీస్‌లు ఓటీటీలో అడుగుపెడుతున్నాయి. థ్రిల్లర్, కామెడీ, హారర్ మరియు కోర్ట్‌రూమ్ డ్రామా వంటి వైవిధ్యమైన శైలులలో ఈ లైనప్ రూపుదిద్దుకుంది. కుటుంబ సమేతంగా చూడటానికి మరియు ఒకేసారి వరుసగా వీక్షించడానికి అనువైన అనేక శీర్షికలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రముఖ డిజిటల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 3న తాప్సీ పన్ను నటించిన గాంధారి చిత్రం ప్రసారం కానుంది. కిడ్నాప్ అయిన తన కుమార్తెను వెతుక్కుంటూ చూపు కోల్పోయిన ఒక తల్లి చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియాతో చేసే పోరాటం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దీనితో పాటు ఆగస్టు 7న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సాధించిన వరుణ్ తేజ్ హారర్ కామెడీ చిత్రం కొరియన్ కనకరాజు సెప్టెంబర్ 4న రానుంది. అనంతపురం కనకరాజు శరీరంలోకి కొరియన్ గ్యాంగ్‌స్టర్ ఆత్మ ప్రవేశించే కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకులను నవ్విస్తుంది. ఇదిలా ఉండగా జూలై 10న థియేటర్లలో సందడి చేసిన అజయ్ దేవగన్ మరియు సంజయ్ మిశ్రా ల కామెడీ చిత్రం ధమాల్ 4 కూడా సెప్టెంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది. గుప్తనిధి వేట మరియు గందరగోళం చుట్టూ తిరిగే ఈ కథ ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని పంచుతుంది. దీనితో పాటు ద జెంటిల్మెన్ సీజన్ 2 కూడా సెప్టెంబర్ 3న ప్రసారానికి సిద్ధంగా ఉంది. మరొక ప్రముఖ సంస్థ సోనీ లివ్ లో కుంచాకో బోబన్ నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ఉన్మాదం సెప్టెంబర్ 4న అందుబాటులోకి రానుంది. జూలై 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఒక పాత కేసు తిరిగి తెరుచుకోవడంతో ఒక పోలీసు అధికారి జీవితంలో వచ్చే మార్పుల చుట్టూ తిరుగుతుంది. ఫలితంగా క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను

తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం సడన్‌గా ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మరియు రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో సాయంత్రం లేదా రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య సమావేశం కానున్నారు. రాబోయే సెప్టెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ భేటీకి తీవ్ర రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. గాంధీభవన్ వర్గాల్లో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ మరియు క్రమశిక్షణ నివేదిక అంశాలపైనే పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది. గత కొన్ని రోజులుగా తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రివర్గ మార్పులు మరియు చేర్పుల వ్యవహారం తీవ్రంగా వేడెక్కింది. దీనికితోడు మంత్రి కొండా సురేఖపై పీసీసీ డిసిప్లినరీ కమిటీ తయారు చేసిన నివేదిక ఇప్పటికే ఏఐసీసీకి చేరింది. సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు మరియు దానిపై సురేఖ స్పందించిన తీరు పార్టీలో వివాదాస్పదమైంది. ఈ ఘటనల ఆధారంగా ఆమెను మంత్రివర్గం నుండి తొలగించడంతో పాటు పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేయాలని స్థానిక రిపోర్టులు చెబుతున్నాయి. ఈ కీలక భేటీ కోసం సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మరియు మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హస్తినకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. కేసీ వేణుగోపాల్ విదేశీ పర్యటన ಮುగించుకుని తిరిగి రాగానే ఈ భేటీ ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులతో కూడా సమావేశమై మెట్రో రైల్, విమానాశ్రయం మరియు ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సు వంటి అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గ మార్పులలో కొండా సురేఖ స్థానంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. స్పీకర్

Visakhapatnam: విశాఖ ఉక్కు భూముల వేలం.. 19.29 ఎకరాల విక్రయానికి సిద్దం! ఈ వార్తకు సంబంధించిన

సెప్టెంబర్ తొలి వారంలో ఓటీటీ ప్రేక్షకులకు వినోదాల విందు సిద్ధమైంది. థియేటర్లలో మిస్ అయిన సినిమాల నుంచి సరికొత్త వెబ్ సిరీస్‌ల వరకు పలు ఆసక్తికరమైన టైటిల్స్ డిజిటల్ స్ట్రీమింగ్కు రానున్నాయి. క్రైమ్ థ్రిల్లర్లు, యాక్షన్ డ్రామాలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, రొమాంటిక్ కథలు ఇలా ప్రతి రుచికి తగ్గ కంటెంట్ ఈ వారం అందుబాటులోకి రానుంది. వీకెండ్ ప్లాన్ చేసుకునే ముందు ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఏ వెబ్ సిరీస్ బింజ్ వాచ్‌కు బెస్ట్? అన్న వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ జాబితాపై ఓ లుక్ వేయండి. OTT లవర్స్‌కు ఈ వారం మంచి ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ! 🎬📺 ఈ వారం.. కొత్త ఓటీటీ సినిమాలు (𝐓𝐡𝐢𝐬 𝐖𝐞𝐞𝐤 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞) Manorama Max Ananthan Kaadu (Malayalam) 𝐒𝐞𝐩 𝟐 Jio Hotstar Star Wars: The Mandalorian and Grogu (English) 𝐒𝐞𝐩 𝟐 The Court (Tamil) [Weekly Series] 𝐒𝐞𝐩𝟒 Paramount+ Scary Movie (English) 𝐒𝐞𝐩 𝟑 Sunnxt DC (Tamil, Telugu, Malayalam) - 𝐒𝐞𝐩𝟒 Zee5 Veerabhadruni Rahasyam: S1 Part 2 (Telugu) 𝐒𝐞𝐩𝟒 Sony Liv Unmadham (Malayalam, Tamil, Telugu, Kannada, Hindi) - 𝐒𝐞𝐩𝟒 Apple Tv May Day (English) 𝐒𝐞𝐩𝟒 HBO Max Fuze (English) 𝐒𝐞𝐩𝟒 MUBI Erupcja (English) 𝐒𝐞𝐩𝟒 MGM Plus A Tale Of Two Cities Series 𝐒𝐞𝐩6 Shudder Parasomnia (English) 𝐒𝐞𝐩𝟒 Hulu Signal One (English) 𝐒𝐞𝐩𝟒 Prime Video Confinement (English) Rent 𝐒𝐞𝐩𝟏 I Want Your Sex (English) Rent 𝐒𝐞𝐩𝟏 Just Play Dead (English) Rent 𝐒𝐞𝐩𝟏 The Wrong Girls (English) Rent 𝐒𝐞𝐩𝟏 The Runner (English) 𝐒𝐞𝐩 𝟐 Dark Hollow

రాకింగ్ స్టార్ యాష్ హీరోగా, వర్సటైల్ నటి నయనతార , ప్రముఖ నటి కియారా అద్వానీ కీలక పాత్రల్లో నటించిన భారీ యాక్షన్ చిత్రం టాక్సిక్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. థియేటర్లలో విడుదలై ఆరో రోజుకు చేరుకున్న నేపథ్యంలో, బాక్సాఫీస్ వసూళ్లలో గణనీయమైన మార్పులు నమోదు అయ్యాయి. ఆరో రోజు వసూళ్లలో మునుపటి రోజులతో పోలిస్తే 67.6 శాతం మేర తగ్గుదల (డ్రాప్) కనిపించినప్పటికీ, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలిపి ఇప్పటివరకు రూ. 304.05 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ చిత్రం విడుదలైన మొదటి ఐదు రోజుల్లో భారీ ఓపెనింగ్స్ సాధించి రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోయింది. యాష్‌కు ఉన్న అంతర్జాతీయ మార్కెట్ క్రేజ్, అలాగే నయనతార, కియారా అద్వానీల సపోర్టింగ్ రోల్స్ ఈ సినిమాకు మంచి ఆదరణ తెచ్చిపెట్టాయి. ఆరో రోజు సాధారణ పనిదినం (వర్కింగ్ డే) కావడంతో వసూళ్లలో 67.6 శాతం మేర తగ్గుదల నమోదైనట్లు బాక్సాఫీస్ విశ్లేషకులు వెల్లడించారు. అయినప్పటికీ, అంతర్జాతీయంగా, దేశీయంగా సాధించిన వసూళ్లతో కలిపి మొత్తం రూ. 304.05 కోట్ల గ్రాస్ మార్కును చేరుకోవడం టాక్సిక్ పవర్ ను చూపిస్తోంది. టాక్సిక్ మూవీ బాక్సాఫీస్ వద్ద రోజురోజుకూ వసూళ్లు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఇండియా నెట్ కలెక్షన్లలో ఇప్పటికే రూ. 200 కోట్ల మార్కును దాటినప్పటికీ, మొదటి రోజు సాధించిన రికార్డు ఓపెనింగ్స్ తర్వాత ప్రతిరోజూ వసూళ్లు పడిపోతున్నాయి. ప్రముఖ ట్రేడ్ వెబ్సైట్ Sacnilk కథనం ప్రకారం, మొదటి సోమవారం ఈ చిత్రం కేవలం రూ. 7.45 కోట్లు మాత్రమే రాబట్టింది. సినిమా విడుదలైనప్పటి నుండి ఇదే అత్యల్ప సింగిల్-డే కలెక్షన్ కావడం గమనార్హం. దీంతో ఈ చిత్రం ఇప్పటివరకు భారత్‌లో సాధించిన మొత్తం నెట్ కలెక్షన్స్ రూ. 221.55 కోట్లకు చేరుకున్నాయి. ఇండియాలో గ్రాస్ వసూళ్లు.. 264.80 కోట్లు కాగా.. ఒవర్ సిస్ లో

Lionel Messi Net Worth And Assets: ప్రపంచ ఫుట్‌బాల్‌లో మరో దిగ్గజం ఆట నుంచి వైదొలిగింది. దాదాపు రెండు దశాబ్దాలు ఆటకు వన్నె తెచ్చిన గొప్ప సాకర్ ఆటగాడు లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అర్జెంటీనా స్టార్ తన ఆటకు ముగింపు పలుకుతూ ప్రకటన చేశాడు. దీంతో ఆయన ఆట నుంచి ఎంత సంపాదించాడో తెలుసుకుందాం. ప్రపంచంలో అత్యంత టాప్ జట్టు అంటే అర్జెంటీనా.. మేటి ఆటగాడు అంటే లియోనిల్ మెస్సీ గుర్తుకు వస్తాడు. అంతటి గొప్ప జట్టు.. గొప్ప ఆటగాడు ఇటీవల ముగిసిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ట్రోఫీ లేకుండానే టోర్నీని ముగించాడు. ఫైనల్లో ఘోర పరాభవం నుంచి తేలుకోక ముందే మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించడం ఆ అర్జెంటీనా జట్టును మరింత కోలుకోలేని దెబ్బతీసింది. ఇటీవల అతడి తండ్రి జార్జ్ మెస్సీ మరణించడం.. ప్రపంచకప్‌లో ట్రోఫీని చేజార్చుకున్న బాధలో మెస్సీ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ రెండు పరిణామాలతో కొంత కలత చెందిన మెస్సీ ఈ క్రమంలోనే భవిష్యత్‌లో ఆటపై దృష్టి సారించలేనని ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఫుట్‌బాల్ అర్జెంటీనా జాతీయ జట్టు తరపున అంతర్జాతీయ పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం మెస్సీ ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. జాతీయ జట్టును వీడటం బాధాకరమైన నిర్ణయమే అయినా తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని తెలిపాడు. అర్జెంటీనాకు 2022 ప్రపంచ కప్, రెండు కోపా అమెరికా టైటిళ్లు అందించిన మెస్సీ 2026 ప్రపంచ కప్‌లో జట్టును రన్నరప్‌గా నిలిపాడు. ఆటతోపాటు ఆస్తుల్లోనూ మెస్సీ బాగా సంపాదించాడు. అతడి ఆస్తులు మొత్తం రూ.10,450 కోట్లు ఉంటుందని ఇటీవల విడుదలైన ఫోర్బ్స్ నివేదిక ఆధారంగా చెప్పవచ్చు. ఫుట్‌బాల్ ఆటగాడిగానే కాకుండా వ్యాపారాలు, వాణిజ్య ప్రకటనల ద్వారా 39 ఏళ్ల మెస్సీ బాగా వెనకేసుకున్నాడు. ఫుట్‌బాల్ ఆటగాడిగా ఏడాదికి రూ.530 కోట్లకు పైగా సంపాదించగా.. వాణిజ్య ప్రకటనలు.. ఇతర వ్యాపారాల ద్వారా రూ.550 కోట్ల మేర

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. లక్ష్మీ నారాయణ రాజయోగం 2026: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచరిస్తూ ఉంటాయి. దీని వలన కొన్ని యోగాలు ఏర్పడుతుంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ముఖ్యంగా మేధస్సు, వ్యాపారం, సంభాషణలకు కారకుడిగా పరిగణించబడే బుధుడు, సంపద, అందం మరియు ఆనందానికి ప్రతీక అయిన శుక్రుడు ఒకే రాశిలో కలిసినప్పుడు లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఆర్థికంగా పురోగతి, చేసే వృత్తిలో ఉన్నత అవకాశాలు.. వ్యక్తిగత జీవితంలో మంచి అభివృద్ధికి దారితీస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్న మాట. జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా చేసిన అంచనాల ప్రకారం, సెప్టెంబర్ 2026లో ఏర్పడనున్న ఈ రాజయోగం ప్రభావం కొన్ని రాశులపై అనుకూలంగా ఉండబోతుంది. లక్ష్మీ నారాయణ రాజయోగం సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు లేదా అవకాశాలు లభించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. వ్యాపారవేత్తలకు కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. క్లయింట్లు లేదా విస్తరణ అవకాశాలు లభించవచ్చు. ఆర్థిక పరంగా కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. కొత్తగా ఆలోచించే అవకాశం లభించవచ్చు. కానీ ఇవి జ్యోతిష్య నమ్మకాలపై ఆధారపడిన సాధారణ ఫలితాలు. ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత జాతకం, గ్రహ స్థానాలు మరియు దశ-భుక్తి ఆధారంగా ఫలితాలు మారవచ్చు. కన్య రాశి.. కన్య రాశి వారు తమ సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ఇది సహాయకారిగా పనిచేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతితో పాటు జీతం పెంపుదల ఉండనుంది. కొత్త పదవి వంటి

పర్యావరణ పరిరక్షణను ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ఇంటింటి ఉద్యమంగా మార్చి, గ్రామాలను స్వచ్ఛంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు 'నెట్‌జీరో' విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించి, పర్యావరణహిత జీవనశైలిని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. శనివారం 'స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని అలవరం కోడూరు గ్రామంలో సీఎం పర్యటించారు.ఈ సందర్భంగా, గ్రామంలో అమలు చేస్తున్న నెట్‌జీరో కార్యక్రమాల గురించి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ముఖ్యమంత్రికి వివరించారు. ఇంటింటా సౌర విద్యుత్ వినియోగం, పరిశుభ్రమైన వంట విధానాలు, తడి చెత్తతో సేంద్రియ ఎరువుల తయారీ, మురుగునీటిని ఇంటి వద్దే శుద్ధి చేయడం వంటి పద్ధతుల ద్వారా గ్రామాలను ఎలా ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారో తెలిపారు.క్షేత్రస్థాయిలో కార్యక్రమాల పరిశీలనకార్యక్రమం అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు, గ్రామానికి చెందిన జె. మహేశ్వరరావు ఇంటిని సందర్శించారు. మహేశ్వరరావు కుటుంబం చేపడుతున్న పర్యావరణహిత కార్యక్రమాలను సీఎం ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. వంటింటి నుంచి వెలువడే తడి వ్యర్థాలను ప్రత్యేక కంపోస్ట్ గుంతలో వేసి సేంద్రియ ఎరువుగా మార్చుతున్న విధానాన్ని వారు ముఖ్యమంత్రికి చూపించారు. దీనివల్ల ఎరువుల ఖర్చు తగ్గడమే కాకుండా, వ్యర్థాల నిర్వహణ భారం కూడా తగ్గుతుందని వివరించారు.అలాగే, ఇంటి నుంచి వెలువడే మురుగునీటిని బయటకు వదలకుండా, ఆవరణలోనే నిర్మించిన ఇంకుడు గుంతలోకి మళ్లిస్తున్న విధానాన్ని సీఎం పరిశీలించారు. ఈ 'ఇన్‌సిటు వేస్ట్‌వాటర్ మేనేజ్మెంట్' వల్ల రోడ్లపై మురుగు నిలవకుండా, దోమల బెడద తగ్గి, ఆరోగ్యకరమైన వాతావరణం

కన్య రాశి : కన్యా రాశి వారికి ఆగస్టు చివరి వారం చాలా అద్భుతంగా గడుస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతంది. చాలా ఆనందంగా జీవిస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం లభిస్తుంది. తుల రాశి : తుల రాశి వారికి పట్టింది బంగారమే అవుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఊహించని విధంగా మంచి జాబ్ దొరుకుతుంది. అంతే కాకుండా వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. అన్నింట్లో శుభ ఫలితాలు కలుగుతాయి. మకర రాశి : మకర రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. డబ్బులు చేతికి అందుతాయి. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఈ రాశుల వారికి మంచి రోజులు వచ్చాయి అని చెప్పాలి. అంతే కాకుండా చాలా ఆనందకర వాతావరణం నెలకుంటుంది. మీన రాశి : మీన రాశి వారికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకుంటుంది. ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లలు పోటీ పరీక్షల్లో నెగ్గుక వస్తారు. ఈ నెల చివరి వారం మొంత్తం ఆనందాలతో చాలా బాగా గడిచి పోతుంది

ఎలాంటి సినీ వారసత్వం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తన అద్భుత నటనా కౌశలం, డాన్సులతో మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి ఆర్థిక ప్రస్థానం అత్యంత స్పూర్తిదాయకం. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన ప్రయాణంలో కేవలం బాక్సాఫీస్ రికార్డులే కాకుండా, ఒక బలమైన వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా నిర్మించుకున్నారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్న వేళ.. సీని, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.వివిధ నివేదికలు, జాతీయ మీడియా అంచనాల ప్రకారం, చిరంజీవి నికర ఆస్తి విలువ ప్రస్తుతం సుమారు రూ. 1,650 కోట్ల నుంచి రూ. 1,750 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. 1978లో సాధారణ నటుడిగా ప్రారంభమై, భారత్‌లోనే అత్యధిక పారితోషికం పొందే స్థాయికి చేరుకున్నారు. సినిమాల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు వాణిజ్య ప్రకటనలు, వివిధ వ్యాపార భాగస్వామ్యాలు ఆయన సంపదను నిలకడగా పెంచాయి. మెగాస్టార్ విధ్వంసం.. రచ్చ లేపుతున్న టైటిల్ గ్లింప్స్!అత్యాధునిక నివాసాలు - రియల్ ఎస్టేట్ఆయన ఆస్తులలో ప్రధాన భాగం రియల్ ఎస్టేట్ రంగానికి చెందింది. హైదరాబాద్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో ఆయనకు ఒక విలాసవంతమైన విల్లా ఉంది. గత నివేదికల ప్రకారం ఈ భవనం విలువ దాదాపు రూ. 28 కోట్ల పైచిలుకు ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు బెంగళూరు సహా పలు నగరాలలో ఉన్న విలువైన స్థిరాస్తులు ఆయన ఇన్వెస్ట్మెంట్ వ్యూహానికి నిదర్శనం.మెగాస్టార్ సినిమాలకు స్టార్లు కట్టిన ఏపీ మంత్రి.. రాత్రంతా థియేటర్ దగ్గరే ఉండిరాయల్ గ్యారేజ్ - లైఫ్స్టైల్ఆయన లగ్జరీ కార్ల సేకరణ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆయన గ్యారేజ్‌లో అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ ఫాంటమ్‌తో పాటు రేంజ్ రోవర్, టయోటా ల్యాండ్ క్రూజర్, మెర్సిడెస్ బెంజ్ వంటి మోడళ్లు ఉన్నట్లు వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. వ్యక్తిగత ప్రయాణాల కోసం ప్రైవేట్ జెట్ విమానం ఉందనే ప్రచారం

ఈ యోగం కర్కాటక రాశి వారికి అత్యంత శుభప్రదంగా ఉండనుంది. ఉచ్ఛ స్థితిలో ఉన్న గురుడు మీ లగ్నంలో (మొదటి ఇల్లు) , శని తొమ్మిదవ ఇంట్లో ఉండటం వల్ల అనేక రంగాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి లేదా జీతం పెంపు వంటి శుభవార్తలు అందుతాయి. వ్యాపారులకు లాభసాటి ఒప్పందాలు కుదురుతాయి. సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. వృశ్చిక రాశి వారికి ఈ కాలం వృత్తి, ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది. గురుడు తొమ్మిదవ ఇంట్లో, శని ఐదవ ఇంట్లో ఉండటం వల్ల అదృష్టం రెట్టింపు అవుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, మంచి అవకాశాలు లభిస్తాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో కొత్త పరిచయాల వల్ల లాభాలు వస్తాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైన సమయం. తులారాశి వారికి నవపంచమ రాజయోగం కెరీర్ పరంగా మంచి ఫలితాలను ఇస్తుంది. గురుడు ఏడవ ఇంట్లో, శని మూడవ ఇంట్లో ఉండటం వల్ల కొత్త ప్రాజెక్టులు, బాధ్యతలు చేపడతారు. భాగస్వామ్య వ్యాపారాలలో మంచి లాభాలు ఉంటాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పాత ప్రణాళికలు ఇప్పుడు అమలులోకి వచ్చి అనుకూల ఫలితాలను ఇస్తాయి. నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. మేష రాశి వారికి కూడా ఈ యోగం సానుకూల మార్పులను తీసుకువస్తుంది. గురుడు నాలుగవ ఇంట్లో, శని పన్నెండవ ఇంట్లో వక్రగతిలో ఉండటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. సమాజంలో హోదా, గౌరవం పెరుగుతాయి. స్నేహితులు, సన్నిహితుల నుండి సహకారం అందుతుంది. వృత్తిపరంగా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. జీతం పెంపు లేదా పదోన్నతి పొందే అవకాశం ఉంది

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారం రేపాయి. హైదరాబాద్, ఆగస్టు 22: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె కుమార్తె కొండా సుస్మితా పటేల్ చేసిన వరుస వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారం రేపాయి. ప్రభుత్వంలో బాధ్యత గల మంత్రిగా ఉండి.. కుమార్తె వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా సురేఖ అదుపు చేయకపోవడంపై కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర అంసతృప్తితో ఉన్నట్లు సమాచారం. గతంలో సినీ పరిశ్రమకు చెందిన వారిపై సురేఖ చేసిన కామెంట్స్ ఇప్పుడు లెక్కలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెను మంత్రి వర్గం నుంచి తప్పించే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కోసం పై వీడియోను వీక్షించండి. ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ అర్హుల జాబితా 25న

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. గాజాకు మానవతా సహాయక సామాగ్రితో వెళ్తున్న నౌకలను ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకోవడం దీనికి ప్రధాన కారణం. దీనిపై కొనసాగుతున్న విచారణలో భాగంగా టర్కీ ఈ నిర్ణయం తీసుకుంది. నెతన్యాహుతో పాటు పలువురు ఇజ్రాయెల్ ఉన్నతాధికారులను అరెస్ట్ చేసేందుకు వీలుగా ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ నోటీస్ జారీ చేయాలని కూడా కోరింది.ఈ వివరాలను టర్కీ న్యాయశాఖ మంత్రి అకిన్ గుర్లెక్ వెల్లడించారు. గాజాపై ఇజ్రాయెల్ విధించిన నావికా దిగ్బంధనాన్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నించిన వివిధ దేశాలకు చెందిన నౌకలను ఇజ్రాయెల్ రక్షణ దళాలు అడ్డుకోవడాన్ని టర్కీ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్.. అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఇస్తాంబుల్ ప్రాసిక్యూటర్ కార్యాలయాన్ని రంగంలోకి దించారు.దీని ఆధారంగానే ఇజ్రాయెల్ ప్రధానితో పాటు ఆ నౌకల దిగ్బంధనానికి ప్రత్యక్షంగా ఆదేశాలు ఇచ్చిన, క్షేత్రస్థాయిలో ఆపరేషన్‌లో పాల్గొన్న ఇతర ఉన్నత స్థాయి సైనిక అధికారులను నిందితులుగా ఈ అరెస్ట్ వారెంట్లల్లో చేర్చింది. ఇజ్రాయెల్ సైన్యం మానవ హక్కుల ఉల్లంఘన, చట్టవిరుద్ధ నిర్బంధాలకు పాల్పడిందని టర్కీ ప్రాసిక్యూటర్లు తమ చార్జ్‌షీట్‌లో పొందుపరిచారు.వాస్తు ప్రకారం.. ఇంట్లో మూడు బర్నర్లు ఉన్న గ్యాస్ స్టవ్ వాడవచ్చా?ఇజ్రాయెల్ ప్రభుత్వం సామూహిక మారణహోమ యత్నాలకు ప్రయత్నించిందని, అంతర్జాతీయ శాంతి కార్యకర్తలను చట్టవిరుద్ధంగా నిర్బంధించడం, వారిని గాయపర్చడం వంటి హేయమైన చర్యలకు పాల్పడిందని టర్కీ కోర్టు పేర్కొంది. టర్కీతో పాటు ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రేలియా కూడా తమ న్యాయపరిధుల్లో స్వతంత్ర దర్యాప్తును ప్రారంభించాయి. ఇటువంటి అమానవీయ చర్యలకు పాల్పడిన వారందరినీ చట్టం ముందు నిలబెడతామని టర్కీ చెబుతోంది.అందుకే.. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతులు ఇవ్వలేదు: తేల్చి చెప్పిన కేంద్రంటర్కీ ప్రభుత్వం అధికారికంగా విజ్ఞప్తి చేసినప్పటికీ.. ఇంటర్‌పోల్ ద్వారా నెతన్యాహుపై రెడ్ నోటీస్ జారీ కావడం, దాని అమలు అనేది అంత తేలికైన విషయం కాదు. నిందితులను అరెస్ట్ చేసి అప్పగించడం అనేది ఆయా

నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీపర బావ నామ సంవత్సరం, శ్రావణమాసం, వర్షఋతువు, దక్షిణాయనం, 2026 ఆగస్టు 22 శనివారం. పండితుల ప్రకారం ఈరోజు అదృష్టం కలిసి వచ్చే రాశులు ఏవి? ఏ రాశులు కొత్త పనులు ప్రారంభించకూడదు? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మేష రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి నిర్ణయాన్ని ఆచితూచి తీసుకోవాలి. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున కోపాన్ని తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యులతో సఖ్యత పెంచుకోవడానికి ప్రయత్నించండి. మిథున రాశి వారికి ఈరోజు శుభకరంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కీలకమైన పనులను ప్రారంభిస్తారు. పెండింగ్‌లో ఉన్న పనులను కూడా పూర్తి చేస్తారు. ఆర్థికంగా కలిసివచ్చే రోజు కావడంతో ప్రాంతీయ ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. కర్కాటక రాశి వారికి ఈరోజు శుభకరం. మీరు తీసుకునే కొత్త నిర్ణయాలు సానుకూలంగా సాగుతాయి. అయితే కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది.. ఇతరులతో అనవసరపు గొడవలకు దిగకండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. కుంభ రాశి వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. కార్యాలయంలో మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్య పరంగా కూడా ఈరోజు బాగుంటుంది. మీన రాశి వారు ఈరోజు చాలా చురుకుగా ఉంటారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.. దీనివల్ల లాభాలు కలుగుతాయి. బంధుమిత్రులతో కలిసి సరదాగా గడుపుతారు.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)

తెలంగాణ మంత్రి కొండా సురేఖపై వేటు వేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యల వివాదం, పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత ఈ మేరకు అధికారిక ప్రక్రియ ప్రారంభం కానుంది.కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని అహంకారిగా అభివర్ణిస్తూ, తెలంగాణ కాంగ్రెస్‌ను 'తెలుగుదేశం కాంగ్రెస్'గా మార్చేశారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సురేఖకు షోకాజ్ నోటీసు ఇవ్వగా, తన కుమార్తె వ్యాఖ్యలు వ్యక్తిగతమని, వాటితో తనకు సంబంధం లేదని ఆమె బదులిచ్చారు. అయితే, కుమార్తె వ్యాఖ్యలను ఖండించకపోవడం, సీఎం పాల్గొన్న కార్యక్రమాలకు గైర్హాజరు కావడం వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది.ఈ పరిణామాల మధ్య, ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలకు చెందిన సుమారు 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్రవారం సమావేశమయ్యారు. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి, పార్టీ నుంచి తక్షణమే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ విప్ బీర్ల ఇలయ్య, ఎమ్మెల్యే వేముల వీరేశం వంటి నేతలు మాట్లాడుతూ.. పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించే అంతర్గత విమర్శలపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సురేఖపై చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం. ఈ నిర్ణయాన్ని అధిష్ఠానం

లెజెండరీ నటి షావుకారు జానకి హఠాన్మరణం చిత్ర పరిశ్రమ ని విషాదంలోకి నెట్టేసింది. ఆమె శ్వాస సంబంధించిత సమస్యలతో బాధపడుతూ శుక్రవారం కన్నుమూశారు. దీంతో సౌత్ సినిమాలో విషాదం నెలకొంది. అయితే షావుకారు జానకికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఆమె సంపాదించిన ఆస్తులకు సంబంధించిన వివరాలు షాకిస్తున్నాయి. స్వయంగా జానకినే తాను ఎంత సంపాదించిందో తెలిపారు. వేల కోట్లు సంపాదించినట్టు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కెరీర్‌ని ప్రారంభించింది జానకి. తాను సినిమాల్లోకి వెళ్లాలనుకున్న సమయంలోనే ఇంట్లో పెళ్లి చేశారు. ఆ తర్వాత ఫ్యామిలీ ఇబ్బందులు ఫేస్ చేసింది. ఈ క్రమంలో భర్తని ఒప్పించి ఇళ్లు గడవడం కోసం ఆమె నటిగా బిగ్ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చారు. `షావుకారు` చిత్రంతో బిగ్ బ్రేక్ అందుకున్నారు. ఆ మూవీ టైటిల్‌నే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు. ఏడు దశాబ్దాలుగా నటించారు. రాణించారు. ఈ క్రమంలో తాను బాగా ఆస్తులు సంపాదించారు. రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్టిమెంట్ పెట్టారు. ఇటు హైదరాబాద్, అటు చెన్నైలో భారీగా ఆస్తులు కొన్నారు. కొన్ని తన భర్త పేరుతోనూ రిజిస్టర్ చేయించారు. అయితే జానకి సంపాదించడంతో భర్త శంకరమంచి శ్రీనివాసులు జల్సాలకు అలవాటు పడ్డారు. జాబ్ వదిలేసి భార్య సంపాదనతో బతకడం స్టార్ట్ చేశారు. అప్పట్లో భారీగా డబ్బు రావడంతో తాను ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు, తాగుడికి బానిసయ్యారు. ఈ క్రమంలో ఆస్తులన్నీ కరిగిపోవడం స్టార్ట్ అయ్యాయి. దీంతో ఇది సరిగా లేదని చెప్పి జానకి.. భర్తకి దూరంగా ఉన్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఆస్తులన్నీ పోయాయి. అయినా భర్త బాగోగులు చూసుకున్నారు జానకి. అయితే తాను కొన్న ఆస్తులు, పోయిన ఆస్తుల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జానకి స్పందించారు. తాను కొన్న ఆస్తులు ఇప్పుడు ఉండి ఉంటే వాటి విలువ వందల కోట్లు కాదు, వేల కోట్లు ఉంటాయని చెప్పారు. అవన్నీ

గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ భారత రూపాయి శుక్రవారం ట్రేడింగ్‌లో తీవ్ర గందరగోళానికి గురైంది. ఒక్కో దశలో మంచి లాభాల్లోకి దూసుకెళ్లినప్పటికీ... అంతిమంగా స్వల్ప లాభంతో ముగిసింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కేవలం 3 పైసలు పుంజుకుని 95.71 వద్ద స్థిరపడింది. విదేశీ మార్కెట్లలో డాలర్ కొంత బలహీనపడటం రూపాయికి కలసివచ్చినప్పటికీ, మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు రూపాయి దూకుడుకు అడ్డుకట్ట వేశాయి.ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఉదయం రూపాయి 95.69 వద్ద లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఒక దశలో గరిష్ఠంగా 95.65 స్థాయికి చేరుకుని ఇన్వెస్టర్లలో ఆశలు రేకెత్తించింది. అయితే అంతర్జాతీయ పరిణామాలతో వెంటనే కోలుకున్న డాలర్ ధాటికి ఒకానొక సమయంలో 95.75 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. చివరికి గురువారం నాటి ముగింపు (95.74) కంటే కేవలం 3 పైసలు మాత్రమే మెరుగై 95.71 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది.గడువు కుదింపు.. ఒక్కసారిగా $56 బిలియన్ల వరద!గడిచిన 30 రోజుల్లో అతిపెద్ద పరిణామం ఏమిటంటే.. ప్రత్యేక విదేశీ డిపాజిట్ పథకానికి (FCNR-B) ఇచ్చిన గడువును ఆర్బీఐ ఆగస్టు 31 వరకు కుదించింది. ఈ ముందస్తు ఆదేశంతో ఒక్కసారిగా విదేశీ కరెన్సీ భారత్‌కు పోటెత్తింది. దీనిద్వారా దేశంలోకి ఏకంగా 56.84 బిలియన్ డాలర్ల నిధులు రాగా, మొత్తం విదేశీ నిధుల ప్రవాహం 80 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. ఈ నిధుల వరద రూపాయి పతనానికి బలమైన అడ్డుకట్టగా మారింది.చెక్కుచెదరని రూపాయి.. ఆర్బీఐ వ్యూహంతో భారత్‌కు ఊరట!రూ.707 బిలియన్లకు చేరిన విదేశీ కరెన్సీ నిల్వలుగత కొద్ది వారాల్లో భారత్ ఫారెక్స్ నిల్వలు సరికొత్త గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఆగస్టు మొదటి వారంలో ఫారెక్స్ నిల్వలు ఏకంగా $14.13 బిలియన్లు పెరిగి $707 బిలియన్ మార్కును అధిగమించాయి. ఈ బలమైన ఆర్థిక పునాదితో ఆర్బీఐ స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌ను కట్టడి చేస్తూ, రూపాయి విలువను నిలకడగా

తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ఈ అంశంపై ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాలకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు సీఎల్పీ వేదికగా సమావేశమై చర్చించారు. అనంతరం కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గం నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం.సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ను టార్గెట్ చేస్తూ కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై సమావేశంలో తీవ్ర చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆమె వ్యాఖ్యలపై పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు కూడా సురేఖకు వ్యతిరేకంగా గళం విప్పారు.సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు మీడియా సమావేశంలో మాట్లాడారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ ఇప్పటివరకు ఖండించకపోవడాన్ని ఎమ్మెల్యేలు తీవ్రంగా తప్పుబట్టారు. మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలపై బాధ్యత వహించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. సీఎంను వ్యతిరేకించే వారికి పార్టీలో ఉండే అర్హత లేదని స్పష్టం చేశారు. మీ భాష ఎప్పుడూ పార్టీకి నష్టం కలిగించేలా ఉందని కొండా ఫ్యామిలీని ఉద్దేశించి అన్నారు.సుస్మిత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని సురేఖ చెప్పడంపైనా ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇచ్చిన వివరణ తమకు ఆమోదయోగ్యంగా లేదని తేల్చారు. సీఎం రేవంత్ ఎంతో కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు. అలాంటి వ్యక్తిని విమర్శించినప్పుడు ఖండించడం కనీస బాధ్యత అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చాలనే ప్రతిపక్షాల కుట్రలకు బలం చేకూర్చుతున్నారని మండిపడ్డారు. అలాంటి వ్యక్తులపై కఠిన చర్చలు తీసుకోవాలని

భారత్‌లో స్టార్‌లింక్ సేవలపై స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ మరోసారి కీలక వ్యాఖ్య చేశారు. దేశంలోని అత్యంత తక్కువ సేవలు అందుతున్న ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు స్టార్‌లింక్ సహాయపడుతుందని పేర్కొన్నారు. గ్రామీణ భారతంలో ఇంటర్నెట్ సౌకర్యాలపై పేర్కొన్న గణాంకాలతో కూడిన ఒక ఎక్స్ పోస్టుకు స్పందిస్తూ మస్క్ ఈ అభిప్రాయం వెల్లడించారు. దీంతో భారత్‌లో స్టార్‌లింక్ కమర్షియల్ సేవల ప్రారంభంపై మరోసారి ఆసక్తి పెరిగింది. ఆగస్టు 20 రాత్రి డోగ్డిజైనర్ అనే ఎక్స్ ఖాతా గ్రామీణ ఇంటర్నెట్ అంతరంపై వివరాలతో పోస్ట్ చేసింది. మే 2026 నాటికి దేశంలోని 11,256 జాబితా గ్రామాలకు ఇంకా 4జీ కవరేజీ లేదని అందులో పేర్కొంది. మార్చి 2026 నాటికి భారత్‌లో 1.093 బిలియన్ ఇంటర్నెట్ సబ్స్క్రిప్షన్లు ఉండగా, గ్రామీణ ప్రాంతాల వాటా 440.87 మిలియన్లుగా తెలిపింది. ప్రతి 100 మందికి గ్రామీణ సబ్స్క్రిప్షన్ సాంద్రత 48.31గా ఉంటే, పట్టణాల్లో అది 126.80గా ఉన్నట్లు వివరించింది. భారత్‌నెట్ కింద ఇప్పటికే 8.5 లక్షల కిలోమీటర్లకు పైగా ఫైబర్ ఏర్పాటు చేసినట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు. సుమారు 2.21 లక్షల గ్రామ పంచాయతీలను సేవలకు సిద్ధం చేసినప్పటికీ, జూన్ 2026 నాటికి 80,472 ప్రాంతాల్లోనే అనుసంధాన కేంద్రాలు పనిచేస్తున్నట్లు తెలిపింది. దీంతో కఠిన భూభాగాలు, కొండ ప్రాంతాలు, దీవులు, మారుమూల గ్రామాల్లో చివరి మైలు అనుసంధానం ప్రధాన సవాలుగా కొనసాగుతోంది. ఇలాంటి ప్రాంతాల్లో స్టార్‌లింక్ ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ పూరక సేవగా ఉపయోగపడుతుందనే వాదన ముందుకొచ్చింది. ఇదిలా ఉండగా స్టార్‌లింక్ తన రెండో తరం ఉపగ్రహ నెట్‌వర్క్‌కు అనుమతి కోరుతూ ఇన్-స్పేస్‌కు తాజా దరఖాస్తు సమర్పించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. దాదాపు 30,000 ఉపగ్రహాలతో పాటు ప్రత్యక్ష పరికర అనుసంధాన సాంకేతికతకు కూడా ఆమోదం కోరుతున్నట్లు సమాచారం. గతంలో రెండో తరం దరఖాస్తు తిరస్కరణకు గురికాగా, 2025 జూలైలో సుమారు 4,408 ఉపగ్రహాల మొదటి తరం వ్యవస్థకు అనుమతి లభించింది

భారత్‌లో ఇంటర్నెట్ సదుపాయం అంతగా లేని ప్రాంతాలకు స్టార్‌లింక్ ఉపయోగపడుతుందని స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు శాటిలైట్ ఇంటర్నెట్ మేలు చేస్తుందని పేర్కొన్నారు. భారత్‌లో స్టార్‌లింక్ వాణిజ్య సేవలు ఇంకా ప్రారంభం కాలేదు. అనుమతుల ప్రక్రియ కొనసాగుతోంది.‘ఎక్స్’లో ఓ పోస్ట్‌కు స్పందిస్తూ మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2026 మే నాటికి దేశంలో 11,256 గ్రామాలకు 4జీ సదుపాయం లేదని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఇంటర్నెట్ వినియోగంలో భారీ తేడా ఉందని వివరించారు.2026 మార్చి నాటికి భారత్‌లో 109.3 కోట్ల ఇంటర్నెట్ సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల వాటా 44.087 కోట్లు. గ్రామీణ ప్రాంతాల్లో 100 మందికి 48.31 ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్నాయి. పట్టణాల్లో ఈ సంఖ్య 126.80గా ఉంది.మారుమూల గ్రామాలు, పర్వత ప్రాంతాలు, దీవులు, విపత్తుల ప్రభావిత ప్రాంతాల్లో శాటిలైట్ ఇంటర్నెట్ ఉపయోగపడే అవకాశం ఉంది. ఇలాంటి చోట్ల భౌగోళిక పరిస్థితులు, మౌలిక వసతుల కొరత వల్ల సంప్రదాయ టెలికాం సేవలు అందించడం కష్టంగా ఉంటుంది. దేశంలో భారత్‌నెట్ ద్వారా 8.5 లక్షల రూట్ కిలోమీటర్లకు పైగా ఫైబర్ వేశారు. సుమారు 2.21 లక్షల గ్రామ పంచాయతీలను సేవలకు సిద్ధం చేశారు. స్టార్‌లింక్ సేవలు ప్రారంభం కావాలంటే నియంత్రణ అనుమతులు, స్పెక్ట్రమ్ కేటాయింపు పూర్తి కావాలి. ఈ ప్రక్రియ పూర్తయితే మారుమూల ప్రాంతాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో వచ్చే అవకాశం ఉంది

అణగారిన ప్రజల కష్టాలు, వారి జీవిత గాథలను చెప్పే చిత్రంగా ‘అమరం’ రూపొందించినట్టు ఆ చిత్ర దర్శకుడు తిరు అరుల్ కృష్ణన్ చెప్పారు. తాజాగా ఈ మూవీ ఆడియో వేడుక గ్రాండ్‌గా నిర్వహించారు. అణగారిన ప్రజల కష్టాలు, వారి జీవిత గాథలను చెప్పే చిత్రంగా ‘అమరం’ (Amaram) రూపొందించినట్టు ఆ చిత్ర దర్శకుడు తిరు అరుల్ కృష్ణన్ (Arul Krishnan) చెప్పారు. దివ్య నేత్ర ఫిలిమ్స్ పతాకంపై సీఆర్ రాజన్ నిర్మించిన ఈ చిత్రంలో తేజస్ రాజన్ హీరోగా నటించగా, ఐరా అగర్వాల్ హీరోయిన్. ఇతర పాత్రల్లో జార్జ్, సాయిదీనా, నాగినీడు, కల్కిరాజన్, హరీష్ పేరడి, వాసుదేవన్ మురళి తదితరులు నటించారు. కథ, స్ర్కీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం తిరు అరుల్ కృష్ణన్. సంగీతం మిక్కీ జే మేయర్. ఈ నెల 28వ తేదీ విడుదలకానున్న ఈ చిత్ర ఆడియో రిలీజ్ వేడుక తాజాగా చెన్నై నగరంలో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సీఆర్ రాజన్ మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరూ సినిమా తీయాలని కోరుకుంటారు. కానీ, అనేక మంది కళాకారుల కృషి, అంకితభావం అవసరం. అది కొన్ని సినిమాల విషయంలో మాత్రమే సాధ్యమవుతుంది. ఆ కోణంలో చూస్తే మా సినిమాకు అన్ని పుష్కలంగా లభించాయి. అందుకే ఒక అద్భుతమైన మూవీగా నిలుస్తుందని నమ్మకంగా చెబుతున్నా’’ అన్నారు. హీరో తేజస్ రాజన్ మాట్లాడుతూ.. మా అందరి కృషి ఫలితంగా ఓ చిత్రం రూపుదిద్దుకుని మీ ముందుకు వస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. 330 మందికిపైగా నటీనటులు, సాంకేతిక నిపుణులు అంకితభావంతో ఈ చిత్రాన్ని పూర్తిచేశాం. దర్శకుడు అరుల్ కృష్ణన్ చాలా చక్కగా తెరకెక్కించారని పేర్కొన్నారు. దర్శకుడు అరుల్ కృష్ణన్ మాట్లాడుతూ.. ‘‘ఈ స్టోరీ సమాజం తిరస్కరించిన వారి జీవితాల గురించి మాట్లాడుతుంది. ఇలాంటి కథ సృష్టించడానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం నిర్మాతలో ఉండటం వల్లే ఈ సినిమా సకాలంలో

దక్షిణాది చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకు పైగా అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న త్రిష కృష్ణన్, నటనతోనే కాకుండా సంపాదనలోనూ తన సత్తా చాటుతున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ చెన్నై బ్యూటీ ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణులలో ఒకరిగా నిలిచారు. మీడియా నివేదికల ప్రకారం.. ప్రస్తుతం త్రిష నికర ఆస్తి విలువ సుమారు రూ. 85 కోట్లకు చేరింది. ‘పొన్నియిన్ సెల్వన్’, ‘లియో’ వంటి భారీ విజయాల తర్వాత త్రిష తన రెమ్యునరేషన్‌ను గణనీయంగా పెంచారు. ప్రస్తుతం ఆమె ఒక్కో చిత్రానికి రూ.10 నుంచి 12 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాలతో పాటు ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ, ఎండార్స్మెంట్ల ద్వారా ఏటా సుమారు రూ.9 కోట్లు ఆర్జిస్తున్నారు. ఆస్తి పెట్టుబడుల్లోనూ త్రిష ముందున్నారు. చెన్నైలో ఆమెకు సుమారు రూ.10 కోట్ల విలువైన లగ్జరీ ఇల్లు ఉంది. అలాగే షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చినప్పుడు ఉండేందుకు ఇక్కడ రూ. 6 నుంచి 6.5 కోట్ల విలువైన మరో ఇల్లు ఉంది. అంతేకాకుండా విదేశాల్లోనూ ఆమెకు పెట్టుబడులు ఉన్నట్లు సమాచారం.ఇక లగ్జరీ కార్లంటే త్రిషకు చాలా ఇష్టం. ఆమె గ్యారేజీలో మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, బీఎండబ్ల్యూ, రేంజ్ రోవర్ ఎవోక్, ఆడి వంటి రూ. 3 నుంచి 4 కోట్ల విలువైన ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇలా నటనతో పాటు వ్యాపార దృక్పథంతో ముందుకు సాగుతూ త్రిష తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. మటన్ అమ్మే పనిలో బిజీగా షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్.. తర్వాత ఏమైందంటే.. Anupama Parameswaran: నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు.. టాలీవుడ్లో ఆగని రచ్చ.. ఫిల్మ్ పెడరేషన్ సీరియస్ చర్యలు బఘీరా.. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటారా.. NTR ఎమోషనల్! Balakrishna 111: గాయాన్ని లెక్కచేయకుండా.. బాలయ్య మొండి పట్టు

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష పద్ధతిలో జడ్పీ ఎన్నిక జరగాలంటూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఎంపీ శ్రీభరత్ అభినందించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని తెలిపారు. విశాఖపట్నం, ఆగస్టు 20: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష పద్ధతిలో జడ్పీ ఎన్నిక జరగాలంటూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఎంపీ శ్రీభరత్ అభినందించారు. ఈరోజు(గురువారం) విశాఖ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఎంపీ తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారని కొనియాడారు. గత ప్రభుత్వం చేసిన అరాచకాలు నుంచి రాష్ట్రం ఇంకా పూర్తిగా రికవరీ అవ్వలేదని ఎంపీ అన్నారు. రాష్ట్రంలో మంచి ప్రతిపక్షం లేదని... ప్రతిపక్షంలో ఉన్నవారికి వారి పాత్ర అర్ధం కావడం లేదని చెప్పుకొచ్చారు. ఎల్‌నినో వలన నీటి సమస్య తలెత్తుతోందన్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని డేటా సెంటర్ల వలన నీటి సమస్య వస్తోందని కొన్ని శక్తులు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. డేటా సెంటర్లు రావడానికి ఇంకా రెండు సంవత్సరాలు సమయం పడుతుందని తెలిపారు. వర్షాలపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. పోలవరం నీటిని విశాఖకు తీసుకువస్తున్నారని, నదులన్నీ అనుసంధానం అయిన తర్వాత దక్షిణ భారతదేశంలో నీటి సమస్య తగ్గుతుందని ఎంపీ శ్రీభరత్ వెల్లడించారు. ఏపీలో మిలాద్-ఉన్-నబి సెలవు తేదీ మార్పు.. ఎస్సీబీఏ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా రవిశంకర్ ఎన్నిక

అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి పంబ నుంచి శబరిమల కొండపైకి వెళ్లే భక్తులు తప్పనిసరిగా తలపై పవిత్రమైన మూటను ధరిస్తారు. దాన్నే ఇరుముడి లేదా ఇరుముడి కట్టు అంటారు. మలయాళంలో "ఇరు" అంటే రెండు, "ముడి" అంటే మూట లేదా కట్టు అని అర్థం. ఈ ఇరుముడి అనేది కేవలం పూజా సామగ్రిని తీసుకెళ్లే ఒక సంచి మాత్రమే కాదు. ఇది 41 రోజుల పాటు కఠినంగా ఉండే అయ్యప్ప స్వామి దీక్ష, నెయ్యాభిషేకం, పవిత్ర 18 మెట్లతో బలమైన సంబంధం కలిగిన అత్యంత ఆధ్యాత్మిక ప్రతీక. శబరిమల ఆలయ అధికారిక వివరాల ప్రకారం, ఇరుముడి సంప్రదాయం వెనుక మణికంఠుడు పులి పాలు తీసుకురావడానికి అడవికి వెళ్లిన కథ దాగి ఉంది. నాటి ప్రయాణాన్ని స్మరించుకుంటూ భక్తులు ఇరుముడిని తలపై మోస్తూ పంపా నదిలో స్నానం చేసి శరణఘోషతో కొండ ఎక్కుతారు. ఇరుముడి సంకల్పాన్ని ప్రధానంగా రెండు భాగాలుగా విభజిస్తారు. అందులో మొదటిది దైవిక భాగం కాగా, రెండోది భక్తుని స్వంత అవసరాల కోసం ఉపయోగపడేది. ఇందులో స్వామివారికి సమర్పించే పవిత్ర వస్తువులు ఉంటాయి. పీచు తీసిన కొబ్బరికాయకు పైన రంధ్రం చేసి, అందులోని నీటిని పూర్తిగా తీసేసి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో నింపుతారు. దీనినే నెయ్య్ తేంగా (నెయ్యి కొబ్బరికాయ) అంటారు. ఇది శబరిమలలో అయ్యప్ప స్వామికి చేసే నెయ్యాభిసేకానికి చాలా ప్రధానమైనది. దీనితో పాటు పసుపు, కుంకుమ, గంధం, కర్పూరం, ధూప్‌స్టిక్స్, విభూతి, ఆవు నెయ్యి వంటి పూజా ద్రవ్యాలు ఉంటాయి. అలాగే నైవేద్యం కోసం బెల్లం, కండచక్కెర, జీడిపప్పు, ఎండుద్రాక్ష, పేలాలు, అటుకులు, తమలపాకులు, వక్కలు, నాణేలు సహా ఇతర కానుకలు ఉంచుతారు. ఈ భాగంలో భక్తుడు అంటే స్వామి యాత్రలో తన ఆహారం కోసం తీసుకెళ్లే బియ్యం, పప్పు ధాన్యాలు, ఇతర తినుబండారాలు, వ్యక్తిగత పూజా సామగ్రిని భద్రపరుచుకుంటారు. శబరిమలలో జరిగే నెయ్యాభిషేకం అయ్యప్ప స్వామికి అత్యంత ముఖ్యమైన పూజా

హైదరాబాద్‌లో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, గ్యాంగ్‌స్టర్ షహజాద్ భట్టీ నెట్‌వర్క్‌కు సంబంధించిన జాడలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. హైదరాబాద్, ఆగస్టు 20: హైదరాబాద్‌లో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, గ్యాంగ్‌స్టర్ షహజాద్ భట్టీ నెట్‌వర్క్‌కు సంబంధించిన జాడలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. పాక్ ఐఎస్ఐ నెట్‌వర్క్‌తో హైదరాబాద్‌కు సంబంధాలు ఉన్నాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో యూసుఫ్‌గూడ, మేడ్చల్ ప్రాంతాల్లో కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. గతంలో అరెస్టైన ఇద్దరు యువకులకు ఈ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఉగ్రకుట్ర కేసులో భాగంగా ఇటీవల దేశవ్యాప్తంగా 253 మంది అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. 14 రాష్ట్రాల్లో 253 మందిని అరెస్ట్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. 253 మందిలో తెలంగాణ నుంచి ఇద్దరు అరెస్టైనట్లు గుర్తించారు. వీరికి గాజియాబాద్‌కు చెందిన 22 ఏళ్ల జాయిద్ ఖాన్‌కు కీలక లింకులు ఉన్నట్లు బయటపడింది. జాయిద్ ఖాన్.. ఫిబ్రవరిలో మేడ్చల్‌లోని ఓ రెస్టారెంట్లో పనిచేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఐఎస్ఐ నెట్‌వర్క్‌తో పరిచయం ఏర్పడిందని, అనంతరం ఐఎస్ఐ సానుభూతిపరులతో జాయిద్ ఖాన్ చాటింగ్ చేసినట్లు విచారణలో తేలింది. ఐఏఎస్ సానుభూతిపరులు హమీద్, రాణా హుస్సేన్‌లతో జాయిద్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్.. వీరి చాటింగ్‌పై నిఘా పెట్టింది. తెలంగాణలో సెక్షన్ 22Aపై రాహుల్‌కు హరీశ్ లేఖ.. కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు నగల బ్యాగ్‌ను పోగొట్టుకున్న బధిర అన్నాచెల్లెళ్లు.. పోలీసుల చొరవతో తిరిగి అప్పగింత

Nalgonda: నల్గొండలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు! ఈ వార్తకు సంబంధించిన

Gudur-Gummidipoondi Railway: తెలుగు రాష్ట్రాల్లో రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణ దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య రైల్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసేందుకు గూడూరు-గుమ్మిడిపుండి సెక్షన్ మధ్య రూ. 2,229 కోట్ల వ్యయంతో మరో రెండు (3, 4వ) కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా, వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌తో పాటు ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్‌లో ఈ మార్గం అత్యంత కీలకమైనదిగా మారనుంది. గూడూరు నుంచి గుమ్మిడిపుండి (Gudur-Gummidipoondi Railway)మధ్య 90 కిలోమీటర్ల పొడవునా సాగే ఈ ప్రాజెక్టును రాబోయే నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నిర్మాణంలో భాగంగా స్వర్ణముఖి నదిపై ఒక భారీ బ్రిడ్జి, 21 పెద్ద వంతెనలు, 127 చిన్న వంతెనలతో పాటు 34 ఆర్వోబీ లేదా ఆర్‌యూబీలను నిర్మించనున్నారు. ఈ కొత్త లైన్ల వల్ల పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల అభయారణ్యం వంటి పర్యాటక ప్రాంతాలకు రవాణా సౌకర్యం మరింత సులువవుతుంది. ఈ ప్రాజెక్టుతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం రూ. 9,450 కోట్ల అంచనా వ్యయంతో 4 మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల భారతీయ రైల్వే నెట్వర్క్ మరో 410 కిలోమీటర్ల మేర విస్తరించనుంది. దాదాపు 6,448 గ్రామాలకు చెందిన 60 లక్షల మంది జనాభాకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. 2030-31 నాటికి ఈ విస్తరణ లక్ష్యాలను పూర్తిగా సాధిస్తామని కేంద్రం స్పష్టం చేసింది

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. India vs Pakistan Highlights: హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుతం చేసింది. ప్రపంచ హాకీ టోర్నీలో భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసి ముందడుగు వేసింది. భారీ తేడాతో విజయం సాధించిన భారత జట్టు గోల్స్‌తో అదరగొట్టింది. హర్మన్‌ప్రీత్ సింగ్, అభిషేక్ గోల్స్‌తో చెలరేగడంతో పాకిస్థాన్ ఆటగాళ్లు ఏమాత్రం పోరాడలేకపోయారు. చేసిన మూడు గోల్స్‌కు పరిమితమై ఓటమితో ప్రపంచకప్‌ను పాకిస్థాన జట్టు వీడింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పురుషుల హాకీ ప్రపంచకప్ 2026లో ఓటమి నుంచి తేరుకున్న భారత జట్టు హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై తీవ్రంగా శ్రమించి విజయం సాధించింది. ఆమ్‌స్టల్‌వీన్ వేదికగా బుధవారం జరిగిన పూల్-డి మ్యాచ్‌లో భారత్ 5-3 తేడాతో పాకిస్థాన్‌ను చిత్తుచేసింది. భారీ విజయాన్ని అందుకున్న భారత జట్టు రెండో రౌండ్‌కు అర్హత సాధించగా.. పాకిస్తాన్ జట్టు ప్రపంచకప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ ప్రారంభం నుంచే భారత జట్టు దూకుడుగా ప్రదర్శన చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, ఫార్వర్డ్ అభిషేక్ చెరో రెండు గోల్స్‌తో చేసి ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలో పడేశారు. రెండో క్వార్టర్ పూర్తయ్యాక భారత్ 3-0తో పాకిస్థాన్‌పై ఆధిక్యం సాధించి మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది. మూడో క్వార్టర్లో పాకిస్థాన్ గొప్పగా పుంజుకుని రెండు గోల్స్ సాధించింది. అయితే అదే సమయంలో భారత జట్టు మరో గోల్ సాధించడంతో 4-2 భారత్ ఆధిక్యం కొనసాగింంది. ఆఖరి క్వార్టర్లో పాకిస్థాన్ తొలుత ఓ గోల్ కొట్టి భారత్‌కు ఝలక్ ఇచ్చింది. తర్వాత గోల్స్ కోసం పాకిస్థాన్ ఆటగాళ్లు శ్రమించినా భారత

ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనం చేకూర్చే కీలకమైన రైల్వే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. గూడూరు-గుమ్మిడిపూండి మధ్య 90 కిలోమీటర్ల మేర మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,229 కోట్లుగా నిర్ణయించారు.కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం డబుల్ లైన్‌గా ఉన్న ఈ మార్గాన్ని నాలుగు లైన్లుగా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గి, మరిన్ని ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపేందుకు వీలవుతుందని వివరించారు. దేశంలో అత్యంత రద్దీగా ఉండే చెన్నై-కోల్‌కతా, ఢిల్లీ-చెన్నై మార్గాలతో పాటు వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో ఈ ప్రాజెక్టు ఎంతో కీలకం కానుంది.ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించడంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తిరుపతి ఎంపీ గురుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. ఈ అదనపు ట్రాక్‌లు ప్రాంతీయ అభివృద్ధికి, ప్రగతికి బాటలు వేస్తాయని పవన్ కల్యాణ్ పేర్కొంటూ కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపినందుకు రైల్వే మంత్రికి ఎంపీ గురుమూర్తి కృతజ్ఞతలు తెలిపారు.ప్రాజెక్టుతో చేకూరే ప్రయోజనాలుఈ ప్రాజెక్టు పూర్తయితే గూడూరు జంక్షన్లో ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది. చెన్నై, విజయవాడ, తిరుపతి వైపు వెళ్లే రైళ్ల రాకపోకలు సులభతరం అవుతాయి. ముఖ్యంగా పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం, శ్రీహరికోటలోని సతీశ్