
HYD - WGL జాతీయ రహదారి.. ఉప్పొంగిన వాగు
జనగామ(Janagama) జిల్లా రఘునాథపల్లి మండలంలో భారీ వర్షం కురిసింది.

జనగామ(Janagama) జిల్లా రఘునాథపల్లి మండలంలో భారీ వర్షం కురిసింది.

అక్కినేని నాగచైతన్యకు ‘తండేల్’ సినిమా మరోసారి అవార్డు తెచ్చిపెట్టింది.

Nagarjuna Seed Ganesha | సీడ్ గణేశుడిని స్వీకరించిన నాగార్జున.. సంతోష్‌కుమార్ కృషికి అభినందనలు
Nagarjuna Fires Trigun: డొల్ల,డబ్బా, నిబ్బా త్రిగుణ్!! రోహిత్ స్టెరాయిడ్స్ ఎక్కించుకున్నాడా? నువ్ చూశావా? నాగార్జున ఉతుకుడు రె‘ఢీ’

Naga Vamsi : ట్రైలర్లో ఆనంద్ ముద్దు సీన్.. '90స్' డైరెక్టర్‌పై ట్రోల్స్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నాగవంశీ!

Nagarjuna - DSP: హ్యాట్రిక్ ఇచ్చిన డిసెంబర్ మాసం...

Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!

Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?

మీరు కూడా బిగ్ బాస్ డే 1 ప్రోమో చూసేయండి.. (Bigg Boss Telugu 10 Day 1 Promo)

విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు పోలీసు అధికారుల బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో వారు మరికొంత కాలం జైలులోనే గడపాల్సి ఉంటుంది.ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ సీఐ నాగరాజు (ఏ1), హెడ్ కానిస్టేబుల్ జంగం నాని (ఏ3), హెడ్ కానిస్టేబుల్ బాబురావు (ఏ5), సాంబయ్య (ఏ6) తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విజయవాడలోని 8వ ఏడీజే కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, నిందితుల అభ్యర్థనను తోసిపుచ్చుతూ వారి పిటిషన్లను కొట్టివేసింది.ప్రస్తుతం ఈ నలుగురు రిమాండ్ ఖైదీలుగా వేర్వేరు జైళ్లలో ఉన్నారు. సీఐ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండగా, జంగం నాని ఏలూరు సబ్ జైలులో, బాబురావు అవనిగడ్డ సబ్ జైలులో, సాంబయ్య గన్నవరం సబ్ జైలులో ఉన్నారు. తాజా తీర్పు నేపథ్యంలో వారంతా జైలుకే పరిమితం కానున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ ఎలా సాగుతుందనే అంశంపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది

కరీంనగర్ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, పెను ప్రమాదం తృటిలో తప్పింది. చిగురుమామిడి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, పెను ప్రమాదం తృటిలో తప్పింది. హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం హుస్నాబాద్ నుంచి 54 మంది ప్రయాణికులతో కరీంనగర్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో చిగురుమామిడి మండలం సుందరగిరి శివారులో రోడ్డుపై ఉన్న గుంతలను తప్పించేందుకు డ్రైవర్ హరీశ్ ప్రయత్నించాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావి వైపు దూసుకెళ్లింది. అయితే, బస్సు తక్కువ వేగంతో ఉండడం, డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు బావి అంచు వరకు వెళ్లి ఆగిపోయింది. వెంటనే ప్రయాణికులు అద్దాలు పగులగొట్టి బయటకు దూకారు. భట్టి భార్య వసూళ్లు.. పొంగులేటి దౌర్జన్యాలు కనిపిస్తలేవా? ఉద్వాసన ఖాయం!.. కొండా సురేఖను పట్టించుకోని అధిష్ఠానం
కరీంనగర్లో బావిలోకి దూసుకెళ్లిన RTC బస్సు.. బయటపడ్డ 54 మంది ప్రయాణికులు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో ఘోర బస్సు ప్రమాదం త్రుటిలో తప్పింది. కరీంనగర్ నుండి హుస్నాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి, పక్కనే ఉన్న ఒక వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 54 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో ప్రయాణికులంతా స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మూడు రోజుల క్రితమే రిపేర్ చేయించినా ఇలా జరిగిందని డ్రైవర్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వార్తకు సంబంధించిన

బాలానగర్ : మహిళలు తప్పని సరిగా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలని మహబూబ్‌నగర్ ఎంపీ డి.కె అరుణ అన్నారు. క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించి, సకాలంలో చికిత్స అందిస్తే పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుందన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఫ్యూయలింగ్ గ్రోత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తాతో కలిసి ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. కుటుంబ బాధ్యతల్లో నిమగ్నమై చాలామంది మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, వ్యాధి ముదిరిన తర్వాత చికిత్స కష్టతరమై ఖర్చులు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను కోరారు. స్క్రీనింగ్‌లో అనుమానిత కేసులను గుర్తించి, వారికి పరీక్షలు, చికిత్స అందేలా వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అవసరమైన వారికి ప్రభుత్వ పథకాలు, ఉచిత లేదా తక్కువ ఖర్చుతో లభించే వైద్య సేవలపై అవగాహన కల్పించాలని సూచించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

మహబూబ్‌నగర్ (ఈటీవీ): రూ.2 వేల కోట్లతో మహబూబ్‌నగర్ జిల్లాలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించి విడతల వారీగా పనులు ప్రారంభిస్తున్నామని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో రూ.603 కోట్లతో ఏర్పాటు చేయనున్న భూగర్భ డ్రైనేజీ పనుల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. మొదటి విడతలో రూ. 142 కోట్లతో 9 డివిజన్లలో మంజూరైన పనులను ఆయన ప్రారంభించారు. మహబూబ్‌నగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణంతో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య వసతులు అందుబాటులోకి వస్తాయన్నారు. మౌలిక వసతులు కల్పించి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే తాగునీటి వ్యవస్థకు రూ.200 కోట్ల వ్యయంతో ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మాణం చేపడుతున్నామన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

విజయవాడ గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అరెస్టయిన నలుగురు పోలీసు అధికారులకు కోర్టులో చుక్కెదురైంది. సీఐ నాగరాజుతో పాటు మరో ముగ్గురు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. విజయవాడ: గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అరెస్టయిన నలుగురు పోలీసు అధికారుల బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న A1 సీఐ నాగరాజు, A3 హెడ్ కానిస్టేబుల్ జంగం నాని, A5 హెడ్ కానిస్టేబుల్ బాబురావు, A6 సాంబయ్య దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. సాయి కృష్ణ లాకప్ డెత్‌కు సంబంధించిన కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం A1 సీఐ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. A3 జంగం నాని ఏలూరు సబ్ జైలులో, A5 బాబురావు అవనిగడ్డ సబ్ జైలులో, A6 సాంబయ్య గన్నవరం సబ్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. తమకు బెయిల్ మంజూరు చేయాలని నలుగురు నిందితులు కోర్టును ఆశ్రయించగా.. విచారణ అనంతరం వారి పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. దీంతో నలుగురూ ప్రస్తుతం జైల్లోనే కొనసాగనున్నారు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో తదుపరి విచారణపై ఉత్కంఠ నెలకొంది. గొడ్డలి పార్టీ అన్నింట్లోనూ క్రెడిట్ చోరీకి యత్నిస్తోంది: సీఎం చంద్రబాబు రైతులను అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడొద్దు: ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి

విజయనగరం రూరల్: వినియోగదారుల హక్కులను పరిరక్షించడంలో అధికారులు పూర్తి బాధ్యతతో, సమన్వయంతో పనిచేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఎస్. సేదు మాధవన్ ఆదేశించారు. వినియోగదారుల పరిరక్షణ చట్టం–2019ను పటిష్టంగా అమలు చేస్తూ, ప్రజలకు నాణ్యమైన వస్తువులు, సేవలు అందేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బుధవారం జిల్లా వినియోగదారుల పరిరక్షణ మండలి సమీక్షా సమావేశంలో ఆయన వివిధ శాఖల అధికారులతో వినియోగదారుల సమస్యలు, వాటి పరిష్కారంపై జాయింట్ కలక్టరు చాంబరులో సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. మార్కెట్లో వస్తువుల నాణ్యత, తూకాలు–కొలతలు, ధరలు, ఆహార పదార్థాల స్వచ్ఛత, ప్రజా రవాణా, విద్యుత్, టెలికాం, మున్సిపల్ సేవలు తదితర అంశాల్లో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఏపీలో ఉద్యోగ సంఘాలు ప్రస్తుతం ఆందోళన బాటలో ఉన్నాయి. పీఆర్సీ, ఐఆర్, డీఏ.. ఇలా ఎటు చూసినా బకాయిలు, పెండింగ్ అంశాలే కనిపిస్తున్నాయి. వీటిపై ప్రభుత్వం (AP Govt) వెనువెంటనే నిర్ణయాలు తీసుకోకపోవడంతో ఇవన్నీ పెండింగ్ సమస్యలుగా మారిపోయాయి. వీటిపై ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నించకుంటే.. వారిపై ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అలాగని ప్రశ్నిస్తే ప్రభుత్వం దృష్టిలో రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరిగితే జరిగిందని భావించి తాజాగా ఏపీ జేఏసీ అమరావతి నాయకులు మూడు దశల ఉద్యమాన్ని ప్రకటించారు. అన్నట్లుగానే నిరసనలు ప్రారంభించేశారు.జనసేన ఎమ్మెల్యేకు చంద్రబాబు ఊహించని షాక్- ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ సందర్బంగా ప్రభుత్వం ఉద్యోగుల (employees) పట్ల చూపుతున్న నిర్లక్ష్యంపై గతంలో చంద్రబాబు మాట్లాడిన మాటల వీడియోల్ని ప్రదర్శించడం వివాదాస్పదమైంది. దీంతో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆందోళనలు, తాజాగా ఉద్యోగ సంఘాలు ప్రారంభించిన నిరసనల్ని దృష్టిలో ఉంచుకుని ఇవాళ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక ప్రకటన చేశారు.ఏపీ సర్కార్ కు ఉద్యోగుల షాక్..! మూడు దశల్లో ఉద్యమం- కార్యాచరణ ప్రకటన..!రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం త్వరలో ఉద్యోగ సంఘ నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తానని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తనను కలిసిన ఉద్యోగ నేతలతో వెల్లడించారు. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న రెవిన్యూ ఉద్యోగుల సమస్యలపై వెంటనే చర్చించి సమస్యలు పరిష్కరించాలని నేతలు మంత్రిని కోరారు. వీఆర్ఏ, విఆర్ఓ, సర్వేర్లు, రెవెన్యూ శాఖలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఇప్పటికే అనేకసార్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చిన విషయం మరోసారి గుర్తుచేశారు. దీనిపై మంత్రి అనగాని స్పందిస్తూ రెవిన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని, అలాగే ఉద్యోగులుకు ఇవ్వవలసిన పెండింగ్ డీఏలు, ఐఆర్, పీఆర్సీ కమిషన్ కు సంబంధించిన ఆర్థికపరమైన విషయాలపై

మిడ్జిల్: మట్టిలో దాగిన మాణిక్యం వెలుగులోకి వచ్చింది. ప్రతిభకు పట్టుదల, కఠోర శ్రమ తోడైతే సాధించలేనిది ఏదీ లేదని నిరూపింది ఈ విద్యార్థిని. మల్లాపూర్‌కు చెందిన పౌర్ణమి డిస్కస్ త్రోలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. జిల్లా కేంద్రంలో అక్షర జూనియర్ కాలేజీలో చదువుతున్న పౌర్ణమి, అండర్-18 విభాగంలో జరిగిన 12వ తెలంగాణ రాష్ట్ర జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో డిస్కస్ త్రోను 30.47 మీటర్ల దూరం విసిరి, ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ అద్భుత ప్రదర్శనతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై తన క్రీడా జీవితంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. తండ్రి ప్రోత్సాహమే విజయ ప్రయాణంలో తండ్రి శ్రీనివాస్ రెడ్డి ప్రోత్సాహం ప్రత్యేకంగా నిలిచింది. కుమార్తెలోని క్రీడా ప్రతిభను చిన్ననాటి నుంచే గుర్తించి, ఆమె కలలకు అండగా నిలుస్తూ నిరంతరం ప్రోత్సహించారు. సాధనలో అలసట ఎదురైనా, పోటీల్లో సవాళ్లు ఎదురైనా ధైర్యం నింపుతూ ముందుకు నడిపించారు. పౌర్ణమి ఎంపికపై హర్షం డిస్కస్ త్రోలో పౌర్ణమి జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల డీవైఎస్ఓ రాజశేఖర్ రెడ్డి, అథ్లెటిక్ సెక్రటరీ శరత్ చంద్ర, పీడీ ఆనంద్, శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ వేదికపై కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకం సాధించాలని ఆకాంక్షిస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

కోరుట్ల: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదంటూ బుధవారం కోరుట్ల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో బస్టాండ్ సర్కిల్లో రహదారిపై బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ముద్రించిన 160 మీటర్ల ప్లెక్సీని ప్రదర్శించారు. ధర్మపురం: కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ మాజీ మంతి కోప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో బుధవారం ధర్మపురిలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా పేదలకు న్యాయం జరగడం లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

కరీంనగర్ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. చిగురుమామిడి మండలం సుందరగిరి శివారులో ఉన్న వ్యవసాయ బావిని ఢీకొట్టి బస్సు ఆగిపోయింది. ఈ ఘటనలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బస్సు హుస్నాబాద్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వార్త చదివారా: బండను చీల్చిన గుండెరా!

కమాన్‌పూర్: కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలంలోని జూలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బుధవారం ఎన్టీపీసీ సౌజన్యంతో సైకిళ్లు, క్రీడా దుస్తులు, పుస్తకాలను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచి పోలుదాసరి వనిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందించడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని సుజాత, ఉపసర్పంచి గడ్డం రాజమహేందర్, వార్డు సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

Veenavanka: వీణవంక మండలం మల్లారెడ్డిపల్లిలో ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి! Veenavanka: కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం,మల్లారెడ్డిపల్లి గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకొని మల్లారెడ్డిపల్లి గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మల సమ్మన్న ముదిరాజ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనమైన నివాళులు అర్పించి గ్రామస్తులకు స్వీట్లు పంచినారు. ఈ సందర్భంగా టిపిసిసి సాంస్కృతిక సేన కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ పేద ప్రజల కోసం ఎన్నో ప్రభుత్వ పథకాలను తీసుకొచ్చి వారి అభివృద్ధికి,పేద ప్రజల ఉన్నతికి వారి జీవితాన్ని అంకితం చేసినారని వారి యొక్క సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గోనెల సమ్మన్న ముదిరాజ్, నిమ్మల సమ్మన్న ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ దూలం సమ్మన్నగౌడ్,మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి,93 వ బూత్ అధ్యక్షులు పల్లేర్ల కిరణ్,94 వ బూత్ అధ్యక్షులు మాజీ ఉప సర్పంచ్ ముద్దసాని బిక్షపతి,9వ వార్డ్ సభ్యులు గంధం ప్రశాంత్,డీలర్ కర్రె వెంకట నర్సయ్య, రాయణవేణి చంద్రయ్య, దూలం కిరణ్,మాజీ వార్డ్ సభ్యులు గోనెల సమ్మయ్య,అర్సం నాగేష్, దూలం వెంకటేష్, కర్రె రాజు, కర్రె కుమారస్వామి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Hyderabad: జూబ్లీహిల్స్‌లో ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి వేడుకలు! Hyderabad: మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీనగర్ కాలనీ డివిజన్ ఎల్లారెడ్డిగూడలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్సార్ గారు ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించి, పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, వికలాంగులు, వృద్ధులు, వితంతువుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన మహానేత అని కొనియాడారు.. రైతులకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు విద్యుత్ బకాయిలను రద్దు చేసి వ్యవసాయ రంగానికి వైఎస్సార్ గారు కొత్త ఊపిరి పోశారని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ కార్యక్రమాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు.. వైద్య, ఇంజనీరింగ్ విద్యను పేద, మధ్యతరగతి విద్యార్థులకు చేరువ చేసి, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన గొప్ప దార్శనికుడు వైఎస్సార్ గారు అని అన్నారు. వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు అండగా నిలిచి వారి జీవితాల్లో భరోసా నింపిన మహానేత అని కొనియాడారు

ఇటీవల థియేటర్లకు వచ్చిన అన్నపూర్ణ సంస్థ నిర్మించిన సినిమా ‘పళ్ల బురుసు’ సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చి షాక్ ఇచ్చింది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఇటీవల థియేటర్లకు వచ్చిన ప్రముఖ బ్యానర్ అన్నపూర్ణ సంస్థ నిర్మించిన సినిమా ‘పళ్ల బురుసు’ (Palla Burusu) సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చి షాక్ ఇచ్చింది. బలగం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మ, గోమతి, సుజాత కీలక పాత్రల్లో నటించగా ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ కలసి నిర్మించాయి. అయితే ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. కథ విషయానికి వస్తే.. తెలంగాణలోని పల్లెలో శంభ అనే వృద్థుడు ఒంటరిగా జీవిస్తుంటాడు. కొడుకు, కూతురు వేరే వేరే ఊర్లలో స్థిరపడి తండ్రి బాగోగులు అంతగా పట్టించుకోరు. తను పంటి నొప్పితో ఆసుపత్రికి వెళ్లగా డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి వేప పుల్ల స్థానంలో టూత్ బ్రష్ ఉపయోగించమని సూచిస్తారు. కొడుకు తిరుపతి (మురళీధర్ గౌడ్)ని టూత్ బ్రష్ (పళ్ల బురుసు), మందులు తెచ్చివ్వమని అడుగుతాడు. సొంత సమస్యల్లో బిజీగా ఉన్న తిరుపతి, తండ్రి మాటను అంతగా పట్టించుకోడు. కొద్ది రోజులకే కూతురు పెళ్లి ఖాయం చేసుకుని కనీసం తండ్రిని పిలవడు. ఇది గమనించిన శంభ లోలోపల కుమిలి పోలీసులను ఆశ్రయిస్తాయి. అక్కడ కూడా పరిష్కారం దొరక్కపోవడంతో కోర్టు మెట్లు ఎక్కుతాడు. అసలు తండ్రీకొడుకుల మధ్య గ్యాప్ రావడానికి కారణమేంటి? తనకున్న ఎకరం పొలంలో తన సమాధిని తానే ఎందుకు సిద్థం చేసుకున్నాడు? చివరకు ఏం జరిగింది అన్నదే కథ. వయసు మీద పడ్డ తల్లిదండ్రుల విషయంలో ఈతరం ఎలా వ్యవహరిస్తుందో చూపిస్తూ సాగే ఈ కథలో భావోద్వేగాలు అశించినంతగా బలంగా ఉండవు. కానీ శంభా తన సమాధి తానే సిద్ధం చేసుకునే సన్నివేశాలు, క్లైమాక్స్ మాత్రం గుండెను బరువెక్కిస్తాయి. కాగా ఇప్పుడు ఈ చిత్రం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే అమెజాన్

ఈ ఆదివారం జబర్దస్త్ స్పెషల్ ఎపిసోడ్ సందడి చేయబోతోంది. అందులో పాత కంటెస్టెంట్స్, టీమ్ లీడర్స్ కనిపించబోతున్నాడు. ఇక ఈ ప్రత్యేక ఎపిసోడ్‌కు మెగా బ్రదర్ నాగబాబు తో పాటు సుధీర్, ధనరాజ్, గెటప్ సీను, చంటీ, ఇలా అందరు సందడి చేయడంతో పాటు 13 ఏళ్ల కిందటి జబర్దస్త్ వాతావరణానికి మళ్లీ క్రియేట్ చేయబోతున్నారు. ఈక్రమంలో నాగబాబు, ధనరాజ్, ఇంద్రజల మధ్య జరిగిన సరదా సంభాషణలు నవ్వులు పూయించాయించగా.. తాగుబోతు రమేష్, దీప్తి నల్లమోతు , రోహినీ ల కామెడీ కడుపుబ్బా నవ్వించింది. వీటితో పాటు సుధీర రష్మీల లవ్ ట్రాక్ ఇంట్రెస్టింగ్ గా అనిపించగా.. రష్మీ సుధీర్ పై చేసిన కామెంట్స్.. ఆమె బోరున విలపించడం అందరిని ఎమోషనల్ అయ్యేలా చేసింది. బుల్లితెరపై ఎంతో ఆదరణ పొందిన 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ గౌతమ్‌ల జంట ప్రేక్షకుల్లో పత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఈ షో టీఆర్పీ రేటింగ్స్‌ను విశేషంగా పెంచడంలో కీలక పాత్ర పోషించింది. ఈ ఇద్దరు స్కిట్ లో ఏదో ఒక లవ్ ట్రాక్ పెడితే.. ఆరోజు ఆడియన్స్ కు పండగే.. ఇక ఆతరువాత కాలంలో సుధీర్ వెండితెరపై అవకాశాలు అందుకోవడంతో జబర్దస్త్ నుంచి బయటకు రాగా, రష్మీ యాంకర్‌గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. అయితే చాలా విరామం తర్వాత సుధీర్ తిరిగి జబర్దస్త్ వేదికపైకి రావడం, ఆ సమయంలో రష్మీ తీవ్ర భావోద్వేగానికి గురికావడం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు రీ-ఎంట్రీతో జబర్దస్త్ షోకి కొత్త కళ వచ్చి చేరింది. ఆయనతో పాటు చంటి, ధనరాజ్, హైపర్ ఆది, సద్దాం వంటి పాత కమెడియన్లు తిరిగి స్టేజ్‌పై అలరిస్తున్నారు. ఈ వరుసలో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను కూడా మళ్లీ జబర్దస్త్ స్టేజ్ పైకి అడుగుపెట్టారు. రీసెంట్ గా రిలీజ్అయిన ప్రోమోలో హైపర్

Karimnagar: పోగొట్టుకున్న ఫోన్‌ను బాధితుడికి అందించిన కరీంనగర్ పోలీసులు! Karimnagar: కరీంనగర్ రూరల్, దుర్షేడ్ గ్రామానికి చెందిన కొల్లూరి అంజయ్య అనునతడు గత సంవత్సరం కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ లో తన యొక్క ఐక్యు సెల్ ఫోన్ పోగొట్టుకొనగా కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినాడు. పోలీసులు సి.ఈ.ఐ.ఆర్ టెక్నాలజీ సహాయంతో పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను ట్రేస్ చేసి పెద్దపల్లి లో పట్టుకోవడం జరిగింది. అట్టి ఫోను యజమాని అయిన కొల్లూరి అంజయ్య కు ఇన్స్పెక్టర్ ఏ.నిరంజన్ రెడ్డి సెల్ ఫోను ను అందజేశారు. సెల్ ఫోన్ ను ట్రేస్ చేయడంలో కృషి చేసిన టెక్ టీం కానిస్టేబుల్ చిట్యాల రాంసాయి మరియు ఫైజాన్ లను సిఐ ఏ. నిరంజన్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా సీఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఎవరు కూడా విలువైన వస్తువులను అజాగ్రత్తగా పర వేసుకోకూడదని జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. పొరపాటున అజాగ్రత్తగా ఏదైనా విలువగల వస్తువులను పోగొట్టుకొనిన, దొంగిలించబడ్డ వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేయాలని తెలిపారు

Vizianagaram: సీతంలో ఇండోసోల్ పూల్ క్యాంపస్ డ్రైవ్ - అర్హతలు ఇవే! Vizianagaram: సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పూల్ క్యాంపస్ నియామక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. హైదరాబాద్‌కు చెందిన ఎస్‌ఎస్‌ఎస్‌వీ సొల్యూషన్స్ సహకారంతో సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటలకు సీతం కళాశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. బీటెక్‌లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్‌తో పాటు డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు హాజరుకావచ్చు. 2023 నుంచి 2026 వరకు బ్యాచ్‌లకు చెందిన విద్యార్థులతో పాటు ఇప్పటికే కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు కూడా అర్హులని కళాశాల యాజమాన్యం తెలిపింది. ఎంపికైన వారికి విద్యార్హతను బట్టి వార్షిక వేతన ప్యాకేజీ అందించనున్నారు. బీటెక్ అభ్యర్థులకు రూ.2.16 లక్షలు, డిగ్రీ, డిప్లొమా అభ్యర్థులకు రూ.1.90 లక్షలు, ఐటీఐ అభ్యర్థులకు రూ.1.80 లక్షలు వేతనంగా నిర్ణయించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ సోలార్ సంస్థలో ఉద్యోగం పొందేందుకు ఈ నియామక కార్యక్రమం మంచి అవకాశమని సీతం కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు, ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మూర్తి తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలతో సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’

తెలుగు సినిమా చరిత్రలో 90s టైమ్ అద్భుతమనే చెప్పాలి. అప్పుడే అదిరిపోయే సినిమాలెన్నో వచ్చాయి. ఎంటర్టైన్మెంగ్ తో పాటు సెంటిమెంట్, ఎమోషనల్, యాక్షన్ మూవీస్ సందడి చేశాయి. అలాంటి సినిమాల లిస్ట్ లో ‘హలో బ్రదర్’ కచ్చితంగా ముందువరుసలో ఉంటుంది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో, అక్కినేని నాగార్జున ద్విపాత్రాభినయంలో రూపొందిన ఈ చిత్రం 1994 ఏప్రిల్ 20న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించింది. నాగార్జున మాస్, క్లాస్ లుక్స్‌తో పాటు రమ్యకృష్ణ, సౌందర్యల గ్లామర్, రాజ్-కోటి సంగీతం ఈ చిత్రాన్ని ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టాయి. మిసెస్ అండ్ మిస్టర్ చక్రవర్తి (శరత్ బాబు, సంగీత) దంపతులకు కవల పిల్లలు జన్మిస్తారు. జన్మతః వీరిద్దరికీ ఒక విచిత్రమైన కనెక్షన్ (రిఫ్లెక్స్ యాక్షన్) ఉంటుంది. ఒకరికి నొప్పి కలిగితే మరొకరికి స్పందన రావడం, ఒకరు కదిలితే మరొకరు కూడా అదే పనిచేయడం వీరి ప్రత్యేకత. అయితే, విశ్వనాథ్ ఉద్యోగరీత్యా ఒక ప్రమాదకరమైన క్రిమినల్ మిట్రా (నెపోలియన్)ని అరెస్ట్ చేసే క్రమంలో, మిట్రా ఈ కవలలలో ఒకరిని ఎత్తుకెళ్లి ఆసుపత్రి నుంచి తప్పించుకుంటాడు. ఈ క్రమంలో ఒక బాబు (దేవా) కూలిపనులు చేసుకునేవారికి దొరుకుతాడు. వారికి అప్పటికే ఓ ఆడపిల్ల కూడా ఉంటుంది. రోడ్డుపై రఫ్ అండ్ టఫ్ వాతావరణంలో దేవా (నాగార్జున) పెరిగి పెద్దవాడవుతాడు. మరో బాబు (రవి వర్మ) తన తల్లిదండ్రుల వద్దే పెరిగి విదేశాలలో చదువుకుని పెద్ద మ్యూజిషియన్‌గా ఇండియాకు తిరిగివస్తాడు. దేవా స్థానిక రౌడీలతో గొడవపడుతూ మాస్ క్యారెక్టర్‌గా మారితే, రవి వర్మ అత్యంత సాఫ్ట్ అండ్ క్లాస్ కుర్రాడిగా ఉంటాడు. దేవాను చక్రవర్తి ఫ్రెండ్ (గిరిబాబు) కూతురు మంగ (రమ్యకృష్ణ) ప్రేమిస్తుంది. రవి వర్మను తన ఈవెంట్ మేనేజర్ అక్కమాంబ( అన్నపూర్ణమ్మ) కూతురు ఊహ (సౌందర్య) ప్రేమిస్తుంది. విధి వశాత్తూ ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒకే నగరంలో కలుసుకున్నప్పుడు వారి రిఫ్లెక్స్ చర్యల వల్ల ఎలాంటి అలజడి సృష్టింపబడింది?

Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మరో నాలుగు రోజుల్లో మొదలు కాబోతుంది. దీంతో ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే స్టార్స్ ఎవరు అని చర్చ జరుగుతుంది. ఇప్పటికే అగ్నిపరీక్షతో నాలుగు సామాన్యులను ఫైనల్ చేసినట్టు సమాచారం. ఇక సెలబ్రిటీలలో సీరియల్ నటీమణులు పల్లవి గౌడ, తేజస్విని, కావ్యశ్రీ, కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హరి, ఆటో రామ్ ప్రసాద్, నూకరాజు, రాకింగ్ రాకేశ్, డ్యాన్సర్ ఆట సందీప్ భార్య జ్యోతి, యూట్యూబర్ నందూ, రచయిత కడలి సత్యనారాయణ వెళ్తారని టాక్ నడుస్తుంది. తాజాగా మరో పేరు కూడా వినిపిస్తుంది. ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి ఫేమ్ తెచ్చుకున్న టెంపర్ వంశీ కూడా ఈసారి బిగ్ బాస్ లోకి వెళ్తాడని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. వంశీ అసలు పేరు అజయ్ అని సమాచారం. ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నాడు వంశీ. జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి, నెగిటివ్ రోల్స్ చేస్తూ వచ్చాడు. ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో నెగిటివ్ రోల్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కూడా విలన్ గా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు వంశీ తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం. మరి బిగ్ బాస్ సీజన్ 10 లోకి ఎవరెవరు వెళ్తారో తెలియాలంటే ఇంకో నాలుగు రోజులు ఎదురు చూడాల్సిందే. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ 6 నుంచి స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ అవ్వనుంది. మొదటి రోజు సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ లాంచ్ మొదలు అవ్వనుంది
ప్రకృతి సౌందర్యానికి నిలయమైన జమ్మూకశ్మీర్ ఇప్పుడు ప్రపంచ సినిమా వేదికగా మారబోతోంది. సినీ నిర్మాణ రంగానికి, సాంస్కృతిక వైవిధ్యానికి వేదికగా నిలిచిన కశ్మీర్ లోయలో తొలిసారిగా అత్యంత భారీ స్థాయిలో 'అంతర్జాతీయ చలనచిత్రోత్సవం' (International Film Festival of Jammu and Kashmir) నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. జమ్మూకశ్మీర్ ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7 నుంచి 10 వరకు ఈ ప్రతిష్ఠాత్మక చలనచిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ చలనచిత్రోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం కశ్మీర్‌తో వెండితెరకు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని పునర్నిర్మించడమేనని నిర్వాహకులు తెలిపారు. స్థానిక ప్రతిభావంతులకు అవకాశాలు కల్పిస్తూనే, గ్లోబల్ సినిమా మ్యాప్‌లో కశ్మీర్‌కు తగిన గుర్తింపు తీసుకురావడం, పర్యాటకరంగాన్ని మరింత బలోపేతం చేయడం మరియు సృజనాత్మక సహకారానికి వేదికను కల్పించడమే ఈ ఉత్సవాల ముఖ్య లక్ష్యం. ఈ చిత్రోత్సవం కోసం ప్రత్యేకంగా ఐదుగురు సభ్యులతో కూడిన ఒక జ్యూరీ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు సంతోష్ శివన్ ఈ జ్యూరీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఉత్సవంలో ప్రపంచవ్యాప్తంగా 41 దేశాల నుంచి ఎంపిక చేసిన 135 చిత్రాలను ప్రదర్శించనుండగా, అందులో 64 ఎంట్రీలు భారతదేశానికి చెందిన చిత్రాలు కావడం విశేషం. విజేతలకు ప్రోత్సాహకంగా నిర్మాతలు భారీ నగదు బహుమతులను ప్రకటించారు. మొత్తం తొమ్మిది విభాగాల్లో చిత్రాలను ఎంపిక చేసి రూ. 96 లక్షల నగదు పురస్కారాలను అందించనున్నారు. ఉత్తమ చలనచిత్రానికి రూ. 25 లక్షలు, ఉత్తమ దర్శకుడికి మరియు ఉత్తమ తొలి చిత్ర దర్శకుడికి తలా రూ. 15 లక్షలు బహుమతిగా ఇస్తారు. అంతేకాకుండా 'ఉత్తమ చిత్రం - జమ్మూకశ్మీర్ సెలెక్ట్' కేటగిరీ విజేతకు రూ. 10 లక్షలు లభించనున్నాయి. ఇక ఉత్తమ నటీనటులకు తలా రూ. 8 లక్షలు చొప్పున, ఉత్తమ ఛాయాగ్రాహకుడు, సౌండ్ డిజైనర్ మరియు ఎడిటర్లకు తలా రూ. 5 లక్షలు చొప్పున అందజేయనున్నారు. ఈ వేడుకల్లో ప్రధాన

కింగ్ నాగార్జున ప్రస్తుతం కింగ్ 100 తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కింగ్ నాగార్జున (Nagarjuna) ప్రస్తుతం కింగ్ 100 తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇదంతా పక్కన పెడితే.. నాగ్ మరోసారి ఒక స్పెషల్ రోల్ లో మెరవనున్నాడానే వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కుబేర, కూలీ సినిమాలలో నాగ్ ప్రత్యేక పాత్రల్లో మెరిశాడు. నిజం చెప్పాలంటే ఈ సినిమాలకు నాగార్జుననే ప్రధాన ఆకర్షణ. కానీ, నాగ్ కి మాత్రం ఈ సినిమాలు కలిసి రాలేదు. ముఖ్యంగా కూలీలో విలన్ గా ఆయన నటన బాగున్నా కూడా ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో నాగ్.. స్పెషల్ రోల్స్ కి దూరంగా ఉండడమే బెటర్ అని అక్కినేని ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. రెండుసార్లు స్పెషల్ రోల్ చేసి దెబ్బ తిన్నా కూడా నాగ్.. మరోసారి అదే పని చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం హెచ్. వినోత్ దర్శకత్వంలో ఒక సినిమా ఓకే చేసిన విషయం తెల్సిందే. ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర కోసం నాగార్జునను సంప్రదించారట. ఆ పాత్రకు నాగ్ అయితేనే పూర్తి న్యాయం జరుగుతుందని భావించి వినోత్.. కథ కూడా చెప్పాడట. తన పాత్రలోని ప్రాధాన్యత నచ్చడంతో నాగార్జున కూడా ఈ ప్రత్యేక పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఇక నాగార్జున ఎంట్రీతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. గతంలో కార్తీతో కలిసి ఊపిరి సినిమాలో నటించిన నాగార్జున, ఇప్పుడు సూర్య నటించబోయే రాబోయే ప్రతిష్టాత్మక చిత్రంలో ఒక పవర్ఫుల్ స్పెషల్ రోల్ చేయడం విశేషం. ఈ చిత్రంలో సూర్య, నాగార్జున మధ్య వచ్చే సన్నివేశాలు అత్యంత ఉత్కంఠభరితంగా, మాస్

నగరంలోని చందానగర్‌లో భారీగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లను ఆర్సీ పురం ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తనిఖీలు చేపట్టగా.. ఈ ఇంజెక్షన్లతో ఇద్దరు వ్యక్తులు దొరికారు. హైదరాబాద్: నగరంలోని చందానగర్‌లో భారీగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లను ఆర్సీ పురం ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు చందానగర్ పీజేఆర్ స్టేడియం వద్ద చేపట్టిన తనిఖీల్లో స్టెరాయిడ్ ఇంజెక్షన్లతో ఇద్దరు వ్యక్తులు పోలీసులకు చిక్కారు. వారి నుంచి రూ. లక్ష విలువ చేసే ఈ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకుని, నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చట్టవిరుద్ధంగా స్టెరాయిడ్లు విక్రయిస్తున్న వీరిని సరసాయి రామ్, కుంచాల రవీంద్రలగా గుర్తించారు. నిందితుల దగ్గర మెఫెంటెరమైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు (Wofen 10ml) ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇద్దరి మధ్య లావాదేవీలు అన్నీ ఆన్లైన్ పేమెంట్స్ ద్వారానే జరిగినట్లు వెల్లడించారు. అయితే ఈ విక్రయాల్లో వినియోగదారులుగా ఉన్న దీపక్, సాయి ప్రసాద్, షకీల్, కిషోర్, నితీష్ అనే మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది

హైదరాబాద్: ఈసారి భాగ్య నగర పరిధిలో లక్షా నలభై వేల గణేష్ మండపాల సిద్ధమవుతున్నాయని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు వాటి నిమజ్జనాలకు అవసరమయ్యే ఏర్పాట్లను చేయాలని ప్రభుత్వాన్ని కోరామని తెలిపింది. బడ్జెట్ కేటాయిపులో ప్రభుత్వం స్పీడ్ పెంచాలని మంత్రి దృష్టికి తీసుకెళ్ళామని, ఎప్పటిలాగే అన్నీ చెరువులు, వినాయక సాగర్‌లో నిమజ్జనం కొనసాగుతుందని బాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రావి నూతుల శశిధర్ సాక్షి టీవీకి తెలిపారు. ‘అధికారుల తప్పుడు నివేదిక కారణంగా హైకోర్టు వినాయక సాగర్‌పై స్టే ఇచ్చింది. ఎక్కడ వినాయక నిమజ్జనం వల్ల పొల్యూషన్ జరిగినట్లు సరైన ఆధారాలు లేవు. కావాలనే కొందరు అధికారులు హిందూ పండుగలను ఆంక్షలు పెట్టాలని చూస్తున్నారు. కాప్రా చెరువుతో పాటు హైడ్రా డెవలప్ చేసిన అన్నీ చెరువుల్లో నిమజ్జనం చేస్తాం. అడ్డుకోవడానికి హైడ్రాకు ఎలాంటి అధికారం లేదు. చెరువులకు ఓనర్లు ప్రజలు.. అధికారులు, నాయకులు కాదు. చెరువుల్లో నిమజ్జనం చేయడం మా సంప్రదాయం. అందుకే అన్నీ చెరువుల్లో నిమజ్జనం కొనసాగిస్తాం. అడ్డుకోవాలని చూస్తే.. పరిణామాలు మరోలా ఉంటాయి’ అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: భారీ పెరిగిన గణేష్ విగ్రహాల ధరలు ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు) తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు) హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు) అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్ సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ

రాజోలి: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొనే క్రీడాకారుల ఎంపికలో భాగంగా జిల్లా స్థాయి ఎంపికలు ఈ నెల 3న గద్వాల పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి రామలింగేశ్వర గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఆసక్తి, అర్హత కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 3న ఉదయం 10:30 గంటలకు ఎంప్లాయి ఐడీ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులతో జిల్లా యువజన క్రీడల అధికారి కార్యాలయంలో హాజరై తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని ప్రోత్సహించడం, ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ప్రోత్సహించడమే ఈ ఎంపికల ప్రధాన ఉద్దేశ్యమని జిల్లా యువజన క్రీడల అధికారి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది: భాజపా రాజోలి: కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, దాడి చేసిన వారిని వదిలేసి, పరామర్శకు వెళ్తున్న వారిని అడ్డుకోవడం హేయమైన చర్య అని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రా రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు అరెస్ట్ నేపథ్యంలో ఐజ పట్టణంలో రామచంద్రారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు పాల్పడుతుంటే, బాధితుల ఇళ్లకు వెళ్లకుండా ముందస్తు అరెస్టులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, హోం శాఖ వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధితులకు కఠిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐజ పట్టణ, మండల అధ్యక్షులు ముదిరాజ్ నర్సింహ, గోపాలకృష్ణ, లక్ష్మణ్ గౌడ్, శ్రీకాంత్, వీరేష్, సిద్దు తదితరులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే

‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘ఈ నగరానికి ఏమైంది 2’ (ENE2) నుంచి అభిమానులను ఉత్సాహపరిచే అప్డేట్ వచ్చింది. టాలీవుడ్లో కల్ట్ క్లాసిక్ బడ్డీ కామెడీగా గుర్తింపు పొందిన ‘ఈ నగరానికి ఏమైంది’ (Ee Nagaraniki Emaindi 2) చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘ఈ నగరానికి ఏమైంది 2’ (ENE2) నుంచి అభిమానులను ఉత్సాహపరిచే అప్డేట్ వచ్చింది. యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ ఫ్రాంచైజీ రెండో భాగం షూటింగ్ విజయవంతంగా పూర్తయినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా.. సినిమా టీమ్ విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్లో “One Side Done” అంటూ షూటింగ్‌లోని ఒక ప్రధాన భాగం పూర్తయిందని వెల్లడించారు. అదే సమయంలో “Other Side – November 19” అంటూ సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. దీంతో ‘ఈఎన్ఈ’ గ్యాంగ్ మరోసారి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తేందుకు సిద్ధమవుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విశ్వక్ సేన్ (Vishwak Sen), అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, సాయినాథ్ మాగంటి తమ పాత పాత్రలతోనే మరోసారి సందడి చేయనున్నారు. మొదటి భాగంలో స్నేహం, హాస్యం, జీవితంలోని సరదా క్షణాలను సహజంగా చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ గ్యాంగ్ ఇప్పుడు మరింత ఎంటర్టైన్మెంట్తో రాబోతోందని సినీ వర్గాలు ఇప్పటికే చెబుతూ వస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ ఒరిజినల్స్, రూట్ నోడ్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నవంబర్ 19న విడుదల కానున్న ఈ సినిమా యూత్ ఆడియన్స్‌కు మరో ఫన్ రైడ్‌గా నిలుస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ కోసం బుల్లితెర ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఆదివారమే (సెప్టెంబర్ 06) బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ ఉండనుది. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈసారి ఈ రియాలిటీ షోపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే నిర్వహించిన ' అగ్ని పరీక్ష సీజన్ 2' కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ కాంటెస్ట్ లో సత్తా చాటిన పలువురు సామాన్యులు ఇప్పుడు నేరుగా బిగ్ బాస్ హౌస్ లోనే అదృష్టం పరీక్షించుకున్నారు. ఇక వీరిని ఎదుర్కొనేందుకు సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కూడా రెడీ అవుతున్నారు. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. సోషల్ మీడియాలో అయితే చాలా పేర్లే వినిపిస్తున్నాయి. పల్లవి గౌడ, కావ్యశ్రీ, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్ జబర్దస్త్ ఫేమ్ ఎక్స్‌ప్రెస్ హరి, ఆటో రామ్ ప్రసాద్, నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ భార్య జ్యోతి, నందూస్ వరల్డ్ నందూ, రాయల్ మెక్ రమణ, శివ్, కడలి సత్యనారాయణ ఇలా చాలా మంది పేర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే ఒక లేడీ సెలబ్రిటీని హౌస్ లోకి రప్పించేందుకు బిగ్ బాస్ తెలుగు 10 టీమ్ విశ్వ ప్రయత్నాలు చేస్తోందట. మరోవైపు ఆమె మాత్రం బిగ్ బాస్ లోకి వచ్చేందుకు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. అయితే బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం ఆమె ఎంత అడిగినా ఇచ్చేందుకు రెడీగా ఉన్నారట. ఆమె మరెవరో కాదు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రన్నరప్ అమర్ దీప్ భార్య సతీమణి, ప్రముఖ సీరియల్ నటి తేజస్విని గౌడ. ప్రస్తుతం తేజస్విని గౌడ సీరియల్స్ , టీవీ షోలతో బిజీ బిజీగా ఉంటోంది. ముఖ్యంగా ప్రస్తుతం ఆమె తమిళంలో నటిస్తోన్న ‘ఆయాలి’ అనే సీరియల్ టీఆర్పీ

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అత్యంత పాపులర్ రియాలిటీ షోల్లో ‘బిగ్‌బాస్ తెలుగు’ ఒకటి. ఇప్పటికే తొమ్మిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. పదో సీజన్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తొలి సీజన్ నుంచి తొమ్మిదో సీజన్ వరకు టైటిల్ గెలిచిన విజేతలు ఎవరు? బిగ్‌బాస్ హౌస్‌లో 100 రోజులు గడిపిన తర్వాత వారి జీవితాలు, కెరీర్లు ఎలా మారాయి? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఓసారి చూద్దాం. శివ బాలాజీ ‘బిగ్‌బాస్ తెలుగు’ తొలి సీజన్ విజేత శివ బాలాజీ. షోకు ముందు నుంచే సినీ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. టైటిల్ గెలిచిన తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతున్నారు. ‘సింధూరం’, ‘కాలింగ్ సహస్ర’ వంటి చిత్రాల్లో నటించిన శివ బాలాజీ.. ఇటీవల ‘కన్నప్ప’లోనూ కీలక పాత్రలో కనిపించారు. తెలుగు సినిమాలతో పాటు తమిళంలోనూ నటించిన ఆయన.. ఇప్పటికీ సినీ పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్నారు. కౌశల్ మండా రెండో సీజన్ విజేత కౌశల్ మండా. బిగ్‌బాస్ హౌస్‌లో తన ఆటతీరుతో భారీ అభిమానగణాన్ని సంపాదించుకున్నారు. ‘కౌశల్ ఆర్మీ’ పేరుతో అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతమైన సందడి కనిపించింది. అయితే టైటిల్ గెలిచిన తర్వాత ఆశించిన స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలు దక్కలేదని కౌశల్ స్వయంగా వెల్లడించారు. సినిమాలు, టెలివిజన్‌లో కొనసాగుతూనే వ్యక్తిగత జీవితం, కుటుంబంపై కూడా దృష్టి సారించారు. ఇదీ చదవండి: ఒకేసారి ఐదు భాషల్లో ‘బిగ్‌బాస్’.. ఎవరు ఎక్కడ హోస్ట్! రాహుల్ సిప్లిగంజ్: మూడో సీజన్ విజేత రాహుల్ సిప్లిగంజ్. బిగ్‌బాస్ టైటిల్ తర్వాత ఆయన కెరీర్లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటను పాడిన గాయకుల్లో రాహుల్ కూడా ఉన్నారు. ఈ పాటకు ఆస్కార్ రావడంతో ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కాగా ఇటీవల ఓ యువతి ఫిర్యాదుతో తనపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు వార్తలు వచ్చిన సమయంలో రాహుల్ ఆరోపణలను ఖండిస్తూ తన వాదనను వెల్లడించారు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించడం కేంద్ర ప్రభుత్వ దుశ్చర్య అని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మత రాజకీయాలకు తెర లేపారని ధ్వజమెత్తారు. నాగర్ కర్నూల్ జిల్లా, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించడం కేంద్ర ప్రభుత్వ దుశ్చర్య అని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు (Telangana Minister Jupally Krishna Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మత రాజకీయాలకు తెర లేపారని ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి అవకాశాలు వచ్చిన సోనియాగాంధీ కుటుంబం తీసుకోలేదని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టినందుకు.. నిరసనగా ఈరోజు (మంగళవారం) నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం అంబేడ్కర్ చౌరస్తా వద్ద గంటసేపు రోడ్డుపై బైఠాయించి మంత్రి జూపల్లి కృష్ణారావు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడారు. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర నిర్వహించి దేశ ప్రజలను చైతన్యం చేశారని మంత్రి జూపల్లి ప్రస్తావించారు. అలాంటి కుటుంబంపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయడం దుశ్చర్యగా భావిస్తున్నామని అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఉత్తరప్రదేశ్‌లోని అల్ది హల్ద్వానిలోని ర్యాలీ వేదికను ఎక్కారని.. శుద్ధి చేసిన వారిపై కేసు నమోదు చేయకుండా.. ఆ విషయాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడమేంటని ప్రశ్నించారు. ‘మోదీ హటావో దేశ్‌కి బచావో.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు తెలంగాణలో తొలిసారిగా కవచ్ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నాం: కిషన్‌రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి ‘తెలంగాణ - జర్మనీ’ లాజిస్టిక్ కారిడార్ ఏర్పాటుకు సహకరించండి: మంత్రి శ్రీధర్‌బాబు

కరీంనగర్ టౌన్: భారత ప్రభుత్వం, జల్ శక్తి మంత్రిత్వ శాఖ చేపట్టిన జాతీయ ఉద్యమంలో భాగంగా దేశంలోని 21 ప్రధాన నగరాల్లో భూగర్భ జలాలపై అవగాహన కల్పించేందుకు ప్రచారకార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నగరంలోని ప్రధాన కూడలల్లో హోర్డింగ్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాయి. అయితే, ఆ హోర్డింగ్ముందు కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జన్మదిన వేడుకలు పూర్తయి నాలుగు రోజులు గడిచినా వాటిని తొలగించకపోవడంతో ఆ హోర్డింగ్స్ మరుగున పడిపోయాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఎంపీ లాడ్స్ నిధుల వినియోగంలో పార్లమెంట్ సభ్యులు తీవ్రంగా వెనుకబడ్డారంటూ 'ఎంపవర్డ్ ఇండియన్' సంస్థ విడుదల చేసిన నివేదిక సత్యదూరమని, వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఎంపీలపై అభాండాలు వేయడం సరికాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఈ మేరకు తన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీ ల్యాడ్స్ నిధుల ఖర్చు వివరాలను ఆయన గణాంకాలతో సహా మీడియాకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం తన నియోజకవర్గానికి రూ. 17.50 కోట్లు కేటాయించగా, అందులో ఏకంగా 94.1 శాతం నిధులకు (రూ. 16.47 కోట్లు) సంబంధించిన పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని స్పష్టం చేశారు. కమ్యూనిటీ హాళ్లు, బోర్‌వెల్స్, సీసీ రోడ్ల వంటి ప్రజావసరాల కోసం గత మూడేళ్లలో 627 ప్రతిపాదనలను కలెక్టర్లకు పంపగా, వాటిలో 82.29 శాతం పనులకు ఇప్పటికే ఆమోదం లభించిందన్నారు. అంతేకాకుండా, గతంలో 16వ లోక్‌సభ సభ్యుడిగా ఉన్న బి. వినోద్ కుమార్ ఖర్చు చేయకుండా వదిలేసిన రూ. 2.5 కోట్ల నిధులను కూడా తానే ఉపయోగించినట్లు గుర్తుచేశారు. స్థానిక సమస్యల పరిష్కారానికి కేంద్రం ఇచ్చే నిధులు చాలడం లేదని, ప్రతి ఏటా ఎంపీ లాడ్స్ కోటాను పెంచాలని ఎంపీలంతా విజ్ఞప్తి చేస్తున్న తరుణంలో ఇలాంటి ఏకపక్ష నివేదికలు ఇవ్వడం అన్యాయమని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల కేటాయింపు నుంచి కలెక్టర్ల ఆమోదం, పనుల అమలు వరకు అనేక దశలు ఉంటాయని... ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ నిధులన్నీ ప్రాసెస్ అయ్యాయని తెలిపారు. ప్రజల విజ్ఞప్తుల కోసం సీఎస్ఆర్ నిధులను కూడా సేకరిస్తున్నామని పేర్కొన్న ఆయన, ఇకనైనా వాస్తవాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు ఇవ్వాలని సదరు సంస్థకు హితవు పలికారు

చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణం 21వ వార్డు చెర్లోపల్లి ప్రాంతంలో అక్రమంగా కొనసాగుతున్న క్వారీలు, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న బ్లాస్టింగ్ల కారణంగా రైతులు, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తరతరాలుగా వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న రైతుల పంట పొలాలకు సమీపంలో ఇష్టారాజ్యంగా క్వారీలు నిర్వహిస్తూ పేలుళ్లు జరపడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ పేలుళ్ల కారణంగా రాళ్లు ఎగిరిపడి భూములు కంపిస్తున్నాయని, ఇళ్లు, బోర్లు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రమాదం జరిగి ప్రాణాలు పోయిన తర్వాత ప్రభుత్వం స్పందిస్తుందా అని నిలదీశారు. కేంద్రానికి రోజా రిక్వెస్ట్.. హైవే సమస్యపై అలుపెరుగని పోరాటం!చెర్లోపల్లి రైతులు తమ ఆవేదనను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని రోజా ఆరోపించారు. పోలీసు శాఖతో పాటు ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినా, ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటూ కాలయాపన చేయడం సరికాదన్నారు. క్వారీలకు అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయా? పర్యావరణ, గనుల, రెవెన్యూ, పోలీసు శాఖల నిబంధనలు పాటిస్తున్నారా? అనే దానిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. క్వారీ యాజమాన్యాలకు రాజకీయ అండదండలు ఉన్నాయని, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌పై వస్తున్న క్వారీ వసూళ్ల ఆరోపణలపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.ఆ పని చేయకుంటే కూటమి ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోమన్న రోజా ప్రమాదం జరిగే వరకు ఎదురుచూడొద్దు!ఒక ప్రాణం పోయిన తర్వాతో, రైతు భూమి నాశనమైన తర్వాతో పరిహారం ఇచ్చినా పోయిన జీవనాధారం తిరిగి రాదని రోజా స్పష్టం చేశారు. ప్రమాదాలు జరిగే వరకు ప్రభుత్వం నిద్రపోకుండా ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. చెర్లోపల్లి ప్రాంతంలోని అక్రమ క్వారీలను వెంటనే నిలిపివేసి, అనుమతులు లేకుండా జరుగుతున్న బ్లాస్టింగ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మేలు

Vizianagaram: భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి - జేసీ సేధు మాధవన్ ఈ వార్తకు సంబంధించిన

మాధవ్ కీలక పాత్రలో మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్న ‘మారెమ్మ’ చిత్రం ట్రైలర్ ను మేకర్స్ మంగళవారం విడుదల చేశారు, మాధవ్ కీలక పాత్రలో మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మారెమ్మ’ (Maremma). దీపా బాలు కథానాయిక. వికాశ్, వినోద్ కుమార్, రూపలక్ష్మి, దయానంద్‌రెడ్డి కీలక పాత్రదారులు. మయూర్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర బృందం ట్రైలర్ విడుదల చేసింది. ‘ఈ భూమ్మీద ఒక జీవి బతకాలంటే మరో జీవి చావాల్సిందే’ అనే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. గ్రామ దేవత మారెమ్మ ఇతివృత్తంగా తెలంగాణ పల్లె కథతో ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే ఆర్థమౌతుంది

ప్రముఖ సినీ నటి భానుప్రియ తన సుదీర్ఘ సినీ ప్రస్థానంపై, తోటి నటులతో తన అనుబంధంపై, అలాగే తన సోదరి శాంతిప్రియ జీవితంలోని వ్యక్తిగత సంఘటనలపై గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన కెరీర్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో సుమన్, బాలకృష్ణ, దర్శకుడు వంశీలను ప్రస్తావించారు. హీరో సుమన్‌తో 14-15 సినిమాలు, బాలకృష్ణతో దాదాపు 8-10 సినిమాలలో కలిసి నటించినట్లు తెలిపారు. సుమన్‌ను నిశ్శబ్దంగా, అత్యంత మర్యాదగా ఉండే వ్యక్తిగా అభివర్ణించగా, బాలకృష్ణను చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఉండే వ్యక్తిగా పేర్కొన్నారు. బాలకృష్ణతో ఎయిర్‌పోర్ట్‌లో అనుకోకుండా జరిగిన భేటీని గుర్తుచేసుకుంటూ, ఆయన ప్రేమగా పలకరించారని, ఇంటికి రావాలని ఫోన్ నంబర్ ఇచ్చారని చెప్పారు. సుమన్‌తో చివరిగా దమ్ము సినిమాలో నటించినట్లు పేర్కొన్నారు. నేను మాట్లాడిన మాట ప్రజల్లోకి వల్గర్‌గా వెళ్ళింది.. నా వల్ల ఆ స్టార్ డైరెక్టర్ మాటలు పడ్డారు.. దర్శకుడు వంశీ, తనకు సీతార, అన్వేషణ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చినట్లు భానుప్రియ తెలిపారు. వంశీతో తన పెళ్లి గురించి ఒకప్పుడు వదంతులు వచ్చాయని, అయితే అప్పటికే ఆయనకు వివాహం కావడంతో తన తల్లి ఆ సంబంధానికి అంగీకరించలేదని భానుప్రియ స్పష్టం చేశారు. అలాగే, నటుడు అక్కినేని నాగార్జునతో జతకట్టే అవకాశం తనకు రాలేదని భానుప్రియ తెలిపారు. అన్నమయ్య వంటి చిత్రాలలో ఇతర నటీనటులు నటించినప్పటికీ, తనకు ఆ అవకాశం దొరకలేదని, తన పెళ్లి చేసుకునే వయస్సుకి వచ్చే సమయానికి ఆ అవకాశం రాలేదని చెప్పారు. అయితే, తన సోదరి శాంతిప్రియ రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అగ్ని సినిమాలో నటించినట్లు గుర్తు చేసుకున్నారు. Anand Deverakonda: అసలు ఎపిక్ సినిమా అంటే అదే.. ఆ సీన్లో కన్నీళ్లు పెట్టుకున్నా: ఆనంద్ దేవరకొండ భానుప్రియ తన సోదరి శాంతిప్రియ గురించి కూడా వివరించారు. శాంతిప్రియ ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారని, అక్కడే స్థిరపడ్డారని తెలిపారు. సహారా వన్ ఛానెల్లో ప్రసారమైన మాతా కీ చౌకీ అనే

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. ఇదే సమయంలో ఆదాయాన్ని పెంచుకునే అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. టికెట్ రహిత ఆదాయాన్ని పెంచుకునేందుకు తెలంగాణా ఆర్టీసీ మెట్రో రైలు తరహాలో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఎలక్ట్రిక్ బస్సుల్లో డిజిటల్ స్క్రీన్స్ ను ఏర్పాటు చేస్తోంది. రూట్‌వేవ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని హయత్‌నగర్-2 డిపోకు చెందిన పది ఎలక్ట్రిక్ బస్సుల్లో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది.డిజిటల్ స్క్రీన్స్ పై ఆర్టీసీ బస్సుల్లో వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయానికి ప్లాన్ ఈ డిజిటల్ స్క్రీన్లపై వాణిజ్య ప్రకటనలతో పాటు రాబోయే బస్ స్టాప్ల వివరాలు, ఆర్టీసీ సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారం ప్రదర్శించనున్నారు. ఈ డిజిటల్ స్క్రీన్స్ ఆర్టీసీ బస్సుల్లో వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు మెట్రో రైలు తరహాలోనే ముందుగా స్టేజీల పేర్లు చూపించడం వల్ల నగరానికి కొత్తగా వచ్చినవారు, మార్గాలు తెలియని ప్రయాణికులు సులభంగా గమ్యస్థానం వద్ద దిగగలుగుతారు.ఒక ఆలోచనతో మూడు ప్రయోజనాలు అంతేకాదు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేయటం ద్వారా ప్రజలకు ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పే అవకాశం కలుగుతుంది. ఈ మూడు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ముందు పైలట్ ప్రాజెక్టు కోసం హయత్‌నగర్-పటాన్చెరు రద్దీ మార్గాన్ని ఎంపిక చేశారు. పది బస్సుల్లో ఇప్పటికే స్క్రీన్లు అమర్చారు.హయత్ నగర్ పటాన్ చెరు రూట్ లో పైలట్ ప్రాజెక్ట్ ప్రయాణికుల స్పందన, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం, సాంకేతిక పనితీరును పరిశీలించిన తర్వాత నగరంలోని ఇతర డిపోల ఎలక్ట్రిక్ బస్సులకు కూడా ఈ వ్యవస్థను విస్తరించే అవకాశం ఉంది. గతంలో డిజిటల్ స్క్రీన్లు ప్రధానంగా వినోదం, ప్రకటనలకే పరిమితమయ్యేవి. ఇప్పుడు ఇన్ఫోటైన్మెంట్ సదుపాయాలు జోడించి ప్రయాణికులకు ఉపయోగపడే సమాచార వేదికగా మారుస్తున్నారు.ఏపీలో పట్టణ ప్రాంతాలలో ఇల్లులేని వారికి తీపికబురు.. ఇక మొదలెట్టండి!పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే అన్ని

Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ ఇంట్లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్లలో కొందరు ఆటతో గుర్తింపు తెచ్చుకుంటే.. మరికొందరు తమ వ్యక్తిత్వం, గ్లామర్, సోషల్ మీడియా క్రేజ్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తారు. ఇప్పుడు బిగ్‌బాస్ తెలుగు పదో సీజన్‌కు సంబంధించి వినిపిస్తున్న పేర్లలో వర్షిణి సౌందరరాజన్ పేరు మాత్రం ప్రత్యేకంగా వినిపిస్తోంది. సీజన్ ప్రారంభానికి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో, ఎవరు హౌస్‌లోకి వెళ్లబోతున్నారనే ఆతృత ప్రేక్షకుల్లో రోజురోజుకూ పెరుగుతోంది. బిగ్‌బాస్ 10 తెలుగు సీజన్లో సినీ రంగానికి చెందినవారితో పాటు టెలివిజన్ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కలగలిపిన కంటెస్టెంట్ల జాబితా ఉండే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలువురు పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పురుష కంటెస్టెంట్లలో కొంతమంది పేర్లు ప్రేక్షకులకు ముందే పరిచయం ఉన్నప్పటికీ, మహిళా కంటెస్టెంట్లలో వర్షిణి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ప్రతి బిగ్‌బాస్ తెలుగు సీజన్లోనూ ప్రేక్షకుల కంట్లో ఎవరో ఒకరు పాపులర్ అవుతుంటారు. వారి ఆటతీరు మాత్రమే కాకుండా వ్యక్తిత్వం, మాట్లాడే విధానం, స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామర్ కూడా హౌస్‌లో వారి గుర్తింపును పెంచుతాయి. ఈసారి ఆ స్థానం వర్షిణికి దక్కవచ్చనే అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆమెకు సోషల్ మీడియాలో ఉన్న ఫేమ్ కూడా దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వర్షిణి సౌందరరాజన్ ఇప్పటికే సినీ, టెలివిజన్ రంగాల్లో ప్రేక్షకులకు పరిచయమైన ముఖమే. పలువురు ప్రముఖ హీరోలతో కలిసి సినిమాల్లో నటించిన ఆమెకు వెండితెర అనుభవం ఉంది. అయితే ఆమెకు మంచి గుర్తింపు తీసుకురావడంలో టెలివిజన్, సోషల్ మీడియా మరింత కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా యూత్ లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వర్షిణిని దాదాపు 20 లక్షల మంది ఫాలో అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. తన గ్లామరస్ సోషల్ మీడియా పోస్టులతో ఆమె డిజిటల్ ప్రేక్షకుల్లోనూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. దీంతో బిగ్‌బాస్ హౌస్‌లోకి ఆమె ప్రవేశిస్తే

కరీంనగర్ టౌన్: కరీంనగర్లో మానసిక స్థితి సరిగ్గా లేని ఓ వ్యక్తి హల్చల్ సృష్టిస్తున్నాడు. కరీంనగర్ కలెక్టరేట్ రోడ్‌లోని ఎస్బీఐ ఏటీఎంలోని అద్దాలపై సిమెంట్ ఇటుక రాయిని విసరడంతో ఏటీఎం అద్దాలు పగిలిపోయాయి. నగరపాలక సంస్థ చొరవ తీసుకొని ఇలాంటి వ్యక్తులను చేరదీసి నగరంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

తెలుగు బుల్లితెరపై అత్యంత జనాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ ల్యాండ్‌మార్క్ ఎడిషన్ సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు స్టార్ మా మరియు జియోహాట్‌స్టార్‌లో ప్రారంభం కానుంది. ఈసారి దశావతారం థీమ్‌తో షోను రూపొందించినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ క్రమంలోనే తొలి వారంలో 10 మంది కంటెస్టెంట్లు మాత్రమే హౌస్‌లోకి అడుగుపెడతారనే వార్తలు బయటకు వచ్చాయి. ఈ సీజన్ 10 ప్రత్యేకతల గురించి నాగార్జున విడుదల చేసిన ప్రోమోలో ఆటలో సవాలు కాదు ఆటే సవాలు అంటూ 10X సర్ప్రైజెస్ ఉంటాయని స్పష్టం చేశారు. సీజన్ 3 నుంచి విజయవంతంగా హోస్టింగ్ చేస్తున్న నాగార్జున, ఈసారి మరింత కొత్తదనంతో అలరించబోతున్నారు. రోజువారీ ఎపిసోడ్లు ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుంచి ప్రసారం కానున్నాయని మీడియా వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రచార చిత్రాలు ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమవుతున్నాయి. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో 10 మంది రూమర్డ్ కంటెస్టెంట్ల పేర్లు బాగా ప్రచారంలో ఉన్నాయి. టీవీ నటి చైత్ర రాయ్, యాంకర్ వర్షిణి, ముఖేష్ గౌడ, సినీ నటుడు కృష్ణుడు, టెంపర్ వంశీతో పాటు జబర్దస్త్ నటులు నరేష్, ఆటో రామ్‌ప్రసాద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీంతో పాటు అదిత్ అరుణ్, దేబ్జానీ మోదక్, యూట్యూబర్ సుధీర్ రెడ్డి హౌస్‌లోకి వెళ్తున్నారనే ప్రచారం గట్టిగా సాగుతోంది. అయితే ఈ జాబితాపై మేకర్స్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలలో రామ్‌ప్రసాద్, నరేష్ కనిపించకపోవడంతో వీరు షోలోకి వెళ్లడం ఖాయమనే ఊహాగానాలు పెరిగాయి. ఫలితంగా నటి దేబ్జానీ మోదక్‌కు వారానికి 4 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మరోవైపు జియోహాట్‌స్టార్‌లో సామాన్యుల ఎంపిక కోసం అగ్నిపరీక్ష సీజన్

కమాన్‌పూర్(సెంటినరీకాలనీ): అనారోగ్యంతో ఉన్న కార్మికులందరినీ మెడికల్ అన్‌ఫిట్ చేసి, నెలకు కనీసం రెండు మెడికల్ బోర్డులు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఆర్జీ-3 పరిధి ఓసీపీ-2 గని వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. అనంతరం కార్మికులతో కలిసి ర్యాలీగా వెళ్లి యాజమాన్యానికి వినతిపత్రం అందజేశారు. భూగర్భ గనుల్లో పనిచేస్తూ తీవ్ర అనారోగ్యాలు, ప్రమాదాలకు గురవుతున్న కార్మికులకు న్యాయం చేయాలని నాయకులు కోరారు. గతంలో మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా కారుణ్య నియామకాలు చేపట్టిన విషయాన్ని గుర్తుచేస్తూ, ప్రస్తుతం మెడికల్ బోర్డులు సక్రమంగా నిర్వహించడం లేదని ఆరోపించారు. ఇకపై నెలకు రెండు, మూడు బోర్డులు నిర్వహించి అర్హులైన వారందరినీ అన్‌ఫిట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు చిప్ప సురేష్, దేవ శ్రీనివాస్, పాశం శ్రీనివాస్‌రెడ్డి, వీరగోని సంతోష్‌గౌడ్, బర్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు