
Manchu Manoj | అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తీ?.. సర్దార్ 2 ప్రమోషన్స్‌లో మంచు మనోజ్!
Manchu Manoj | అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తీ?.. సర్దార్ 2 ప్రమోషన్స్‌లో మంచు మనోజ్!

Manchu Manoj | అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తీ?.. సర్దార్ 2 ప్రమోషన్స్‌లో మంచు మనోజ్!

Manchu Manoj | బాలయ్యకు విలన్‌గా మంచు మనోజ్.. ‘దాదా’లో ఇప్పటివరకు చూడని భయంకరమైన అవతారం!

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అభిమానులకు చిత్ర యూనిట్ ఒక బిగ్ అప్డేట్ ఇచ్చింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న వర్కింగ్ టైటిల్ NBK111 సినిమాకి సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 6వ తేదీన ఈ సినిమా అధికారిక టైటిల్ తో పాటు థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను కూడా వెల్లడించనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఈ వార్త బయటకు రావడంతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ భారీ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గతంలో బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఎంట్రీ ఆఫ్ యాన్ ఎరా గ్లింప్స్ యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఆ గ్లింప్స్ కు లభించిన అనూహ్య స్పందనతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రమంలోనే మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా అనౌన్స్మెంట్కు సంబంధించిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా ఈ సినిమా టైటిల్ విషయమై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం దాదా లేదా గాడ్ అనే రెండు శక్తివంతమైన పేర్లలో ఒకదాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. దీంతో సెప్టెంబర్ 6న ఏ టైటిల్ ప్రకటిస్తారో అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండటం విశేషం. ఫలితంగా ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల వివరాలు కూడా సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ ఒక అత్యంత కీలకమైన మరియు శక్తివంతమైన పాత్రలో కనిపిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ వెండితెరపై ఎలా ఉండబోతుందో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. బాలకృష్ణ గాయం కారణంగా కొద్దిరోజుల పాటు షూటింగ్‌కు విరామం లభించిన సంగతి
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌కు టాలీవుడ్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. గతంలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ సంచలన విజయం సాధించడంతో వీరి తాజా చిత్రం 'NBK111'పై సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పెద్ది’తో ఇటీవల బ్లాక్‌బస్టర్ అందుకున్న నిర్మాత వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్‌ను ఎక్కడా రాజీపడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఒక అదిరిపోయే ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్ట్ అధికారిక టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ని సెప్టెంబర్ 6న రివీల్ చేయనున్నారు. ఆ రోజు బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ తేజ పుట్టినరోజు కావడంతో నందమూరి అభిమానులకు ఇది డబుల్ ధమాకాగా మారనుంది. ఇటీవల షూటింగ్లో బాలకృష్ణ కాలికి గాయమై శస్త్రచికిత్స జరిగినప్పటికీ, ప్రస్తుతం ఆయన వేగంగా కోలుకుంటున్నారు. గాయం వల్ల ప్రాజెక్ట్ ఆలస్యం కాకుండా, ముందస్తు ప్రణాళిక ప్రకారమే చిత్రాన్ని డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని తీసుకురానున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.* బాక్సాఫీస్ వద్ద బిగ్ క్లాష్.. దసరా రేసు నుంచి రజనీకాంత్ 'జైలర్ 2' ఔట్?గతంలో విడుదలైన ‘ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా’ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ముంబై నేపథ్యంలో సాగే ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో బాలయ్య ఎన్నడూ చూడని సరికొత్త, అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, విలక్షణ నటుడు మంచు మనోజ్ పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తుండగా, అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా.. బాలయ్య కటౌట్‌కి తగినట్లుగా పదునైన సంభాషణలు రాస్తున్నారు. బాలయ్య మార్క్ యాక్షన్, గోపీచంద్ మలినేని మాస్

నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ NBK111. ‘వీరసింహారెడ్డి’ వంటి సూపర్ హిట్ తర్వాత ఈ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఆరంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ తో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ కు వెళ్లాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి టాలీవుడ్ వర్గాల్లో ఒక ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా అధికారిక టైటిల్‌తో పాటు థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను సెప్టెంబర్ 6న అధికారికంగా వెల్లడించనున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. ఈ చిత్రానికి మేకర్స్ ‘GOD’ మరియు ‘DADA’ (దాదా) అనే రెండు మాస్ క్యాచీ టైటిల్స్ చిత్ర బృందం పరిశీలనలో ఉన్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. బాలయ్య ఇమేజ్‌కి, గోపీచంద్ మలినేని మార్క్ యాక్షన్ డ్రామాకి ఈ రెండు పేర్లు పర్ఫెక్ట్గా సరిపోతాయని భావిస్తున్నారు. అయితే దాదాపు ‘దాదా’ టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ముంబై నేపథ్యంలో జరిగే గ్యాంగ్ స్టార్ కథాంశంతో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ లో బాలయ్య గాయపడడంతో షూటింగ్ కు గ్యాప్ ఇచ్చారు మేకర్స్. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, మంచు మనోజ్ పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ మూడో వారంలో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. సెప్టెంబర్ 6న వచ్చే అధికారిక ప్రకటనతో ఈ సినిమా టైటిల్ మరియు విడుదల తేదీపై పూర్తి స్పష్టత రానుంది

నటీనటులు : హరి మున్నగి, శశిధర్, మనోజ్, విశ్వేందర్ రెడ్డి కొమ్మిడి, వేద జలంధర్, రావణ్ నిట్టూరు తదితరులు దర్శకత్వం : రమణ రెడ్డి సోమ సంగీతం : స్మరన్ సాయి నిర్మాణం : మాధవి రెడ్డి సోమ ఛాయాగ్రహణం : సలిగంటి విజయ్ కుమార్ కూర్పు: రోహిత్ పెనుమత్స ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో ఓ చిన్న యూత్ ఫుల్ డ్రామా చిత్రం ‘అమీర్ లోగ్’ కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉంది అనేది సమీక్షలో చూద్దాం రండి. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ముగ్గురు మాస్ కుర్రాళ్ళు శ్రీను (హరి మున్నగి), మల్లేష్ (శశిధర్) అలాగే రఫీఖ్ (మనోజ్) మంచి స్నేహితులు. అయితే ఎలాంటి భాద్యతలు లేకుండా తిరిగే వాళ్ళకి చాచా (విశ్వేందర్ రెడ్డి కొమ్మిడి) అంటే ఎంతో ఇష్టం, గౌరవం. ఓరోజు తమ చాచా చేసిన పక్కా హైదరాబాదీ బిర్యానీ తిని వాళ్లంతా ఫ్లాట్ అవుతారు. అయితే కొన్ని పరిణామాల తర్వాత తమ అక్క గీత (వేద జలంధర్) పని చేసే సాఫ్ట్వేర్ ఆఫీస్ కి చెందిన అడ్మిన్ రవి (రావణ్ నిట్టూరు) నుంచి ఆ బిర్యానీ విషయంలో ఓ బిజినెస్ ఆఫర్ వస్తుంది. ఇక అక్కడ నుంచి కొత్త టర్న్ తీసుకున్న ఈ ముగ్గురు స్నేహితుల లైఫ్ ఎలా మారింది. ఆ బిజినెస్ లో వీరు సక్సెస్ అయ్యారా లేదా? ఆ బిర్యానీ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేశారు? అది సజావుగా సాగిందా లేదా? ఈ ప్రయాణంలో వారు తెలుసుకుంది ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. టాలీవుడ్ లో ఇది వరకు ఫ్రెండ్షిప్ నేపథ్యంలో అది కూడా పక్కా హైదరాబాదీ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. చాలా నాచురల్ గా అక్కడక్కడా మంచి మూమెంట్స్ తో ఈ సినిమాలో కథనం దాదాపు

భారత్‌కు భవిష్యత్తులో చైనాతోనే ప్రధాన పోటీ ఉంటుందని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే వ్యాఖ్యానించారు. భారత్‌పై పాక్ ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్నందున దాయాదిపై దృష్టిపెట్టాల్సి వస్తోందని చెప్పారు. ఇంటర్నెట్ డెస్క్: భారత్‌కు భవిష్యత్తులో చైనాతోనే ప్రధాన పోటీ ఉంటుందని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే వ్యాఖ్యానించారు. భారత్‌పై పాక్ ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్నందున దాయాదిపై దృష్టిపెట్టాల్సి వస్తోందని చెప్పారు. పలు రంగాల్లో చైనా భారత్‌కు ప్రధాన పోటీగా మారుతోందని అన్నారు. తాను రచించిన నూతన పుస్తకం ‘ది క్యూరియస్ అంది క్లాసిఫైడ్: అన్ఎర్తింగ్ మిలిటరీ మిథ్స్ అండ్ మిస్టరీస్’ విడుదల సందర్భంగా జనరల్ నరవణే ఈ వ్యాఖ్యలు చేశారు. 2019-22 మద్య నరవణే భారత ఆర్మీ చీఫ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. పాక్, చైనాలతో భారత్ ఎదుర్కొంటున్న సమస్యలు భిన్నమైనవని జనరల్ నవరణే అన్నారు. ‘రెండు దేశాలతోనూ మనం యుద్ధాలు చేశాము. వాళ్లతో ఎప్పటికీ ముప్పు ఉంటూనే ఉంటుంది. పాక్‌తో నాలుగు యుద్ధాలు జరిగాయి. ఉగ్రవాదం ఎగదోస్తున్న పాక్‌పై దృష్టి పెట్టాల్సి వస్తోంది. కానీ నా అభిప్రాయం ప్రకారం, దీర్ఘకాలంలో చైనాతోనే భారత్‌కు ప్రధాన పోటీ ఉంటుంది. నేను చైనాను శత్రువుగా కాకుండా పోటీదారుగా పేర్కొనడానికి కారణం కూడా ఉంది. కేవలం యుద్ధరంగంలోనే కాకుండా రాజకీయాలు, ఆర్థికరంగం, వాణిజ్య రంగాల్లో కూడా చైనాతో పోటీ ఉంటోంది’ ‘పోటీ ఉన్న చోట ఎంతో కొంత ఘర్షణ ఉంటూనే ఉంటుంది. అయితే, ఈ పొరపొచ్చాలను దౌత్యం, చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి. మరో మార్గం లేనప్పుడే బలప్రయోగానికి దిగాలి. ఒక్కోసారి ఈ పరిస్థితి ఎదురు కావొచ్చు. అలాంటి సమయాల్లో ప్రత్యర్థి ఒకింత వెనకడుగు వేసేలా మిలిటరీ సామర్థ్యాలను అందిపుచ్చుకోవాలి. భౌగోళిక రాజకీయాల్లోనైనా, వ్యక్తిగత జీవితంలో అయినా మన ఇరుగుపొరుగుగా ఎవరు ఉంటారనేది చెప్పలేము. కాబట్టి, అందుబాటులో ఉన్న అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి’ అని జనరల్ నరవణే అన్నారు. దేశాభివృద్ధికి దక్షిణ రాష్ట్రాలే మూలస్తంభాలు మహారాష్ట్ర

భారత్‌కు ప్రస్తుతం పాకిస్థాన్ నుంచి ఉగ్రవాద ముప్పు ఎక్కువగా ఉందని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణె అన్నారు. అయితే రాబోయే రోజుల్లో భారత్‌కు చైనానే ప్రధాన పోటీదారుగా మారుతుందని చెప్పారు. రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, సైనిక రంగాల్లో చైనాతో పోటీ పెరుగుతుందని అంచనా వేశారు.తన కొత్త పుస్తకం ‘ది క్యూరియస్ అండ్ ది క్లాసిఫైడ్’ ఆవిష్కరణ కార్యక్రమంలో గురువారం ఆయన మాట్లాడారు. పాకిస్థాన్, చైనాలతో భారత్ గతంలో యుద్ధాలు చేసిందని గుర్తు చేశారు. రెండు దేశాలతోనూ సరిహద్దు సమస్యలు ఇంకా ఉన్నాయని తెలిపారు.ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతు కొనసాగుతుండటంతో ప్రస్తుతం పశ్చిమ సరిహద్దుపైనే భారత్ ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తోందన్నారు. అందుకే పాకిస్థాన్ తక్షణ భద్రతా సవాలుగా ఉందని చెప్పారు.అయితే దీర్ఘకాలంలో చైనాతో పోటీ మరింత పెరుగుతుందని నరవణె అన్నారు. చైనాను తాను ‘శత్రువు’గా కాకుండా ‘పోటీదారు’గా చూస్తున్నట్లు చెప్పారు. పోటీ ఉన్నచోట విభేదాలు రావడం సహజమేనన్నారు.చైనాతో ఉన్న సమస్యలను చర్చలు, సంభాషణల ద్వారానే పరిష్కరించేందుకు ప్రయత్నించాలని సూచించారు. బలప్రయోగం చివరి మార్గంగా ఉండాలని చెప్పారు. అదే సమయంలో దేశ భద్రత కోసం బలమైన సైనిక శక్తి అవసరమని స్పష్టం చేశారు. ఎలాంటి దుస్సాహసాన్నైనా అడ్డుకునే స్థాయిలో సైన్యం సిద్ధంగా ఉండాలని అన్నారు.నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ వంటి పొరుగు దేశాల్లో స్థిరత్వం ఉండేలా భారత్ సహకరించాలని నరవణె పేర్కొన్నారు. పొరుగు దేశంలో అశాంతి పెరిగితే శరణార్థులు, అక్రమ రవాణా, మాదకద్రవ్యాలు, అక్రమ ఆయుధాల సమస్యలు భారత్‌పైనా ప్రభావం చూపుతాయని హెచ్చరించారు.శాంతే భారత్ ప్రధాన

ముంబైలో జరిగిన జెన్ జీ ఆందోళనల్లో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన మోడల్ రియా అహిర్, ఇప్పుడు పోలీసులను ఒక విజ్ఞప్తి చేసి వార్తల్లో నిలిచింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, సోషల్ మీడియాలో తనకు వస్తున్న బెదిరింపులు, నీచమైన కామెంట్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ముంబై పోలీసులను కోరింది. జూలై 22న దాదర్‌లోని శివాజీ పార్క్‌లో వర్షంలో జరిగిన నిరసన మహారాష్ట్ర వ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఆ సమయంలో అరెస్ట్ చేసిన నిరసనకారులను తీసుకెళ్తున్న పోలీస్ వ్యాన్ ముందుకు వచ్చి, గ్రే కలర్ హూడీతో గట్టిగా నిలబడిన రియా అహిర్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. దాంతో ఆమె ఒక్కసారిగా ఈ జెన్ జీ ప్రొటెస్ట్‌కు ముఖచిత్రంగా మారింది. ఈ వివాదంపై ముంబై యూత్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) మనోజ్ శర్మను కలిసి మాట్లాడింది. రియా అహిర్‌పై వేసిన ఎఫ్ఐఆర్, ఆమె ఎదుర్కొంటున్న ఆన్లైన్ వేధింపులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రతినిధి బృందంలో యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి హర్గున్ సింగ్, ముంబై యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు జీనత్ శబ్రీన్ ఉన్నారు. నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తూ ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చారని, మరి ఈ ఎఫ్ఐఆర్ల ఉపసంహరణలో ఎందుకు ఆలస్యం జరుగుతోందని హర్గున్ సింగ్ ప్రశ్నించారు. యూత్ కాంగ్రెస్ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం, రియాపై ఉన్న ఎఫ్ఐఆర్ను ఉపసంహరించుకునే ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని జాయింట్ సీపీ మనోజ్ శర్మ వారికి హామీ ఇచ్చారు. అలాగే, రియాకు సోషల్ మీడియా లో బెదిరింపు మెసేజ్‌లు పంపుతున్న అకౌంట్లపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం. జాయింట్ సీపీతో సమావేశం తర్వాత రియా అహిర్ మాట్లాడుతూ.. తన నిరసన వీడియో వైరల్ అయినప్పటి నుండి ఆన్లైన్ వేధింపులు

నోవై: మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) మిషిగన్ ఆధ్వర్యంలో బోనాలు జాతర 2026 కార్యక్రమం నోవైలోని శ్రీ వెంకటేశ్వర టెంపుల్ & కల్చరల్ సెంటర్లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మిషిగన్‌లోని తెలుగు కుటుంబాలు, కమ్యూనిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై బోనాల పండుగ సంప్రదాయాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఘనమైన బోనాల ఊరేగింపు, మహాకాళీ మాతకు బోనం సమర్పణ, కుంకుమ పూజలు కన్నుల పండువగా సాగాయి. వీటితో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించగా, మహారాష్ట్ర మండల్ డెట్రాయిట్ (MMD)కు చెందిన షిలేదార్ ఢోల్ తాషా పథక్ ప్రదర్శించిన ప్రత్యేక డోలు ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. సభ్యుల ఉత్సాహభరితమైన భాగస్వామ్యంతో ఈ వేడుక ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఈ వేడుకను మాటా మిషిగన్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ బాతిని, రీజినల్ కోఆర్డినేటర్ సత్య మైనంపాటి, ఉమెన్స్ కో-చైర్ అమూల్య రామన్నగారి నాయకత్వంలో విజయవంతంగా నిర్వహించారు. వీరితో పాటు ప్రియ, అక్షర, మల్లేశం అనేక మంది మాటా మిషిగన్ కమ్యూనిటీ వాలంటీర్లు అందించిన అంకితభావంతో కూడిన సహకారం కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించింది. బోనాల సంప్రదాయాన్ని, తెలుగు సంస్కృతిని కాపాడుతూ భావితరాలకు అందించేందుకు తమ కుటుంబాలతో కలిసి హాజరైన ప్రతి ఒక్కరికీ, వాలంటీర్లకు, కళాకారులకు, ఆలయ ప్రతినిధులకు , కమ్యూనిటీ సభ్యులందరికీ MATA మిషిగన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ వేడుక విజయవంతం కావడానికి విశేషంగా సహకరించిన స్పాన్సర్ కళ్యాణ్ తిరుమల గారికి, శ్రీ వెంకటేశ్వర టెంపుల్ & కల్చరల్ సెంటర్‌కు, పాల్గొన్న అన్ని సంస్థలు , ప్రదర్శన బృందాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగు కమ్యూనిటీని ఒక్కతాటిపైకి తీసుకురావడం , మన గొప్ప సాంస్కృతిక సంప్రదాయాలను పరిరక్షించడం పట్ల తమ నిబద్ధతను మాటా మిషిగన్ మరోసారి చాటుకుంది

'పోలీస్ స్టేషన్ మే భూత్' మూవీ విడుదల కావాల్సి ఉండగా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు. 'పోలీస్ కంపెనీ' పేరుతో వర్మ తీయబోయే చిత్రాన్ని టి సీరిస్ సంస్థ నిర్మించబోతోంది. రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు తన నివాసాన్ని తిరిగి ముంబైకు మార్చాడని వార్తలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో జరిగిన కొన్ని పరిణామాలతో హైదరాబాద్ వదిలి వర్మ ముంబైకు వెళ్ళాడని అంటున్నారు. నిజానికి 'గోవిందా గోవింద' మూవీ తర్వాత తెలుగు సినిమా రంగంపై అలిగిన వర్మ ముంబైలోనే చాలా సంవత్సరాలు ఉన్నారు. ఏదో చుట్టపుచూపుగా హైదరాబాద్ వస్తుండేవారు. అయితే హిందీ చిత్రాలు సైతం పరాజయం పాలు కావడం, ఇతర కారణాలతో వర్మ తిరిగి హైదరాబాద్ వచ్చారు. వర్మ హైదరాబాద్ రావడం వెనుక అండర్ వరల్డ్ నుంచి వచ్చిన బెదిరింపులూ ఉన్నాయని కొందరు చెబుతుంటారు. అయితే... మళ్ళీ ముంబైకు చేరిన వర్మ ఇప్పుడు అక్కడో సినిమా తీయబోతున్నారు. అదే 'పోలీస్ కంపెనీ'. గతంలో వర్మ అండర్ వరల్డ్ మీద స్వీయ దర్శకత్వంలోనూ, నిర్మాతగానూ కొన్ని సినిమాలు తీశారు. అందులో 'సత్య', 'కంపెనీ' వర్మకు మేకర్ గా మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలానే బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత రూట్ మార్చిన వర్మ ముంబై పన్నెండేళ్ళ క్రితం 'అబ్ తక్ చెప్పన్' అనే సినిమాను నిర్మించారు. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా గుర్తింపు పొందిన సబ్ ఇన్ స్పెక్టర్ దయా నాయక్ జీవితంలోని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మళ్ళీ ఇంతకాలానికి వర్మ 'పోలీస్ కంపెనీ'ని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. దీనిని టీ. సీరిస్ సంస్థ నిర్మించబోతోంది. తెలుగులో పలు చిత్రాలలో నటించిన హర్షవర్థన్ రాణే ఈ మూవీలో దయానాయక్ పాత్ర పోషించబోతున్నాడు. 'పోలీస్ కంపెనీ' అనే టైటిల్ కు కొనసాగింపుగా 'ఇది డి-కంపెనీ కంటే చాలా ప్రమాదకరమైనది' అనే కాప్షన్ ను వర్మ పేర్కొన్నారు. వచ్చే నెలలో ఈ

ప్రేమ, అనుబంధాలు, భావోద్వేగాలకు అందమైన పల్లె నేపథ్యాన్ని జోడిస్తూ తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ప్రేమ, అనుబంధాలు, భావోద్వేగాలకు అందమైన పల్లె నేపథ్యాన్ని జోడిస్తూ తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ‘Welcome to the Land of Love’ అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. పచ్చని పొలాలు, గాలిమరలు, ఎడ్లబండి, ప్రశాంతమైన పల్లె వాతావరణం పోస్టర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టైటిల్‌కు తగ్గట్టుగానే ప్రేమను, పల్లె అందాలను కలిపి చూపించిన ఈ ఫస్ట్ లుక్ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచుతోంది. మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహారత్న ప్రొడక్షన్స్, ఎస్కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రేమ, భావోద్వేగాలు, మానవ సంబంధాలతో పాటు పల్లె జీవనశైలిని ప్రతిబింబించే కథగా ‘ప్రేమనే ఊరిలో’ రూపొందుతున్నట్లు చిత్ర బృందం చెబుతోంది. ఈ సినిమాకు ప్రతిభావంతమైన సాంకేతిక బృందం పనిచేస్తోంది. ‘కేజీఎఫ్’, ‘కాంతారా’ వంటి చిత్రాలకు డైలాగ్స్ అందించిన హనుమాన్ చౌదరి ‘ప్రేమనే ఊరిలో’ చిత్రానికి సంభాషణలు రాశారు

చలమలశెట్టి సునీల్ సమర్పణలో సతీష్ జై ఫిల్మ్స్ బ్యానర్‌పై సతీష్ జై, ఫర్నాజ్ శెట్టి ప్రధాన పాత్రల్లో డా. మైత్రి శరణ్ నిర్మించిన చిత్రం ‘గజ’. పద్మనాభ రెడ్డి, జి.మధుసూదన్, ఎం.నరేంద్ర సహ నిర్మాతలు. ఈ సినిమాకి సతీష్ జై దర్శకత్వం వహించారు. ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాని మైత్రి మూవీస్ తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలో సోమవారం నాడు గజ మూవీ టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌కి మంచు మనోజ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో.. *మంచు మనోజ్ మాట్లాడుతూ* .. ‘‘సతీష్ జై హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా ధైర్యం చేసి అడుగు ముందుకు వేశారు. చాలా మందికి అలాంటి ధైర్యం ఉండదు. ఇంత ధైర్యంగా అడుగు వేస్తున్న సతీష్‌కి మంచి విజయం దక్కాలి. ‘గజ’ టీజర్ బాగుంది. మణిశర్మ గారు అద్బుతమైన స్కోర్ ఇచ్చారు. ఇండస్ట్రీకి కులం, గోత్రం లేదు. కళామతల్లికి కులం, మతం లేదు. సినిమా వాళ్లకి, ఆడియెన్స్‌కి, మీడియాకి తేడా ఉండదు మనమంతా ప్రేమికులం. చిన్నా, పెద్దా, కొత్త, పాత అన్న తేడా లేకుండా కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ బ్రహ్మరథం పడతారు. ‘గజ’ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. *హీరో, దర్శకుడు సతీష్ జై మాట్లాడుతూ* .. ‘‘గజ’ చిత్రానికి గట్స్ కా బాప్ అని ట్యాగ్ లైన్ పెట్టాను. గట్స్ కా బాప్ అంటే మంచు మనోజ్ అన్న. ఆయన ఎంత బిజీగా ఉన్నా నా కోసం వచ్చారు. ఓ ఆడియెన్‌గా ఆలోచించే ఈ కథను రాసుకున్నాను. ఈ మూవీ కోసం అందరం కష్టపడ్డాం. ‘గజ’ టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. ఇది కేవలం శాంపిల్ మాత్రమే. సినిమా అదిరిపోద్ది. ప్రతీ సీన్ ఎంగేజింగ్‌గా ఉంటుంది. మాకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’

టాలీవుడ్ హీరోలు కొందరు నిర్మాతలుగానూ అలరించే ప్రయత్నంలో ఉన్నారు. తామే నటిస్తూ కొన్ని- ఇతర హీరోలతో మరికొన్ని సినిమాలు నిర్మిస్తూ సాగుతున్నారు. మరి వీరిలో సక్సెస్ రూటులో పయనిస్తున్నవారు ఎందరు!? ఇప్పటి హీరోల్లో కొందరు నటనలో కొనసాగుతూనే నిర్మాతలుగానూ అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆ రూటులో సాగినవారెందరో ఉన్నారు. నవతరం కథానాయకుల్లో రామ్ పోతినేని, మంచు మనోజ్ వంటివారు చిత్ర నిర్మాణంలో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 'రాపో సినిమాటిక్స్' పతాకంపై తన సోదరుడు పోతినేని కృష్ణ నిర్మాతగా రామ్ పోతినేని స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక మంచు మనోజ్ 'ఎమ్.ఎమ్.ఆర్ట్స్' పతాకంపై ప్రతిభను ప్రోత్సహిస్తూ ఇతరులకు అవకాశాలు కల్పించే పనిలో ఉన్నారు. వీరిద్దరూ ప్రొడ్యూసర్స్ గా 'ఆన్ ద వే'లోనే ఉన్నారు. వీరి సినిమాలు జనం ముందుకు వచ్చాకే వారి అభిరుచి ఏ పాటిదో తెలుస్తుంది. ఇంతకు ముందు నితిన్, విజయ్ దేవరకొండ, అల్లరి నరేశ్, సుధీర్ బాబు వంటివారు కూడా నిర్మాతలుగా మారారు. అఖిల్ హీరోగా నితిన్ 'అఖిల్' సినిమా నిర్మించారు. 'మీకు మాత్రమేచెబుతా' అనే చిత్రంతో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారారు. ఈ ఇద్దరు హీరోలు ఇతరులతో చిత్రాలు నిర్మించేసి తరువాత నిర్మాణం వైపు చూడలేదు. అల్లరి నరేశ్ 'బందిపోటు', సుధీర్ బాబు 'నన్ను దోచుకుందువటే' సినిమాల్లో హీరోలుగా నటిస్తూనే నిర్మించారు. మళ్ళీ చిత్ర నిర్మాణంవైపు వీరు కూడా చూడకపోవడం గమనార్హం. కిరణ్ అబ్బవరం ఇతరులతో 'తిమ్మరాజు పల్లి టీవీ' నిర్మించారు. తాను హీరోగా నటిస్తూ- దర్శకత్వం వహిస్తూ కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం బహుముఖ ప్రజ్ఞ బయల్పడనుంది. అసలు పేరున్న హీరోలు సినిమాలు నిర్మించడమన్నది ఇప్పట్లోనే ఏదో మొదలయిందని ఈ తరం ప్రేక్షకులు భావించవచ్చు. కానీ, తెలుగు సినిమాలో తొలి స్టార్ హీరోగా నిలచిన మహానటుడు చిత్తూరు వి.నాగయ్యనే నిర్మాత, దర్శకునిగా సినిమాలు నిర్మించి ఆకట్టుకున్నారు. ఆయన

సతీష్ జై హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘గజ’. ఫర్నాజ్ శెట్టి కథానాయిక. ఈ సినిమా టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. సతీష్ జై హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘గజ’. ఫర్నాజ్ శెట్టి కథానాయిక. ఈ సినిమా టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి నటుడు మంచు మనోజ్, సునీల్ చలమలశెట్టి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ‘గజ’ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.మంచు మనోజ్ మాట్లాడుతూ 'జీవితంలో ముందుకు వెళ్లాలంటే రిస్క్ చేయాలి. సతీష్ జై ఈ సినిమా కోసం ఆ రిస్క్ చేశారు. టీజర్ చాలా బాగుంది. సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ‘రాయలసీమ చౌదరి’ టైటిల్ సాంగ్ కోసం మణిశర్మ గారితో కలిసి ట్రావెల్ చేశాను. ఇండస్ట్రీకి కులగోత్రాలు ఉండవు. టాలెంట్ ఉన్నవారు కచ్చితంగా ఎదుగుతారు. ప్రతి భార్య తన భర్తకు డాక్టర్ లాంటివారే. ఇది నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెబుతున్నాను’ అని అన్నారు. సునీల్ చలమలశెట్టి మాట్లాడుతూ 'నాకు సినిమాలు చూడటం అలవాటే. కానీ సినిమా కార్యక్రమాలకు గెస్ట్‌గా రావడం చాలా అరుదు. సతీష్ జై నటిస్తూ, ఎంతో ఎఫర్ట్ పెట్టి నిర్మించిన ‘గజ’ సినిమా మంచి హిట్ అవ్వాలి. చిత్రబృందానికి నా శుభాకాంక్షలు’’ అని అన్నారు. సతీష్ జై మాట్లాడుతూ 'ఈ సినిమాకు మంచు మనోజ్ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. టీమ్ అందరి సపోర్ట్‌తో ఈ సినిమాను అనుకున్న విధంగా తీయగలిగాం. సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకునే చాలా వావ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సునీల్ చలమలశెట్టి గారు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చే వ్యక్తి. నా లైఫ్‌లో ఆయన ఉండటం నా అదృష్టం. నేను కొత్తవాడినైనా నా వెనుక నిలబడిన వ్యక్తి మంచు మనోజ్. ఆయన గట్స్ కా బాప్. ఆయన మంచి విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు

బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనాత్ ప్రధాన పాత్రలో నటించిన ‘భారత్ భాగ్య విధాత’ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. దేశ స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక రోజు ముందుగా, అంటే ఆగస్టు 14 నుండి ఈ సినిమా జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో హిందీ భాషలో ప్రత్యేక్షంగా స్ట్రీమింగ్ కానుంది. 2008లో జరిగిన ముంబై ఉగ్రదాడుల నేపథ్యంలో రూపొందిన ఈ థ్రిల్లర్ డ్రామా డిజిటల్ ప్రేక్షకులను విశేషంగా అలరించేందుకు వస్తోంది. ఈ సినిమా జూన్ 12న థియేటర్లలో విడుదలై విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకోగలిగింది. 2008 నవంబర్ 26న ముంబైలోని కామా అండ్ అల్బ్లెస్ ఆసుపత్రిపై ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు అక్కడ పనిచేసిన వైద్య సిబ్బంది చూపిన అసమాన ధైర్యాన్ని ఈ చిత్రంలో చూపించారు. సాధారణంగా వచ్చే భద్రతా బలగాల కథలకు భిన్నంగా, ప్రాణాలకు తెగించి రోగులను కాపాడిన ఆసుపత్రి యోధుల త్యాగాలను డైరెక్టర్ మనోజ్ తపడియా ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ చిత్రంలో కంగనా రనాత్తో పాటు గిరిజా ఓక్, స్మితా తాంబే ముఖ్య పాత్రల్లో అద్భుతంగా నటించి ఆకట్టుకున్నారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది, ముఖ్యంగా గర్భిణులను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇదిలా ఉండగా, పెన్ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్, పరమహంస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ ప్రాజెక్టుకు కంగనా స్వయంగా సహ నిర్మాతగా కూడా బాధ్యతలు నిర్వహించడం విశేషం. సమీక్షకులు మెచ్చుకున్నప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో భారీ వసూళ్లను సాధించలేకపోయింది. ఫలితంగా భారత్‌లో సుమారు ₹7 కోట్ల నెట్ వసూళ్లు, ప్రపంచవ్యాప్తంగా ₹8 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టగలిగింది. ఈ నేపథ్యంలో థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకుల కోసం ఈ రియల్ లైఫ్ డ్రామాను డిజిటల్ వేదికపైకి తీసుకువస్తున్నట్లు జీ5 యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. సాధారణ మనుషుల్లో ఉండే నిజమైన హీరోయిజాన్ని నిరూపించే ఈ కథను డిజిటల్ వేదికపై