
స్టేజ్ పైన ఏడ్చేసిన భాగ్యశ్రీ.. నా చివరి సినిమా ఇక్కడే అంటూ ఎమోషనల్
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Bhagyashri Borse:భాగ్యశ్రీ బోర్సే తెలుగులో మాట్లాడుతూ అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సోషల్ మీడియాలో అభిమానులు చూపించిన ప్రేమ, ప్రోత్సాహం తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయని చెప్పారు. తాను ఈ స్థాయికి రావడానికి ప్రేక్షకుల ఆదరణే ప్రధాన కారణమని ఆమె అన్నారు. అలాగే ‘లెనిన్’ చిత్రబృందం తనను కుటుంబ సభ్యురాలిలా చూసుకుందని పేర్కొన్నారు. తన సినీ కెరీర్ ప్రారంభంలో ఆశించిన ఫలితాలు రాకపోయినా, మంచి అవకాశం కోసం ఎదురుచూశానని భాగ్యశ్రీ తెలిపారు. ‘లెనిన్’ సినిమా తన జీవితంలో కీలక మలుపుగా నిలిచిందని చెప్పారు. ఈ చిత్రంలో ‘భారతి’ పాత్రకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వెల్లడించారు. సక్సెస్ మీట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగార్జున తన నటనను ప్రశంసించడం తనకు మరింత ఆనందాన్ని కలిగించిందని భాగ్యశ్రీ అన్నారు. ఆ మాటలు గుర్తు చేసుకుంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. కొద్దిసేపు మాట్లాడలేక కన్నీళ్లు పెట్టుకోవడంతో అక్కడున్న అభిమానులు కూడా చప్పట్లతో ఆమెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా భాగ్యశ్రీ చెప్పిన ఒక మాట అందరి దృష్టిని ఆకర్షించింది. “హైదరాబాద్ నా కర్మభూమి. ఇక్కడి ప్రేక్షకులు నాకు ఎంతో ప్రేమ ఇచ్చారు. నా చివరి సినిమా కూడా టాలీవుడ్లోనే ఉండాలని కోరుకుంటున్నాను” అని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలు వినగానే సభలో చప్పట్లు మార్మోగాయి. ‘లెనిన్’ సినిమాలో అఖిల్, భాగ్యశ్రీ జంటకు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా వారి మధ్య వచ్చిన ప్రేమ కథ, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను


