© 2026 nimisham.in
అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 16.7 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ గ్రాండ్ సక్సెస్ ఇచ్చిన జోష్‌తో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో విజయోత్సవ సభను నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కింగ్ అక్కినేని నాగార్జున , కొడుకు సాధించిన భారీ విజయాన్ని చూసి ఒక తండ్రిగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. స్టేజీపై ఆయన మాట్లాడిన మాటలు అక్కినేని అభిమానుల హృదయాలను హత్తుకుంటున్నాయి.* ‘హైదరాబాద్ నా కర్మ భూమి.. చివరి సినిమా కూడా ఇక్కడే చేస్తా’ – స్టేజ్‌పైనే ఏడ్చేసిన భాగ్యశ్రీ బోర్సేనా జీవితంలో మొదటిసారి దేవుణ్ణి కోరుకున్నాఈ సక్సెస్ మీట్ వేదికగా నాగార్జున తన మనసులోని మాటను బయటపెడుతూ ఎమోషనల్ అయ్యారు. "నేను గతంలో ‘అన్నమయ్య’ లాంటి భక్తిరస చిత్రం చేసినప్పుడు కానీ, ఆ తర్వాత ఎన్నోసార్లు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు కానీ నా కోసం దేవుణ్ణి ఎప్పుడూ ఏమీ అడగలేదు. భగవంతుడి దయ వల్ల నా జీవితంలో నాకు అన్నీ లభించాయి. కానీ ఇటీవల నేను తిరుమల వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లినప్పుడు మాత్రం నా జీవితంలో మొదటిసారి మనస్ఫూర్తిగా దేవుడి ముందు ఒక కోరిక కోరుకున్నాను. మా అఖిల్‌కు ఈసారి ఎలాగైనా ఒక సాలిడ్ బ్లాక్‌బస్టర్ హిట్ ఇవ్వమని స్వామివారిని వేడుకున్నాను. ఆ కలియుగ దైవం ఆశీస్సులు, అలాగే తెలుగు ప్రేక్షకుల అమితమైన ప్రేమాభిమానాల వల్లే ఈ రోజు ‘లెనిన్’ రూపంలో మా అఖిల్‌కు ఒక కరెక్ట్ మాస్ హిట్ దక్కింది" అని నాగార్జున పేర్కొన్నారు.* అయ్యగారి బాక్సాఫీస్ సునామీ.. పాత రికార్డులన్నీ బద్దలు కొడుతూ ‘లెనిన్’ రికార్డ్ ఓపెనింగ్స్ భాగ్యశ్రీ కోరిక
కూడా నెరవేరిందిఈ సందర్భంగా చిత్ర హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గురించి కూడా నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "తిరుమల వెళ్లినప్పుడు భాగ్యశ్రీ కూడా తనకు ఒక మంచి హిట్టు కావాలని స్వామివారిని వేడుకుందట. చివరికి ఆమె కోరిక కూడా నెరవేరింది. ‘లెనిన్’ ఘనవిజయంతో అటు అఖిల్‌కు బలమైన బ్రేక్ రావడంతో పాటు ఇటు భాగ్యశ్రీ ఖాతాలో కూడా ఒక అద్భుతమైన సూపర్ హిట్ చేరింది. ఈ సినిమాలో భారతి పాత్రలో ఆమె నటన చాలా బాగుంది" అని నాగ్ అభినందించారు. సినిమా ఫలితంపై నాగార్జున పూర్తి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ఈ చిత్రంలో అఖిల్ సరికొత్తగా కనిపించాడని కొనియాడారు. థియేటర్లలో ప్రేక్షకులు అఖిల్ 2.0 రేంజ్ మాస్ పర్ఫార్మెన్స్ను చూస్తున్నారని, యాక్షన్ సీక్వెన్స్, ఎమోషనల్ డ్రామా సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని ప్రశంసించారు. ఇంతటి అఖండ విజయాన్ని అందించి, అక్కినేని కుటుంబంపై తమకున్న ఆదరణను చాటుకున్న తెలుగు సినీ ప్రేక్షకులకు నాగార్జున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.