
సాలిడ్ కంటెంట్ తో వస్తోన్న అఖిల్ , ఫస్ట్ హిట్ పక్కా.. లెనిన్ట్రైలర్ ఎలా ఉందంటే
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన `లెనిన్` మూవీ త్వరలో రాబోతుంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ మురళీ కిశోర్ రూపొందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ పలు మార్లు వాయిదా పడింది. `పెద్ది` కోసమే రెండు సార్లు వాయిదా పడటం విశేషం. ఇప్పుడు ఎట్టకేలకు `లెనిన్` మూవీని విడుదల చేయబోతున్నారు. జులై 10న రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో `లెనిన్` సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. మంగళవారం సాయంత్రం ఈ ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. అఖిల్ నటించిన గత చిత్రాలను మించిన కంటెంట్‌తో ఈ సారి రాబోతున్నారని ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. చిత్తూరు జిల్లా శ్రీరామాపురంలో ఈ మూవీ కథ నడుస్తుంది. ఆ ఊరికి పెద్ద ఒకరు ఉంటారు. ఆయన్ని ధర్మరాజుగా పిలుస్తుంటారు. ఆ ధర్మరాజు చెప్పిందే అంతా ఫాలో అవుతుంటారు. వసుదేవ్ అని ఊర్లో మరో పలుకుబడి ఉన్న వ్యక్తి ఉంటాడు. అతనికి సపోర్ట్ గా హీరో అఖిల్ ఉంటాడు. ఆయనకోసం తన ప్రాణాలైనా అడ్డు పెడతాడు. శ్రీరామపురంలో 18రోజులపాటు ద్రౌపదమ్మని ఎంతో భక్తితో, బాధ్యతగా కొలుస్తారు. ఆ సమయంలో ఆ నేలపై రక్తం చిందకూడదనే నిబంధన ఉంది. అలాంటి నేలపై రక్తం చిందే పరిస్థితులు వస్తాయి. ధర్మరాజు చేసిన అఘాయిత్యాలు హద్దులు దాటుతాయి. అప్పటి వరకు పద్ధతిగా ఉన్న మనుషులు క్రమంగా రంగులు మారుస్తుంటారు. ఎవరి రూపం ఏంటో నెమ్మదిగా తెలిసిసొస్తుంది. ఆ పండగ సమయంలోనే అఖిల్‌కి భారతి(భాగ్యశ్రీ) పరిచయం అవుతుంది. అక్కడే ప్రేమ కూడా స్టార్ట్ అవుతుంది. ప్రేమ చాలా దూరం వెళ్తుంది. అయితే ఊర్లో ఆదిపత్యం చాటున కుట్రలు, కుతంత్రాలు జరుగుతుంటాయి. వాటిని హీరో ఎలా ఎదుర్కొన్నాడు, తన స్నేహం కోసం ఏం చేశాడు? ప్రేమ కోసం ఎలా పోరాడాడు?