
పర్సులోంచి సియా ఏదో తీసింది.. కేతన్ పాస్ పోర్టు మాయంపై కొత్త విషయాలు
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యకు సంబంధించి మరో విషయం వెలుగుచూసింది. జూన్ 6న ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కోసం కేతన్, సియా బాలి వెళ్లాలనుకున్నారు. అయితే చివరి నిమిషంలో ఆ పర్యటన రద్దైంది. కేతన్ పాస్ పోర్టు కనిపించకపోవడమే ఇందుకు కారణం. తాజాగా పాస్‌పోర్టు అదృశ్యంపై కేతన్, సియా ప్రయాణించిన క్యాబ్ డ్రైవర్ పలు ఆరోపణలు చేశాడు. బాలి పర్యటన కోసం ముంబయి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు సియాతో అతని సోదరుడు కారులో ఎక్కారు. అయితే ఆమెను సోదరుడు సాహిల్ బలవంతంగానే కారులో కూర్చోబెట్టాడట. అనంతరం రావెట్ ప్రాంతానికి చేరుకోగా కేతన్ కారు ఎక్కాడు. కొంతసేపటికి టీ తాగడానికి కారును ఆపమని సియా కోరింది. టీ తాగిన అనంతరం కారు బూట్‌ను ఓపెన్ చేయమని డ్రైవర్‌ను సియా అడిగింది. అనంతరం తన పర్సులోంచి ఆమె ఏదో తీసినట్లు గమనించానని.. అనంతరం వారిని ఎయిర్‌పోర్టులో దించేసినట్లు డ్రైవర్ తెలిపాడు. అయితే ఎయిర్‌పోర్టు నుంచి కారు బయలుదేరాక రెండు నిమిషాలకు అతనికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. కారులో చిన్న బ్యాగ్ మరిచిపోయినట్లు కేతన్ బృందం చెప్పింది. దీంతో వెనక్కి వచ్చి అతను ఆ బ్యాగును ఇచ్చి వెళ్లాడు. 500 మీటర్లు దూరం వెళ్లాక పాస్‌పోర్టు కనిపించడం లేదని మళ్లీ ఫోన్ వచ్చిందట. కారులోనే ఆ పాస్‌పోర్టు పడిపోయిందని వారు అనుమానం వ్యక్తం చేశారు. తన వాహనంలో లేదని చెప్పినా వినకుండా వీడియో కాల్లో చెక్‌చేశారు. ఆ తర్వాత కారును విమానాశ్రయానికి రప్పించుకుని సాహిల్, కేతన్‌లు పరిశీలించారు. దీంతో పాస్‌పోర్టు కనిపించకపోవడంతో ఎయిర్‌పోర్టు నుంచి వెనుదిరిగారు. అయితే కేతన్ కారు ఎక్కేముందు వరకు సియా, ఆమె సోదరుడు సాహిల్ వాదించుకున్నట్లు డ్రైవర్ పేర్కొన్నాడు. సియా కారు బూటులోంచి తన పర్సు తీసుకుని ఏదో తీసినట్లు తాను గమనించానని.. అయితే అదేంటో తనకు తెలియదని చెప్పాడు. ఇక బాలి పర్యటన

