© 2026 nimisham.in

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Ketan Agarwal grand father passes away: పూణే కేతన్ అగర్వాల్ మర్డర్ ఘటన దేశంలోనే సంచలనంగా మారింది. జూన్ 18నచోటుచేసుకున్న ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అన్ని రకాల ఆధారాలను పోలీసులు పకట్బందిగా సేకరిస్తున్నారు. ఇటీవల సియా ఫోన్ లోని డాటాను సైతం పోలీసులు రికవరీ చేశారు. దీనిలో ఒక చాట్ బైటపడింది. అది కేసు విచారణలో కీలక మలుపుగా పోలీసులు చెబుతున్నారు. మరోవైపు చేతన్ స్నేహితుడ్ని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో కేతన్ కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయి ఉన్నారు. కోడలిని తమ ఇంటికి తెచ్చు కుంటున్నామన్న ఆనందం కాస్త తమ కొడుకు శవాన్ని ఇంటికి తెచ్చేలా మారిందని గుండెలవిసేలా రోదిస్తున్నారు. మరోవైపు కేతన్ మర్డర్ తర్వాత కేతన్ తాత.. దేవీ చంద్ అగర్వాల్ తీవ్ర అనారోగ్యంకు గురయ్యాడు. గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దేవీచంద్కు (71) కొంతకాలం క్రితమే మేజర్ హార్ట్ సర్జరీ జరిగింది. ఇక తన మనవడి మర్డర్ ఘటన తర్వాత ఆరోగ్యంమరింతగా క్షీణించింది. ఈక్రమంలో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతు కేతన్ అగర్వల్ తాత దేవీ చంద్ అగర్వాల్ తుదిశ్వాస విడిచారు. తన తండ్రిని కోల్పోయిన విషయాన్ని తెలియజేస్తూ కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్, సోషల్ మీడియాలో ‘మిస్ యూ డాడ్’ అంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. Read more: Siya Goyal: సియా గోయల్ మిడిల్ ఫింగర్ వివాదం.!. అసలు నిజం బైటపెట్టిన తండ్రి.. ఏమన్నాడంటే..? ఈ క్రమంలోకేతన్
కుటుంబంతో మరో విషాద ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. మరోవైపు పూణే కోర్టు సియా గోయల్ కు, చేతన్ లకు జులై 16 వరకు రిమాండ్ ను పొడిగించింది. ఈకేసులో పోలీసులు బలమైన ఆధారాలు, టెక్నికల్ ఎవిడెన్స్ ల కోసం అన్ని రకాలుగా కేసులో విచారణను వేగవంతం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.