© 2026 nimisham.in

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Lie detector test for siya goyal: పూణె లోహగఢ్ కోట కేతన్ అగర్వాల్ మర్డర్ కేసు దేశంలో సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. జూన్ 18న చోటుచేసుకున్న ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు మిన్నంటాయి. ఈ క్రమంలో పోలీసులు నిందితులు ఇద్దర్ని సియా గోయల్, చేతన్ చౌదరీలను లోహగఢ్ కోటకు తీసుకొచ్చి సీన్ రీ క్రియేషన్ చేశారు. వీరి కదలికలు, ఫోన్ చాటింగ్, హత్య కు ముందు తర్వాత వీరి నుంచి అన్ని రకాల ఆధారాల్నిపోలీసులు సేకరించారు. కానీ లోయలోకి చేతన్ ను ఎవరు తోశారో అన్న దానిపై ఇంకా పోలీసులకు క్లారిటీ రాలేదు. ఇద్దరు కూడా నేరాన్ని ఒకరిపై మరోకరు నెట్టుకునే ప్రయత్నాలు చేశారని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో పోలీసులు సీన్ రీక్రియేషన్ తర్వాత మరల కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే కోర్టు జులై 3 వరకు సియాకు రిమాండ్ ను విధిస్తు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా.. పోలీసులు సియా, చేతన్ లకు లై డిటెక్టర్‌కు అనుమతించాలని కోర్టును ఆశ్రయించారు. కేతన్‌ను లోయలోకి తోసింది ఎవరో నిర్ధారించే ప్రత్యక్ష సాక్ష్యాలు తమ దగ్గర లేవని కోర్టుకు తెలిపారు. పాలిగ్రాఫ్ పరీక్ష అవసరమని కోర్టుకు విన్నవించారు. ఈ పరీక్ష ఫలితాలను కోర్టులో ప్రత్యక్ష సాక్ష్యాలుగా పరిగణించకపోయినా దర్యాప్తునకు కీలక ఆధారాలు సేకరించేందుకు ఉపయోగపడతాయని పోలీసుల తరపు లాయర్ తమ వాదనను విన్నవించారు. మరోవైపు ఈ హత్య తర్వాత కూడా కేతన్ ఫోన్ సియా వద్ద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. Read
more: Pune fort Murder: సియాగోయల్ కు మరో బిగ్ షాక్.. ఏకంగా రూ. 10 కోట్ల పరువు నష్టం దావా.. మ్యాటర్ ఏమిటంటే..?
ఆ తర్వాత కూడా చేతన్ తో సియా మాట్లాడినట్లు గుర్తించారు. ప్రస్తుతం వీరిద్దరు తమ ఫోన్ లోని చాట్ లు, కాల్స్ లను డిలీట్ చేశారు. ఈ అంశంపై ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చాక మరిన్నినిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. మరోవైపు పోలీసుల లై డిటెక్టర్ పరీక్ష ధర్మాసనం ఎలాంటి ఆదేశాలిస్తుదన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.