
గుండు సూదిపై మట్టి వినాయకుడు
జగిత్యాల(Jagitial) జిల్లాకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ మరోసారి తన ప్రతిభను చాటారు.

జగిత్యాల(Jagitial) జిల్లాకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ మరోసారి తన ప్రతిభను చాటారు.

ధర్మపురి గ్రామీణం: శ్రావణమాసం శనివారం సందర్భంగా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు గోదావరిలో స్నానాలచరించి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటున్నారు. అనుబంధ ఆలయాల్లో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. శ్రావణమాసం ఆలయంలో, గోదావరిలో రద్దీ దృష్ట్యా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. విజిలెన్స్ ఎస్పీ బసవ రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

భూముల రీ సర్వే అనంతరం అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకుంటామని, నకిలీ పాస్ పుస్తకాలను గుర్తించి రద్దు చేస్తామని రెవె న్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నకిలీ పాస్ పుస్తకాలను రద్దు చేస్తాం: మంత్రి పొంగులేటి జగిత్యాల, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): భూముల రీ సర్వే అనంతరం అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకుంటామని, నకిలీ పాస్ పుస్తకాలను గుర్తించి రద్దు చేస్తామని రెవె న్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నకిలీ పాస్ పుస్తకాల ఆధారంగా అర్హతలేని వారంతా రైతుబంధు ప్రయోజనాలు పొందారని అన్నారు. భూ రీసర్వే అనంతరం నిజమైన రైతుల హక్కులను పరిరక్షిస్తూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. జగిత్యాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి భూమి పూజ చేశారు. జగిత్యాల నియోజకవర్గ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులతో జరిగిన సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం జిల్లాకు 70 గ్రామాల్లో భూముల రీ సర్వే జరుగుతున్నదని, ఏడాదిన్నర కాలంలో రాష్ట్రవ్యాప్తంగా రీ సర్వేను పూర్తి చేస్తామన్నారు

వెల్గటూర్: పవిత్ర గోదావరి నదీ తీరంలో ఉన్న ప్రాచీన శైవ క్షేత్రం కోటిలింగాలలో శ్రావణ మాస సందడి నెలకొంది. ఉపవాసాలు, పూజలు, వ్రతాలతోపాటు ఆదివారం సెలవు దినం కావడంతో గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా గంగాదేవికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నది తీరంలోని శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామి వారిని దర్శించుకుని పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

వెల్గటూర్: ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. వెల్గటూర్ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం 80 మంది లబ్ధిదారులకు రూ.25.56 లక్షలు విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన సమయంలో ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, పేద కుటుంబాల ఆర్థిక భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

జగిత్యాల జిల్లా లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండ గట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం హుండీలో డమ్మీ 500 నోట్లు కనబడడం సంచలనంగా మారింది. సుమారుగా రెండు లక్షల 50 వేల డమ్మీ నోట్లను గుర్తు తెలియని వ్యక్తులు హుండీలో వేసినట్లు స్థానిక అధికారులు గుర్తించారు. వెంటనే ఈ హుండీలో నుంచి ఆ డమ్మీ నోట్లోనే తీసి పక్కకు పెట్టారు. ఎవరో కావాలనే డమ్మీ నోట్లు హనుమాన్ హుండీలో వేసినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇలా ఎందుకు వేసి ఉంటారనే కోణంలో విచారణ చేపడుతున్నారు. అంతేకాకుండా ఈ నాలుగు ఐదు రోజుల్లో సిసి ఫుటేజ్ ని కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఆ డమ్మీ నోట్లువేసిన వ్యక్తిని గుర్తుపట్టలేదు. అయితే హుండీ భద్రత పైన భక్తుల్లో కలవరం మొదలైంది. హుండీ సమీపంలో సీసీ కెమెరాలు ఉండడంతో, ఈ వ్యక్తిని గుర్తుపట్టే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ ఆలయంలో కావాలనే డమ్మీ నోట్లు వేశారని తెలుస్తుంది. అయితే.. హుండీ ని పూర్తిస్థాయిలో లెక్కించిన తర్వాత.. ఈ డమ్మీ వ్యవహారం పైన పోలీసులకు ఫిర్యాదు చేస్తామని దేవస్థానం అధికారులు చెబుతున్నారు. మొట్ట మొదటిసారిగా హుండీలో డమ్మీ 500 నోట్లు రావడం కలకలంగా మారింది. ఈ విధంగా హుండీలో 500 డమ్మీ నోట్లు వేసి. భక్తుల మనోభావాలను దెబ్బతీశారని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అధికారులు తక్షణమే స్పందించి.. డమ్మీ నోట్లు వేసిన వ్యక్తుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. అదేవిధంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు