
German Silver: అచ్చం వెండిలానే మెరుస్తుంది.. ఈ జర్మన్ సిల్వర్ ను ఎలా తయారు చేస్తారో తెలుసా?
జర్మన్ సిల్వర్ అనే పేరు వింటే చాలామందికి ఇది జర్మనీలో తయారయ్యే ఒక రకమైన వెండి అని అనిపిస్తుంది. వెండిలాగే తెల్లగా, మెరిసేలా కనిపించడం వల్ల ఈ పేరు మరింత గందరగోళానికి గురిచేస్తుంది. అయితే అసలు విషయం ఏమిటంటే.. జర్మన్ సిల్వర్‌లో వెండి అనే లోహం ఉండదు. ఇది ప్రధానంగా రాగి, నికెల్, జింక్ వంటి లోహాలను కలిపి తయారు చేసే మిశ్రమ లోహం. వెండిని పోలిన రంగు, మెరుపు ఉండటం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది.







