
Indian Man Arrested In Germany For Alleged Murder Of American Girlfriend Sgr 1548591
అమెరికాలో తన 19 ఏళ్ల ప్రియురాలిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 20 ఏళ్ల భారతీయ యువకుడిని జర్మనీలో పోలీసులు అరెస్ట్ చేశారు.
అమెరికాలో తన 19 ఏళ్ల ప్రియురాలిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 20 ఏళ్ల భారతీయ యువకుడిని జర్మనీలో పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో తన 19 ఏళ్ల ప్రియురాలిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 20 ఏళ్ల భారతీయ యువకుడిని జర్మనీలో పోలీసులు అరెస్ట్ చేశారు. అరిజోనా రాష్ట్రంలోని టక్సన్‌లో ఈ హత్య జరిగింది. ఈ ఘటన అనంతరం నిందితుడు అమెరికా నుంచి పారిపోయి జర్మనీ చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. అతడిని తిరిగి అమెరికాకు తీసుకెళ్లే ప్రక్రియ కొనసాగుతోంది (Indian Man Germany Arrest).
టక్సన్‌లోని ఓ అపార్ట్మెంట్లో 19 ఏళ్ల కళాశాల విద్యార్థిని జులిస్సా రూబీ సలాజర్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తనిఖీకి వెళ్లగా ఆమె అపస్మారక స్థితిలో కనిపించింది. వైద్య సిబ్బంది ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆమె శరీరంపై తీవ్ర గాయాల గుర్తులు ఉన్నాయి. నిందితుడు ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు (American Girlfriend killed).
మృతురాలికి ప్రియుడైన వరుణ్ బట్చిగారిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె ఫోన్, క్రెడిట్ కార్డులు అతడు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. తర్వాత వరుణ్ టక్సన్ నుంచి జర్మనీలోని బెర్లిన్‌కు వెళ్లినట్లు అధికారులు తెలిపారు (Germany Extradition). బెర్లిన్ నుంచి భారత్‌కు వెళ్లాలని వరుణ్ భావించినట్టు పోలీసులు అనుమానించారు. అమెరికా అధికారులు వరుణ్‌పై ఫస్ట్-డిగ్రీ హత్య, కిడ్నాప్ ఆరోపణలతో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అనంతరం జర్మనీ అధికారులతో సమన్వయం చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వరుణ్ జర్మనీలో పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడిని అరిజోనాకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది.
మక్కా ఒప్పందంలో చేరనున్న ఈజిప్ట్.. టర్కీ కీలక ప్రకటన..
సౌదీ అరామ్కోపై డ్రోన్ దాడి.. హౌతీల కీలక ప్రకటన..




