
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

ఉదయం ఖాళీ పొట్టతో మనం తినే ఆహారం ఆ రోజంతా మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. చాలామందికి ఉదయం లేవగానే టీ, కాఫీ తాగనిదే రోజు మొదలవదు. కానీ పరగడుపున తాగితే కొందరిలో గుండెల్లో మంట, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు వస్తాయి. కాఫీలోని కెఫీన్ పొట్టలో యాసిడ్ ఉత్పత్తిని పెంచి, పేగుల్లో మంట పుట్టిస్తుంది. అసిడిటీ సమస్య ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అందుకే పరగడుపున కాఫీ, టీలు తాగకూడదు. ఉదయానే నిమ్మ, నారింజ వంటి సిట్రస్ వంటి పండ్లను తినకూడదు. వీటిని పరగడుపున తింటే గుండెల్లో మంటను కలిగిస్తాయి. బజ్జీ, బోండా, వడ వంటి నూనె, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలను ఉదయాన్నే పరగడుపున తినొద్దు. ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది, కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. ఫ్యాటీ లేదా గ్రీసీ ఫుడ్స్ కొందరిలో డిస్పెప్సియా లక్షణాలను కలిగిస్తాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ (NIDDK) పేర్కొంది. అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారికి పెరుగు లేదా యోగర్ట్ అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అలాంటి వాళ్లు పరగడుపున తినకుండా, మధ్యాహ్న భోజనంతో పాటు తీసుకోవడం మంచిది. పరగడుపున అరటిపండు తింటే పెద్దగా నష్టమేమీ లేదు. కానీ, కొందరికి ఉదయాన్నే పరగడుపున అరటిపండు తింటే కడుపు ఉబ్బరం లేదా అసౌకర్యం కలగవచ్చు. బాగా పండిన అరటిపండు తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంది. అరటిపండు పండేకొద్దీ దానిలోని పిండిపదార్థం చక్కెరగా మారుతుంది. కాబట్టి అరటిపండును తినకూడదు

ఉసిరి నిజంగానే డయాబెటీస్‌ను తగ్గిస్తుందా? వాస్తవమేంటి?ఉసిరి నిజంగానే డయాబెటీస్‌ను తగ్గిస్తుందా? వాస్తవమేంటి? 16 August 2026 Anand T ఉసిరి వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికి తెలుసుకు. అయితే దీన్ని తినడం వల్ల మధుమేహం తగ్గుతుందని కొందరు నమ్ముతారు. మరీ దీనిలో నిజమెంతా తెలుసుకుందాం పదండి ఉసిరి నిజానికి టైప్-2 మధుమేహాన్ని ఉసిరి పూర్తిగా నయం చేయలేము, దీనితోపాటు సరైన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో కేవలం డయాబెటీస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు అంతే. సాధారణంగా ఉసిరిలో క్రోమియం అనే ఇన్సులిన్ ఉంటుంది. ఇది నిరోధకతను తగ్గించి, రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. అంతేకాదు ఇందులోని విటమిన్ సి పుస్కలంగా ఉంటుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారిలో రోగనిరోధక శక్తిని పెంచి, అలసట, నీరసాన్ని తగ్గిస్తుంది. ఉసిరిలోని పోషకాలు క్లోమ గ్రంథి పనితీరును బెటర్ చేసి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కాసిరిగా పెరగకుండా అడ్డుకుంటాయి. ఇన్సులిన్ ఉత్పత్తి మీ బాడీలో రోజంతా షుగర్ లెవెల్స్ అదుపులో ఉండాలి అంటే ఉదయం పరగడుపున కొద్దిగా నీటిలో ఉసిరి రసం కలిపి తాగడం మంచిది అయితే ఉసిరి అనేది డయాబెటీస్‌ను కంట్రోల్లో ఉంచుతుంది తప్పా.. పూర్తిగా నియంత్రించలేదు. కాబట్టి వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. ఈ సహజ చిట్కాలు పాటిస్తూనే.. క్రమం తప్పకుండా రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల మీరు బెటర్ అవుతున్నారా లేదా అనేది మీకు అర్థమవుతుంది. మరిన్ని వెబ్ స్టోరీస్ తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా? రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్

కరివేపాకు మహిమ.. ఖాళీ కడుపుతో 3 ఆకులు తింటే చాలు, బంపర్ బెనిఫిట్స్..!కరివేపాకు మహిమ.. ఖాళీ కడుపుతో 3 ఆకులు తింటే చాలు, బంపర్ బెనిఫిట్స్..! August 15 Jyothi Gadda జీర్ణక్రియ మెరుగుపడుతుంది: ఉదయాన్నే పచ్చి కరివేపాకులను బాగా నమలి తినడం వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర అదుపు: కరివేపాకులో ఉండే ప్రత్యేక పోషకాలు ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించడంలో సాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారు పరగడుపున తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. బరువు తగ్గడంలో సహాయం: కరివేపాకులో ఉండే ఇథైల్ అసిటేట్, మహనింబిన్ వంటి రసాయనాలు శరీరంలో కొవ్వును కరిగించడంలో దోహదపడతాయి. పరగడుపున వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. కరివేపాకులో విటమిన్- బి, సి, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కుదుళ్లకు తగిన పోషణను అందించి జుట్టు రాలడాన్ని అరికడతాయి. క్రమంగా ఒత్తైన, నల్లని దృఢమైన జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. ఇందులో విటమిన్- ఎ సమృద్ధిగా లభిస్తుంది. ఉదయాన్నే కరివేపాకు తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. రేచీకటి, కంటి పొడిబారడం వంటి సమస్యల నివారణకు ఇది చాలా ఉపయోగపడుతుంది. కరివేపాకులో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఉన్న వ్యర్థాలను, విష పదార్థాలను బయటకు పంపుతాయి. ఇవి కాలేయాని కి రక్షణగా నిలిచి దాని పనితీరును మరింత చురుగ్గా మారుస్తాయి. కరివేపాకులో ఇనుము, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి. ప్రతిరోజూ పరగడుపున నమలడం వల్ల శరీరంలో ఎర్ర రక్తకణాలు పెరిగి, అనిమియా లేదా రక్తహీనత సమస్య నుండి సులువుగా బయటపడవచ్చు. రక్తనాళాల్లో కొవ్వు నిల్వలు చేరకుండా కరివేపాకులోని భాగాలు నిరోధిస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుతుంది. మరిన్ని వెబ్ స్టోరీస్ రోజూ ఒక కప్పు ఉడికించిన సోయాబీన్స్ తిన్నారంటే..ఈ సమస్యలన్నీ పరార్!

తులసి ఆకులు ఆరోగ్యానికి ఉపయోగకరమైనవిగా భావిస్తారు. అయితే వీటిని వ్యాధులకు ప్రత్యామ్నాయ చికిత్సగా భావించకూడదు. తులసి వల్ల కలిగే ప్రయోజనాలు, ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: తులసి మొక్క దాదాపు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది. ఆధ్యాత్మికంగానే కాకుండా, ఆరోగ్య పరంగా కూడా తులసికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తులసి ఆకులను ఎన్నో ఏళ్లుగా ఆయుర్వేదం, సంప్రదాయ వైద్య విధానాల్లో ఉపయోగిస్తున్నారు. అయితే ఉదయాన్నే పరగడుపున నాలుగు తులసి ఆకులు తింటే అన్ని వ్యాధులు నయమవుతాయని చెప్పడం శాస్త్రీయంగా సరైనది కాదు. కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉండొచ్చు కానీ, తులసిని వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా భావించకూడదు. తులసి ఆకుల్లో విటమిన్లు, ఖనిజాలు, యూజినాల్ వంటి సహజ మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి కొంతమేర ఉపయోగపడవచ్చు. అయితే ఏదైనా అనారోగ్యానికి తులసిని మాత్రమే చికిత్సగా ఉపయోగించకూడదు. తులసిని సంప్రదాయంగా జీర్ణక్రియకు ఉపయోగిస్తారు. కొంతమందిలో కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి చిన్నపాటి సమస్యలకు ఇది ఉపశమనం కలిగించవచ్చు. అయితే మలబద్ధకం లేదా ఇతర జీర్ణ సమస్యలను తులసి మాత్రమే పూర్తిగా నయం చేస్తుందని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు. దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యల కోసం తులసిని ఆయుర్వేదంలో చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. తులసిలోని కొన్ని సహజ సమ్మేళనాలకు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండొచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే తీవ్రమైన దగ్గు, ఆస్తమా లేదా శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లకు తులసి కషాయం లేదా ఆకులను వైద్య చికిత్సకు బదులుగా ఉపయోగించకూడదు. తులసిలో ఉండే సహజ మొక్కల సమ్మేళనాలు శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడంలో సహాయపడవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందువల్ల తులసిని సమతుల్యమైన ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. అయితే తులసి తింటే రోగనిరోధక శక్తి ఒక్కసారిగా పెరిగిపోతుందని చెప్పలేం. తులసిని సంప్రదాయంగా ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగిస్తారు. కొన్ని పరిశోధనల్లో తులసి ఒత్తిడి

Healthy Morning Drinks Telugu: మీరు ఉదయాన్ని ఎలా ప్రారంభిస్తారో మీ రోజంతా ఉండే ఉత్సాహం, శక్తి, ఆరోగ్యంపై కొంత ప్రభావం చూపుతుంది. రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరానికి ముఖ్యంగా నీరు అవసరం. అందుకే ఉదయం నిద్రలేచిన వెంటనే సరైన పానీయాన్ని ఎంచుకోవడం మంచి అలవాటు. పోషకాలు కలిగిన పానీయాలు శరీరానికి హైడ్రేషన్‌తో పాటు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి పోషకాలను అందించడంలో సహాయపడతాయి. అయితే, ఉదయం ఖాళీ కడుపుతో అధిక చక్కెర కలిగిన శీతల పానీయాలు, ప్యాక్ చేసిన జ్యూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిని తీసుకోవడం మంచిది కాదు. వీటిలో చక్కెర ఎక్కువగా ఉండి, పోషక విలువ తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలను మీ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. ఉదయాన్ని ప్రారంభించేందుకు 5 ఆరోగ్యకరమైన పానీయాలు నిద్రలేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం చాలా సులభమైన అలవాటు. రాత్రంతా నీరు తీసుకోకపోవడం వల్ల శరీరంలో ఏర్పడే ద్రవాల లోటును భర్తీ చేయడంలో ఇది సహాయపడుతుంది. రోజును ప్రారంభించేందుకు సాధారణ నీరే మంచి ఎంపిక. ఒక గ్లాసు సాధారణ లేదా గోరువెచ్చని నీటిలో అర నిమ్మకాయ రసం కలుపుకుని తాగవచ్చు. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. రుచిని మెరుగుపరచుకోవాలనుకుంటే కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేసుకోవచ్చు. అయితే ఎసిడిటీ లేదా కడుపులో మంట సమస్య ఉన్నవారు నిమ్మరసం తమకు సరిపోతుందో లేదో గమనించాలి. సత్తు ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలను అందించే ఒక మంచి ఎంపిక. ఒక గ్లాసు సాధారణ నీటిలో రెండు నుంచి మూడు టీస్పూన్ల సత్తు, కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు. ఇది కొంతసేపు కడుపు నిండిన భావన కలిగించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఉదయం త్వరగా ఆకలి వేసే వారికి ఇది ఉపయోగకరమైన ఎంపిక కావచ్చు. తాజా కొబ్బరి