
Peddapalli: ప్రజలకు మెరుగైన సేవలందించాలి
కమాన్‌పూర్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు మెరు గైన సేవలు అందేలా మండలరెవెన్యూ కార్యాలయాల పనితీరు ఉండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

కమాన్‌పూర్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు మెరు గైన సేవలు అందేలా మండలరెవెన్యూ కార్యాలయాల పనితీరు ఉండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

పెద్దపల్లి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ నిర్బంధ, అణిచివేత వైఖరికి వ్యతిరేకంగా సీఐ టీయూ రాష్ట్రకమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లాకేంద్రంలో సామూహిక నిరసనదీక్షలు నిర్వహిం చారు.

సుల్తానాబాద్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, హక్కుల పరిరక్ష ణకు అధికారులు ప్రత్యేకశ్రద్ధతో పనిచే యాలని జాతీయ ఎస్టీకమిషన్ సభ్యు డు జాటోత్ హుస్సేన్ అన్నారు

Nano Fertilizers | వ్యవసాయ పంటలకు నానో యూరియా , నానో డీఏపీ ఎరువులను వాడడం వల్ల అధిక దిగుబడితో పాటు భూసారం కూడా పెరుగుతుందని వ్యవసాయాధికారి రాథోడ్ గణేష్ తెలిపారు.

కడప జిల్లావ్యాప్తంగా విభిన్న రీతిలో వినాయకుడి విగ్రహాలు ప్రతిష్టించారు. గత 50 ఏళ్లుగా వినాయకుడి ప్రతిమలు ఏర్పాటు చేశారు.

Nothing Headphone 1 Pro.. విభిన్నమైన డిజైన్లతో టెక్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Nothing ఇప్పుడు ప్రీమియం హెడ్‌ఫోన్ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. Nothing Headphone 1 Pro పేరుతో రానున్న ఈ మోడల్లో అత్యుత్తమ ధ్వని, అధునాతన శబ్ద నియంత్రణ, భారీ బ్యాటరీ వంటి సౌకర్యాలు ఉండనున్నాయి. లీకైన వివరాలు సంగీత ప్రియుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

కలసపాడు: చిన్నారులకు సకాలంలో టీకాలు ఇవ్వాలని వైద్య అధికారి శైలజ తెలిపారు. బుధవారం ఆమె వైయస్సార్ కడప జిల్లా కలసపాడు మండలం రాజుపాలెం గ్రామంలోని వ్యాధి నిరోధక టీకాల కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. టీకాల డ్యూ లిస్ట్, మాత శిశు ప్రగతి రికార్డ్స్ పరిశీలించారు. గర్భిణీగా నమోదు అయిన వెంటనే మొదటి టీకా వేసి పోర్టల్‌లో నమోదు చేయాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వెంకట సుబ్బమ్మ, హెల్త్ అసిస్టెంట్ రామతీర్థం, లక్ష్మీ, ఆశా కార్యకర్త నూర్జహాన్ పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

కడపలో సుమారు రూ.12 కోట్ల వ్యయంతో ఈ స్టార్టప్ హబ్‌ను నిర్మించారు. 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ+3 నమూనాలో రూపొందించిన ఈ భవనంలో యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన ఆధునిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ స్టార్టప్ హబ్ ప్రారంభం కానుంది. జిల్లా యంత్రాంగం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై దృష్టి సారించింది. రాయలసీమలో సాంకేతిక, పారిశ్రామిక రంగాలకు కొత్త ఊపునిచ్చే కేంద్రంగా దీనిని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హై-స్పీడ్ ఇంటర్నెట్, ఆధునిక వర్క్ స్పేస్‌లు, ప్రొటోటైపింగ్ ల్యాబ్‌లు, సాంకేతిక సాఫ్ట్వేర్ టూల్స్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉండనున్నాయి. కొత్త ఉత్పత్తులు, సాంకేతిక పరిష్కారాలను రూపొందించే యువతకు ప్రయోగాత్మక వాతావరణం కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశం కేవలం ఉద్యోగ అవకాశాల సమాచారాన్ని అందించడం కాదు. యువతను స్వయం ఉపాధి, స్టార్టప్‌ల వైపు మళ్లించి భవిష్యత్‌లో ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త వ్యాపార ఆలోచన ఉన్న విద్యార్థి లేదా యువకుడు ప్రారంభ దశలో ఎదుర్కొనే అనేక సమస్యలకు ఇక్కడ మార్గదర్శకత్వం లభించే అవకాశం ఉంది. ఆలోచనను ఎలా అభివృద్ధి చేయాలి, వ్యాపార ప్రణాళికను ఎలా సిద్ధం చేయాలి, మార్కెట్ అవసరాలను ఎలా అర్థం చేసుకోవాలి వంటి అంశాలపై నిపుణుల సహకారం అందించనున్నారు. ముఖ్యంగా చిన్న ఆలోచనతో ప్రారంభమైన ప్రాజెక్టును వాణిజ్యపరంగా విజయవంతమైన సంస్థగా మార్చేందుకు అవసరమైన ఎకోసిస్టమ్‌ను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. స్టార్టప్ ప్రారంభించాలనే ఆసక్తి ఉన్న యువతకు సరైన మార్గదర్శకత్వం ఎంతో కీలకం. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ విద్యాసంస్థలు, పరిశ్రమలకు చెందిన నిపుణులతో మెంటార్షిప్ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. దేశంలోని ప్రముఖ ఐఐటీలు, ఐఐఎంలకు చెందిన నిపుణులతో పాటు గ్లోబల్ టెక్నాలజీ రంగంలో అనుభవం ఉన్న వ్యక్తుల ద్వారా యువతకు దిశానిర్దేశం చేయనున్నారు. విజయవంతమైన వ్యాపార నమూనాలు

రుత్విక్ - విశాఖ ధీమాన్ జంటగా నటించిన సినిమానే 'రాజా ది రాజా'. ఈ ఇద్దరికీ ఇదే మొదటి సినిమా కావడం విశేషం. అనిల్ బోయిడపు దర్శకత్వం వహించిన ఈ సినిమా, జులై 17వ తేదీన థియేటర్లకు వచ్చింది. థియేటర్స్ వైపు నుంచి పెద్దగా మెప్పించలేకపోయిన ఈ సినిమా, ఆగస్టు 21వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.విశాఖపట్నంలో సత్యం (నరేశ్) ఒక డాక్టర్ గా చిన్న క్లినిక్ నడుపుతుంటాడు. భార్య .. కొడుకు 'రాజా' ( రుత్విక్) ఇదే అతని ఫ్యామిలీ. తన కొడుకు రాజా పెద్ద డాక్టర్ గా పేరు తెచ్చుకోవాలనేది ఆయన ఆశ. అయితే రుత్విక్ కి ఫ్యాషన్ డిజైనర్ కావాలనే కోరిక బలంగా ఉంటుంది. ఆ విషయాన్ని తండ్రికి చెబితే ఒప్పుకోడని భావించిన ఆయన, మెడికల్ కాలేజ్ కి వెళ్లి వస్తున్నట్టుగా నటిస్తుంటాడు. ఫ్యాషన్ డిజైనర్ గా జాబ్ సంపాదించి ఆ దిశగా ముందుకు వెళుతుంటాడు. తాను డిజైన్ చేసిన డ్రెస్ లతో ఫ్యాషన్ షోలో పాల్గొనే ఒక అందమైన అమ్మాయి కోసం ఆయన అన్వేషిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఆయనకి 'ఆద్య' అనే ఒక యువతి తారసపడుతుంది. తన సహాయకురాలైన కుమారితో కలిసి, కొత్తగా ఆమె వైజాగ్ వచ్చిందనే విషయం రాజాకి అర్థమవుతుంది. తాము వచ్చింది 'మహీగఢ్' అనే ప్రాంతం నుంచి అంటూ ఆమె ఒక యువరాణిలా మాట్లాడినప్పటికీ, రాజా పెద్దగా పట్టించుకోడు. 'ఆద్య'ను ఫ్యాషన్ షోకి ఒప్పించాలనే విషయంపైనే అతని దృష్టి ఉంటుంది. ఈ విషయంపై ఆద్యా చుట్టూ తిరుగుతూనే ఆమెపై రాజా మనసు పారేసుకుంటాడు. ఆమె కూడా అతని వ్యక్తిత్వం పట్ల ఆకర్షితురాలవుతుంది. ఇలాంటి పరిస్థితులలోనే రాజా తనని మోసం చేశాడనే విషయం సత్యానికి తెలుస్తుంది. అతనికి డాక్టర్ కావాలనే ఆలోచన లేదనీ, ఫ్యాషన్ డిజైనర్ గా

Madanapalle: మదనపల్లెలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పంపిణీపై ప్రత్యేక దృష్టి! Madanapalle: ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా కృషి చేస్తున్నట్లు 32వ వార్డు అధ్యక్షులు మండిపల్లి (జెసిపి) మధుసూదన్ రెడ్డి తెలిపారు. అర్హత ఉన్న లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసి, వారి సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ పెన్షన్ భరోసా అందించడమే లక్ష్యమని, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు

కమలాపురం: కమలాపురం మండలం భారతి సిమెంట్ పరిశ్రమ వద్ద 19వ రోజు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉద్యోగులు వారి తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి ధర్నాకు సంఘీభావం తెలిపారు. ఉద్యోగులు వారి తల్లిదండ్రులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భారతి సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం తక్షణమే తొలగించిన 28 మంది కాంట్రాక్టు ఉద్యోగులను విధుల్లోకి తీసుకుని వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్వర్క్స్ సహ సమర్పణలో రూపొందుతున్న సరికొత్త ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ‘ముగ్గురు కోతులు’. ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్వర్క్స్ సహ సమర్పణలో రూపొందుతున్న సరికొత్త ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ‘ముగ్గురు కోతులు’ (Mugguru Kothulu). శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో నవ దర్శకుడు కార్తీక్ గరిమెల్ల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, వర్షిక పాశం కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ ఫస్ట్ లుక్ (First Look) పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో టైటిల్‌కు తగ్గట్టుగానే ముగ్గురు కుర్రాళ్లు రకరకాల ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ దర్శనమిచ్చారు. పోస్టర్ డిజైన్ చూస్తుంటేనే ఈ సినిమా ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే హిలేరియస్ యూత్‌ఫుల్ కామెడీతో రాబోతోందని స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట మంచి బజ్‌ను క్రియేట్ చేయడంతో పాటు ప్రేక్షకుల్లో సినిమా కాన్సెప్ట్‌పై సరికొత్త క్యూరియాసిటీని పెంచేసింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోందని, త్వరలోనే చిత్రీకరణ పూర్తి చేసుకుని గుమ్మడికాయ కొట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి ఎస్. సుహాస్ సంగీతం అందిస్తుండగా, రాజ్ నోముల సినిమాటోగ్రఫీ, జమీర్ షేక్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆద్యంతం వినోదభరితంగా సాగే కథ, కథనాలతో నేటి యువతను, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. రాబోయే రోజుల్లో టీజర్, పాటలతో పాటు మరిన్ని ఆసక్తికర ప్రమోషనల్ అప్డేట్స్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటించనున్నామని ఈ

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో నిన్న వరలక్ష్మీ వ్రత వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ఉత్సవాల్లో టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి కూడా పాల్గొన్నారు. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించారు. ఇక్కడ అష్టలక్ష్మి మంటపాన్ని కూడా ఎంతో శోభాయమానంగా అలంకరించారు. ఇక సాయంత్రం వేళ వైభవంగా స్వర్ణ రథోత్సవం కూడా నిర్వహించారు. ఉదయాన్నే సుప్రభాత సేవతో కార్యక్రమాలు మొదలయ్యాయి. అమ్మవారికి సహస్రనామార్చన, నిత్యార్చన, అభిషేకాలు నిర్వహించారు. ఈరోజు అమ్మవారు బంగారు చీరతో విశేషంగా అలంకరించబడి భక్తులకు దివ్యదర్శనాన్ని ఇచ్చారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఉత్సవ మూర్తిని ఆస్థాన మండపంలో పద్మ పీఠంపై ప్రతిష్టించారు. వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి, రోజా, మల్లె, చామంతి, సంపంగి, తామర, తులసి వంటి సుగంధ పుష్పాలతో అమ్మవారిని అలంకరించారు. మొత్తం 12 రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పించి, మహా మంగళ హారతితో వ్రతాన్ని ముగించారు. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానం, దీర్ఘ మాంగల్యం, సౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఈ వ్రతాన్ని ఆచరించడం అత్యంత విశిష్టమని పండితులు పేర్కొంటున్నారు. టీటీడీ ఉద్యానవన విభాగంలోని 60 మంది సిబ్బంది మూడు రోజుల పాటు శ్రమించి, సుమారు మూడు టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 14 రకాల కట్ ఫ్లవర్స్‌తో ఆలయం, ఆస్థాన మండపాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. మంటపాన్ని మోసంబి, పైనాపిల్, ద్రాక్ష, డ్రాగన్ ఫ్రూట్ వంటి పండ్లతో, పూలతో అందంగా తీర్చిదిద్దారు. మంటపం పైభాగంలో గజలక్ష్మి అమ్మవారు, ఇరువైపులా ఐరావతాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకలను కనులారా చూడాలనుకునే భక్తుల కోసం ప్రత్యేకంగా ఏడు ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మరోసారి తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ హత్య వెనుక జరిగిన ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం మెరుపు దాడులు చేపట్టారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ప్రధాన నిందితుడు దస్తగిరి ఇళ్లలో, ఆఫీసులలో ఒకేసారి రైడ్స్ నిర్వహించారు. తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని కడప ప్రాంతాల్లో ఏకకాలంలో మొత్తం 7 చోట్ల జరిపిన ఈ సోదాల్లో లెక్కింపులోకి రాని రూ.24 లక్షల నగదుతో పాటు రెండు బ్యాంకు లాకర్ తాళాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.హైదరాబాద్ జోనల్ పరిధిలోని ఈడీ అధికారులు నిర్వహించిన ఈ దాడుల్లో భారీగా కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలు లభ్యమయ్యాయి. 2019 మార్చి 15న తన సొంత నివాసంలోనే దారుణ హత్యకు గురైన వివేకానందరెడ్డి కేసును మొదట హైకోర్టు ఆదేశాలతో సీబీఐ విచారించింది. సీబీఐ దాఖలు చేసిన మూడు చార్జ్షీట్ల ఆధారంగా ఈడీ ప్రత్యేకంగా మనీ లాండరింగ్ కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసింది. సీబీఐ మోపిన చార్జ్‌షీట్‌లో వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, డి.శివశంకర్ రెడ్డి, వై.సునీల్ యాదవ్ తదితరులను ప్రధాన నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే. ఏకిపారేసిన వైఎస్ అవినాష్ రెడ్డిహత్య వెనుక రూ.40 కోట్ల సుపారీ డీల్?ఈడీ ప్రకటన ప్రకారం.. వివేకా హత్య వెనుక భారీ స్థాయిలో సుపారీ డబ్బులు మారినట్లు విచారణలో తేలింది. వైఎస్సార్సీపీలో వివేకానందరెడ్డి తిరిగి క్రియాశీలకం కావడం, రాజకీయంగా ఆయన ప్రభావం పెరుగుతుండటంతోనే హత్యకు ప్లాన్ వేసినట్లు ఈడీ స్పష్టం చేసింది. డి.శివశంకర్ రెడ్డి రూ.40 కోట్లు ఇస్తామని చెప్పి ఈ కుట్ర పన్నినట్లు ఈ కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తేలింది. ఇందులో భాగంగా రూ.5

Yedapally: పేదల భూములపై కార్పొరేటర్ కన్ను.. నిజామాబాద్‌లో దళితుల ఆందోళన! ఈ వార్తకు సంబంధించిన

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి నిందితుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులకు దిగింది. కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి నిందితుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులకు దిగింది. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి సహా దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్ ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 10 ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుపాలు అలాస్కాలో కుప్పకూలిన చార్టర్ విమానం.. 8మంది మృతి

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆర్థిక లావాదేవీల కోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. వైఎస్సార్సీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సంబంధించిన ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్‌లోని కోకాపేట ఓపెన్ స్కైస్లో ఉన్న అవినాశ్ రెడ్డి విల్లాతోపాటు పులివెందుల నివాసం, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. కడప జిల్లా, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో అవినాశ్ రెడ్డి ఈడీ సోదాలు కొనసాగుతున్నట్లు వివరాలు వెలువడ్డాయి. వైఎస్ వివేకానంద రెడ్డి 2019 మార్చి 15న పులివెందులలోని తన నివాసంలో హత్యకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ చేపట్టింది. 2020లో కేసు నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ, 2021లో మొదటి అభియోగపత్రంతోపాటు తర్వాత అనుబంధ అభియోగపత్రాలు దాఖలు చేసింది. వాటి ఆధారంగా 2025 ఆగస్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేక కేసు నమోదు చేసినట్లు అందుబాటులో ఉన్న సమాచారం చెబుతోంది. ఈ నేపథ్యంలో అవినాశ్ రెడ్డి ఈడీ సోదాలు కేసులోని ఆర్థిక కోణాన్ని మరోసారి ప్రధాన చర్చగా మార్చాయి. అవినాశ్ రెడ్డికి సంబంధించిన ప్రాంతాలతోపాటు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, యెర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, షేక్ దస్తగిరికి సంబంధించిన ప్రాంతాల్లోనూ తనిఖీలు సాగినట్లు సమాచారం. దీంతో హత్యకు ముందు, తర్వాత జరిగినట్లు అనుమానిస్తున్న ఆర్థిక లావాదేవీలు దర్యాప్తులో కీలకంగా మారాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ అభియోగాల ప్రకారం, వివేకానంద రెడ్డి హత్య వెనుక కుట్ర ఉందని పేర్కొంటూ పలువురి పాత్రపై ఆరోపణలు చేసింది. ఇదిలా ఉండగా, హత్యకు సంబంధించి జరిగినట్లు అనుమానిస్తున్న నగదు లావాదేవీల మూలాలను గుర్తించడంపైనే అవినాశ్ రెడ్డి ఈడీ సోదాల్లో ప్రధానంగా దృష్టి ఉన్నట్లు సమాచారం. కేంద్ర దర్యాప్తు సంస్థ గతంలో భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయగా, అవినాశ్ రెడ్డికి న్యాయస్థానాల నుంచి ముందస్తు బెయిల్ లభించింది. ఈ కేసులో
వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇళ్లు కార్యాలయాల్లో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) సోదాలు చేస్తోంది. ఇవాళ తెల్లవారుజాము నుంచి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఆరు చోట్ల ఈడీ అధికారులు ఈ సోదాలు జరుపుతోంది. హైదరాబాద్ కోకాపేట, పులివెందులలోని అవినాష్ రెడ్డి నివాసాలతో పాటుగా ఆయన కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. ప్రధానంగా మనీలాండరింగ్, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? అంటూ ఈడీ ఆరా తీస్తున్నట్లు తెలస్తోంది. ఈడీ అధికారులు కీలక డాక్యుమెంట్ల కోసం వెతుకుతున్నట్లు సమాచారం. అంతేకాదు అవినాశ్ రెడ్డి ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారనే ప్రచారం జరరుగుతోంది.ఎంపీ అవినాశ్ రెడ్డి మాత్రమే కాదు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుల ఇళ్లలోనూ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. పులివెందులలోని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్ ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. తొండూరు మండలం టి తుమ్మలపల్లిలో ఎర్ర గంగిరెడ్డి నివాసంలో తనిఖీలు జరుగుతున్నాయి. ఇటు పులివెందులలోని వైఎస్ జగన్ సమీప బంధు సునీల్ రెడ్డి ఇంట్లోనూ ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈడీ అధికారులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు చేపట్టగా.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఈడీ ఏ కేసుకు సంబంధించి ఈ తనిఖీల చేపట్టిందనేది క్లారిటీ రావాల్సి ఉంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి ఇళ్లలో సోదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అందుకే వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నాయా అనే చర్చ మొదలైంది. ఈ కేసును సీబీఐ విచారణ చేయగా.. ఈడీ ఎందుకు రంగంలోకి దిగిందనే కూడా తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఈడీ సోదాలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్‌పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఈడీ

వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా అవినాశ్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై దాడులకు దిగింది. కడప: వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా అవినాశ్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై దాడులకు దిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ (శుక్రవారం తెల్లవారుజాము నుంచి సోదాలు మొదలుపెట్టింది. ఈ మేరకు దాదాపు 10 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. హైదరాబాద్, పులివెందులలోని అవినాశ్ రెడ్డి నివాసాలు సహా ఆయన కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మనీలాండరింగ్, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? అని ఆరా తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్ల కోసం వెతుకుతున్నారు. అలాగే అవినాశ్ రెడ్డి ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు, ఎంపీ అవినాశ్ రెడ్డితో పాటు వివేకా హత్య కేసు నిందితుల ఇళ్లపైనా ఈడీ అధికారులు దాడులకు దిగారు. పులివెందులలోని దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్ ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. తొండూరు మండలం టి.తుమ్మలపల్లిలో ఎర్ర గంగిరెడ్డి నివాసంలో తనిఖీలు జరుగుతున్నాయి. అలాగే, పులివెందులలోని జగన్ సమీప బంధు సునీల్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు. ఈడీ అధికారులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై మేమైతే కోర్టుకు వెళ్లం

Duvvuru: కేసీ కెనాల్ కింద ఆరుతడి పంటలు సాగు చేయాలి! ఈ వార్తకు సంబంధించిన

Manthani: మంథనిలో రూ.164 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రుల శంకుస్థాపన మంథని: పెద్దపల్లి జిల్లా మంథనిలో సుమారు 164 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. గంగపురిలో 20 కోట్లతో న్యాక్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బస్ డిపో నుంచి గోదావరినది వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి 22 కోట్ల నిధులు, సూరయ్యపల్లి నుండి కాకర్లపల్లి వరకు 29 కోట్ల నిధులు, గుంజపడుగు నుండి విలోచవరం వరకు 8 కోట్లు, కూనారం నుండి ముత్తారం వరకు 36 కోట్లు రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు, అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు, లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులతో పాటు పలు గ్రామాలకు వైకుంఠ రథాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.... మంథని అభివృద్ధికి రూ.164 కోట్లు కాదు.. రూ.800 కోట్ల నిధులు ఇచ్చిన తక్కువేనని అన్నారు. మంథని ప్రాంతానికి చేసిన సేవలకు ఈ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేమని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు ఏమైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కాకుండా రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబుకు చెప్పుకుంటామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. శ్రీధర్‌బాబు తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావుతో కలిసి పనిచేసిన అదృష్టం తమకు దక్కిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే నిరుపేదలకు సన్నబియ్యం, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని తుమ్మల తెలిపారు. మంథని నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్న మంత్రి శ్రీధర్‌బాబును నియోజకవర్గ ప్రజలు, నాయకులు ఎప్పటికీ మర్చిపోవద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆ తర్వాత మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... మంథనిలో నేడు 164 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని, మంథని పట్టణాన్ని

Nirmal: కొండపేటలో రైతులతో అడిషనల్ కలెక్టర్ ప్రత్యేక అవగాహన సదస్సు! ఈ వార్తకు సంబంధించిన

కలసపాడు: వైయస్సార్ కడప జిల్లా కలసపాడు మండల కేంద్రంలోని విద్యుత్ ఉపకేంద్రం వద్ద బుధవారం డీటీఆర్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. దీంతో దాదాపు 40 కుటుంబాలకు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎస్పీడీసీఎల్ ఏఈ ఎం. చిన్నయ్య వెంటనే స్పందించారు. యుద్ధ ప్రాతిపదికన కొత్త డీటీఆర్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను తెప్పించి ఏర్పాటు చేయించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టిన ఏ ఈ చిన్నయ్య, విద్యుత్ సిబ్బందిని స్థానికులు అభినందించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

Manthani: రేపు మంథనిలో నలుగురు మంత్రుల పర్యటన.. వివరాలు మంథని: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో రేపు రాష్ట్రానికి చెందిన నలుగురు మంత్రులు పర్యటించనున్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుతో పాటు రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎస్సీ–ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు గంగాపురి వద్ద న్యాక్ స్కిల్ డెవలప్మెంట్ భవన నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 2.20 గంటలకు మంథని పెట్రోల్ బంక్ చౌరస్తా వద్ద సీఎస్ఆర్ నిధులతో నాలుగు మండలాల్లోని తొమ్మిది గ్రామాలకు మంజూరైన తొమ్మిది వైకుంఠ రథాలను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మంథని బస్ డిపో వద్ద రూ.164.64 కోట్ల విలువైన పలు రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో మంథని పట్టణంలోని డ్రెయిన్లు, సెంట్రల్ లైటింగ్, రోడ్ల విస్తరణతో పాటు మంథని–డిగ్రీ కళాశాల, మంథని–గోదావరి నాలుగు వరుసల రహదారి, సూరయ్యపల్లి–సీతంపేట, గుంజపడుగు–విలోచవరం, కూనారం–ముత్తారం రహదారి పనులు ఉన్నాయి. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నాలుగు మండలాల లబ్ధిదారులకు రేషన్ స్మార్ట్ కార్డులు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, సీఎంఆర్ఎఫ్ సహాయం, మైనార్టీలకు కుట్టు మిషన్లు, మహిళా స్వశక్తి సంఘాలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు

చుంచుపల్లి, ఆగస్టు 18 : చుంచుపల్లి మండల పరిధిలోని పెనగడప గ్రామ పంచాయతీ నడి ఒడ్డు గ్రామంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణ చర్యలను చేపట్టారు. గ్రామ సర్పంచ్ కారం సీతారాములు, ఉప సర్పంచ్ మహమ్మద్ గోరిబాబు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ హరీష్ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది గ్రామంలోని వీధులు, కాలువలు, దోమలు అధికంగా ఉండే ప్రాంతాల్లో దోమల మందును పిచికారి చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉప సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో పారిశుధ్య పనులను ముమ్మరంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిల్వ నీరు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శ్రీనివాసరావు, హెచ్ఈఓ రవి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు

Kadapa: కడప జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా పోలీసుల నైట్ పెట్రోలింగ్ Kadapa: నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల అరికట్టడం, ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడం లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రతి రోజు విస్తృతంగా నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. తాళాలు వేసిన ఇళ్ల వద్ద ప్రత్యేక నిఘా, అనుమానితులు, పాత నేరస్తులపై పర్యవేక్షణ, మొబైల్ చెక్ డివైస్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే లాడ్జిల్లో తనిఖీలు చేపట్టి, బస చేస్తున్న వారి వివరాలు పరిశీలిస్తూ అక్రమ కార్యకలాపాలపై కఠిన నిఘా కొనసాగిస్తున్నారు
హత్య, హత్యాయత్నం, దోపిడీ, ఎక్సైజ్, గంజాయి, గొడవలు, బైండోవర్ కేసుల్లో కీలక నిందితుడిగా ఉంటూ.. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న రాయలసీమ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సయ్యద్ సుల్తాన్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఇన్నాళ్లు పోలీసుల కంటపడకుండా తిరుగుతున్న సుల్తాన్‌ను అరెస్టు చేసి పిట్ ఎన్డీపీఎష్ యాక్ట్ పెట్టి కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ వెల్లడించారు. ఈ మేరకు విలేకర్ల సమావేశం నిర్వహించిన ఎస్పీ ధీరజ్ సయ్యద్ సుల్తాన్ అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. మదనపల్లె త్యాగరాజవీధికి చెందిన 31 సంవత్సరాల సయ్యద్ సుల్తాన్‌పై హత్య, హత్యాయత్నం, దోపిడీ, ఎక్సైజ్, గంజాయి, గొడవలు, బైండోవర్ కేసులు ఉన్నాయని.. మదనపల్లె, పీలేరు, ఆత్మకూరు స్టేషన్లలో గంజాయి కేసులు కూడా నమోదయినట్లు తెలిపారు. మూడు కేసుల్లో 51.915 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.READ ALSO ప్రాణం తీసిన చికెన్ పకోడి.. శనివారం మాంసం తినొద్దన్న అన్న.. గొడ్డలితో నరికి చంపిన తమ్ముడుగంజాయి రవాణా, విక్రయాలు, వినియోగం చేస్తుండటంతో ప్రభుత్వానికి నివేదిక పంపగా ప్రివెన్షన్ ఆఫ్ ఇల్లిసిటీ ట్రాఫిక్ ఇన్ నార్కో డ్రగ్స్ అండ్ సైకోథెరఫిక్ సబ్స్టెషన్స్ యాక్ట్ 1998 కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ ధీరజ్ తెలిపారు. పలు కేసుల్లో నిందితుడుగా ఉన్న సయ్యద్ సుల్తాన్ ముంబై, హైదరాబాద్, కర్ణాటకలో తిరుగుతున్నట్లు గుర్తించి బృందాలు ఏర్పాటు చేశామని.. టెక్నాలజీ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు.సయ్యద్ సుల్తాన్‌పై మూడు గంజాయి, రెండు హత్య కేసులు, ఏడు హత్యాయత్నం కేసులు, దోపిడీ కేసు ఒకటి, ఎక్సైజ్ కేసు 1, గొడవ కేసులు 2, బైండోవర్ కేసులు రెండు ఉన్నాయని.. పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఆరు నెలలు జైలులోని ఉండాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఆపై పీటీ వారెంట్‌పై పెండింగ్ కేసులకు సంబంధించి అదుపులోకి తీసుకుని మళ్లీ అరెస్టు చేస్తామన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా

Veeraballi: ఉత్తమ సేవా అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం! Veeraballi: స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా అత్యుత్తమ సేవలకు జిల్లా స్థాయి అధికారుల చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకున్న ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది కల్పన, 108 వాహన పైలట్ లోకేష్ లను సోమవారం విఆర్డిఎస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సంస్థ అధ్యక్షుడు సురేంద్రారెడ్డి, డాక్టర్ నరేష్ సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు నిజాయితీగా పని చేస్తున్న వారిని ఎప్పుడూ ప్రభుత్వం గుర్తిస్తుందని తెలిపారు.అంబులెన్స్ డ్రైవర్లు ప్రాణాలను కాపాడే అత్యవసర వైద్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు.రోగులను వేగంగా ఆసుపత్రులకు చేర్చడంలో, ప్రాథమిక సహాయం అందించడంలో నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు.వైద్య సిబ్బంది నారాయణ, లక్ష్మి, ఉషాబాల, వెంకటకృష్ణ 108 సిబ్బంది ఆంజనేయులు,రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు

Kadapa: కడపలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం వన్ టౌన్ పోలీసుల కేసు నమోదు! Kadapa: నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక విద్యార్థిని అదృశ్యం అయినట్లు సిఐ తిమ్మారెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం విద్యార్థిని కళాశాలకు వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి సాయంత్రం ఇంటికి రాలేదు. దీంతో విద్యార్థిని కుటుంబ సభ్యులు భయపడి పోలీసులను ఆశ్రయించడంతో చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ తిమ్మారెడ్డి తెలిపారు

కలసపాడు: వైయస్సార్ కడప జిల్లా కలసపాడు మండల కేంద్రంలోని పలు వీధుల్లో అధికారులు ఎల్ఈడీ వీధి దీపాలకు మరమ్మతులు చేయించారు. ఈనెల 12న కాలిపోయిన వీధి దీపాలతో అవస్థలు అనే శీర్షికన ‘ఈనాడు.నెట్’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఎంపీడీవో మహబూబ్ బీ, పీడీవో సదాశివరెడ్డి.. సిబ్బందితో కలిసి సమస్యను పరిష్కరించారు. బలిజ వీధితో పాటు ఇతర వీధుల్లో ఉన్న వీధి దీపాలకు మరమ్మతులు చేయించారు. కాలిపోయిన వాటి స్థానంలో కొత్త ఎల్ఈడీ వీధిదీపాలను ఏర్పాటు చేయించి సమస్యను పరిష్కరించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

వైఎస్సార్ కడప, అల్లూరి, నంద్యాల జిల్లాల్లో దారుణ ఘటనలు బ్రహ్మంగారిమఠం/డుంబ్రిగుడ: మద్యానికి బానిసలై ఒకడు సోదరుడిని హతమార్చగా... మరొకడు కన్నతండ్రిని, ఇంకొకడు భార్యను హత్య చేశాడు. ఈ ఘటనలు వైఎస్సార్ కడప, అల్లూరి, నంద్యాల జిల్లాల్లో జరిగాయి. వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలోని తెలుగుగంగ రోడ్డులో ఉంటున్న హైమావతికి ఇద్దరు కుమారులు. వీరిలో పెద్దకుమారుడు వెంకటసుబ్బయ్య (45)కు వివాహమైంది. ఇతడికి ముగ్గురు పిల్లలు. మద్యానికి బానిస కావడంతో భార్య పిల్లలు ఇతన్ని వదిలి వెళ్లిపోయారు. చిన్నకుమారుడు సురేష్ కూడా మద్యానికి అలవాటు పడడంతో భార్య, ఇద్దరు పిల్లలు విడిపోయారు. అప్పటి నుంచి ఇద్దరు అన్నదమ్ములు తల్లి దగ్గరే ఉంటున్నారు. శనివారం రాత్రి సురేష్ చికెన్ పకోడి తెచ్చుకున్నాడు. శనివారం చికెన్ తేవద్దని అమ్మ నాకు చెబుతూ ఉండేదని, నువ్వు ఎందుకు తెచ్చుకున్నావని వెంకటసుబ్బయ్య మద్యం మత్తులో చికెన్పకోడీ, సురేష్ భార్య గురించి అవహేళనగా మాట్లాడాడు. అది మనసులో పెట్టుకున్న సురేష్ ఆదివారం వెంకటసుబ్బయ్య మద్యం తాగి, భోజనం చేసి మంచంపై నిద్రిస్తుండగా గొడ్డలితో తలపై కొట్టాడు. తల్లితో వాడు చచ్చాడో లేదో చూడుపో అన్నాడు. బయట ఉన్న తల్లి హైమావతి ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే వెంకటసుబ్బయ్య మృతి చెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు సురే‹Ùను పోలీసులు అదుపులోకి తీసుకుని. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కర్రతో భార్యను హతమార్చిన భర్త మరో ఘటనలో అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలం కొర్ర పంచాయతీ శెట్టిబంద గ్రామానికి చెందిన గెమ్మెలి కామయ్య మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు. శనివారం రాత్రి మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని భార్య గెమ్మెలి కోమలి (40)తో గొడవ పడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం తారాస్థాయికి చేరి కోట్లాటకు దారి తీసింది. మత్తులో ఉన్న కామయ్య విచక్షణ కోల్పోయి ఆగ్రహంతో భార్య మెడపై, శరీరంపై కర్రతో బలంగా మోది హత్య చేసి పరారయ్యాడు

Talakondapally: తలకొండపల్లిలో ఘనంగా ఈదమ్మ-మాడెలయ్య బోనాల పండుగ తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం సర్పంచుల సంఘం తలకొండపల్లి మండల అధ్యక్షులు తలకొండపల్లి సర్పంచ్ కటికెల శేఖర్ యాదవ్ తలకొండపల్లి మండల కేంద్రంలోని రజకుల కులదైవం ఈదమ్మ& మాడెలయ్య బోనాల పండుగ మహోత్సవంలో పాల్గొన్న తలకొండపల్లి సర్పంచ్ కటికెల శేఖర్ యాదవ్ .....! అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రజకుల కులస్తులు సర్పంచ్ ఘనంగా సన్మానించారు... కార్యక్రమంలో గ్రామస్తుల గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Palakurthi: పాలకుర్తిలో ఘనంగా బోనాల పండుగ బోనమెత్తిన ఎర్రబెల్లి ఈ వార్తకు సంబంధించిన

Pegadapalli: పెగడపల్లిలో క్షుద్ర పూజల కలకలం మడేల్లయ్య స్వామి గుడిలో భయాందోళన! ఈ వార్తకు సంబంధించిన

కడప జిల్లాలో అత్యంత దిగ్భ్రాంతికరమైన, అమానుషమైన ఘటన వెలుగు చూసింది. సొంత రక్తసంబంధం, కలిసి పెరిగిన అనుబంధం క్షణికావేశం ముందు చిన్నబోయాయి. ఆత్మీయంగా పలకరించుకోవాల్సిన అన్నదమ్ముల మధ్య ఒక చిన్న కారణం చివరకు ప్రాణాలు తీసేంత ఘోరానికి దారితీసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో చోటుచేసుకున్న ఈ దారుణం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బ్రహ్మంగారిమఠం ప్రాంతానికి చెందిన వెంకటసుబ్బయ్య, సురేష్ సొంత అన్నదమ్ములు. వీరిద్దరూ ఒకే ఇంట్లో కలిసి జీవనం సాగిస్తున్నారు. రోజూలాగే పనుల్లో నిమగ్నమయ్యే ఈ సోదరుల మధ్య శనివారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. శనివారం నాడు అన్న వెంకటసుబ్బయ్య ఇంటికి చికెన్ తీసుకువచ్చాడు. శనివారం రోజున చికెన్ ఎందుకు తెచ్చావంటూ తమ్ముడు సురేష్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. వారంలో శనివారం చికెన్ తెచ్చి వండడం ఏంటని తీవ్ర కోపంతో రగిలిపోయాడు. మామూలు మాటల యుద్ధంతో ప్రారంభమైన ఈ గొడవ క్షణాల్లో తీవ్రరూపం దాల్చింది. కోపంతో ఊగిపోయిన తమ్ముడు సురేష్, విచక్షణ కోల్పోయి ఇంట్లోని గొడ్డలి తీసుకుని అన్న వెంకటసుబ్బయ్యపైకి దూసుకెళ్లాడు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే, గొడ్డలితో అన్నపై తీవ్రంగా దాడి చేసి దారుణంగా నరికి చంపేశాడు. రక్తపు మడుగులో పడిపోయిన వెంకటసుబ్బయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఒకే ఒక్క చికెన్ విషయంలో వచ్చిన వివాదం చివరకు ప్రాణాలను బలితీసుకోవడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఈ ఘోర ఘటనపై సమాచారం అందుకున్న బ్రహ్మంగారిమఠం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తం మడుగులో ఉన్న మృతదేహాన్ని పరిశీలించి, క్లూస్ టీమ్ ద్వారా కీలక ఆధారాలు సేకరించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షణికావేశంలో సొంత అన్నను అత్యంత దారుణంగా హత్య చేసిన తమ్ముడు సురేష్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. చికెన్ తెచ్చాడనే ఒక చిన్న విషయానికి సొంత సోదరుడి

మైదుకూరు : సొంత అన్ననే గొడ్డలితో నరికి హతమార్చాడో తమ్ముడు. ఈ ఘటన ఆదివారం వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సురేశ్ పొక్లెయిన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి సురేశ్ చికెన్ పకోడా తీసుకుని ఇంటికి వచ్చాడు. శనివారం చికెన్ పకోడా ఎలా తెస్తావంటూ సోదరుడు వద్దిరాల వెంకటసుబ్బయ్య(42).. సురేశ్‌ను ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీన్ని మనసులో పెట్టుకున్న సురేష్ ఆదివారం ఉదయం మద్యం మత్తులో మంచంపై నిద్రిస్తున్న వెంకట సుబ్బయ్యను గొడ్డలితో నరికి హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
వైఎస్సార్ కడప జిల్లాలో ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడంపై వైఎస్సా్ర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. టెట్ సమస్యపై ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి వినతిపత్రం ఇచ్చినందుకు టీచర్లను సస్పెండ్ చేస్తారా అంటూ తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను నమ్మించి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని మోసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల భవిష్యత్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఆటలు ఆడుతోందని విమర్శించారు. చంద్రబాబు వైఖరిపై ప్రభుత్వ ఉపాధ్యాయులు చేసే పోరాటానికి వైసీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్షను వైసీపీ వ్యతిరేకిస్తోందని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.మరోవైపు వైఎస్సార్ కడప జిల్లాలోని వేంపల్లి మండలానికి చెందిన ముగ్గురు ఉపాధ్యాయులను అధికారులు సస్పెండ్ చేశారు. ఏపీకి చెందిన ఓ బృందం ఇటీవల కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి వినతి పత్రం సమర్పించింది. ఈ బృందంలో వేంపల్లి మండలానికి చెందిన ఎస్జీటీలు వెంకటనాథరెడ్డి, అమర్నాథ్రెడ్డి, సంగమేశ్వరరెడ్డి ఉన్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. సర్వీసు నిబంధనలను అతిక్రమించి వ్యవహరించారంటూ ఈ ముగ్గురినీ సస్పెండ్ చేశారు. కడప డీఈవో షంషుద్దీన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ వ్యవహారంలో రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి.ఏపీ ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. వీరు కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారంటూ ఓ వాదన వినిపిస్తోంది. అయితే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరేందుకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారనే వాదన కూడా ఉంది. అయితే ప్రభుత్వ సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా.. ముందస్తు అనుమతి తీసుకోకుండానే కేంద్ర మంత్రిని కలవడాన్ని విద్యాశాఖ అధికారులు చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం

రాజధాని హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నై వరకూ ప్రతిపాదించిన హైస్పీడ్ రైల్వే లైన్.. ఫ్యూచర్‌సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు.. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే, హైస్పీడ్ రైల్వే లైన్ ప్రాథమిక అలైన్మెంట్లపై స్పష్టత రాష్ట్రంలో 180 కిలోమీటర్లు ప్రయాణించనున్న హైస్పీడ్ ట్రైన్ శంషాబాద్, ఫ్యూచర్‌సిటీ, డ్రై పోర్టు, నాగార్జునసాగర్, వాడపల్లి వద్ద స్టేషన్లు రాష్ట్ర పరిధిలో 2 జిల్లాలు 40 గ్రామాల మీదుగా గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే పొడవు 297 కిలోమీటర్లు.. అందులో 118 కిలోమీటర్లు తెలంగాణలో హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నై వరకూ ప్రతిపాదించిన హైస్పీడ్ రైల్వే లైన్.. ఫ్యూచర్‌సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు ప్రతిపాదించిన 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేలు పక్కపక్కనే వెళ్లనున్నాయి. ఈ రెండింటిలో రోడ్డు ఎడమవైపు.. రైలు మార్గం కుడివైపు ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఎడమవైపు అంటే.. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఉన్న ప్రస్తుత రహదారికి ఎడమవైపు.. ఫ్యూచర్‌సిటీ-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే ఉంటుంది. కుడివైపు రైలు మార్గం ఉండనుంది. వీటికి సంబంధించిన అలైన్మెంట్ల విషయంలోనూ ఒక స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ప్రాథమికంగా అందిన వివరాల ప్రకారం.. హైదరాబాద్-అమరావతి- చెన్నై కారిడార్‌లో శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, డ్రై పోర్టు, నాగార్జునసాగర్ (హాలియా), వాడపల్లి దగ్గర స్టేషన్లు రానున్నాయి. ఈ లైన్ శంషాబాద్ నుంచి ఓఆర్ఆర్ రావిర్యాల ఎగ్జిట్ దగ్గర నిర్మించనున్న 21 కిలోమీటర్ల కొత్త రేడియల్ రోడ్డుకు దగ్గర్లో ప్రారంభమయ్యే గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే వద్ద కలుస్తుంది. ఈ రైల్వే లైన్ పొడవు మొత్తం 760 కిలోమీటర్లు కాగా.. రాష్ట్రపరిధిలో 180 కిలోమీటర్లు ఉండనుంది. దీనికి సంబంధించి ఆ మార్గంలో పలుచోట్ల మార్కింగ్‌లు కూడా

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Puri Jagannath Temple Theme: వినాయక చవితి ఉత్సవాల్లో విశిష్ట ప్రాధాన్యం ఉన్న బాలాపూర్ గణేశ్ ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఈసారి కొత్త థీమ్‌తో బాలాపూర్ గణేశ్ రూపుదిద్దుకుంటోంది. అశేష సంఖ్యలో భక్తులు విచ్చేస్తుండడంతో వారికి మరపురాని అనుభూతి కల్పించేందుకు బాలాపూర్ గణేశ్ ఉత్సవ నిర్వాహకులు ఈసారి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి యేడాది మాదిరి ఈ ఏడాది మరో కొత్త థీమ్‌తో వస్తున్నారు. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన పూరి జగన్నాథ్ స్వామి ఆలయ రూపంలో మండపాన్ని రూపుదిద్దుతున్నారు. ప్రతి సంవత్సరం భక్తులకు వైభవంగా దర్శనమిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్న బాలాపూర్ గణేష్ 2026 సంవత్సరానికి సంబంధించి కొత్తగా కనిపించనున్నారు. ఈ ఏడాది మరో అద్భుతమైన రూపంలో భక్తులను కనువిందు చేయబోతున్నారు. గతంలో అరుణాచలేశ్వర ఆలయం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, యాదాద్రి స్వర్ణగిరి ఆలయం, అయోధ్య శ్రీరామ మందిరం వంటి పుణ్యక్షేత్రాల థీమ్‌లలో మండపాన్ని రూపొందించి బాలాపూర్ గణేష్ భక్తులకు దర్శనమిచ్చింది. కొత్త కొత్త థీమ్‌లకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తుండడంతో ఈ ఏడాది కూడా మరో పుణ్యక్షేత్రాన్ని ఎంచుకున్నారు. ఈసారి పూరీ ఆలయం రూపంలో మండపాన్ని తీర్చిదిద్దనున్నారు. ప్రతి సంవత్సరం సుధాకర్ రెడ్డి డెకరేటర్స్ ఈ ఆలయ నమూనాలు వేస్తుండగా... ప్రతి రూపం భక్తుల్లో ఆధ్యాత్మిక భావన, భక్తి శ్రద్ధలను మరింత పెంచుతున్నాయి. ఈ ఏడాది ఒడిశాలోని పవిత్ర పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ స్వామి ఆలయ థీమ్‌లో బాలాపూర్ గణేష్ భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు. జగన్నాథ స్వామి ఆలయ వైభవాన్ని ప్రతిబింబించేలా బాలాపూర్ గణేశ్ మండపం రూపొందించనున్నారు. ఈ ఆలయంతో బాలాపూర్ గణేశ్ సరికొత్తగా కనిపిస్తాడని.. భక్తుల కళ్లకు పండుగలా

Flag Hoisting | కోల్ సిటీ, ఆగస్టు 15: రామగుండం నగర పాలక సంస్థ 51వ డివిజన్ పరిధి స్వతంత్ర చౌక్‌లో శనివారం జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జాతీయ జెండావిష్కరణ విషయంలో వివాదం తలెత్తింది. డివిజన్ ప్రధాన కేంద్రమైన స్వతంత్ర చౌక్‌లో ప్రతీ సంవత్సరం గెలిచిన కార్పొరేటర్ ప్రజల సమక్షంలో జెండావిష్కరణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే 80వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని గెలిచిన బీఆర్ఎస్ కార్పొరేటర్ ఆకారపు రేఖ మహేష్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి స్వతంత్ర చౌక్ లో ఏర్పాట్లు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ భర్త తిరుపతి తన అనుచరులతో వచ్చి ఇక్కడ తామే జెండా ఎగురవేయాలని వారించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణంకు దారి తీసింది. దీంతో గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు రంగంలోకి దిగి సముదాయించి ఎవరికి వారుగా వేడుకలు జరుపుకోవాలని సూచించి వెళ్లగొట్టారు. శనివారం ఉదయం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. పోలీసులు చేరుకొని ఇరువర్గాలను కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన పంద్రాగస్టు వేడుకలకు మరెక్కడా లేనివిధంగా 51వ డివిజన్లో మాత్రమే పోలీసులు బందోబస్తు కల్పించాల్సిన విచిత్ర పరిస్థితి ఏర్పడింది. కొద్ది సేపు అక్కడ ఏం జరుగుతుందోనని స్థానికులు అయోమయానికి లోనయ్యారు. చివరకు ఒకే చోట ప్రక్కప్రక్కనే రెండు జాతీయ జెండాలు ఎగరడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సమైక్యతకు స్ఫూర్తిగా నిలవాల్సింది పోయి వేడుకల్లో ఆధిపత్యం ప్రదర్శించడం, ప్రజా తీర్పుతో గెలిచిన కార్పొరేటర్ ను అవమానించడం పట్ల స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా కార్పొరేటర్ రేఖ మహేశ్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర వేడుకలను వేదికగా చేసుకొని మాజీ కార్పొరేటర్ రాజకీయం చేయడం, పైగా తన పట్ల దౌర్జన్యంకు దిగడం, కనీసం ప్రొటోకాల్ కూడా పాటించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కార్పొరేటర్‌గా ఇక్కడ జెండా ఎగురవేయడం అనేక

ఉత్తరాంధ్ర ప్రజలు దశాబ్ద కాలంగా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చారిత్రాత్మక సమయం రానే వచ్చింది. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram International Airport) నుండి ఈ నెల 17వ తేదీ నుంచి కమర్షియల్ విమానాల రాకపోకలు అధికారికంగా ప్రారంభం కానున్నాయని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME), ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్(Kondapalli Srinivas) సంచలన ప్రకటన చేశారు. ఈ అద్భుత పరిణామంతో ఉత్తరాంధ్ర ప్రాంతం అంతర్జాతీయ విమానయాన పటంలో చేరబోతోంది. విమానాశ్రయ ప్రారంభోత్సవ విశేషాల గురించి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ నెల 17న సింగపూర్ నుండి నేరుగా మొదటి అంతర్జాతీయ వాణిజ్య విమానం భోగాపురం రన్‌వేపై ల్యాండ్ కానుందని వెల్లడించారు. తొలిరోజు విదేశాల నుండి భోగాపురం చేరుకోనున్న ప్రయాణికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడం వల్ల విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల రూపురేఖలు మారిపోతాయని, పరిశ్రమలు, ఐటీ రంగం మరింత వేగంగా విస్తరిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఆధారంగా ఈ ప్రాంతంలో పర్యాటక రంగాన్ని (Tourism) ఓ రేంజ్లో డెవలప్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఎస్. కోట (శృంగవరపుకోట) పరిసర ప్రాంతాలలో సుమారు 100 ఎకరాల భారీ విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒక భారీ రిసార్ట్‌ను నిర్మిస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. ఈ విమానాశ్రయం మరియు రిసార్ట్ ప్రాజెక్టుల వల్ల స్థానిక యువతకు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని, భోగాపురం పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మరియు వాణిజ్య రంగాలు రాకెట్ వేగంతో అభివృద్ధి చెందుతాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు
ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు సస్పెండ్ అయ్యారు. కడప జిల్లా వేంపల్లి మండలానికి చెందిన ముగ్గురు టీచర్లపై వేటు పడింది. ఏపీలో నిర్వహించిన మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ ఓ ప్రతినిధి బృందం కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ఫిర్యాదు చేసింది. ఆ బృందంతో పాటుగా ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు.. ఆ ఫోటో కూడా వైరల్ అయ్యింది. దీంతో కడప జిల్లాకు చెందిన ఎస్జీటీలు అమర్నాథ్రెడ్డి, సంగమేశ్వరరెడ్డి, వెంకటనాథరెడ్డిపై చర్యలు తీసుకున్నారు. సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ముగ్గురిని సస్పెండ్ చేసినట్లు డీఈవో షంషుద్దీన్ ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురు ప్రభుత్వ టీచర్ల సస్పెన్షన్ వ్యహారం చర్చనీయాంశంగా మారింది.మెగా డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ఇటీవల ఓ ప్రతినిధుల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రమంత్రిని కలిసిన బృందం వెంట కడప జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు అమర్నాథ్రెడ్డి, సంగమేశ్వర్‌రెడ్డి, వెంకటనాథ్‌రెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురు ప్రభుత్వ సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని.. ముందుగా ఎలాంటి అనుమతి తీసుకోకుండానే కేంద్ర మంత్రిని కలిసి ఫిర్యాదు చేయడంపై విద్యాశాఖ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. అందుకే ఈ ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని సస్పెండ్ చేశారు.ఇదిలా ఉంటే మరో వాదన కూడా వినిపిస్తోంది. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు కోసం వీరు కేంద్రమంత్రిని కలిసినట్లు చెబుతున్నారు. ఈ ముగ్గురు టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులంటున్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని వైఎస్సార్సీపీ చెబుతోంది. ఉపాధ్యాయుల సమస్యలపై మాత్రమే కేంద్రమంత్రుల్ని కలవడానికి ప్రయత్నించారంటున్నారు. వారు డీఎస్సీ గురించి మాట్లాడలేదని.. డీఎస్సీకి సంబంధించిన ఎలాంటి వినతిపత్రం కూడా సమర్పించలేదన్నారు. ఉపాధ్యాయుల సమస్యల గురించి మాట్లాడారని.. ఇలా సస్పెండ్ చేయడం సరికాదన్నారు. ఈ సస్పెన్షన్లను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ ముగ్గురిలో నర్రెడ్డి సంగమేశ్వరరెడ్డి ఎస్టీయూ

ఓదెల, ఆగస్టు 14: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గోపరపల్లి గ్రామంలో స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమాన్ని సర్పంచ్ మద్దెవేని రవి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో సర్పంచ్, వైద్య సిబ్బంది, వివిధ శాఖల అధికారులు తిరిగి స్వచ్ఛ శుక్రవారం ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేశారు. ప్రస్తుత వర్షాకాలం సీజన్ లో ఎక్కువగా వ్యాధులు ప్రభలే అవకాశం ఉంటుంది కనుక ప్రజలు శుభ్రతను పాటించాలని కోరారు. అలాగే మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమలు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్, మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న విజన్-2047కు అనుగుణంగా యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధికి ఆలయ ధర్మకర్తల మండలి(ట్రస్టు బోర్డు) కీలక నిర్ణయాలు తీసుకుంది. సొంత నిధులు ఇస్తానన్న బోర్డు చైర్మన్ సత్యనారాయణరెడ్డి ఆ డబ్బుతో దీక్షాపరుల మండపం, నిత్యకల్యాణ మండపం,వరంగల్-హైదరాబాద్ హైవేపై స్వాగత తోరణాల నిర్మాణం కొండపై శంఖు, చక్ర, నామాలతో విద్యుత్ బోర్డు ఏర్పాటుకు రూ.85లక్షలు ఇస్తానన్న కొణిదెల సురేఖ ఆలయ అభివృద్ధికి ట్రస్టు బోర్డు పలు కీలక నిర్ణయాలు యాదాద్రి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న విజన్-2047కు అనుగుణంగా యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధికి ఆలయ ధర్మకర్తల మండలి(ట్రస్టు బోర్డు) కీలక నిర్ణయాలు తీసుకుంది. చైర్మన్ మన్నె సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన ట్రస్టు బోర్డు సమావేశమైంది. ఇందులో పలు తీర్మానాలను ఆమోదించారు. ఆ వివరాలను సత్యనారాయణరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మండల దీక్షలు చేపట్టే భక్తుల కోసం కొండపై విష్ణుపుష్కరిణి వద్ద దీక్షాపరుల మండపం, స్వామివారి నిత్యకల్యాణ మండపం, హైదరాబాద్-వరంగల్ హైవేపై రాయిగిరి వద్ద స్వాగత తోరణ నిర్మాణాలను రూ.55.95కోట్లతో చేపట్టడానికి ట్రస్ట్ బోర్టు ఆమోదించింది. ఈ మూడు నిర్మాణాలకు ట్రస్ట్ బోర్డు చైర్మన్ సత్యనారాయణరెడ్డి తన సొంత నిధులను అందిస్తున్నట్లుగా ప్రకటించారు. కొండపై శంఖు, చక్ర, నామాల విద్యుత్ బల్బుల బోర్డును పునరుద్ధరించాలని నిర్ణయించారు. దీనికోసం రూ.85లక్షలను సమకూర్చడానికి ధర్మకర్త కొణిదెల సురేఖ ముందుకు వచ్చారు. మరోవైపు, పెద్దగుట్ట టెంపుల్ సిటీపై వేదపాఠశాల, విశ్వవిద్యాలయంతో పాటు 40ఎకరాల్లో మోడల్ గోశాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. స్వామివారి భక్తులకు ప్రస్తుతం అందిస్తున్న అన్నప్రసాదాన్ని 2వేల మందికి పెంచారు. తిరుమల తరహాలో టీసీఎస్ సహకారలంతో ఆన్లైన్ సేవలు, టికెట్ వ్యవస్థను రూపొందించాలని నిర్ణయించారు. ఇక ఆలయ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడం కోసం ఐఎస్బీఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) సంస్థను కన్సల్టెంట్‌గా నియమించడానికి ట్రస్టు బోర్డు ఆమోదం తెలియజేసింది. దేవస్థాన విద్యుత్ వినియోగ వ్యయభారం తగ్గింపు కోసం 4 మెగావాట్ల సోలార్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు

కేంద్రం ఏపీ,తెలంగాణా రాష్ట్రాలలో ఎయిర్ పోర్ట్ ల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణా రాష్ట్రంలోని పెద్దపల్లిలో కూడా ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చెయ్యాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. తెలంగాణలోని పెద్దపల్లి ప్రాంతానికి విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా కేంద్రం చేసింది. ఆపై తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది.ఎయిర్ పోర్ట్ కోసం పార్లమెంట్ వేదికగా పెద్దపల్లి ఎంపీ డిమాండ్ఈ క్రమంలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మాకొక ఎయిర్ పోర్ట్ కావాలి అంటూ డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపల్లికి రావాల్సిన ఎయిర్‌పోర్ట్‌ను ఇతర ప్రాంతాలకు తరలించిందని ఆయన ఆరోపించారు. పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై నేడు మండిపడిన ఆయన పెద్దపల్లికి ఎయిర్పోర్ట్ ఎంతో అవసరమన్నారు.కేంద్రం ప్రాతినిధ్యం వహించే ప్రాంతాలకే ఎయిర్ పోర్టులు, ఇతర ప్రాజెక్ట్ లుప్రాంతీయ అభివృద్ధికి ఇది కీలకమని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు. అయితే కేంద్రం, బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలకే విమానాశ్రయాలు, ఇతర ప్రాజెక్టులను తరలించుకుపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాంతానికి రావాల్సిన అభివృద్ధిని అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల నాణ్యతపై కూడా ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.కేంద్రప్రభుత్వం వందల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తోందన్న ఎంపీకేంద్రం ఆర్భాటంగా నిర్మిస్తున్న ఎయిర్‌పోర్టులు, ఇతర ప్రాజెక్టులు ప్రారంభం కాకముందే లేదా కనీసం ఆరు నెలలు గడవకముందే కుప్పకూలిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజలకు కేవలం హడావిడిగా కట్టే నిర్మాణాలు కాకుండా, తరాలపాటు నిలిచిపోయే నిర్మాణాలు కావాలన్నారు. తమకు నాణ్యమైన ఎయిర్పోర్ట్ కావాలని ఆయన డిమాండ్ చేశారు.పార్లమెంట్లో సరైన చర్చలు, సలహాలు లేకుండానే కేంద్ర ప్రభుత్వం వందల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తోందని వంశీకృష్ణ మండిపడ్డారు.మేడారం నుండే కొత్త పెన్షన్ ల పంపిణీ చేయనున్న సీఎం రేవంత్!పెద్దపల్లి ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు తక్షణమే చర్యలు తీసుకోండిప్రాంతీయ అసమానతలను పక్కనపెట్టి పెద్దపల్లి ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు

ఏపీలో స్వయం సహాయక సంఘాలకు కూటమి సర్కార్ (AP Govt) ఇవాళ మరో శుభవార్త చెప్పింది. డ్వాక్రా సంఘాలకు ప్రయోజనాలు కల్పించేందుకు వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం.. ఇదే కోవలో ఇవాళ వారికి భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ డ్వాక్రా సంఘాలకు ఉన్న 10 మంది సభ్యుల నిబంధన నుంచి వెసులుబాటు కల్పించింది. ఇకపై 8 మంది ఉన్నా సరే వారికి రుణాలతో పాటు ఇతర ప్రయోజనాలు కల్పించబోతోంది

మైసూర్ పాక్ పేరు వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. 20వ శతాబ్దం ప్రారంభంలో మైసూర్ ప్యాలెస్ వంటగదిలో మహారాజు 4వ కృష్ణరాజ వడియార్ కోసం కొత్త స్వీట్ తయారు చేసే బాధ్యతను వంటమనిషి కాకాసుర మడప్ప తీసుకున్నారని చెబుతారు. శనగపిండి, పంచదార, నెయ్యితో చేసిన ఈ స్వీట్ అనుకోకుండా కొత్త రూపం దాల్చిందని కథనం.పంచదార పాకాన్ని మడప్ప ఉడికించిన సమయంలో అది కొంత ఎక్కువసేపు మంటపై ఉండటంతో బంగారు రంగులో, మెత్తగా ఉండే ప్రత్యేకమైన స్వీట్ తయారైందని ప్రచారంలో ఉన్న కథ చెబుతోంది. మహారాజు దాని పేరు అడిగినప్పుడు, అప్పటికప్పుడు మడప్ప దానికి ‘మైసూరు పాక’ అని పేరు పెట్టారని అంటారు. కన్నడలో ‘పాక’ లేదా ‘పాకా’ అనే పదానికి తీపి లేదా వంట ప్రక్రియ అనే అర్థాలు ఉన్నాయి.మహారాజుకు స్వీట్ నచ్చడంతో అది రాజభవనం దాటి ప్రజల్లోకి వెళ్లిందని చెబుతారు. మడప్ప మైసూర్ ప్యాలెస్ వెలుపల స్వీట్ షాపు ప్రారంభించారని, అదే తర్వాత ప్రసిద్ధ గురు స్వీట్స్‌కు మూలమైందనే వాదన కూడా ఉంది. అయితే ఈ విషయం కుటుంబ చరిత్రగా మాత్రమే ప్రచారంలో ఉంది. దీనికి స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేవు.కాలక్రమంలో మైసూర్ పాక్ కర్ణాటకతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఇది ప్రధానంగా మెత్తగా నోట్లో కరిగిపోయే రకం, సంప్రదాయంగా కొంత గట్టిగా ఉండే రకం అంటూ రెండు విధాలుగా కనిపిస్తుంది. అయితే ఈ స్వీట్ పేరు, ప్యాలెస్‌లో పుట్టిన కథకు సంబంధించిన వివరాలు ఎక్కువగా మౌఖికంగానే ప్రాచుర్యంలో

కలసపాడు: వైఎస్సార్ కడప జిల్లా కలసపాడు మండలం పుల్లారెడ్డి పల్లె గ్రామంలో తాగునీటి పైపులు పగిలి నీరంతా వృథాగా ప్రవహిస్తోంది. తాగునీరు కలుషితం కావడంతోపాటు రహదారి బురదమయంగా మారింది. విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి హబీబా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. రెండు రోజుల్లో పగిలిన పైపులకు మరమ్మతులు చేయించి, నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఈనాడు కథనానికి స్పందన.. రహదారి ఆక్రమణల తొలగింపు కలసపాడు: వైఎస్సార్ కడప జిల్లా కలసపాడు మండల కేంద్రంలోని చెన్నుపల్లి ప్రధాన రహదారిపై రహదారి, మురుగు కాల్వల ఆక్రమణల తొలగింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 10న ‘వర్షం కురిస్తే.. రోడ్లన్నీ నీటిమడుగులే’అనే శీర్షిక పేరిట ఈనాడులో కథనం ప్రచురితమైంది. ఎంపీడీవో మహబూబ్‌బీ, డిప్యూటీ ఎంపీడీవో మురళీమోహన్, పీడీవో సదాశివరెడ్డి స్పందించారు. గురువారం చెన్నుపల్లి ప్రధాన రహదారిపై పీడీవో సదాశివరెడ్డి యంత్రాలను ఏర్పాటు చేసి, దగ్గరుండి ఆక్రమణల తొలగింపు, మురుగు కాల్వల్లో పూడిక తీత పనులు చేపట్టారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
ఉత్తర తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కీలకమైన రామగుండం–మణుగూరు రైల్వే లైన్ పురోగతిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చర్చించారు. సుమారు రూ.4 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన ఈ రైల్వే మార్గం ప్రస్తుత స్థితి, ప్రాజెక్టు పురోగతి, తదుపరి కార్యాచరణపై మంత్రి నుంచి వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల విస్తరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు అంశాలనుకూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మల్లు రవి, సురేశ్ షెట్కార్ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులు, పెండింగ్ పనులు, కొత్త మౌలిక వసతుల కల్పన, ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలపై విస్తృతంగా చర్చించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రైల్వే ప్రాజెక్టులను పరిశీలించి త్వరగా మంజూరు చేయడంతో పాటు ఇప్పటికే ప్రారంభమైన పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కోరారు. రామగుండం–మణుగూరు రైల్వే లైన్ ఉత్తర తెలంగాణలోని పారిశ్రామిక, వాణిజ్య, రవాణా రంగాల అభివృద్ధికి అత్యంత కీలకమని ఎంపీ వంశీకృష్ణ కేంద్ర మంత్రికి వివరించారు. రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంతాల్లో ఇప్పటికే భారీ పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వాణిజ్య కార్యకలాపాలు విస్తరించి ఉన్న నేపథ్యంలో కొత్త రైల్వే మార్గం సరుకు రవాణాతో పాటు ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరిచే అవకాశం ఉందని పేర్కొన్నారు.ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన ముందుకు తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు. రైల్వే మార్గం అందుబాటులోకి వస్తే పరిశ్రమలకు ముడిసరుకు, ఉత్పత్తుల రవాణా సులభతరం కావడంతో పాటు కొత్త పారిశ్రామిక పెట్టుబడులకు కూడా ఊతం లభించే అవకాశం ఉందని చెప్పారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే మంజూరైన రైల్ ఓవర్ బ్రిడ్జిలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని కూడా ఎంపీ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అవసరమైన నిధుల

ఏపీలో కేంద్ర పౌర విమాన యాన శాఖామంత్రిగా కింజారపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చేపట్టటం ఏపీకి వరంగా మారింది. మంత్రి రామ్మోహన్ నాయుడు ఏపీలో ఏవియేషన్ అభివృద్ధికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో చంద్రబాబు సర్కార్ కూడా ఏపీలో విమానయాన రంగ అభివృద్ధికి ఫుల్ గా దృష్టి సారించింది.రాష్ట్రంలో ఆరు కొత్త పైలట్ శిక్షణా కేంద్రాలుఆంధ్రప్రదేశ్లో విమానయాన రంగాన్ని బలోపేతం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కొత్త చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా తెలంగాణా రాష్ట్రంలో ఆరు కొత్త పైలట్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఈ కొత్త పైలెట్ శిక్షణా కేంద్రాలు కర్నూలు, రాజమహేంద్రవరం, కడప విమానాశ్రయాల్లో ఏర్పాటు కానున్నాయి.ఈ విమానాశ్రయాలలోనే పైలెట్ శిక్షణా కేంద్రాల ఏర్పాటు రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ నిర్వహణలో కర్నూలు విమానాశ్రయం ఉంది. రాజమహేంద్రవరం, కడప విమానాశ్రయాలు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో ఉన్నాయి. ఇవి మాత్రమేకాక తిరుపతి విమానాశ్రయంలో కూడా ఎఫ్‌టీవోలు ఏర్పాటు చేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి అనుమతి పొందిన ప్రైవేటు సంస్థలు ఈ కేంద్రాలను నిర్వహించనున్నాయి.వివిధ దశల్లో పైలెట్ శిక్షణా కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ కర్నూలులో రెండు ఎఫ్‌టీవోలకు రాష్ట్రంలోని కూటమి సర్కార్ అనుమతి ఇచ్చింది. వాటిలో ఒకటి ఈ నెల 22న ప్రారంభం కానుంది. రెండోది డిసెంబరు నాటికి అందుబాటులోకి వస్తుంది. రాజమహేంద్రవరంలో రెండు పైలెట్ శిక్షణా కేంద్రాలకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఆరు నెలల్లోగా అవి ప్రారంభం కావచ్చు. కడపలోనూ రెండు ఎఫ్‌టీవోలకు టెండర్లు ప్రారంభించారు.ఒక్కో కేంద్రం ద్వారా 30 నుంచి 40 మందికి పైలట్ శిక్షణ అందించే అవకాశం ఉంటుంది.తెలంగాణాకు 11.56లక్షల ఇళ్ళు కేటాయించాలని కేంద్రానికి మంత్రి పొంగులేటి విజ్ఞప్తి.. కేంద్రమంత్రి రెస్పాన్స్ ఇదే!ఏపీలో పైలెట్ ట్రైనింగ్ ఔత్సాహికులకు పండుగే ఇప్పటివరకు రాష్ట్రంలో పైలెట్ శిక్షణ అందుబాటులో లేదు. కాబట్టి ఈ శిక్షణా కేంద్రాల ద్వారా