
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ భారీగా పుంజుకుంది. శనివారం ఉదయం 9.10 గంటలకు 78,588 డాలర్ల వద్ద ట్రేడైంది. గత 24 గంటల్లో గరిష్ఠంగా 4.8 శాతం పెరిగింది. గత వారం రోజుల్లో 24.5 శాతం లాభపడింది. 2023 మార్చి తర్వాత ఇదే అత్యంత బలమైన వారపు ర్యాలీగా నిలిచింది.అమెరికా ట్రెజరీ దీర్ఘకాలిక బాండ్ల బైబ్యాక్‌లను రెట్టింపు చేయనున్నట్లు ప్రకటించడం బిట్‌కాయిన్ జోరుకు ప్రధాన కారణాల్లో ఒకటిగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రకటనతో దీర్ఘకాలిక బాండ్ రాబడులు తగ్గాయి. మార్కెట్లలో రిస్క్ తీసుకునే ఆసక్తి పెరిగింది.బిట్‌కాయిన్ ధర పెరగడంతో పతనాన్ని అంచనా వేసి తీసుకున్న భారీ షార్ట్ పొజిషన్లు లిక్విడేట్ అయ్యాయి. దీంతో క్రిప్టో ధర మరింత వేగంగా పెరిగింది. మరోవైపు బంగారం ధర కూడా మే తర్వాత గరిష్ఠ స్థాయికి చేరింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిప్టో సంస్థల ప్రతినిధులతో సమావేశం కావడం కూడా మార్కెట్‌కు సానుకూల సంకేతంగా మారింది. అమెరికాలో నమోదైన స్పాట్ బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌ల్లోకి సంస్థాగత పెట్టుబడులు మళ్లీ పెరిగాయి. 13 ఈటీఎఫ్‌ల్లోకి ఈ వారం ఇప్పటివరకు బిలియన్ డాలర్లకు పైగా నిధులు వచ్చాయి.2025 అక్టోబర్‌లో బిట్‌కాయిన్ దాదాపు 1,26,000 డాలర్ల గరిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత భారీ పతనం నమోదైంది. 2026 జూన్ చివర్లో 58,642 డాలర్లకు పడిపోయింది. ప్రస్తుతం 80 వేల డాలర్లకు చేరువగా దూసుకెళుతోంది

క్రిప్టోకరెన్సీ పేరుతో భారీ లాభాలు వస్తాయని నమ్మించడం.. సోషల్ మీడియాలో పరిచయం పెంచుకోవడం.. ఆ తర్వాత డీల్ మాట్లాడుకుందామంటూ ఓ ప్రాంతానికి పిలిపించడం.. అక్కడికి వెళ్లాక బెదిరించి చేతిలో ఉన్న డబ్బు గుంజేయడం..! హైదరాబాద్‌లో ఓ ముఠా చేస్తున్న అరాచకాలపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా ముఠా సభ్యులను అరెస్టు చేశారు..రూ.7 లక్షలు వసూలు చేసిన కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఫేస్బుక్లో పరిచయం.. క్రిప్టో పేరుతో వల! బేగంబజార్‌కు చెందిన జె.ఆర్. చౌదరిని నిందితులు సోషల్ మీడియా ద్వారా సంప్రదించారు. క్రిప్టోకరెన్సీ లావాదేవీలు, పెట్టుబడుల పేరుతో ఆయనకు నమ్మకం కలిగించారు. భారీ మొత్తంలో లాభాలు పొందవచ్చని చెప్పి క్రిప్టో డీల్ కోసం కలుద్దామని ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆగస్టు 15న బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్మాయిల్‌నగర్‌కు చౌదరిని పిలిపించినట్లు పోలీసులు తెలిపారు. అక్కడికి వెళ్లిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. నిందితులు బెదిరింపులకు పాల్పడి ఆయన వద్ద నుంచి రూ.7 లక్షల నగదు బలవంతంగా తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదుతో బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారం ఆధారంగా నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. ఆగస్టు 17న చాంద్రాయణగుట్టలోని కింగ్స్ స్నూకర్ వద్ద నిందితులు ఉన్నట్లు సమాచారం రావడంతో ప్రత్యేక పోలీస్ బృందం అక్కడికి చేరుకుని నలుగురినీ అరెస్టు చేశారు. ఫిట్నెస్ ట్రైనర్ నుంచి విద్యార్థుల వరకు.. అరెస్టయిన వారిని కాంచన్‌బాగ్‌కు చెందిన ఫిట్నెస్ ట్రైనర్ సబేర్ బిన్ అహ్మద్ హద్రానీ అలియాస్ సైఫ్ (A-1), కర్వాన్‌కు చెందిన విద్యార్థి మహమ్మద్ అబుల్ సలామ్ (A-2), రాజేంద్రనగర్‌కు చెందిన విద్యార్థి మహమ్మద్ అనస్ (A-3), పహాడీషరీఫ్‌కు చెందిన డ్రైవర్ *మహమ్మద్ ఆసిఫ్ (A-4)*గా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో A-5గా పేర్కొన్న మరో ఆసిఫ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి

డిజిటల్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందడంతో, ఆన్లైన్ లావాదేవీలు మన దైనందిన జీవితంలో ఒక అంతర్భాగంగా మారాయి. ఆన్లైన్లో షాపింగ్ చేయడం, నిధులను బదిలీ చేయడం లేదా వ్యాపారం చేయడం వంటి ఏ విషయంలోనైనా, డిజిటల్ లావాదేవీల సౌలభ్యం మనం ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఆన్లైన్ లావాదేవీలలో మోసాలను నివారించడానికి డిజిటల్ సంతకాలు ఒక శక్తివంతమైన సాధనంగా ఆవిర్భవించాయి. ఎలక్ట్రానిక్ పత్రాల ప్రామాణికతను ధ్రువీకరించడానికి, సంతకం చేసేవారి గుర్తింపును నిర్ధారించడానికి సురక్షితమైన, ట్యాంపర్-ప్రూఫ్ పద్ధతిని అందించడం ద్వారా, ఆన్లైన్ లావాదేవీల భద్రత, విశ్వసనీయతను పెంచడంలో డిజిటల్ సంతకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆన్లైన్ లావాదేవీల్లో మోసాలను నివారించడానికి ఇవి ఎలా దోహదపడుతున్నాయో తెలుసుకుందాం. డిజిటల్ సంతకమనేది ఒక డిజిటల్ పత్రం లేదా సందేశానికి సంబంధించిన సమగ్రతను, ప్రామాణికతను ధ్రువీకరించడానికి ఉపయోగించే ఒక క్రిప్టోగ్రాఫిక్ పద్ధతి. ఒక వ్యక్తికి సంబంధించిన గుర్తింపును చేతితో రాసి తెలిపే సంప్రదాయ సంతకానికి భిన్నంగా, క్రిప్టోగ్రాఫిక్ కీలను ఉపయోగించి రూపొందించిన ఒక గణిత అల్గారిథమే డిజిటల్ సంతకం. సంతకం చేసే వ్యక్తికి సంబంధించిన ప్రైవేట్ కీతో పాటు, సంతకం చేస్తున్న పత్రం లేదా సందేశంలోని విషయానికి ఒక గణిత ఫంక్షన్‌ను వర్తింపజేయడం ద్వారా డిజిటల్ సంతకాలు సృష్టిస్తారు. ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పణలు చేయడానికి లేదా ఇ-టెండర్లలో పాల్గొనడానికి, అద్దె ఒప్పందాలు, ఉద్యోగ ఒప్పందాలు వంటి వ్యక్తిగత చట్టపరమైన పత్రాల కోసం డిజిటల్ సంతకాలను ఉపయోగించవచ్చు. పూర్తిగా ఎలక్ట్రానిక్ రూపంలో రూపొందించి, ప్రాసెస్ చేసిన పత్రాలకు ఇ-సంతకాలు ఉత్తమంగా సరిపోతాయి. ఇవి వేగం, భద్రత, చట్టపరమైన చెల్లుబాటును నిర్ధారిస్తాయి. వీలునామాలు, రిజిస్ట్రేషన్, భౌతిక సంతకాలు అవసరమయ్యే సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్ వంటి కొన్ని ఆస్తి పత్రాలు, పవర్ ఆఫ్ అటార్నీ, ట్రస్ట్ డీడ్లు లాంటి వాటిలో వీటిని అంగీకరించరు. ఇంకా, కోర్టులు కేవలం క్రిప్టోగ్రాఫిక్