
క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ భారీగా పుంజుకుంది. శనివారం ఉదయం 9.10 గంటలకు 78,588 డాలర్ల వద్ద ట్రేడైంది. గత 24 గంటల్లో గరిష్ఠంగా 4.8 శాతం పెరిగింది. గత వారం రోజుల్లో 24.5 శాతం లాభపడింది. 2023 మార్చి తర్వాత ఇదే అత్యంత బలమైన వారపు ర్యాలీగా నిలిచింది.అమెరికా ట్రెజరీ దీర్ఘకాలిక బాండ్ల బైబ్యాక్‌లను రెట్టింపు చేయనున్నట్లు ప్రకటించడం బిట్‌కాయిన్ జోరుకు ప్రధాన కారణాల్లో ఒకటిగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రకటనతో దీర్ఘకాలిక బాండ్ రాబడులు తగ్గాయి. మార్కెట్లలో రిస్క్ తీసుకునే ఆసక్తి పెరిగింది.బిట్‌కాయిన్ ధర పెరగడంతో పతనాన్ని అంచనా వేసి తీసుకున్న భారీ షార్ట్ పొజిషన్లు లిక్విడేట్ అయ్యాయి. దీంతో క్రిప్టో ధర మరింత వేగంగా పెరిగింది. మరోవైపు బంగారం ధర కూడా మే తర్వాత గరిష్ఠ స్థాయికి చేరింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిప్టో సంస్థల ప్రతినిధులతో సమావేశం కావడం కూడా మార్కెట్‌కు సానుకూల సంకేతంగా మారింది. అమెరికాలో నమోదైన స్పాట్ బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌ల్లోకి సంస్థాగత పెట్టుబడులు మళ్లీ పెరిగాయి. 13 ఈటీఎఫ్‌ల్లోకి ఈ వారం ఇప్పటివరకు బిలియన్ డాలర్లకు పైగా నిధులు వచ్చాయి.2025 అక్టోబర్‌లో బిట్‌కాయిన్ దాదాపు 1,26,000 డాలర్ల గరిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత భారీ పతనం నమోదైంది. 2026 జూన్ చివర్లో 58,642 డాలర్లకు పడిపోయింది. ప్రస్తుతం 80 వేల డాలర్లకు చేరువగా దూసుకెళుతోంది.





