
HYROX బీజింగ్ పోటీలో అథ్లెట్ మద్యలోనే మలవిసర్జన.. నెటిజన్లలో చర్చలు
hyrox బీజింగ్ ఫిట్నెస్ పోటీలో జరిగిన ఒక సంఘటన ప్రపంచవ్యాప్తంగా వివాదానికి దారితీస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన అథ్లెట్ జొవాన్నా వియెట్రిక్ ఈ సంఘటనలో ప్రధాన పాత్

hyrox బీజింగ్ ఫిట్నెస్ పోటీలో జరిగిన ఒక సంఘటన ప్రపంచవ్యాప్తంగా వివాదానికి దారితీస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన అథ్లెట్ జొవాన్నా వియెట్రిక్ ఈ సంఘటనలో ప్రధాన పాత్

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కాబోతుంది. వచ్చే ఆదివారం సాయంత్రం స్టార్ట్ కానుంది. దీనికి సంబంధించిన గ్రాండ్‌గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. గత సీజన్ల కంటే ఈ సీజన్‌ని చాలా ప్రత్యేకంగా మార్చబోతున్నారట. హౌజ్ నుంచి, కంటెస్టెంట్ల ఎంపిక, వచ్చే కంటెస్టెంట్లు, గేమ్స్, టాస్క్ లు ఇలా అన్ని కొత్తగా ఉండబోతున్నాయని, ఎంటర్టైన్మెంట్ 10 టైమ్స్ అనేలా ప్లాన్ చేస్తున్నట్టు నాగార్జున ప్రోమోల్లో చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షో పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సారి చాలా వరకు తెలిసిన కంటెస్టెంట్లని ఎంపిక చేశారట. సెలబ్రిటీ విభాగంలో చాలా వరకు తెలిసిన వాళ్లే వస్తున్నారని సమాచారం. గతంలో సగం తెలియని వారు ఉండేది. ఇన్ఫ్లూయెన్సర్లు, సినిమా, టీవీకి సంబంధం లేని వారు, ఇతర రంగాలకు చెందిన వాళ్లు ఉండేవారు. కానీ ఈ సారి చాలా వరకు ఎంటర్టైన్మెంట్ రంగానికి పరిచయం ఉన్నవాళ్లే వస్తున్నారట. అందులో ప్రముఖంగా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లు ఆల్మోస్ట్ కన్ఫమ్ అంటున్నారు. ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లోకి సెలబ్రిటీలు, కామనర్స్ కలిపి దాదాపు 16 మంది కంటెస్టెంట్లు రాబోతున్నారట. వీరిలో పది మంది సెలబ్రిటీలు, 6 కామనర్స్ ఉంటారని సమాచారం. వీరిలో సెలబ్రిటీ విభాగంలో టెంపర్ వంశీ, రామ్ ప్రసాద్, జబర్దస్త్ నరేష్, అదిత్(త్రిగుణ్), యాంకర్ వర్షిణి సౌందరాజన్, ముఖేష్ గౌడ, కృష్ణుడు, నటి చైత్ర రాయ్, సుధీర్ రెడ్డి, దేబ్జానీ వంటి సెలబ్రిటీ కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌజ్‌కి ఎంపిక చేశారట. ప్రస్తుతం వీరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే నిజమే అయితే హౌజ్ ఈ సారి యమ రంజుగా ఉండబోతుందని చెప్పొచ్చు. గ్లామర్‌కి గ్లామర్, కామెడీకి కామెడీ, ఫైట్లకి ఫైట్లు గట్టిగానే ఉంటాయని చెప్పొచ్చు. ఇక కామనర్స్ విభాగంలో సింగర్ ఝాన్సీ, రోహిత్, షాలిని

అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మిస్‌వరల్డ్ అందాల పోటీల గ్రాండ్ ఫినాలో సెప్టెంబర్ 5, 2026న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అందాల భామ ఉజ్జయినికి చెందిన నికితా పోర్వాల్పైనే అందరి ఆశాలు, ఆకాంక్షలు. ఈ బ్యూటీ కేవలం అందగత్తె మాత్రం కాదు తనలో నటి కూడా ఉందంటూ వెండితెరపై మెరిసింది కూడా. ఆమె సంజీవ్ సింగ్ పర్మార్ నిర్మించి, దర్శకత్వం వహించిన బ్రిజ్ భాషా చలనచిత్రం 'చంబల్ పార్'లో నటించింది. నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఆస్ట్రేలియా సందర్భంగా అరాలూయెన్ సెంటర్లో ఈ చిత్రం ప్రీమియర్ ప్రదర్శన జరుపుకుంది. ఇది త్వరలో భారత్‌లో కూడా విడుదలకానుంది. అందాల పోటీల్లో పాల్గొనేవారు కేవలం గ్లామర్‌కే పరిమితం కాదని, అభినయంలో కూడా సత్తా చాటగలరని చూపించడమే తన ధ్యేయమని అంటోంది నికితా. ఆ విషయంలో తనకు ప్రియాంక చోప్రా ఆదర్శం అని చెబుతోంది. ఎందుకుంటే ఆమె బరేలి నుంచి సినీ ఇండస్ట్రీకి వచ్చి ఎలాంటి గాడ్‌ఫాదర్స్ అండ దండ లేకుండా అంచలంచెలుగా ఎదిగి తనదైన ముద్ర వేసిందని అన్నారామె. ఇక నికితా కూడా త్వరలో కన్నడ చిత్రసీమలో అరంగేట్రం చేయనున్నారు. అంతేగాదు ఆమెకు కథలు చెప్పడంలో కూడా మంచి నైపుణ్యం ఉంది. ఆమె ఇటీవలే కృష్ణ లీల' అనే పేరుతో 250 పేజీల రచన చేసినట్లు సమాచారం ఇక మిస్ ఇండియా ఆర్గనైజేషన్ సైతం నికితాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చింది. ఫెమినా మిస్ ఇండియా వేదిక నుంచి అత్యున్నత ప్రపంచ వేదిక వరకు నికితాపోర్వాల్ తన మిస్ వరల్డ్ ప్రయాణంలో ప్రతి అడుగులో భారతదేశ స్ఫూర్తిని, బలాన్ని, కథను ముందుకు తీసుకువెళ్లారు. ఈ 75వ మిస్ వరల్డ్ పోటీల్లో ప్రపంచ వేదికపై లక్షలాది ఆశలు, ఆశీస్సులు, అభినందనలను స్వదేశం నుంచి వియత్నాం వరకు ఆమెతోపాటు వస్తాయని పేర్కొంది. కాగా నిఖితా పోర్వాల్ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి

Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ ఇంట్లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్లలో కొందరు ఆటతో గుర్తింపు తెచ్చుకుంటే.. మరికొందరు తమ వ్యక్తిత్వం, గ్లామర్, సోషల్ మీడియా క్రేజ్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తారు. ఇప్పుడు బిగ్‌బాస్ తెలుగు పదో సీజన్‌కు సంబంధించి వినిపిస్తున్న పేర్లలో వర్షిణి సౌందరరాజన్ పేరు మాత్రం ప్రత్యేకంగా వినిపిస్తోంది. సీజన్ ప్రారంభానికి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో, ఎవరు హౌస్‌లోకి వెళ్లబోతున్నారనే ఆతృత ప్రేక్షకుల్లో రోజురోజుకూ పెరుగుతోంది. బిగ్‌బాస్ 10 తెలుగు సీజన్లో సినీ రంగానికి చెందినవారితో పాటు టెలివిజన్ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కలగలిపిన కంటెస్టెంట్ల జాబితా ఉండే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలువురు పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పురుష కంటెస్టెంట్లలో కొంతమంది పేర్లు ప్రేక్షకులకు ముందే పరిచయం ఉన్నప్పటికీ, మహిళా కంటెస్టెంట్లలో వర్షిణి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ప్రతి బిగ్‌బాస్ తెలుగు సీజన్లోనూ ప్రేక్షకుల కంట్లో ఎవరో ఒకరు పాపులర్ అవుతుంటారు. వారి ఆటతీరు మాత్రమే కాకుండా వ్యక్తిత్వం, మాట్లాడే విధానం, స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామర్ కూడా హౌస్‌లో వారి గుర్తింపును పెంచుతాయి. ఈసారి ఆ స్థానం వర్షిణికి దక్కవచ్చనే అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆమెకు సోషల్ మీడియాలో ఉన్న ఫేమ్ కూడా దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వర్షిణి సౌందరరాజన్ ఇప్పటికే సినీ, టెలివిజన్ రంగాల్లో ప్రేక్షకులకు పరిచయమైన ముఖమే. పలువురు ప్రముఖ హీరోలతో కలిసి సినిమాల్లో నటించిన ఆమెకు వెండితెర అనుభవం ఉంది. అయితే ఆమెకు మంచి గుర్తింపు తీసుకురావడంలో టెలివిజన్, సోషల్ మీడియా మరింత కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా యూత్ లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వర్షిణిని దాదాపు 20 లక్షల మంది ఫాలో అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. తన గ్లామరస్ సోషల్ మీడియా పోస్టులతో ఆమె డిజిటల్ ప్రేక్షకుల్లోనూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. దీంతో బిగ్‌బాస్ హౌస్‌లోకి ఆమె ప్రవేశిస్తే

బిగ్ బాస్ అగ్నిపరీక్షలో తన ప్రయాణం, అనుభవాలపై మాజీ కంటెస్టెంట్ గాయత్రి ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అగ్నిపరీక్షలో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఆమె ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. సింగిల్ పేరెంట్ పెంపకంలో పెరిగిన పిల్లల శక్తిని, వారి తల్లిదండ్రుల త్యాగాలను సమాజానికి చాటిచెప్పాలనేదే తన అసలు లక్ష్యమని గాయత్రి చెప్పుకొచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ముందుగా గాయత్రి తన వ్యక్తిగత నేపథ్యాన్ని పంచుకుంటూ, ఖమ్మం స్వస్థలమని, తనకు ఒక సంవత్సరం వయసున్నప్పుడే తన తల్లిదండ్రులు విడిపోయారని తెలిపారు. తన తల్లి ఒక బ్యూటీషియన్ మరియు టైలర్‌గా పనిచేస్తూ, ఎన్నో కష్టాలను ఎదుర్కొని తనను పెంచిందని చెప్పారు. ఆమె తల్లి చేసిన త్యాగాలు, ఇచ్చిన ప్రోత్సాహం వల్లే కెనడాలో మాస్టర్స్ చదువు పూర్తి చేయగలిగానని అన్నారు. ఇండస్ట్రీలోకి రావాలనే తన నిర్ణయాన్ని తల్లి మొదట వ్యతిరేకించినా, తర్వాత అంగీకరించారని, తన ఆరోగ్య సమస్యలు, తల్లి ఒంటరితనం కారణంగా విదేశాల నుండి తిరిగి వచ్చానని తెలిపారు. నేను మాట్లాడిన మాట ప్రజల్లోకి వల్గర్‌గా వెళ్ళింది.. నా వల్ల ఆ స్టార్ డైరెక్టర్ మాటలు పడ్డారు.. బిగ్ బాస్ అగ్నిపరీక్షలో ఎదురైన సవాళ్ళను, ముఖ్యంగా క్లిప్స్ టాస్క్‌ను గాయత్రి వివరించారు. ఈ టాస్క్‌లో తన చర్మం సున్నితత్వం కారణంగా క్లిప్స్ పెట్టుకోవడం అత్యంత బాధాకరంగా మారిందని ఆమె పేర్కొన్నారు. విపరీతమైన నొప్పి, రక్త ప్రసరణ ఆగిపోవడం, వణుకు వచ్చిందని, దాదాపు ఫిట్స్ వచ్చినంత పని అయిందని తెలిపారు. ఈ క్లిప్స్ తీయడానికి తోటి కంటెస్టెంట్లు అభిజిత్, నవదీప్, శ్రీముఖి తదితరులు ముందుకు వచ్చి సహాయం చేశారని, ముఖ్యంగా అభిజిత్ తన కాళ్ళకు ఉన్న క్లిప్స్ తీయడంలో తోడ్పడ్డారని చెప్పారు. Anand Deverakonda: అసలు ఎపిక్ సినిమా అంటే అదే.. ఆ సీన్లో కన్నీళ్లు పెట్టుకున్నా: ఆనంద్ దేవరకొండ ఈ ఒక్క టాస్క్‌లో గెలవలేకపోయినా, తనను టాప్ 15లో ఎంపిక చేయడానికి కేవలం

తెలుగు బుల్లితెరపై అత్యంత జనాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ ల్యాండ్‌మార్క్ ఎడిషన్ సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు స్టార్ మా మరియు జియోహాట్‌స్టార్‌లో ప్రారంభం కానుంది. ఈసారి దశావతారం థీమ్‌తో షోను రూపొందించినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ క్రమంలోనే తొలి వారంలో 10 మంది కంటెస్టెంట్లు మాత్రమే హౌస్‌లోకి అడుగుపెడతారనే వార్తలు బయటకు వచ్చాయి. ఈ సీజన్ 10 ప్రత్యేకతల గురించి నాగార్జున విడుదల చేసిన ప్రోమోలో ఆటలో సవాలు కాదు ఆటే సవాలు అంటూ 10X సర్ప్రైజెస్ ఉంటాయని స్పష్టం చేశారు. సీజన్ 3 నుంచి విజయవంతంగా హోస్టింగ్ చేస్తున్న నాగార్జున, ఈసారి మరింత కొత్తదనంతో అలరించబోతున్నారు. రోజువారీ ఎపిసోడ్లు ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుంచి ప్రసారం కానున్నాయని మీడియా వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రచార చిత్రాలు ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమవుతున్నాయి. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో 10 మంది రూమర్డ్ కంటెస్టెంట్ల పేర్లు బాగా ప్రచారంలో ఉన్నాయి. టీవీ నటి చైత్ర రాయ్, యాంకర్ వర్షిణి, ముఖేష్ గౌడ, సినీ నటుడు కృష్ణుడు, టెంపర్ వంశీతో పాటు జబర్దస్త్ నటులు నరేష్, ఆటో రామ్‌ప్రసాద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీంతో పాటు అదిత్ అరుణ్, దేబ్జానీ మోదక్, యూట్యూబర్ సుధీర్ రెడ్డి హౌస్‌లోకి వెళ్తున్నారనే ప్రచారం గట్టిగా సాగుతోంది. అయితే ఈ జాబితాపై మేకర్స్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలలో రామ్‌ప్రసాద్, నరేష్ కనిపించకపోవడంతో వీరు షోలోకి వెళ్లడం ఖాయమనే ఊహాగానాలు పెరిగాయి. ఫలితంగా నటి దేబ్జానీ మోదక్‌కు వారానికి 4 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మరోవైపు జియోహాట్‌స్టార్‌లో సామాన్యుల ఎంపిక కోసం అగ్నిపరీక్ష సీజన్

‘అగ్నిపరీక్ష’ వేదికపై రాజకుమారి చెప్పిన కన్నీటి కథ అందరినీ కదిలించింది. ముగ్గురు పిల్లల కోసం ఆమె చేసిన పోరాటం వైరల్‌గా మారింది. బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీపై ఆసక్తి నెలకొంది. కష్టాల కడలిని దాటి.. కన్నీళ్లను దిగమింగి.. ముగ్గురు పిల్లల భవిష్యత్తు కోసం ఒంటరిగా పోరాడిన ఓ మహిళ కథ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజకుమారి (Rajakumari) జీవిత ప్రయాణం వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ఎన్నో అవమానాలు, అన్యాయాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ఆత్మవిశ్వాసంతో నిలబడిన ఆమె.. ‘అగ్నిపరీక్ష’ వేదికపై తన మాటలతో అందరినీ కదిలించింది. త్వరలో ప్రారంభం కానున్న ‘బిగ్‌బాస్ 10’ (Bigg Boss 10 Telugu) కోసం సామాన్యుల నుంచి కంటెస్టెంట్లను ఎంపిక చేస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న ‘అగ్నిపరీక్ష’ కార్యక్రమంలో నవదీప్, అభిజిత్, బిందు మాధవి జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. కంటెస్టెంట్లకు ఆసక్తికరమైన టాస్క్‌లు ఇస్తూ.. వారి ప్రతిభతో పాటు జీవిత కథలను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలో రాజకుమారి చెప్పిన తన జీవిత కథ ఇప్పుడు ప్రత్యేకంగా నిలిచింది. చిన్న వయసులోనే రాజకుమారికి ఇష్టం లేని పెళ్లి జరిగింది. ఆమె నల్లగా ఉందనే కారణంతో మొదటి భర్త మరో వివాహం చేసుకుని ఆమెకు తీవ్ర అన్యాయం చేశాడు. ఆ బాధ నుంచి కోలుకునేలోపే కుటుంబ సభ్యులు మరో పెళ్లి చేశారు. అయితే రెండో వివాహం కూడా ఆమెకు సంతోషాన్ని ఇవ్వలేదు. భర్త బాధ్యతలను వదిలేసి వెళ్లిపోవడంతో ముగ్గురు చిన్నారులతో కలిసి ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. చేతిలో డబ్బు లేదు.. ఉండేందుకు సరైన చోటు లేదు.. పిల్లలను చూసుకునే తోడు లేదు. అయినా రాజకుమారి కుంగిపోలేదు. పిల్లల ఆకలి కేకలు తనను మరింత బలంగా మార్చాయి. ఆత్మహత్య ఆలోచనలను పక్కన పెట్టి.. తన పిల్లల భవిష్యత్తు కోసం జీవితంతో పోరాడాలని నిర్ణయించుకుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ తన పిల్లలను పెంచేందుకు ఆమె సాగించిన

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న రియాలిటీ షో 'బిగ్‌బాస్' సరికొత్త హంగులతో పదో సీజన్‌తో సందడి చేసేందుకు సిద్ధమైంది. కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ సీజన్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈసారి షో మునుపటి కంటే భిన్నంగా, మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతోందని నిర్వాహకులు చెబుతున్నారు.ఈ సీజన్ గురించి నాగార్జున మాట్లాడుతూ, ఇది నెక్స్ట్ లెవల్లో ఉంటుందని, వెరైటీ, సర్ప్రైజ్లు, డ్రామా, సవాళ్లు పదింతలు అధికంగా ఉంటాయని తెలిపారు. ఈ సీజన్‌ను 'దశావతారం'గా అభివర్ణించిన ఆయన, ప్రతి వారం బిగ్‌బాస్ ఒక కొత్త అవతారం ఎత్తుతాడని, ఇది కంటెస్టెంట్లకు ఊహించని మలుపులను ఇస్తుందని అన్నారు. దీనికి తగ్గట్టుగానే “ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్” అనే కొత్త ట్యాగ్‌లైన్‌ను విడుదల చేశారు. ఈ ట్యాగ్‌లైన్ షో స్వరూపాన్నే మార్చేలా ఉందనిపిస్తోంది.ప్రస్తుతం కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ వేగంగా జరుగుతోంది. కొంతమంది సినీ, టీవీ నటీనటులను నేరుగా ఎంపిక చేయగా, సామాన్య ప్రజల కోసం 'అగ్నిపరీక్ష' పేరుతో ప్రత్యేక ఆడిషన్లు నిర్వహిస్తున్నారు. ఈ అగ్నిపరీక్షకు న్యాయనిర్ణేతలుగా బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు అయిన నవదీప్, బిందు మాధవి, అభిజీత్‌లు వ్యవహరిస్తున్నారు. వీరి పర్యవేక్షణలో సామాన్యుల నుంచి తుది జాబితాను ఖరారు చేయనున్నారు.అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని, బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుందని సమాచారం. సరికొత్త థీమ్, ఆసక్తికరమైన కంటెస్టెంట్లతో ఈ పదో సీజన్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాలి

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ముందు భోగాపురం ఎయిర్పోర్ట్ పైన బెస్ట్ తెలుగు స్లోగన్స్ పోటీ నిర్వహించారు. అంతేకాదు భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించిన రీల్స్, వీడియోస్ పోటీ కూడా నిర్వహించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యంత ప్రాచుర్యం తీసుకురావాలన్న ఉద్దేశంతో ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ముందు అనేక కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగానే లక్షల నగదు బహుమతులను ప్రకటించి భోగాపురం ఎయిర్పోర్ట్ పైన పోటీలను నిర్వహించారు. భోగాపురం నుంచి విమానాల రాకపోకల షెడ్యూల్- ఏ నగరానికి ఎప్పుడు..!!తెలుగు స్లోగన్స్ పోటీలో భారీగా పాల్గొన్న విద్యార్థులుఅయితే భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బెస్ట్ తెలుగు స్లొగన్స్ పోటీలలో విజేతలను విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామచంద్ర రెడ్డి వెల్లడించారు. ఆగస్టు ఒకటవ తేదీన విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ పోటీలలో ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందని మొత్తం ఆరువేల 199 మంది ఈ పోటీలో పాల్గొన్నారని, ఇద్దరికి ఓట్లు సమానంగా రావడంతో ఇద్దరిని విజేతలుగా ప్రకటించారు.భోగాపురం ఎయిర్ పోర్ట్ కు ఎలక్ట్రిక్ ఏసీ బస్సు సేవలకు ముహూర్తం ఫిక్స్!స్లోగన్స్ పోటీలో ఆరవతరగతి నుండి డిగ్రీ వరకు విద్యార్థులువీరిద్దరికి చెరో లక్ష రూపాయలు నగదు బహుమతి అందజేయనున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి అందరినీ ఆకట్టుకునే విధంగా తెలుగులో బెస్ట్ స్లొగన్స్ రూపొందించి పంపాలని ఆరవ తరగతి విద్యార్థుల నుండి డిగ్రీ వరకు చదువుకున్న విద్యార్థులకు అవకాశం కల్పించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పైన విమానాశ్రయ ప్రభావాన్ని, ప్రత్యేకతను గొప్పతనాన్ని తెలియజేసేలా సంక్షిప్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు ఈ స్లొగన్స్ కాంటెస్ట్ లో భారీ స్థాయిలో పోటీపడ్డారు.బెస్ట్ స్లోగన్స్ ఇవేపల్నాడు జిల్లా వినుకొండ కు చెందిన బి టెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని చెరుకూరి నాగసాయి లక్ష్మీ సూచించిన ఉత్తరాంధ్రకు మణిహారం స్వర్ణాంధ్రకు శ్రీకారం స్లోగన్ బెస్ట్ స్లోగన్ గా ఎంపిక అయింది. ఇది

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ప్రారంభానికి ముందు అదిరిపోయే షో వస్తోంది. అదే `అగ్నిపరీక్ష`. బిగ్ బాస్ హౌజ్‌లోకి పంపేందుకు కామనర్స్ ని ఎంపిక చేసేందుకు పెట్టిన మిని టెస్ట్ షో ఇది. ఇందులో కామనర్స్ నుంచి కొందరిని ఎంపిక చేసి టెస్ట్ చేస్తారు. వాళ్లు బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లేందుకు అర్హులా కాదా అనేది ముగ్గురు జడ్జ్ లు నిర్ణయిస్తారు. అభిజీత్, బిందు మాధవి, నవదీప్ జడ్జ్ లుగా ఈ అగ్నిపరీక్ష మిని షోస్ రన్ అవుతుంది. ఇది ఈ నెల 15 నుంచి స్టార్ మాలో, అలాగే జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అగ్నిపరీక్ష కోసం కామనర్స్ నుంచి సుమారు 70 మందిని ఎంపిక చేశారట. అందులో 45 మందిని షార్ట్ లిస్ట్ చేసినట్టు సమాచారం. వీరి నుంచి 15 మందిని రెండో దశలో ఫిల్టర్ చేసినట్టు సమాచారం. వీరి నుంచే హౌజ్‌లోకి పంపే కంటెస్టెంట్లని ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ నెల 15 నుంచి స్టార్ట్ కానున్న షోలో ఒక్కో కంటెస్టెంట్ ని పిలిచి వారిని టెస్ట్ చేస్తారు జడ్జ్ లు. వారు ఇంప్రెస్ అయితే ఎంపిక జరుగుతుంటుంది. అయితే దీనికి సంబంధించిన ప్రోమోలు విడుదల చేస్తున్నారు. కొందరు కంటెస్టెంట్లు జడ్జ్ లకే ఝలక్ ఇస్తుంటే, జడ్జ్ లు కంటెస్టెంట్లకి ఝలక్ ఇస్తున్నారు. అందులో భాగంగా ఒక అమ్మాయికి అభిజీత్ షాక్ ఇచ్చాడు. దెబ్బకి ఆమెకి ఉన్న తలపొగరు మొత్తం దిగిపోయింది. స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకుంది. అదేంటనేది చూస్తే, లెటస్ట్ ప్రోమోలో.. కరీంనగర్ నుంచి షాలిని దామెర అనే అమ్మాయి అగ్నిపరీక్ష స్టేజ్‌మీదకు వచ్చింది. ఆమె ఇటీవలే జిమ్ కూడా స్టార్ట్ చేసినా అని, కొంచెం కండ వచ్చిందని చెప్పింది. చూపించమని శ్రీముఖి అడగ్గా, తన చిన్న కండని చూపించింది. దీనికి నవదీప్ కౌంటర్ వేయడం నవ్వులు పూయించింది. అనంతరం బిందు మాధవి.. షూస్ క్లీన్

తెలుగులో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్న రియాల్టీ షోలలో బిగ్ బాస్ ఒకటి. తెలుగులో తొమ్మిది సీజన్స్ ని పూర్తి చేసుకొని ఇప్పుడు పదో సీజన్ కి రెడీ అయింది. ఇప్పటికే సామాన్యులను బిగ్ బాస్ కి తీసుకెళ్లే అగ్నిపరీక్ష కు ఆడిషన్స్ తీసుకొని అందులో పాల్గొనే వాళ్లకు ఫైనల్ పరీక్ష కూడా రెడీ అయింది. బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష ఆగస్టు 15 నుంచి స్టార్ మా ఛానల్ లో, జియో హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. దాదాపు 15 రోజుల పాటు బిగ్ బాస్ అగ్ని పరీక్ష సాగనుంది. దీంతో బిగ్ బాస్ ఫాలోవర్స్ అగ్ని పరీక్ష షో కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ షో టెలికాస్ట్ డేట్ లేక్ అయింది. టాలీవుడ్ సమాచారం ప్రకారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ 6 ఆదివారం నుంచి టెలికాస్ట్ మొదలవ్వనున్నట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ 6 ఆదివారం నాడు కంటెస్టెంట్స్ ని గ్రాండ్ గా హౌస్ లోకి పంపి సెప్టెంబర్ 7 నుంచి అసలైన అట మొదలు కానుంది. దాదాపు 15 వారాల పాటు ఈ షో సాగనుంది. స్టార్ మా ఛానల్ లో ప్రతిరోజు రాత్రి 9.30 గంటలకు, శని, ఆది వారాలు రాత్రి 9 గంటలకు బిగ్ బాస్ టెలికాస్ట్ అవ్వనుంది. జియో హాట్ స్టార్ ఓటీటీలో కూడా ఈ షో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈసారి కూడా నాగార్జునే బిగ్ బాస్ ని హోస్ట్ చేయబోతున్నారు. మరి ఈసారి బిగ్ బాస్ లోకి వచ్చే సెలబ్రిటీలు, సామాన్యులు ఎవరో చూడాలంటే ఇంకో నెల రోజులు ఎదురు చూడాల్సిందే. డ్యూటీకి డుమ్మా కొట్టి.. ప్రైవేటు డాక్టర్ని పెట్టి.. బైటపడ్డ ప్రభుత్వ డాక్టర్ బాగోతం..! ట్రాక్‌పై దూసుకెళ్తున్న రైలు.. ఒక్కసారిగా ఊడిపోయిన చక్రాలు యూపీఐ ఛార్జీలపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన రిటైరైనా తగ్గని క్రేజ్.. బ్రాండ్