
Future City | బ్రదర్స్ కోసమే రేవంత్ ఫ్యూచర్ సిటీ.. అనుముల సోదరులకు అప్పనంగా దోచిపెడ్తున్న సర్కార్
Future City | బ్రదర్స్ కోసమే రేవంత్ ఫ్యూచర్ సిటీ.. అనుముల సోదరులకు అప్పనంగా దోచిపెడ్తున్న సర్కార్

Future City | బ్రదర్స్ కోసమే రేవంత్ ఫ్యూచర్ సిటీ.. అనుముల సోదరులకు అప్పనంగా దోచిపెడ్తున్న సర్కార్

చెట్ల కొమ్మల తొలగింపు, నిర్వహణ పనుల కారణంగా గ్రీన్‌పార్క్ ఫీడర్ పరిధిలోని కొన్ని ఏరియాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్: చెట్ల కొమ్మల తొలగింపు, నిర్వహణ పనుల కారణంగా గ్రీన్‌పార్క్ ఫీడర్ పరిధిలోని కాప్రా, శాంతివిహార్ కాలనీ, గ్రీన్‌పార్క్, అశోక్ కాలనీ, రామ్దాస్నగర్ పరిసర ప్రాంతాలలో గురువారం ఉదయం 10 నుంచి 12గంటల వరకు, లక్ష్మీపురం ఫీడర్ పరిధిలోని రుక్మిణీపురి, అయోధ్యనగర్, నయాక్రాంతినగర్, త్యాగరాయనగర్, లక్ష్మీపురం, బృందావన్ కాలనీ పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, జనప్రియ ఫీడర్ పరిధిలోని జనప్రియ టౌన్‌షి్‌ప పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని సైనిక్‌పురి సెక్షన్ ఏఈ సత్యనారాయణ తెలిపారు. కొనసాగుతున్న ధరల పతనం.. 3 రోజుల్లో రూ.6 వేల పైచిలుకు మేర తగ్గుదల

ఆగస్టు నెల అంటేనే వర్షాలు, పచ్చదనంతో ప్రశాంతంగా ఉండాల్సిన సమయం. కానీ, ఈ ఏడాది పరిస్థితి బొత్తిగా మారపోయింది! భానుడి భగభగలకు 125 సంవత్సరాల వాతావరణ చరిత్ర తలకిందులైంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవడంతో దేశవ్యాప్తంగా కరెంట్ వాడకం అనూహ్యంగా పెరిగింది. ఫలితంగా గత ఐదేళ్లలోనే ఎన్నడూ లేని విధంగా ఆగస్టు నెలలో విద్యుత్ వినియోగం సరికొత్త రికార్డులను తిరగరాసింది. ఒకవైపు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, మరోవైపు ఏకిపారేస్తున్న విద్యుత్ డిమాండ్‌తో దేశంలోని విద్యుత్ సరఫరా వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది.వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం 1901 తర్వాత.. అంటే గత 125 సంవత్సరాలలో భారతదేశంలో నమోదైన అత్యంత వేడి కలిగిన ఆగస్టు నెలగా ఈ ఏడాది ఆగస్టు నిలిచింది. పగటి పూట ఎండలతో పాటు రాత్రి పూట కూడా సగటు కనిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కావడం గమనార్హం. ఉక్కపోత, తేమ శాతం తీవ్రంగా పెరగడంతో ఇళ్లల్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నిరంతరాయంగా నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా రాత్రిపూట కరెంట్ వాడకం తగ్గుతుందని భావిస్తారు, కానీ ఈసారి రాత్రివేళల్లో కూడా ఏసీల వాడకం విపరీతంగా పెరగడం విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోవడానికి ప్రధాన కారణమైంది.గత ఐదేళ్ల రికార్డులన్నీ గాల్లోకి!కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ మరియు ఎన్ఎల్డీసీ లెక్కల ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టులో గరిష్ట విద్యుత్ డిమాండ్ ఏకంగా 258.27 గిగావాట్లకు చేరింది. గత ఏడాది ఆగస్టులో నమోదైన 229.72 గిగావాట్లతో పోలిస్తే ఇది ఏకంగా 12.4 శాతం ఎక్కువ. ఇక మొత్తం కరెంట్ వినియోగం చూసుకుంటే 169.01 బిలియన్ యూనిట్లకు చేరుకుని 12.85 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. మే నెలలో నమోదైన ఆల్ టైమ్ హై (270.82 GW) తర్వాత, ఈ స్థాయిలో కరెంట్ డిమాండ్ పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.ఎల్ నినో దెబ్బకు అమెజాన్, దాని ఉప నదులు

తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగిస్తున్న పలు ఎక్స్ ప్రెస్ రైళ్లకు హైదరాబాద్ హైటెక్ సిటీ నుంచి మంచి ఆదరణ ఉంటుంది. ఇక్కడి ఐటీ ఉద్యోగులు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ (Hi-Tech City Station) నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ స్టేషన్లో పలు రైళ్లకు స్టాప్ కోసం రైల్వే శాఖ వద్ద వినతులు వస్తూనే ఉన్నాయి. దీంతో రైల్వేశాఖ ఎప్పటికప్పుడు పలు రైళ్లకు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ లో స్టాప్ ఇచ్చే విషయంలో నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది.ఉత్తరాంధ్రలో 14 రైళ్ల టైమింగ్స్ మార్పు..! స్టేషన్ల వారీగా ఇలా..!ఇదే క్రమంలో ఇప్పటికే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తున్న నాలుగు ఎక్స్ ప్రెస్ రైళ్లకు గతంలో ఇచ్చిన తాత్కాలిక స్టాప్ ను పొడిగించాలని దక్షిణ కోస్తా రైల్వే నిర్ణయించింది. వీటిలో నరసాపురం-లింగంపల్లి ఎక్స్ ప్రెస్ (17255), లింగంపల్లి-నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ (17256), కాకినాడ టౌన్-లింగంపల్లి కోకనాడ ఎక్స్ ప్రెస్ (12775), లింగంపల్లి-కాకినాడ టౌన్ కోకనాడ ఎక్స్ ప్రెస్ (12776) రైళ్లు ఉన్నాయి. వీటికి ప్రస్తుతం ఉన్న తాత్కాలిక స్టాప్ ను పొడిగించారు. Visakhapatnam–LTT Express: విశాఖ-లోక్ మాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ కు కొత్త స్టాప్..!నరసాపురం-లింగంపల్లి ఎక్స్ ప్రెస్ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ లో ప్రతీరోజూ తెల్లవారుజామున 4.45కు ఆగనుంది. అలాగే లింగంపల్లి-నరసాపురం ఎక్స్ ప్రెస్ రైలు రాత్రి 9.08కి ఆగనుంది. కాకినాడ-లింగంపల్లి కోకనాడ ఎక్స్ ప్రెస్ ఉదయం 7.10కి ఆగనుంది. ఈ మూడు రైళ్లూ అక్టోబర్ 27 నుంచి నవంబర్ 10 వరకూ హైటెక్ సిటీ స్టేషన్లో ప్రతీ రోజూ ఆగుతాయి. అలాగే లింగంపల్లి-కాకినాడ టౌన్ కోకనాడ ఎక్స్ ప్రెస్ రైలు రాత్రి 7.08కి ఆగనుంది. ఈ రైలు డిసెంబర్ 18 నుంచి వచ్చే ఏడాది జనవరి 19 వరకూ ఆగేలా స్టాప్ ఇచ్చారు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Meat shops closed in Hyderabad city on September 4: ప్రస్తుతం మనం శ్రావణ మాసంలో ఉన్నాం. ఈనెలలో ప్రతి రోజు ఏదో ఒక పండగను మనం జరుపుకుంటాం. అయితే.. సెప్టెంబర్ 4న మనం జన్మాష్టమిని భక్తి శ్రద్దలతో జరుపుకుంటాం. శ్రీకృష్ణ జన్మాష్టమి హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.ఈ రోజున చాలా మంది ఉపవాసాలు ఉంటారు. విష్ణుమూర్తి ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని గ్రాండ్ గా నిర్వహిస్తారు. పలు చోట్ల దహి హండీ ఉట్టి కొట్టే వేడుకను నిర్వహిస్తారు. తమ పిల్లలకు చిన్నారి శ్రీకృష్ణుడు, రాధలా కాస్ట్యూమ్ లు వేసి పొంగిపోతారు. శ్రీకృష్ణుడు అర్ధరాత్రి సమయంలో జన్మించాడనే విశ్వాసంతో రాత్రి వేళ పూజలు నిర్వహిస్తారు. ఈ రోజు అష్టమి, రోహిణి తిథి ఉండేలా చూసుకుంటారు. ఈసారి సెప్టెంబర్ 4, శుక్రవారం రోజునే జన్మాష్టమి వేడుకలు నిర్వహించాలని పండితులు సూచిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ పరిధిలో కూడా జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 4న చికెన్, మటన్ అమ్మకాలపై ఒక రోజు నిషేధం విధిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. Read more: Konda Surekha: నన్ను ఎవరు పిలువలేదు.. నేనే వచ్చా... ఉత్కంఠ వేళ కొండంత ట్విస్ట్ ఇచ్చిన మంత్రి సురేఖ..! ఈ మేరకు రిటైల్, చికెన్, మటన్ షాపులు, పశువధ శాలలన్ని మూసి వేసి ఉంచాలని అధికారులు తెల్చి చెప్పారు. ఎవరైన రహస్యంగా మాంసం అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అంతే కాకుండా జన్మాష్టమి రోజున ప్రత్యేకంగా తనిఖీలు చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ వాసులు

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Womens Turn Waste Into Wealth: చెత్త.. అనే పదం వినగానే అందరూ ముక్కు మూసుకుంటూ ఉంటారు.. అలాంటిది ఆ చెత్తనే తమ సంపాదనగా మార్చుకున్నారు త్రిపుర రాష్ట్రంలోని కోవాయ్ పట్టణానికి సంబంధించిన 100 మంది మహిళలు.. ఒకప్పుడు సమాజంలో చెత్త ఏరుకునే వారు అని పిలుచుకుంటూ అగౌరవానికి గురైన వారు.. ఇప్పుడు ఏకంగా ఒక వ్యవస్థకే యజమానులుగా మారారు.. వారి కృషితో ఇప్పుడు పట్టణం చెత్త కుండీలు లేని నగరంగా మారిపోయి దేశానికే ఆదర్శనీయంగా నిలిచింది. పింకీ కర్ దేబ్ అని మహిళ గత తొమ్మిదేళ్లుగా చెత్తను సేకరించే పని చేసే వారట.. ఎలాంటి గ్లౌజులు లేకుండా.. చేతులతోనే చెత్తను వేరు చేసేదట.. మురుగు వాసన వచ్చే ఆ చెత్తలో పని చేస్తుంటే.. అటుగా వెళ్లే వారంతా ముక్కున వేలేసుకునే వారట.. కానీ నేడు పరిస్థితి ఊహించని స్థాయిలో మారింది.. పింకీ ఇప్పుడు ఒక చెత్త నిర్వాహణ కేంద్రానికి ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టింది.. మాస్క్ లేకుండా దర్జాగా తన ఆఫీసులో కూర్చుని భోజనం చేస్తున్నారు. ఆమె ఒక కార్మికురాని స్థాయి నుంచి ఓనర్ స్థాయికి ఎదిగారు.. ఈ మార్పు వెనక ఒక ఐఏఎస్ అధికారి ఆలోచన కూడా ఉంది. కోవాయ్ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) నిర్మల్ కుమార్ ఒకసారి గుజరాత్ లోని అముల్ కోఆపరేషన్ సందర్శించింది.. అదే తరహాలో పారిశుద్ధ్య కార్మికులతో ఎందుకు ఒక సొసైటీని ఏర్పాటు చేయకూడదు అన్న ఆయన ఆలోచనే..కోవాయ్ వేస్ట్ టు వెల్త్ ప్రొడ్యూసర్ సొసైటీ

రైతులను అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు నాటకాలు ఆడుతున్నారని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. రైతులకు సాగు, తాగు నీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయడానికి ప్రణాళికలు వేస్తున్నామని ఆయన తెలిపారు. వైసీపీ నేతల మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం, సెప్టెంబర్ 2: శ్రీశైలం జలాల కోసం వెలుగోడు రిజర్వాయర్ ముట్టడి పేరుతో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ఆయన కొడుకు రవి కిషోర్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఎల్ నినో ప్రభావం వల్ల నీరు వచ్చే పరిస్థితి లేదని, అందువల్ల ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని ఆరు నెలల క్రితమే స్పష్టం చేశామని ఆయన పేర్కొన్నారు. కానీ వైసీపీ నాయకులు రైతులను అడ్డం పెట్టుకుని శ్రీశైలం జలాల కోసం పోరాటాలు చేయడం రైతులను తప్పుదోవ పట్టించడమే అవుతుందని ఆయన అన్నారు. తమ ఉనికిని కాపాడుకోవడం కోసం రైతులను అడ్డుపెట్టుకుని డ్రామాలు చేయడం సమంజసం కాదని హితవు పలికారు. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే వైసీపీ హయాంలో రైతుల సంక్షేమం కోసం ఏం చేశారో చెప్పాలని రాజశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. శిల్పా చక్రపాణి రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు రైతులకు నీళ్లు ఇచ్చారో చెప్పాలని ఆయన నిలదీశారు. ‘వైసీపీ ప్రభుత్వ హయాంలో కర్నూలులో నీటి సమస్యలను పరిష్కరించాలని అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ దగ్గరికి వెళ్తే మీరేం చేశారు.. పోలీసులతో రైతులను అడ్డగించలేదా..? ఆనాడు ఏం అయింది మీ చిత్తశుద్ధి?’ అని ఎమ్మెల్యే నిలదీశారు. పిఠాపురం అభివృద్ధిపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్ సత్ఫలితాలిస్తున్న అక్షర ఆంధ్ర... సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నాం: మంత్రి లోకేశ్ ఏపీలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు: మంత్రి ఆనం

న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ కూడలిలో ఇటీవల జరిగిన దాడిలో మరణించిన మహిళను బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్‌ప్రెసిడెంట్ ఎరిన్ పియాసెంటిగా అధికారులు గుర్తించారు. ఇంటర్నెట్ డెస్క్: న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ కూడలిలో ఇటీవల జరిగిన దాడిలో మరణించిన మహిళను బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్‌ప్రెసిడెంట్ ఎరిన్ పియాసెంటిగా అధికారులు గుర్తించారు. మంగళవారం ఈ దాడి జరిగిన విషయం తెలిసిందే. క్వీన్స్‌కు చెందిన ఓ 49 ఏళ్ల మహిళ టైమ్స్ స్క్వేర్ వద్దకు రెండు కత్తులతో వచ్చి అక్కడున్న ఎరిన్‌తో పాటు మరో వ్యక్తిని కత్తితో పొడిచింది. ఈ ఘటనలో ఎరిన్ కన్నుమూశారు. తీవ్రగాయాలపాలైన మరో వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్నతస్థానంలో ఉన్న ఎరిన్ ఇటీవల ఓ బిడ్డకు తల్లయ్యారు. ఇంతలో అనూహ్యంగా ఆమె మరణించడంతో ఆ కుటుంబం విషాదంలో కూరుకుపోయింది. ఎరిన్ మృతిపై బ్యాంక్ ఆఫ్ అమెరికా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా యూఎస్‌లో రెండో అతిపెద్ద బ్యాంకు అన్న విషయం తెలిసిందే. కత్తులతో దాడికి పాల్పడ్డ మహిళ కూడా పోలీసు కాల్పుల్లో కన్నుమూసింది. ఆమెను పామెలా సిస్నెరోస్‌గా (49) పోలీసులు గుర్తించారు. పామెలాకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, ఆమెకు మానసిక ఆరోగ్యం సరిగా లేదని పోలీసులు తెలిపారు. గతంలో ఓసారి ఆమెపై ఫిర్యాదు వచ్చినా కేసులు మాత్రం నమోదు కాలేదని చెప్పారు. పామెలా దశాబ్దాలుగా మానసిక సమస్యలతో బాధపడుతోందని ఆమె సోదరుడు చెప్పాడు. అయితే, ఇప్పటివరకూ ఏనాడు ఆమె హింసాత్మక ధోరణి కనబరచలేదని అన్నాడు. నాటో సదస్సు సందర్భంగా ట్రంప్ విమానం మార్పుపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. నేపాల్‌ను వణికిస్తున్న వర్షాలు.. ప్రమాదకర స్థాయిలో నదుల ప్రవాహం

హైటెక్ సిటీలో రైళ్ల నిలుపుదల అదనపు చార్జీలు లేని సౌకర్యం చార్లపల్లి నుండి ప్రత్యేక రైళ్లు Hitech City Railway Station: పండుగ సీజన్లలో ప్రయాణికుల తీవ్ర రద్దీని తట్టుకునేందుకు, ఐటీ కారిడార్ వాసులకు ప్రయాణ సౌలభ్యం కల్పించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. లింగంపల్లి, సికింద్రాబాద్ ప్రధాన రైల్వే స్టేషన్లపై ప్రయాణికుల ఒత్తిడిని తగ్గించేందుకు గాను హైటెక్ సిటీ రైల్వే స్టేషన్(Hitech City Railway Station)లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల తాత్కాలిక నిలుపుదలను మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి పండుగల సమయంలో ప్రయాణించే వారికి ఈ నిర్ణయం ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుందని రైల్వే శాఖ తెలిపింది. Ponnam Prabhakar: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. 700 ప్రత్యేక బస్సులతో ఆర్టీసీ ధమాకా.. మంత్రి పొన్నం కీలక ఆదేశాలు రెండు విడతల్లో స్టాపింగ్స్: అదనపు చార్జీలు లేకుండా మార్పు: నరసాపూర్ - లింగంపల్లి, కాకినాడ టౌన్ - లింగంపల్లి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హైటెక్ సిటీలో స్టాపింగ్‌ను రెండు విడతల్లో పొడిగించారు. మొదటి విడతగా దసరా, దీపావళి రద్దీ కోసం అక్టోబర్ 27 నుంచి నవంబర్ 10 వరకు, రెండో విడతగా క్రిస్మస్, సంక్రాంతి కోసం డిసెంబర్ 18 నుంచి జనవరి 19 వరకు ఈ రైళ్లు ఆగుతాయి. లింగంపల్లి నుండి బోర్డింగ్ ఉన్న ప్రయాణికులు ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేకుండా తమ బోర్డింగ్ పాయింట్‌ను హైటెక్ సిటీకి సులభంగా మార్చుకోవచ్చని సూచించారు. చార్లపల్లి - తిరుచానూర్ ప్రత్యేక రైళ్లు: పండుగ ప్రయాణికులకు ఊరట: మరోవైపు ఆధ్యాత్మిక యాత్రికుల కోసం చార్లపల్లి - తిరుచానూర్ మధ్య ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. సెప్టెంబర్ 4న చార్లపల్లి నుండి, సెప్టెంబర్ 5న తిరుచానూర్ నుండి ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఇవి నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట

వేగంగా ఓల్డ్‌సిటీ మెట్రో కారిడార్ పనులు మొత్తం 888 ఆస్తుల్లో ఇప్పటి వరకు 833 సేకరణ ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు చర్యలు మరోవైపు ముమ్మరంగా కూల్చివేతలు హైదరాబాద్ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెట్రో రెండో దశ విస్తరణలోని ఓల్డ్‌సిటీ కారిడార్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నిర్మాణంలో భాగంగా కావాల్సిన భూసేకరణ ప్రక్రియ చివరి దశకు చేరింది. మరో 55 ప్రభావిత ఆస్తులను తీసుకుంటే కారిడార్ నిర్మాణానికి అడుగులు పడినట్లవుతుందని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) అధికారులు చెబుతున్నారు. నగరంలో రెండో దశ మెట్రో విస్తరణలో భాగంగా కారిడార్-6 కింద ఎంజీబీఎస్ - చాంద్రాయణగుట్ట వరకు (7.5 కిలోమీటర్లు) నిర్మాణాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్ (జేవీ) ప్రాతిపదికన రూ.2,741 కోట్లతో నిర్మాణాన్ని పూర్తి చేయనున్నాయి. అయితే నాగోల్ - శంషాబాద్ ఎయిర్‌పోర్టు (36.8 కిలోమీటర్ల) మార్గం తర్వాత పాతనగరం కారిడార్‌పైనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ‘ఇది ఓల్డ్‌సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు సభల్లో చెబుతూ వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రెండో దశ ప్రాజెక్టుకు సంబంధించిన డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)కు అనుమతి ఇచ్చిన వెంటనే ఈ మార్గంలోని పనులను ప్రారంభించేందుకు ఎదురుచూస్తోంది. ఇదిలా ఉండగా, ఫలక్‌నుమా ఆర్టీసీ ప్రాంగణంలో 2024 మార్చి 8న శంకుస్థాపన చేశారు. పరిహారం.. వెంటనే తొలగింపు ఇప్పటివరకు సేకరించిన ఆస్తుల్లో 60 శాతం కమర్షియల్ భవనాలు, 40 శాతం నివాస గృహాలున్నాయి. అయితే సేకరించిన ఆస్తులకు సంబంధించిన యజమానులకు పరిహారం అందిస్తున్న అధికారులు వెంటవెంటనే తొలగింపు పనులు చేపడుతున్నారు. ఆయా దారుల్లో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా చూస్తూ పొక్లెయినర్లతో తొలగిస్తూ శిథిలాలను దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు విద్యుత్ స్తంభాలు, వాటర్పైపులకు ప్రమాదం వాటిల్లకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా, తొలగింపు పనులను వివిధ శాఖల అధికారులు దగ్గరుండి

రాజధాని హైదరాబాద్‌ను భారతదేశంలోనే అతిపెద్ద గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల యూకే, అమెరికా పర్యటనల్లో సాధించిన పురోగతిపై ఉన్నతస్థాయి కమిటీ సోమవారం సీఎంకు నివేదిక సమర్పించింది. ఈ పర్యటనల ఫలితంగా ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలతో కీలక ఒప్పందాలు కుదిరినట్లు కమిటీ వెల్లడించింది.అమెరికాకు చెందిన నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ, యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ లండన్ భారత్‌లో తమ తొలి ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు అంగీకరించాయి. ముఖ్యంగా, నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ తన క్యాంపస్‌ను ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ప్రభుత్వ, కార్పొరేట్ అధికారుల కోసం ఎంసీఆర్హెచ్ఆర్డీలో స్వల్పకాలిక ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను ప్రారంభించేందుకు హార్వర్డ్ యూనివర్సిటీ కూడా అంగీకరించింది. ఈ కోర్సులు వచ్చే నవంబర్ నుంచే ప్రారంభం కానున్నాయి.సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆగస్టు 19 నుంచి 29 వరకు యూకే, యూఎస్‌లలో పర్యటించి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఎంఐటీ వంటి దిగ్గజ సంస్థలతో చర్చలు జరిపింది. ఈ చర్చల ఫలితంగా, ఆయా సంస్థల ప్రతినిధుల బృందాలు త్వరలోనే హైదరాబాద్‌లో పర్యటించి ఇక్కడి వసతులను పరిశీలించనున్నాయి. ఐటీ, ఫార్మా రంగాల్లో ఇప్పటికే ప్రత్యేక ముద్ర వేసిన హైదరాబాద్‌ను అంతర్జాతీయ విద్యా, నైపుణ్య కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు

విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టును తెరకెక్కించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై మాజీ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) ఇవాళ మరోసారి ఫైర్ అయ్యారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు కోసం పెట్టే భారీ ఖర్చును విమర్శిస్తూ ఆయన పోస్ట్ పెట్టారు. అలాగే ఇందులో నాలుగో వంతు పెడితే విజయవాడ ఎలా మారిపోతుందో కూడా వివరించారు. ప్రస్తుత లెక్కల బట్టి విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఖర్చు రూపాయలు 12వేల కోట్లు అని ప్రభుత్వం చెబుతోందని, ఇది పూర్తి అవటానికి సుమారు 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుందన్నారు. అప్పటికి దాని వ్యయం కచ్చితంగా రెట్టింపై 24 వేల కోట్లకు పెరుగుతుందన్నారు.Vijayawada Railway Station: విజయవాడ రైల్వే స్టేషన్ కు షాక్..! రూటు మార్చిన కేశినేని..!విజయవాడ నగరం ఒక్క చక్కటి నివాస యోగ్యమైన నగరంగా చేయటానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలైనటువంటి 24/7 సురక్షితమైన తాగునీరు, నాణ్యమైన, గుంతలు లేని రహదారులు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, వర్షపు నీటి పారుదల, వరద నివారణ, నిరంతర విద్యుత్ సరఫరా, వీధి దీపాలు, పరిశుభ్రత, చెత్త సేకరణ-శుద్ధి, సురక్షితమైన కాలిబాటలు, మెరుగైన ప్రజా రవాణా, ప్రభుత్వ ఆసుపత్రులు, అత్యవసర వైద్యసేవలు, నాణ్యమైన ప్రభుత్వ పాఠశాలలు, ఉద్యానవనాలు, ఆటస్థలాలు, ట్రాఫిక్ నిర్వహణ, వాహన నిలుపుదల సదుపాయాలు, ప్రజా మరుగుదొడ్లు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు అనుకూలమైన సదుపాయాలు, ప్రజా భద్రత, అగ్నిమాపక-అత్యవసర సేవలు, పచ్చదనం, కాలుష్య నియంత్రణ వంటి వాటిపై ప్రాజెక్టులో 25 శాతం ఖర్చుపెడితే సరిపోతుందన్నారు. విజయవాడకు మెట్రో రైల్ వరమా ? శాపమా ? - కేశినేని నాని ప్రశ్న..!ఇలా మెట్రో రైల్ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో 25 శాతం వెచ్చించి అందమైన, అన్ని వర్గాల వారికి ఆమోదకరమైన నివాస యోగ్యకరమైన సుందర విజయవాడగా తయారు చేసుకోవడం సబబా లేక మెట్రో రైల్ ప్రాజెక్ట్ చేయడం సబబా అని కేశినేని నాని ప్రశ్నించారు.

హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్ డివిజన్ పరిధిలో విద్యుత్ ఫీడర్ల మరమ్మతు పనులు నిమిత్తం శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని సీబీడీ ఏడీఈ జి.నాగేశ్వరరావు తెలిపారు. చిక్కడపల్లి(హైదరాబాద్): హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్ డివిజన్ పరిధిలో విద్యుత్ ఫీడర్ల మరమ్మతు పనులు నిమిత్తం శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని సీబీడీ ఏడీఈ జి.నాగేశ్వరరావు తెలిపారు. ఇందిరానగర్, నల్లకుంట 11 కేవీ విద్యుత్ ఫీడర్ల పరిధిలో ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు, నారాయణగూడ, ప్రివెంటివ్ మెడిసిన్ పరిధిలో 11.30 నుంచి 12.30 గంటల వరకు, రాఘవేంద్రస్వామి పరిధిలో 12 నుంచి 12.30 గంటల వరకు, కమలానగర్ పరిధిలో మధ్యాహ్నం 3 నుంచి 3.45 గంటలవరకు విద్యుత్ సరఫరా ఉండదని, వినియోగదారులు తమ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. సైదాబాద్: టీజీఎస్పీడీసీఎల్ ఆస్మాన్‌ఘడ్ డివిజన్ పరిధిలో మరమ్మతు పనుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరా ఉండదని డీఈ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. అలాగే 11కేవీ ఆనంద్ బిస్కెట్ ఫ్యాక్టరీ ఫీడర్.. లక్ష్మీనగర్ ఎక్స్ రోడ్డు, రామాలయం, వాణినగర్, పటేలమ్మ మడిగలు, ఆనంద్ బిస్కెట్ ఫ్యాక్టరీ, దోబీఘాట్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో 2 నుంచి 3 గంటల వరకు కరెంట్ ఉండదని పేర్కొన్నారు. సాదత్‌నగర్ ఫీడర్.. పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు. ఏఎస్రావు నగర్: చర్లపల్లి సాయినగర్ ఫీడర్లో సాంకేతిక మరమ్మతుల కారణంగా శనివారం ఆ ఫీడర్ పరిధిలోని ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30వరకు ఎంఆర్ఆర్ కాలనీ, కృష్ణారెడ్డినగర్, సుభా్‌షనగర్, రెడ్డికాలనీ, సాయినగర్, ఎన్ఎన్ కాలనీ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో కొత విధిస్తున్నట్లు ఏఈ టి.బాలరాజు ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు గమనించి తమతో సహకరించాలని ఆయన కోరారు. కాప్రా: విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా ఆర్టీసీ కాలనీ ఫీడర్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ, జెడ్టీఎస్ తిరుమలనగర్, హనుమాన్‌నగర్, డాక్టర్ కృష్ణానగర్

ఏపీలోని రెండు ప్రధాన నగరాలు విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్టుల్ని సాధ్యమైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వీటికి అవసరమైన డీపీఆర్ లను తయారు చేసి ఆమోదించడంతో పాటు భూసేకరణ వరకూ వెళ్లింది. ఇలాంటి తరుణంలో విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టు (Vijayawada Metro Rail Project) నిర్మాణంపై మాజీ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) ఓ కీలకమైన ప్రశ్న లేవనెత్తారు.కూటమి సర్కార్ లో సూపర్ సీఎం ? ఏ మంత్రి నిర్ణయం అయినా వీటో చేసే అధికారం..!విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం తాజాగా భూమిని సేకరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు రాకతో నగరం రూపు రేఖలు మారిపోతాయన్న అంచనాలు ఉన్నాయి. నగరంలోని ఏలూరు, బందరు రోడ్లలో రెండు కారిడార్లుగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు వల్ల పాత విజయవాడ నగరం హైదరాబాద్ తరహాలో పూర్తిగా మారిపోతుందన్న ఆందోళనలు ఉన్నాయి. వీటినే ఇంకాస్త ముందుకు తీసుకెళ్తూ కేశినేని నాని.. ఇవాళ ఈ ప్రాజెక్టు నగరానికి వరమా లేక శాపమా అనే ప్రశ్న సంధించారు. ఇంత చిన్న నగరానికి మెట్రో అవసరమా అని ఇప్పటికే ప్రశ్నిస్తున్న వారి వాదనకు కేశినేని ప్రశ్న ఊతమిచ్చేలా ఉంది. Vijayawada Railway Station: విజయవాడ రైల్వే స్టేషన్ కు షాక్..! రూటు మార్చిన కేశినేని..!రెండే ప్రధాన కమర్షియల్ రోడ్లు -బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు మాత్రమే వున్న విజయవాడ నగరానికి, విజయవాడ ప్రజలకు విజయవాడ మెట్రో రైల్ వరమా లేక శాపమా ? అని మాజీ ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్టు పెట్టారు. దీనిపై భిన్న స్పందనలు వస్తున్నాయి. కొందరు ఈ ప్రాజెక్టు వరమని, ఇంకొందరు శాపమని స్పందిస్తున్నారు. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుతో రాకతో నగరంలో జరిగే మార్పుల వల్ల ఎలాగో కొందరికి నష్టం తప్పదు. ఈ నేపథ్యంలో వారిని

హైదరాబాద్ నగరంలో కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ప్రతిష్టాత్మక హెచ్ సిటీ ప్రాజెక్టు పనుల నేపథ్యంలో ట్రాఫిక్ ను నియంత్రించడం కోసం వన్ వే విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారు. కెబిఆర్ పార్కు చుట్టూ అండర్ పాస్ లు, మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణ పనుల వల్ల రోడ్డు స్థలం తగ్గిపోవడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా వన్ వే విధానాన్ని తీసుకువచ్చారు.ట్రాఫిక్ సమస్యలను అధిగమించడం కోసం ముందస్తు ప్రణాళికరాబోయే ఒకటిన్నర నుండి రెండు సంవత్సరాల పాటు ఈ పనులు కొనసాగనున్న క్రమంలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడం కోసం ముందస్తు ప్రణాళికగా దీనిని అమలు చేస్తున్నారు. అయితే తాజాగా కేబీఆర్ పార్కు పరిసరాల్లో నూతనంగా అమలులోకి వచ్చిన వన్ వే ట్రాఫిక్ విధానాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ పరిశీలించారు. ఈరోజు ఉదయం 10గంటల సమయంలో ఎటువంటి ఆర్భాటం లేకుండా సివిల్ దుస్తుల్లో ఆయన బైక్ పైన ప్రయాణించారు.రోడ్ నెంబర్ 45 నుండి వన్ వే రూట్ చెక్ చేసిన సీపీ సజ్జనార్ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ట్రాఫిక్ విధానంలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనేది ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోడ్ నెంబర్ 45 నుండి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, వెంకటగిరి, కేబీఆర్ పార్క్ ప్రధాన గేటు, ముగ్ద జంక్షన్, బసవతారకం, అగ్రసేన్ చౌరస్తా, ఫిలింనగర్ జంక్షన్ మీదుగా తిరిగి రోడ్ నెంబర్ 45 వరకు రెండుసార్లు బైక్ పైన తిరుగుతూ ట్రాఫిక్ విధానాన్ని పరిశీలించారు.విధుల్లో ఉన్న పోలీసులతో మాట్లాడిన సీపీ ఆ తర్వాత మధ్యాహ్నం కూడా మరోసారి కొత్తగా అమలు చేస్తున్న వన్ వే ట్రాఫిక్ రోడ్డుపైన మరోమారు ట్రాఫిక్ ను క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేశారు. అక్కడ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందితో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వన్ వే ట్రాఫిక్ చాలా సాఫీగా సాగుతుందని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదని

పండగల సీజన్ వస్తుండటంతో దేశంలో ఉద్యోగ నియామకాల జోరు పెరగనుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఫెస్టివ్ హైరింగ్ 15 నుంచి 20 శాతం పెరుగుతుందని అంచనా. ఈ క్రమంలో 2 నుంచి 2.5 లక్షల వరకు తాత్కాలిక, గిగ్ ఉద్యోగాలు అందుబాటులోకి రావొచ్చని ఎన్ఎల్బీ సర్వీసెస్ నివేదిక వెల్లడించింది. ఈ-కామర్స్, క్విక్ కామర్స్, రిటైల్, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, ట్రావెల్, కన్జ్యూమర్ సర్వీసెస్ రంగాల్లో ఎక్కువ అవకాశాలు ఉండనున్నాయి.ఈసారి కంపెనీలు పండగల సీజన్‌కు ముందుగానే నియామకాలపై దృష్టి పెడుతున్నాయి. చివరి నిమిషంలో భారీగా ఉద్యోగులను తీసుకునే విధానానికి బదులుగా.. 12 నుంచి 14 వారాల ముందే సిబ్బంది ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. సంప్రదాయ ఉద్యోగ కేంద్రాలకే పరిమితం కాకుండా కొత్త ప్రాంతాల్లోనూ ప్రతిభ కోసం వెతుకుతున్నాయి. టెక్నాలజీ ఆధారిత, అవసరమైన వెంటనే పనిలో చేరగల సిబ్బందికి డిమాండ్ పెరుగుతోంది.డెలివరీ, వేర్‌హౌస్, ఫీల్డ్ ఆపరేషన్స్, హాస్పిటాలిటీ రంగాల్లో నియామకాలు ఎక్కువగా ఉండనున్నాయి. అదే సమయంలో డార్క్ స్టోర్ ఇన్వెంటరీ కంట్రోలర్లు, రిటర్న్స్-రిఫండ్స్ నిపుణులు, కస్టమర్ సపోర్ట్, మార్కెట్‌ప్లేస్ ఆపరేషన్స్, మోసాల నియంత్రణ, క్యాటలాగ్ మేనేజ్మెంట్, ఆర్డర్ మేనేజ్మెంట్ ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతోంది.ఈసారి టైర్-2, టైర్-3 నగరాలకూ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వెళ్లనున్నాయి. మొత్తం ఫెస్టివ్ హైరింగ్‌లో ఈ నగరాల వాటా 45 శాతం వరకు ఉండొచ్చని అంచనా. ఇక్కడ నియామకాలు 25 నుంచి 30 శాతం పెరగొచ్చని నివేదిక పేర్కొంది. జైపుర్, లక్నో, ఇండోర్, సూరత్, నాగ్‌పుర్, భువనేశ్వర్, కోయంబత్తూర్, చండీగఢ్, కొచ్చి నగరాల్లో ఉద్యోగాల డిమాండ్ మరింత పెరగనుంది

రెండు వేర్వేరు రాష్ట్రాలు, రెండు వేర్వేరు ప్రభుత్వాలు.. కానీ రాజధాని మాత్రం ఒకటే. ఇది మరెక్కడో కాదు.. మన దేశంలోనే. పంజాబ్, హర్యానా రాష్ట్రాలు రెండింటికీ ఏకైక రాజధానిగా ఉన్న నగరం చండీగఢ్.. అసలు.. రెండు రాష్ట్రాలకు ఒకే నగరం రాజధానిలా ఎలా మారింది..? భారతదేశంలోని మొదటి ప్లాన్డ్ సిటీగా పిలిచే చండీగఢ్ నగరం కథేంటి? ఈ నగరం ఎందుకు అంత స్పెషల్..? ఈ విషయం ఇప్పుడు తెలుసుకుందాం... ఈ ప్రాంతంలో ప్రసిద్ధ చండీ మందిరం ( దుర్గా దేవి గుడి) ఉంది. అలాగే ఇక్కడ ఫేమస్ గఢ్( కోట) కూడా ఉంది. ఈ రెండు పదాలను కలిపి చండీగఢ్ అనే పేరు పెట్టారు. 1947లో దేశ విభజన జరిగినప్పుడు.. పంజాబ్ పాత రాజధాని ‘లాహోర్’ పాకిస్తాన్ లోకి వెళ్లిపోయింది. దీంతో పంజాబ్ కోసం కొత్త రాజధాని నిర్మించాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు చండీగఢ్ ని రాజధానిగా నియమించారు. స్వతంత్ర భారత ప్రతిభను ప్రపంచానికి చూపించేలా ఒక ఆధునిక నగరాన్ని కట్టాలని అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అనుకున్నారు.ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ లీ కార్బుసియర్ ఈ నగరానికి ప్లాన్ వేశారు. విచిత్రమేంటంటే.. మనిషి శరీరం ఆధారంగా ఈ నగరాన్ని డిజైన్ చేశారు. క్యాపిటల్ కాంప్లెక్స్ తల భాగంలో, సిటీ సెంటర్ గుండె ఆకారంలో, పార్కులు, చెట్లు ఊపిరితిత్తులు గా విభజించారు. ఇక ఈ నగరాన్ని 'సెక్టర్లు'గా విభజించారు. ప్రతీ సెక్టార్లోనే బడులు, మార్కెట్లు, పార్కులు ఉండేలా ప్లాన్ చేశారు. అయితే చండీగఢ్‌లో సెక్టర్ 13 ఉండదు. 1966లో పంజాబ్ నుండి 'హర్యానా' ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. మన తెలుగు రాష్ట్రాలు విడిపోయినట్లే పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాలుగా విడిపోయాయి. అయితే.. విభజన తర్వాత చండీగఢ్ మాదంటే మాదని ఇరు రాష్ట్రాలూ పట్టుబట్టాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం ఒక పరిష్కారం కనుగొంది. చండీగఢ్‌ను ఒక కేంద్రపాలిత ప్రాంతంగా (UT) ప్రకటిస్తూ, రెండింటికీ ఉమ్మడి రాజధానిగా చేసింది

హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్, హైదరాబాద్ సిటీ-1 డివిజన్ల పరిధిలో విద్యుత్ ఫీడర్ల మరమ్మతు పనులు నిమిత్తం గురువారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు ట్రాన్స్ కో అధికారులు తెలిపారు. చిక్కడపల్లి(హైదరాబాద్): హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్, హైదరాబాద్ సిటీ-1 డివిజన్ల పరిధిలో విద్యుత్ ఫీడర్ల మరమ్మతు పనులు నిమిత్తం గురువారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు సీబీడీ ఏడీఈలు జి. నాగేశ్వరరావు, డి. వినోద్‌కుమార్ తెలిపారు. గోల్కొండ క్రాస్‌రోడ్ 11కేవీ విద్యుత్ ఫీడర్ పరిధిలో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, తాళ్లబస్తీ పరిధిలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, పోస్టాఫీస్ పరిధిలో మధ్యా హ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని వినియోగదారులు తమ సిబ్బందికి సహకరించాలని ఏడీఈలు కోరారు. కేపీహెచ్‌బీ కాలనీ: టీజీఎస్పీడీసీఎల్ బాలాజీనగర్ సెక్షన్ పరిధిలో జలమండలి పనుల నేపథ్యంలో గురువారం పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ భీమాలింగప్ప ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కేపీహెచ్‌బీ లోధా అపార్ట్మెంట్స్, ఇందూ అపార్ట్మెంట్స్, బీఎస్ఎన్ఎల్ క్వార్టర్స్, ఫిష్ మార్కెట్, ఎన్ఎస్ఎల్ మాల్, డీమార్ట్ ఏరియా, ఐదోఫేజ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు

Rajahmundry: పాఠశాల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ Rajahmundry: విద్యాసంస్థల్లో మౌలిక వసతులను మెరుగుపరిచి, విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 24వ డివిజన్ మెరకలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఏపీ పేపర్ మిల్లు సీఎస్ఆర్ నిధులు రూ.20 లక్షలతో చేపట్టిన తరగతి గదుల మరమ్మతులు, ఇతర అభివృద్ధి పనులను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది క్రితం పాఠశాల వెనుక గోడ శిథిలావస్థకు చేరడంతో పాటు తరగతి గదుల స్లాబుల నుంచి పెచ్చులు ఊడిపడటం, వాటర్ లీకేజీలు, కిటికీలు, తలుపులు దెబ్బతినడం, గ్రిల్స్‌కు తుప్పు పట్టడం వంటి సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. స్థానిక వార్డు ఇన్చార్జి కాశీ సూచనతో పాఠశాల సమస్యలను పరిశీలించి, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. పాఠశాలలో అప్పట్లో కేవలం 16 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని, ఉపాధ్యాయులు, సిబ్బంది సహకారంతో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య 36కు పెరిగిందని చెప్పారు. విద్యార్థుల సంఖ్య మరింత పెంచేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని కోరారు. పాఠశాలలోని సమస్యల పరిష్కారానికి రూ.20 లక్షల సీఎస్ఆర్ నిధులు అందించిన ఏపీ పేపర్ మిల్లు యాజమాన్యానికి ఎమ్మెల్యే వాసు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలలో తాను, అధికారులు, స్థానికులు గుర్తించిన సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు అవసరమైన అదనపు పనులను కూడా చేపట్టామని చెప్పారు. పాఠశాల ఆవరణలో శానిటేషన్ సిబ్బంది మస్టర్ రూమ్ కోసం ఉపయోగించాలనుకున్న ప్రాంతాన్ని విద్యార్థుల అవసరాలకు వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అక్కడ వంటశాల, విద్యార్థులు భోజనం చేసేందుకు షెడ్డు, ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయాలని చర్చిస్తున్న సమయంలో గ్లాస్ వరల్డ్ అధినేత కమల్ ముందుకు వచ్చి తన సొంత నిధులతో గది, షెడ్డు

ఈ పువ్వు కళ్లకు హానికరం.. కానీ, ఆ రోగాలన్నింటికీ దివ్యౌషధం..!ఈ పువ్వు కళ్లకు హానికరం.. కానీ, ఆ రోగాలన్నింటికీ దివ్యౌషధం..! August 19 Jyothi Gadda కీళ్ల నొప్పుల నివారణ: జిల్లేడు ఆకులను వేడి చేసి బాధిస్తున్న కీళ్లపై కట్టడం లేదా ఆకుల రసాన్ని క్రమంగా రాయడం వల్ల వాపులు, తీవ్రమైన కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు: జిల్లేడు పువ్వులు లేదా ఆకుల డికాక్షన్ శ్వాసనాళాల్లోని కఫాన్ని పల్చగా చేసి బయటకు పంపడం ద్వారా ఆస్తమా, దగ్గు, జలుబు సమస్యలను తగ్గిస్తుంది. తలనొప్పికి చక్కటి పరిష్కారం: జిల్లేడు ఆకులను మెత్తగా నూరి నుదిటిపై పేస్ట్‌లా రాయడం వల్ల అందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు తీవ్రమైన తలనొప్పిని త్వరగా తగ్గిస్తాయి. చర్మ ఇన్ఫెక్షన్ల నివారణ: ఆకుల పేస్ట్ లేదా రసాన్ని చర్మంపై పూయడం వల్ల తామర, దురదలు, మొటిమలు, ఇతర ఇన్ఫెక్షన్లు పెరగకుండా అరికట్టవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. పైల్స్ సమస్యకు ఉపశమనం: పైల్స్ గాయాలు, నొప్పులతో బాధపడేవారు జిల్లేడు ఆకుల పేస్ట్‌ను గాయంపై తరచూ అప్లై చేయడం వల్ల మంట తగ్గి గాయాలు త్వరగా నయమవుతాయి. జీర్ణ వ్యవస్థ మెరుగుదల: జిల్లేడు భాగాలను సంప్రదాయ ఆయుర్వేద పద్ధతిలో సరైన మోతాదులో వాడటం వల్ల మలబద్ధకం, విరేచనాలు, కడుపు పూతల వంటి సమస్యలు తగ్గుతాయి. గాయాలను త్వరగా మానపడం: ఈ మొక్కలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ సెప్టిక్ లక్షణాలు శరీరంపైన ఏర్పడే దెబ్బలు, గాయాలను త్వరగా మాన్పడానికి ఎంతో బాగా తోడ్పడతాయి. దంత సమస్యల నివారణ: జిల్లేడు వేరు లేదా పాలు ఆయుర్వేదంలో దంత క్షయం, పంటి నొప్పి, చిగుళ్ల వాపుల నివారణలో ఉపశమనం కలిగించడానికి ఔషధంగా ఎంతగానో తోడ్పడతాయి. రక్తంలో చక్కెర నియంత్రణ: జిల్లేడు ఆకుల్లోని ప్రత్యేక గుణాలు శరీరంలో ఇన్సులిన్ ప్రతిస్పందనను మెరుగుపరిచి, డయాబెటిస్ బాధితుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. మరిన్ని
హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) మరో కొత్త ఏసీ ఎలక్ట్రిక్ బస్ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రగతినగర్ కమాన్ నుంచి వేవ్‌రాక్ వరకు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఈ సర్వీస్ నడవనుంది. ముఖ్యంగా నగరంలోని నార్త్ ఈస్ట్ ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్‌లోని వేవ్‌రాక్ వైపు ప్రతిరోజూ రాకపోకలు సాగించే ఐటీ ఉద్యోగులు, ఇతర ప్రయాణికులకు ఈ సర్వీస్ ఉపయోగపడనుంది.ఈ కొత్త సర్వీసులో 100 శాతం ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను వినియోగిస్తున్నారు. దీంతో ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు పర్యావరణహితమైన ప్రజా రవాణా అందుబాటులోకి రానుంది. ప్రగతినగర్ కమాన్ నుంచి బయలుదేరిన బస్సులు బాచుపల్లి క్రాస్ రోడ్డు, మల్లంపేట, ఓఆర్ఆర్ ఎగ్జిట్-4ఏ, ఎగ్జిట్-1 మీదుగా ప్రయాణిస్తాయి. అనంతరం సైయంట్ సిగ్నల్, ఐసీఐసీఐ సిగ్నల్ మీదుగా వేవ్‌రాక్‌కు చేరుకుంటాయి. ప్రస్తుతం ఉదయం నాలుగు ట్రిప్పులను ఏర్పాటు చేశారు. ప్రగతినగర్ కమాన్ నుంచి ఉదయం 7.45 గంటలకు, 8.15 గంటలకు, 9.15 గంటలకు, 10.15 గంటలకు బస్సులు బయలుదేరనున్నాయి. ఉదయం వేళ ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లే సమయంలో ఈ సర్వీసులు అందుబాటులో ఉండేలా సమయాలను రూపొందించారు.వేవ్‌రాక్ నుంచి తిరుగు ప్రయాణానికి సాయంత్రం మూడు ట్రిప్పులను నడపనున్నారు. సాయంత్రం 4.15 గంటలకు, 5.15 గంటలకు, 6.45 గంటలకు బస్సులు బయలుదేరుతాయి. దీంతో ఆఫీస్ అవర్స్ పూర్తయిన తర్వాత నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యం లభించనుంది. ప్రగతినగర్, బాచుపల్లి, మల్లంపేట తదితర ప్రాంతాల్లో నివసిస్తూ ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నవారికి ఈ సర్వీస్ ప్రత్యేకంగా ఉపయోగపడనుంది. సాధారణంగా ఈ ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్‌కు వెళ్లే ప్రయాణికులు వ్యక్తిగత వాహనాలు, క్యాబ్‌లు లేదా పలు మార్గాల్లో మారాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓఆర్ఆర్ మీదుగా నేరుగా సర్వీస్ అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయం, మార్గమధ్యంలో వాహనాల మార్పు వంటి ఇబ్బందులు కొంతవరకు

దేశంలో ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్న ప్రాంతాల్లో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చోటు దక్కింది. జైపుర్, నాసిక్, సూరత్, ముర్షిదాబాద్‌తో పాటు రంగారెడ్డి తన ఆర్థిక ప్రాధాన్యాన్ని పెంచుకుంటున్నట్లు ‘డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్’ తాజా నివేదిక వెల్లడించింది. దేశ ఆర్థిక వృద్ధి ఇక సంప్రదాయ మెట్రో నగరాలకే పరిమితం కాకుండా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోందని తెలిపింది.‘డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ సిటీ వైటాలిటీ ఇండెక్స్’ ప్రకారం దేశంలో అత్యంత ఆర్థికంగా కీలకమైన మెట్రో నగరంగా పుణె నిలిచింది. ఐటీ సేవలు, అధునాతన తయారీ, ఆటోమొబైల్, విద్య, ఆవిష్కరణ ఆధారిత కార్యకలాపాలు పుణెకు కలిసొచ్చాయి. అహ్మదాబాద్ రెండో స్థానంలో నిలిచింది. మెట్రో నగరాల్లో ఆర్థిక వృద్ధి వేగం విషయంలో కోల్‌కతా ముందుంది.ఏప్రిల్-జూన్ 2026 కాలానికి రూపొందించిన సూచీలో దేశవ్యాప్తంగా 800కుపైగా జిల్లాలను పరిశీలించారు. ఉపగ్రహ ఆధారిత భౌగోళిక పరిశీలన డేటాతో పాటు ఆర్థిక సూచీలను ఇందుకు ఉపయోగించారు. అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో సౌత్ 24 పరగణాస్ అగ్రస్థానంలో నిలిచింది. నార్త్ 24 పరగణాస్, థానే తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జైపుర్, నాసిక్, సూరత్, ముర్షిదాబాద్, రంగారెడ్డి ప్రాంతాలు కూడా తమ ఆర్థిక ప్రాధాన్యాన్ని పెంచుకుంటున్నాయని నివేదిక పేర్కొంది. గత దశాబ్దంలో దిమాపూర్, పంచమహల్స్, ఆనంద్, అయోధ్య, రాంపుర్, బస్తీ, షామ్లీ, బౌధ్, ఔరంగాబాద్, కోడెర్మా వంటి జిల్లాలు స్థిరమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేశాయి.దేశంలో పట్టణీకరణ మరింత విస్తృతంగా జరుగుతోందని నివేదిక పేర్కొంది. పెట్టుబడులు, వ్యాపారాలు, ప్రతిభావంతులైన మానవ వనరులు, మౌలిక వసతులు కొత్త నగరాల వైపు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపింది
రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. కర్నూలును డ్రోన్ సిటీగా అభివృద్ధి చేసేందుకు సన్నాహకాలు చేస్తోంది. కర్నూలు సమీనంలోని ఓర్వకల్లు మండలంలో 600 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న డ్రోన్ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయని.. రాబోయే కాలంలో రూ. 5 వేల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. డ్రోన్ల పరిశోధన, ఆవిష్కరణ, తయారీ, పరీక్షల నిర్వహణ, ధ్రువీకరణ తదితర అన్ని విభాగాలు ఇక్కడే అందుబాటులో ఉంటాయన్నారు.డ్రోన్ సిటీలో వివిధ డ్రోన్ల కంపెనీల సీఈఓలతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. దేశంలోనే ఈ డ్రోన్ సిటీ మొదటిదన్నారు. సీఈఓలు చేసిన సూచనల అధ్యయనానికి ఒక కమిటీ వేస్తామని ఆయన చెప్పారు. డ్రోన్ సంస్థలకు వేగవంతమైన సేవలు అందుబాటులోకి వచ్చే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. READ ALSO వెలుగొండ ప్రాజెక్టు కోసం ఊళ్లే వదిలేసి వెళ్తున్నారు.. నల్లమల సాగర్‌తో 11 గ్రామాలు మునకఅమరావతిలో రెండేళ్ల కిందట డ్రోన్ సమ్మిట్ నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటికప్పుడు డ్రోన్ సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. దానికి అనుగుణంగానే కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటయిందన్నారు. రాళ్లతో నిండిన ఈ ప్రాంతం రేపు డ్రోన్ల తయారీ కేంద్రంగా నిలుస్తుందన్నారు. టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేసి ప్రతి మూడు నెలలకు ఒకసారి డ్రోన్ సిటీ అభివృద్ధిని సమీక్షిస్తామని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.తొలి దశలో 120 ఎకరాల్లో అభివృద్ధి చేశామని, రెండో దశలో 480 ఎకరాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఏపీఐఐసీ ఈడీ యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. డ్రోన్ల రంగాన్ని రూ. 500 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎండీ గీతాంజలి శర్మ చెప్పారు. డ్రోన్ల తయారీ సంస్థల ప్రతినిధులు ప్రదర్శించిన డ్రోన్లను రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. TGSRTC Changes Bus Routes: కేబీఆర్ పార్క్ చుట్టూ హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ ఫ్లైఓవర్ అండర్‌పాస్‌లను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనుల వల్ల ట్రాఫిక్ నియంత్రించడానికి ఆగస్టు 18 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే విధానాన్ని అమలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఈ మార్గాల్లో కాకుండా ఇతర మార్గాల్లో మళ్లింపులు చేపట్టారు. కీలకమైన ప్రాంతాల్లో సైన్ బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు మైక్ ద్వారా కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. నిన్న ఈ వన్-వే విధానం గురించి తెలియక చాలా మంది వాహనదారులు తమ ఆఫీసులకు వెళ్లే క్రమంలో ఇబ్బందులు పడ్డారు. అందుకే ఈరోజు నుంచి వాహనదారులు ముందుగానే బయలుదేరాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం మళ్లింపులు చేపట్టడమే కాకుండా బస్సు రూట్లను కూడా మార్చారు. కాబట్టి జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, బంజారాహిల్స్, రోడ్ నంబర్ 45 వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తమ రూట్లను ముందుగానే గుర్తించుకోవాలి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ బస్సు మార్గాల్లో కీలక మార్పులు చేస్తూ, కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ పరిసరాల్లోని బస్టాపులను కూడా మార్చింది. బస్ నంబర్ 47L రూట్.. సికింద్రాబాద్ లేదా జూబ్లీ బస్ స్టాండ్ నుండి మణికొండకు వెళ్లే ఈ 47L బస్సు.. సికింద్రాబాద్ నుంచి బేగంపేట్, నాగార్జున సర్కిల్, ఎల్వీ ప్రసాద్, బసవతారకం హాస్పిటల్, బీఆర్ఎస్ భవన్, ఎమ్మెల్యే కాలనీ, ఒమేగా, అపోలో హాస్పిటల్, ఫిల్మ్ నగర్, దర్గా, మణికొండకు చేరుతుంది. తిరిగి వచ్చే సమయంలో మణికొండ నుంచి పంచవటి కాలనీ, దర్గా, ఫిల్మ్ నగర్, జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్

Devarkadra: దేవరకద్రలో రైతులకు ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఈ వార్తకు సంబంధించిన

తాగునీటిలో ఉండే ఫ్లోరైడ్ వల్ల మెదడు ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: ఫ్లోరైడ్ మన రోజువారీ జీవితంలో సాధారణంగా కనిపించే పదార్థం. తాగునీటిలో, టూత్‌పేస్ట్ వంటి దంత సంరక్షణ ఉత్పత్తుల్లో ఇది ఉంటుంది. దంతక్షయాన్ని నివారించడంలో ఫ్లోరైడ్ ఉపయోగపడుతుంది. అయితే ఫ్లోరైడ్ వల్ల మెదడు ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందా అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. దీనిపై పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.. సాధారణ పరిమాణంలో ఫ్లోరైడ్ తీసుకోవడం వల్ల మెదడుపై నేరుగా హానికరమైన ప్రభావం ఉంటుందని స్పష్టమైన ఆధారాలు లేవు. అయితే ఎక్కువ మొత్తంలో, ఎక్కువ కాలం ఫ్లోరైడ్ తీసుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఫ్లోరైడ్ తాగునీరు, టూత్‌పేస్ట్ వంటి దంత సంరక్షణ ఉత్పత్తుల ద్వారా శరీరంలోకి చేరుతుంది. అనంతరం ఇది ఎముకలు, దంతాలు వంటి శరీర భాగాల్లో నిల్వ అవుతుంది. సాధారణ స్థాయిలో ఉండే ఫ్లోరైడ్ వల్ల సాధారణంగా పెద్దగా సమస్య ఉండదు. కానీ దీర్ఘకాలం పాటు అధిక మోతాదులో ఫ్లోరైడ్ తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు కనిపించవచ్చు. శరీరంలో ఫ్లోరైడ్ స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగే అవకాశం ఉంది. ఇది మెదడు కణాల పనితీరును ప్రభావితం చేయవచ్చు. ముఖ్యంగా మెదడు కణాల మధ్య సమాచారాన్ని చేరవేసే న్యూరోట్రాన్స్మిటర్ల పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అధిక మొత్తంలో ఫ్లోరైడ్ శరీరంలోకి చేరితే థైరాయిడ్ పనితీరుపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. థైరాయిడ్ సమస్యలు పరోక్షంగా మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. అయితే సాధారణ తాగునీటిలో ఉండే సురక్షిత స్థాయి ఫ్లోరైడ్ వల్ల సాధారణంగా ఇలాంటి సమస్యలు రావు. భూగర్భ జలాలను ఎక్కువగా ఉపయోగించే ప్రాంతాల్లో నీటిలో ఫ్లోరైడ్ స్థాయులు అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాంటి నీటిని ఎక్కువ కాలం తాగడం వల్ల ఫ్లోరోసిస్

తెలంగాణ పారిశ్రామిక రంగానికి జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఒక కొత్త ఊపునివ్వనుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ స్మార్ట్ సిటీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. 3,245 ఎకరాల భారీ విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న ఈ స్మార్ట్ సిటీ ద్వారా సుమారు రూ. 15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య-పరిశ్రమల మంత్రి పీయూష్ గోయెల్‌లు సంయుక్తంగా నిర్వహించిన 'నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్' వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి శ్రీధర్‌బాబు సచివాలయం నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జహీరాబాద్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులన్నింటినీ 2028 మార్చి నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. EPC (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) విధానంలో జరుగుతున్న ఈ పనులను గడువులోగా పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించామని వివరించారు. ఈ స్మార్ట్ సిటీలో భూమి రూపంలో తెలంగాణ ప్రభుత్వ వాటా 51 శాతం ఉండగా, మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తోందని మంత్రి పేర్కొన్నారు. పరిశ్రమలకు అవసరమైన ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ఇదే క్రమంలో, 'భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన' (భవ్య) కింద కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రకటించిన 100 ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కుల్లో నాలుగింటిని తెలంగాణకు కేటాయించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్‌ను ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు కోరారు

బస్సుల్లో ప్రయాణం అంటే ఉదయాన్నే రద్దీ, కండక్టర్ చిల్లర ఇవ్వండి అనడం, ఆపై జేబుల్లో కాయిన్స్ కోసం వెతుక్కోవడం ప్రతి ఒక్కరికీ అనుభవమే. వీటితో పాటు మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం కూడా అమలువుతున్న నేపథ్యంలో పీక్ అవర్స్ లో ఆర్టీసీ బస్సులో విపరీతమైన రష్ ను మనం ఎదుర్కుంటున్నాం. చాలా సార్లు కండక్టర్ మన కాళ్లు తొక్కుకుంటూ టికెట్ ఇవ్వడానికి వెళ్తున్న ఇబ్బందికర పరిస్థితులను కూడా చూశాం.అయితే, ఈ రోజువారీ తిప్పలకు త్వరలోనే చెక్ పడనుంది. హైదరాబాద్ నగర రవాణాను సరికొత్త డిజిటల్ బాట పట్టించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో అడుగు ముందుకు వేసింది. మెట్రో రైలు తరహాలోనే.. ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఎక్కడానికి ముందే ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా అడ్వాన్స్ టికెట్ బుక్ చేసుకునే సౌకర్యాన్ని మీ టికెట్ (Mee Ticket) యాప్ రూపంలో అందుబాటులోకి తెస్తోంది.ఈ కొత్త విధానంతో రద్దీ సమయాల్లో బస్సుల్లో నిలబడి, ఊపిరి ఆడని జనం మధ్య కండక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రయాణికులు తమ మొబైల్ యాప్‌లో ఎక్కే బస్ స్టాప్, దిగే ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుని యూపీఐ, డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా ముందే చెల్లింపులు చేయవచ్చు. టికెట్ బుక్ అవ్వడమే కాకుండా, బస్సు ప్రస్తుతం ఎక్కడుందో లైవ్ లొకేషన్ ట్రాక్ చేస్తూ సమయానికి డిజిటల్ ప్రయాణం చేయవచ్చు. అంతేకాకుండా ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ వంటి సేవలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడమే ఈ యాప్ ముఖ్య ఉద్దేశం.నైరుతి బైబై?.. పసిడి నేలను పలకరించకుండానే వీడ్కోలు..ఈ సదుపాయం రావడం వల్ల ప్రయాణికుల సమయం ఆదా అవ్వడమే కాకుండా, కండక్టర్లపై పనిభారం గణనీయంగా తగ్గుతుంది. ప్రతిరోజూ నగరంలో తిరిగే 3200కు పైగా బస్సుల్లో సుమారు 26 లక్షల మంది ప్రయాణిస్తుండగా, ఇప్పటికే 23 శాతం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ (మంగళవారం) రెండో రోజు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. తొలుత ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించనున్నారు. అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ (మంగళవారం) రెండో రోజు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. తొలుత ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) నిర్ణయాల నివేదికను సభ ముందు సీఎం చంద్రబాబు ఉంచనున్నారు. అనంతరం విద్యుత్ శాఖకు సంబంధించిన జీవో ఆర్టీ నం.27ను మంత్రి గొట్టిపాటి రవికుమార్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్-1971 ప్రకారం ఈ జీవోను సభ ముందు పెట్టనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీస్ (అమెండ్మెంట్) బిల్లు-2026పై కీలక ప్రక్రియ జరగనుంది. సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరడంతోపాటు.. బిల్లును పరిశీలనకు తీసుకోవాలని, అనంతరం ఆమోదించాలని మంత్రి నారా లోకేశ్ ప్రతిపాదించనున్నారు. అలాగే, ‘సూపర్ సిక్స్-ప్రజా సంక్షేమం’పై సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. సూపర్ సిక్స్ పథకాలు, ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంపై ఎమ్మెల్యే దాసరి సుధ ప్రశ్నించనున్నారు. గత రెండేళ్లలో స్వయం సహాయక సంఘాలకు విడుదల చేసిన వడ్డీ లేని రుణాల వివరాలనూ ఆమె కోరనున్నారు. 25 వేలకుపైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసే ప్రతిపాదనపై ప్రశ్నలు రానున్నాయి. కోవూరు గ్రామ పంచాయతీని కూడా అప్‌గ్రేడ్ చేసే జాబితాలో చేర్చారా? అనే అంశంపై సభ్యులు ప్రశ్నించనున్నారు. కోనసీమలో వృద్ధాప్య దశకు చేరిన కొబ్బరి తోటల అంశం సభ ముందుకు రానుంది. కొబ్బరి తోటల పునరుజ్జీవనం, తిరిగి నాటే కార్యక్రమాలపై కొబ్బరి అభివృద్ధి బోర్డుతో కేంద్రం జరిపిన సంప్రదింపుల వివరాలను కోరనున్నారు. అర్హులైన కొబ్బరి రైతులకు కొత్త మొక్కలు
తెలంగాణలో పారిశ్రామిక రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. జహీరాబాద్‌లో 3,245 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ పనులను 2028 మార్చి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఈ పారిశ్రామిక వాడలో భారీగా పెట్టుబడులను ఆకర్షించి వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వివరించారు.జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి సుమారు రూ.15 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఈ పారిశ్రామిక నగరంలో పూర్తిస్థాయిలో పరిశ్రమలు, కార్యకలాపాలు ప్రారంభమైతే సుమారు 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (ఎన్ఐసీడీఐటీ) ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ నిర్వహించిన ఈ సమావేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పరిశ్రమల శాఖ మంత్రులు పాల్గొన్నారు.జహీరాబాద్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికను ఇప్పటికే స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)కి అందించినట్లు మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ విధానంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని.. నిర్ణయించిన గడువులోనే పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ జహీరాబాద్ పారిశ్రామిక నగరంలో పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఇప్పటికే నీటి సరఫరా పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయిందని.. విద్యుత్ సరఫరా పనులను కూడా నిర్దేశించిన గడువులోగా పూర్తి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.ఈ ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం భూమి రూపంలో 51 శాతం వాటా కలిగి ఉండగా.. అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను

రోజువారీ అవసరాల కోసం ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ప్రస్తుతం ఈవీ కార్లలో చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్లో MG Comet EV మంచి ఆప్షన్‌గా ఉంది. సిటీలో రోజూ తిరగడానికి ఈ కారు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు ఎంజీ కంపెనీకి చెందిన కామెట్ ఈవీ. వేరియంట్‌ను బట్టి ఈ కారు ధర రూ. 4.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారును ప్రత్యేకంగా నగరాల్లోని రద్దీ రోడ్లను దృష్టిలో పెట్టుకుని తయారు చేశారు. దీని కాంపాక్ట్ సైజ్, బాక్సీ డిజైన్, స్మార్ట్ ఫీచర్ల వల్ల యువతలో బాగా ప్రాచుర్యం పొందింది. రోజువారీ ప్రయాణాలకు ఈ కారు ఉత్తమమైన ఎంపిక. ఇందులో 17.3 kWh సామర్థ్యం గల బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 230 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. Budget EV Cars : అత్యంత చౌక టాటా ఎలక్ట్రిక్ కారు ఏదో తెలుసా? Petrol Saving : గురూ.. నీ పెట్రోల్ ఖర్చు తగ్గాలంటే ఈ ట్రిక్స్ ఫాలోకా.. Cars Under 5 Lakhs: రూ. 5 లక్షల లోపు వచ్చే బెస్ట్ కార్లు ఇవే!

Hyderabad Real Estate : నిజాంల నగరం హైదరాబాద్ ఇప్పుడు గ్లోబల్ సిటీగా మారిపోయింది. ఓవైపు ఓల్డ్ సిటీ నగర చారిత్రకు నిలువెత్తు నిదర్శనంగా నిలిస్తే మరోవైపు ఐటీ సిటీ అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఇలా పాత కొత్తల కలయికతో హైదరాబాద్ నగరం ముందుకు సాగుతోంది... డెవలప్మెంట్ కు కొత్త అర్థం చెబుతోంది. హైదరాబాద్ అభివృద్ధి గురించి తెలియాలంటే ఇక్కడి రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకోవాల్సిందే. ఒకప్పుడు కొండలు, గుట్టలతో బీడుభూమిగా ఉన్నప్రాంతం ఐటీ విప్లవంతో కోట్లకు పడగలెత్తింది. ఒకప్పుడు హైదరాబాద్ లో రిచ్చెస్ట్ ఏరియా అంటే బంజారాహిల్స్, జూబ్లిహిల్స్... కానీ ఇప్పుడు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్ రామ్ గూడ, రాయదుర్గం వంటి ప్రాంతాలు వాటిని తలదన్నేలా మారాయి. ఇక్కడ భూముల ధరలు వందలు కోట్లు పలుకుతున్నాయి. గతంలో హైదరాబాద్ శివారు కోకాపేట నియోపోలిస్ లో ఎకరా భూమి రూ.100 కోట్లు పలికితేనే అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత రాయదుర్గం నాలెజ్డ్ సిటీలో టిజిఐఐసి నిర్వహించిన ఈ-వేలంలో రికార్డు స్థాయిలో రూ.237 కోట్లకు ఎకరం పలికింది. ఈ ధర రియల్ ఎస్టేట్ పండితులనే అవాక్కయ్యేలా చేసింది. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఆల్ టైమ్ రికార్డును బద్దలుగొట్టేందుకు రంగం సిద్దం అవుతోంది... అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతంలో భూమిని అమ్మబోతోంది ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం రాయదుర్గం లోని ఐటిసి కోహినూర్ ఎదురుగా సర్వే నెంబర్ 83/1 లో గల 10.63 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టింది. ఇటీవల మే నెలలో ఈ ప్రాంతంలోని భూమిని ఎకరం కనీస ధర రూ.139 కోట్లకు వేలం పెడితే ఏకంగా రూ.237 కోట్లకు అమ్ముడుపోయింది. కాబట్టి ఈ నెలలో నిర్వహించే వేలంలో కనీస ధర రూ.175 కోట్లుగా నిర్ణయించింది టిజిఐఐసి. అయినా ఈ రాయదుర్గం భూమిని దక్కించుకునేందుకు పలు కంపెనీలు సిద్దంగా ఉన్నాయి... దీంతో ఈసారి ఆల్ టైమ్ రికార్డు ధర నమోదయ్యే అవకాశాలున్నాయని రియల్ ఎస్టేట్ నిపుణుల

ఏపీలో మంత్రి లోకేష్ మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. తనకు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా అవకాశం కల్పించిన మంగళగిరి వాసులకు మౌలిక వసతుల కల్పనకు లోకేష్ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధుల నుండే కాదు వివిధ కేంద్ర నిధులను కూడా మంగళగిరి-తాడేపల్లిలో మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా కేటాయించేలా చొరవ చూపుతున్నారు.మంగళగిరి-తాడేపల్లిలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర నిధులు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, మంగళగిరి-తాడేపల్లిలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద మంజూరు చేసిన నిధులు రూ. 497.71 కోట్లు ఉన్నాయి.రూ. 1,167.50 కోట్ల రూపాయలతో అత్యాధునిక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఈ ప్రాంతంలో అత్యాధునిక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్ట్ ఫేజ్-1 మరియు ఫేజ్-2 పనుల కోసం కేంద్రం ఇచ్చే నిధులతో పాటు, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో ఈ నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. ఇందులో కొంత మేర నిధులు హడ్కో రుణాల ద్వారా కూడా సమకూరుస్తున్నారు.రూ. 1,167.50 కోట్ల రూపాయలతో ఈ భారీ ప్రాజెక్ట్ ను చేపట్టారు. ఈ నిధులతో మంగళగిరి-తాడేపల్లిలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలను ఆధునీకరించనున్నారు.33వేల ఇళ్ళకు మేలు చేసేలా భారీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థమంగళగిరి-తాడేపల్లిలో సుమారు 33వేల ఇళ్లకు మేలు చేసేలా భారీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను తీసుకురానున్నారు మంత్రి లోకేష్. 303కిలోమీటర్ల పొడవైన నెట్‌వర్క్‌తో పాటు రోజూ 26.68 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసే సామర్థ్యం కలిగిన 6 STPలను ఇందులో భాగంగా నిర్మించనున్నారు. ఇది మాత్రమే కాక రూ. 450.24 కోట్లను నగరవ్యాప్తంగా, కొత్తగా విలీనమైన 15కు పైగా గ్రామాల్లో 24గంటల తాగునీటి సరఫరా గ్రిడ్ కోసం కేటాయించారు.రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతుల కల్పనకు నిధులు ఇలా అమృత్ 2.0 పథకం కింద

హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, బందరు పోర్టులను అనుసంధానించేలా రెండు భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సమాంతరంగా పరుగులు పెట్టనున్నాయి. హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైల్వే లైన్, ఫ్యూచర్ సిటీ-బందరు పోర్టు 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలను పక్కపక్కనే నిర్మించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమికంగా అంగీకరించాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, హైదరాబాద్-విజయవాడ ప్రస్తుత జాతీయ రహదారికి ఎడమవైపు ఎక్స్‌ప్రెస్‌వే, కుడివైపు హైస్పీడ్ రైలు మార్గం ఉండేలా అలైన్మెంట్ ఖరారు చేశారు.760 కిలోమీటర్ల హైస్పీడ్ రైలు మార్గంహైదరాబాద్-అమరావతి-చెన్నై మధ్య ప్రతిపాదించిన ఈ హైస్పీడ్ రైల్వే కారిడార్ మొత్తం పొడవు 760 కిలోమీటర్లు. ఇందులో తెలంగాణ పరిధిలో 180 కిలోమీటర్ల మేర నిర్మాణం జరగనుంది. ఈ మార్గంలో శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, డ్రై పోర్టు, నాగార్జునసాగర్ (హాలియా), వాడపల్లి వద్ద స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 2.24 లక్షల కోట్లు కాగా, దాదాపు 790 హెక్టార్ల భూమి అవసరమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇప్పటికే ఈ మార్గంలో మార్కింగ్ పనులు పూర్తయ్యాయి.298 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేహైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్), రీజినల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) మధ్యలో ఉన్న ముచ్చర్ల ఫ్యూచర్ సిటీ సమీపంలోని తిప్పారెడ్డిపల్లి వద్ద ఈ 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం కానుంది. ఇది అమరావతి మీదుగా మచిలీపట్నం-బందరు పోర్టుకు అనుసంధానమవుతుంది. మొత్తం 297.82 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గంలో తెలంగాణ పరిధిలో 118 కిలోమీటర్లు (40 గ్రామాల మీదుగా), ఏపీలో మిగిలిన భాగం (60

రాజధాని హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నై వరకూ ప్రతిపాదించిన హైస్పీడ్ రైల్వే లైన్.. ఫ్యూచర్‌సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు.. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే, హైస్పీడ్ రైల్వే లైన్ ప్రాథమిక అలైన్మెంట్లపై స్పష్టత రాష్ట్రంలో 180 కిలోమీటర్లు ప్రయాణించనున్న హైస్పీడ్ ట్రైన్ శంషాబాద్, ఫ్యూచర్‌సిటీ, డ్రై పోర్టు, నాగార్జునసాగర్, వాడపల్లి వద్ద స్టేషన్లు రాష్ట్ర పరిధిలో 2 జిల్లాలు 40 గ్రామాల మీదుగా గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే పొడవు 297 కిలోమీటర్లు.. అందులో 118 కిలోమీటర్లు తెలంగాణలో హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నై వరకూ ప్రతిపాదించిన హైస్పీడ్ రైల్వే లైన్.. ఫ్యూచర్‌సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు ప్రతిపాదించిన 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేలు పక్కపక్కనే వెళ్లనున్నాయి. ఈ రెండింటిలో రోడ్డు ఎడమవైపు.. రైలు మార్గం కుడివైపు ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఎడమవైపు అంటే.. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఉన్న ప్రస్తుత రహదారికి ఎడమవైపు.. ఫ్యూచర్‌సిటీ-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే ఉంటుంది. కుడివైపు రైలు మార్గం ఉండనుంది. వీటికి సంబంధించిన అలైన్మెంట్ల విషయంలోనూ ఒక స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ప్రాథమికంగా అందిన వివరాల ప్రకారం.. హైదరాబాద్-అమరావతి- చెన్నై కారిడార్‌లో శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, డ్రై పోర్టు, నాగార్జునసాగర్ (హాలియా), వాడపల్లి దగ్గర స్టేషన్లు రానున్నాయి. ఈ లైన్ శంషాబాద్ నుంచి ఓఆర్ఆర్ రావిర్యాల ఎగ్జిట్ దగ్గర నిర్మించనున్న 21 కిలోమీటర్ల కొత్త రేడియల్ రోడ్డుకు దగ్గర్లో ప్రారంభమయ్యే గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే వద్ద కలుస్తుంది. ఈ రైల్వే లైన్ పొడవు మొత్తం 760 కిలోమీటర్లు కాగా.. రాష్ట్రపరిధిలో 180 కిలోమీటర్లు ఉండనుంది. దీనికి సంబంధించి ఆ మార్గంలో పలుచోట్ల మార్కింగ్‌లు కూడా

Flag Hoisting | కోల్ సిటీ, ఆగస్టు 15: రామగుండం నగర పాలక సంస్థ 51వ డివిజన్ పరిధి స్వతంత్ర చౌక్‌లో శనివారం జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జాతీయ జెండావిష్కరణ విషయంలో వివాదం తలెత్తింది. డివిజన్ ప్రధాన కేంద్రమైన స్వతంత్ర చౌక్‌లో ప్రతీ సంవత్సరం గెలిచిన కార్పొరేటర్ ప్రజల సమక్షంలో జెండావిష్కరణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే 80వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని గెలిచిన బీఆర్ఎస్ కార్పొరేటర్ ఆకారపు రేఖ మహేష్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి స్వతంత్ర చౌక్ లో ఏర్పాట్లు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ భర్త తిరుపతి తన అనుచరులతో వచ్చి ఇక్కడ తామే జెండా ఎగురవేయాలని వారించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణంకు దారి తీసింది. దీంతో గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు రంగంలోకి దిగి సముదాయించి ఎవరికి వారుగా వేడుకలు జరుపుకోవాలని సూచించి వెళ్లగొట్టారు. శనివారం ఉదయం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. పోలీసులు చేరుకొని ఇరువర్గాలను కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన పంద్రాగస్టు వేడుకలకు మరెక్కడా లేనివిధంగా 51వ డివిజన్లో మాత్రమే పోలీసులు బందోబస్తు కల్పించాల్సిన విచిత్ర పరిస్థితి ఏర్పడింది. కొద్ది సేపు అక్కడ ఏం జరుగుతుందోనని స్థానికులు అయోమయానికి లోనయ్యారు. చివరకు ఒకే చోట ప్రక్కప్రక్కనే రెండు జాతీయ జెండాలు ఎగరడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సమైక్యతకు స్ఫూర్తిగా నిలవాల్సింది పోయి వేడుకల్లో ఆధిపత్యం ప్రదర్శించడం, ప్రజా తీర్పుతో గెలిచిన కార్పొరేటర్ ను అవమానించడం పట్ల స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా కార్పొరేటర్ రేఖ మహేశ్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర వేడుకలను వేదికగా చేసుకొని మాజీ కార్పొరేటర్ రాజకీయం చేయడం, పైగా తన పట్ల దౌర్జన్యంకు దిగడం, కనీసం ప్రొటోకాల్ కూడా పాటించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కార్పొరేటర్‌గా ఇక్కడ జెండా ఎగురవేయడం అనేక

వర్షపు నీరు చూడటానికి శుభ్రంగా కనిపించినా అందులో దుమ్ము, ధూళి, ఇతర సూక్ష్మ కణాలు ఉండవచ్చు. ఇవి నీటిలో విద్యుత్ ప్రవాహానికి కొంతవరకు మార్గం కల్పించగలవు. విద్యుత్ తీగల జాయింట్లు, మీటర్ బాక్సులు, స్విచ్ బోర్డులు, బయట ఉన్న విద్యుత్ కనెక్షన్లలోకి నీరు చేరితే సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో లీకేజీ కరెంట్, షార్ట్ సర్క్యూట్, ఫ్యూజ్ లేదా బ్రేకర్ ట్రిప్ కావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా సరైన ఇన్సులేషన్ లేని లేదా ఎక్కువ కాలం వాడిన తీగల్లో వర్షం ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు. అందుకే తేమ నుంచి విద్యుత్ కనెక్షన్లను రక్షించడం చాలా ముఖ్యం. మన ఇళ్లకు విద్యుత్ చేరడానికి ఒక పెద్ద నెట్వర్క్ పనిచేస్తుంది. దూర ప్రాంతాల నుంచి విద్యుత్‌ను తీసుకువచ్చే ట్రాన్స్మిషన్ లైన్లు, నగరాలు, గ్రామాలకు సరఫరా చేసే డిస్ట్రిబ్యూషన్ లైన్లు, భవనాల వైరింగ్, చివరగా ఇంట్లోని విద్యుత్ తీగలు ఇందులో భాగంగా ఉంటాయి. భారీ వర్షం, ఈదురుగాలులు వచ్చినప్పుడు చెట్లు లేదా కొమ్మలు విద్యుత్ తీగలపై పడవచ్చు. పిడుగులు విద్యుత్ నెట్‌వర్క్‌పై ప్రభావం చూపవచ్చు. నేల పూర్తిగా తడిసిపోవడం వల్ల ఎర్తింగ్ వ్యవస్థలో కూడా మార్పులు రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సమస్య చిన్నదే అయినా, భద్రత కోసం సంబంధిత లైన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తారు. సమస్యను సరిచేసిన తర్వాత విద్యుత్ సరఫరాను తిరిగి ప్రారంభిస్తారు. వర్షం సమయంలో కరెంట్ పోతే చాలామంది పెద్ద ప్రమాదం జరిగిందని భావిస్తారు. కానీ ప్రతి విద్యుత్ అంతరాయం పెద్ద నష్టం వల్లే జరుగుతుందని చెప్పలేం. విద్యుత్ వ్యవస్థలో భద్రత కోసం ఏర్పాటు చేసిన పరికరాలు ప్రమాదాన్ని గుర్తించినప్పుడు ఆటోమేటిక్‌గా సరఫరాను నిలిపివేస్తాయి. ఉదాహరణకు షార్ట్ సర్క్యూట్, అధిక కరెంట్, లీకేజీ లేదా లైన్లో మరో సమస్య గుర్తించినప్పుడు బ్రేకర్లు, ఫ్యూజులు, ఇతర రక్షణ పరికరాలు పనిచేస్తాయి. దీని వల్ల

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు మువ్వన్నెల జెండాను ఎగురవేసి, పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. రాష్ట్రాన్ని వికాసం నుంచి వైభవం వైపు, సుస్థిరత నుంచి స్వర్ణాంధ్ర దిశగా నడిపిస్తున్నామని, 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధనకు ఐదున్నర కోట్ల మంది ఆంధ్రులు సంకల్పం తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు."భారతీయులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. దశాబ్దాల పోరాటం, ఎందరో మహనీయుల త్యాగఫలమే మన స్వాతంత్ర్యం. 80 ఏళ్ల క్రితం మన పెద్దలు కన్న కలలను సాకారం చేసి, 2047 నాటికి దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలబెడదాం. ఈ దేశానికి మనమేం ఇవ్వగలమని ఆలోచించడమే ‘అనే నేను...’ సంకల్పం. రాబోయే 20 ఏళ్లు దేశ భవిష్యత్తు కోసం పనిచేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. ప్రధాని మోదీ ఇచ్చిన వికసిత్ భారత్, మనం నిర్దేశించుకున్న స్వర్ణాంధ్ర లక్ష్యాలు వేర్వేరు కావు. ఐక్యంగా ఈ లక్ష్యాలను సాధిద్దాం" అని ముఖ్యమంత్రి ఉద్బోధించారు.గత పాలన విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపుగత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని విధాలా విధ్వంసానికి గురైందని, వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. "గత పాలకుల అహంకారం, అవినీతి, అరాచకాలతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పునర్నిర్మాణ బాధ్యతను స్వీకరించాం. గత

బొమ్మనహళ్లి: బెంగళూరు నగర శివారులోని ఆనేకల్ తాలూకా హెబ్బగోడి దగ్గర అనంతనగరలో బైక్‌పై వెళ్తున్న యువతి గుంతల రోడ్డుకు బలైంది. కేరళకు చెందిన మేధ (32) మృతురాలు. ఆమె ఎలక్ట్రానిక్ సిటీలోని కేంద్ర ప్రభుత్వ పీఎఫ్ ఆఫీసులో ఉద్యోగిని. వివరాలు.. మేధ తన స్నేహితుడు అజయ్ గురుతో కలిసి బుధవారం సాయంత్రం బైక్‌పై వెళ్తోంది. ఈ సమయంలో, ముందు వెళ్తున్న కారు డ్రైవర్ గుంతను చూసి హఠాత్తుగా బ్రేకులు వేశాడు. వెనుక వస్తున్న అజయ్ బైక్ గాభరాపడి బ్రేక్ నొక్కగా అదుపుతప్పి కింద పడిపోయారు. వెనుక నుంచి వస్తున్న ఓ గూడ్స్ వ్యాన్ మేధ మెడపై నుంచి దూసుకెళ్లింది. ఆమెకు తీవ్ర రక్తస్రావమై అక్కడే మరణించింది. ఇదంతా క్షణాల్లోనే జరిగింది. స్థానికుల నిరసన ఈ ఘోరాన్ని చూసిన స్థానికులు, వాహనదారులు రోడ్డును దిగ్బంధించారు. కొవ్వొత్తులు వెలిగించి, మేధ ఆత్మశాంతి కోసం ప్రార్థించారు. ఎలక్ట్రానిక్ సిటీ పరిసరాల్లోని రోడ్లు చాలా అధ్వాన్నంగా, గుంతలతో నిండి ఉన్నాయని, అందువల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తక్షణం రోడ్లను బాగు చేయాలని కోరారు. హెబ్బగోడి, ఎలక్ట్రానిక్ సిటీ ట్రాఫిక్ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. విజయవాడ : ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాసం రద్దీ (ఫొటోలు) 'సురక్ష కా తిరంగా' అవగాహన కార్యక్రమంలో హీరో నాగార్జున (ఫొటోలు) జెన్‌జీతో మోదీ కనెక్ట్.. వందేమాతరం హైలైట్.. ఎర్రకోటపై కొత్త సందేశం (చిత్రాలు) అఖిల్ రాజ్, నాగదుర్గ జంటగా ‘శనార్తి’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు) వెకేషన్లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ చిల్.. (ఫోటోలు) అనంతపురంలో హైటెన్షన్.. 15 గంటల పాటు హైడ్రామా.. లాయర్ గౌతంరాజుకి సీఐ క్షమాపణ ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ కెవ్వు కేక... ఈ సారి అమిత్ షా కాళ్ళు పట్టుకున్న సరే ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు YSRCP కేంద్ర కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

రతన్‌టాటా గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు, ఎలివేటెడ్ కారిడార్లకు కూడా.. క్లారిటీ ఇచ్చిన రాష్ట్రం ప్రభుత్వం నిర్మాణ అనుమతులకు 50శాతం టీడీఆర్ ఇచ్చినా చాలు.. రియల్ ఎస్టేట్ పరిశ్రమకు ఊతమిచ్చిన ప్రభుత్వం హైదరాబాద్ సిటీ: ట్రాన్స్ఫరబుల్ డెవల్‌పమెంట్ రైట్స్ (టీడీఆర్)పై చిక్కుముడులు వీడాయి. హెచ్ఎండీఏ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు టీడీఆర్ తీసుకోవడంపై భూ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. హెచ్ఎండీఏ చేపట్టే ప్రాజెక్టులన్నింటికీ టీడీఆర్‌లను జారీ చేసే అధికారం ఆ సంస్థకే కల్పిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నగరంలో చేపడుతున్న ఎలివేటెడ్ కారిడార్లకు భూసేకరణ ప్రక్రియలో టీడీఆర్‌లను ఎవరు జారీ చేయాలనే దానిపై ఇప్పటివరకు సందిగ్ధత నెలకొని ఉండేది. ఏ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ/ఎంఎంసీ)పరిధిలో భూ సేకరణ చేస్తే సంబంధిత కార్పొరేషనే ఇప్పటివరకు టీడీఆర్ జారీ చేసేది. అయితే, రావిర్యాల నుంచి ఫ్యూచర్ సిటీ వరకు నిర్మిస్తున్న రతన్‌టాటా రేడియల్ రోడ్డుకు పరిహారంగా టీడీఆర్ కావాల్సినవారు ఎంఎంసీని సంప్రదించాలా? హెచ్ఎండీఏను సంప్రదించాలా? లేదా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)ని సంప్రదించాలా అనే సందేహం ఉండేది. ఈ నేపథ్యంలో వీటన్నింటికి చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండీఏ ప్రాజెక్టులకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవల్‌పమెంట్ అథారిటీనే (హెచ్ఎండీఏ) టీడీఆర్ జారీ చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఈ టీడీఆర్‌లను హెచ్ఎండీఏ పరిధిలో ఎక్కడైనా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించింది. తాజా నిర్ణయంతో హెచ్ఎండీఏ పరిధిలో భూసేకరణ, అభివృద్ధి పనులకు ఇక మరింత ఊతం లభించనుంది. బిల్డ్నౌలోనే సింగిల్ బ్యాంకు టీడీఆర్ పొందిన నిర్వాసితులు క్రయ, విక్రయాలు చేసుకోవడానికి ఇప్పటివరకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు ప్రత్యేకంగా వెబ్సైట్లోనే టీడీఆర్ బ్యాంకును ఏర్పాటు చేశాయి. అయితే, కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఎంఎంసీ, సీఎంసీలు, పెరీ అర్బన్ రీజియన్ పరిధిలో ఎఫ్సీడీఏలు వచ్చాయి. దీంతో రాష్ట్రం మొత్తానికి ఒకే టీడీఆర్ బ్యాంకును బిల్డ్ నౌలో ఏర్పాటు చేసేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఒక టీడీఆర్‌ను పలు నిర్మాణ అనుమతులకు వినియోగిస్తూ తప్పదోవ

ప్రతినెలా వచ్చే కరెంట్ బిల్లు చూసి "ఇక ఇంట్లో సోలార్ ప్యానెల్ పెట్టేస్తే ఈ బిల్లు గోల ఉండదు కదా?" అని చాలామంది అనుకుంటారు. కానీ సోలార్ పెట్టాలంటే మొదట్లోనే పెద్ద మొత్తంలో డబ్బు పెట్టాలి. అదే కరెంట్ కనెక్షన్‌కు మొదట్లో పెట్టుబడి అవసరం లేదు, కానీ జీవితాంతం బిల్లు కడుతూనే ఉండాలి. ఇంతకీ సోలార్ సిస్టమ్ పెట్టడం లాభమా? లేక కరెంటు బిల్లు కట్టుకోవడమే బెటరా? ఓ సింపుల్ లెక్కతో చూద్దాం. మంచి వాతావరణంలో 1 kW గ్రిడ్-కనెక్టెడ్ రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్ రోజుకు సగటున 4-5 యూనిట్ల వరకు కరెంటును ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్యానెల్స్ లైఫ్‌టైమ్ 25 ఏళ్ల వరకు ఉంటుంది. అంటే 1 kW సోలార్ సిస్టమ్ ఏడాదికి సుమారు 1,460-1,825 యూనిట్ల వరకు కరెంట్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ సూర్యరశ్మి, నీడ, ప్యానెల్ నాణ్యత, ఇంటి పైకప్పు నిర్మాణం, నిర్వహణ వంటి కారణాలతో ఉత్పత్తిలో మార్పులు ఉంటాయి. 1 kW సోలార్ సిస్టమ్ పెట్టడానికి దాదాపు 10 చదరపు మీటర్ల నీడ పడని ఖాళీ స్థలం అవసరం. ఒక ఇంట్లో నెలకు 200–300 యూనిట్ల కరెంట్ వాడితే, వాళ్లు 2 kW లేదా 3 kW రూఫ్‌టాప్ సోలార్ గురించి ఆలోచించవచ్చు. 2 kW సోలార్ సిస్టమ్ రోజుకు సుమారు 8–10 యూనిట్లు, 3 kW సోలార్ సిస్టమ్ రోజుకు సుమారు 12–15 యూనిట్ల కరెంట్ ఉత్పత్తి చేస్తుంది. అయితే వర్షాలు, మబ్బులు, నీడ వల్ల ఉత్పత్తి తగ్గవచ్చు. కేంద్ర ప్రభుత్వ 'పీఎం సూర్యఘర్ యోజన (PM-Surya Ghar: Muft Bijli Yojana)' పథకం కింద, ఇళ్లపై సోలార్ సిస్టమ్స్ పెట్టుకోవడానికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం… మొదటి 2 kW సోలార్ సిస్టమ్ ఏర్పాటుకు అయ్యే ఖర్చులో 60% వరకు, అదనంగా మరో 1 kW సోలార్ సిస్టమ్ పెట్టుకుంటే దీనిపై
.webp)
విద్యుత్ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు..! రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతోపాటు, తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి వచ్చేలా సమగ్ర ప్రణాళికలను తయారుచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షంచారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... రాష్ట్రంలోని 130 రిజర్వాయర్ల వద్ద పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేయాలన్నారు. పోలవరం వద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటుపై వచ్చిన ప్రతిపాదన ప్రస్తావనకు వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి ఈ సూచన చేశారు. ఈ మేరకు అధ్యయనం చేయడంతోపాటు... ఎకనమిక్ ఫీజిబిలిటీపై స్టడీ చేయాలన్నారు. ఇక ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉన్నందున్న వివిధ రిజర్వాయర్లు.. ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి కష్టసాధ్యం కావచ్చనే అంశాన్ని ప్రస్తావిస్తూ... విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగం పుంజుకోవడంతో పాటు... ప్రతి ఆరేళ్లకూ విద్యుత్ వినియోగం రెట్టింపు అవుతుందని... దానికి అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అదే సమయంలో విద్యుత్ పంపిణీ నష్టాలను మరింత తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించారు. సౌర విద్యుత్ ఉత్పత్తిని వీలైనంత మేర పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పీఎం సూర్యఘర్ కింద 6 లక్షల సోలార్ కనెక్షన్లను సెప్టెంబరు నాటికి ఇన్స్టాల్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాన్ సూర్య ఘర్ కింద మరో 3 లక్షల కనెక్షన్లను త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. వీటితో పాటు మరో 10 లక్షల కనెక్షన్ల కోసం కేంద్రానికి దరఖాస్తు చేయాలని చెప్పారు. ఇక కుసుమ్ పథకం కింద లక్ష్యాన్ని పూర్తిచేస్తూనే, అదనంగా 2,000 మెగావాట్ల సామర్థ్యం కోసం కేంద్రాన్ని కోరాలని సీఎం సూచించారు. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ వంటి వనరులను సమన్వయం చేసుకుని తక్కువ

దేశవ్యాప్తంగా బొగ్గుకు ఒకే ధర ఉండేలా త్వరలో కోల్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు చేపడుతోందన్నారు. ఢిల్లీ: దేశవ్యాప్తంగా బొగ్గుకు ఒకే ధర ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. త్వరలో కోల్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దీనివల్ల విద్యుత్ ఉత్పత్తి వ్యయం తగ్గి వినియోగదారులకు తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2018 నుంచి బొగ్గు ధరలను పెంచలేదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అదే విధంగా సిమెంట్, స్టీల్ వంటి రంగాలకు సంబంధించిన ధరల విషయంలోనూ పెరుగుదలను నియంత్రించే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మినరల్స్ అంశంలో రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేయబోదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. పన్నులు, సెస్‌ల విషయంలోనూ కేంద్రం జోక్యం చేసుకోదని తెలిపారు. రాష్ట్రాలకు ఉన్న హక్కులు, అధికారాలను గౌరవిస్తూనే ఖనిజ రంగ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. దేశంలో మినరల్స్ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఫుకెట్-న్యూఢిల్లీ ఫ్లైట్ ఉదంతంపై కేంద్రం సీరియస్! దేశ రాజధానిలో ఆగస్టు 15 వేడుకలకు సర్వం సిద్ధం

Minister Narayana: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై మంత్రి పి.నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడిందని ఆయన అన్నారు. రాష్ట్రానికి మంచి రాజధాని నిర్మించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు సాగారని తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాలకు దీటుగా అమరావతిని నిర్మించాలన్నది చంద్రబాబు విజన్ అని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి కేవలం పరిపాలనా రాజధానిగా కాకుండా రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా కూడా అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో ప్రణాళికలు రూపొందించారని చెప్పారు. అమరావతిని ప్రపంచంలోని టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు విజన్ అని మంత్రి నారాయణ తెలిపారు. రహదారులు, మౌలిక వసతులు, ఆధునిక నిర్మాణాలతో రాజధానిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. అమరావతి అభివృద్ధిలో రైతులు, ప్రభుత్వం కలిసి ముందుకు సాగుతాయని మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబుపై నమ్మకంతో రైతుల భూములు రాజధాని నిర్మాణానికి ఎలాంటి కట్టడాలైనా భూమి అవసరమని మంత్రి నారాయణ అన్నారు. చంద్రబాబుపై నమ్మకంతో రాజధాని రైతులు తమ భూములను సమీకరణకు ఇచ్చారని తెలిపారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి లేకుండానే రైతులు రాజధాని నిర్మాణంలో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. కృష్ణా నది ఒడ్డున అమరావతిని ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమన్యాయం జరుగుతుందనే ఆలోచనతో చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని మంత్రి వివరించారు. సింగపూర్ మాస్టర్ ప్లాన్ చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతో సింగపూర్ ప్రభుత్వం అమరావతికి మాస్టర్ ప్లాన్ అందించిందని నారాయణ పేర్కొన్నారు. అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో అప్పట్లో ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. అయితే, 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల కాలంలో అమరావతి రాజధాని పనులన్నీ నిలిచిపోయాయని మంత్రి నారాయణ ఆరోపించారు. అప్పటి ప్రభుత్వం రాజధాని విషయంలో మూడు రాజధానుల విధానాన్ని తీసుకురావడంతో అమరావతి అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పిన

CM Chandrababu: రాజధాని అమరావతి నిర్మాణంలో రైతుల పాత్ర ఎంతో కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి రైతులది కేవలం త్యాగం మాత్రమే కాదని, భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే అంశమని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణం తన గ్రేట్ విజన్‌కు తొలి విజయమని అన్నారు. రైతుల నమ్మకం, సహకారం లేకపోతే అమరావతి రాజధాని సాధ్యమయ్యేది కాదని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిని అనుసంధానించే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ-3ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఉండవల్లి వద్ద సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానించే స్టీల్ బ్రిడ్జిల ప్రారంభానికి సూచికగా శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. రాజధాని ఎక్కడ అన్నదానిపై తొలుత గందరగోళం 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు కొత్త రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉండాలనే అంశంపై స్పష్టత లేకపోయిందని చంద్రబాబు తెలిపారు. శివరామకృష్ణన్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశామని, కమిటీ నివేదికలో మెజార్టీ ప్రజలు రాజధానిని ఈ ప్రాంతంలోనే నిర్మించాలని అభిప్రాయపడ్డారని చెప్పారు. అనంతరం అసెంబ్లీలో చర్చ జరిగి అమరావతిని రాజధానిగా నిర్ణయించినట్లు తెలిపారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తొలి రాష్ట్రంగా ఏర్పడిందని, రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమరావతిలో రాజధాని నిర్మించాలని సంకల్పించినట్లు సీఎం వివరించారు. హైటెక్ సిటీని కట్టినప్పుడు కూడా విమర్శలు తాను హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మించేటప్పుడు కూడా పలువురు విమర్శలు చేశారని చంద్రబాబు గుర్తుచేశారు. రోడ్లు వేసి తాను షో చేస్తున్నానని కొందరు ఎగతాళి చేశారని, అయినా వెనక్కి తగ్గలేదన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వంటి మౌలిక వసతులను నిర్మించి చూపించానని చెప్పారు. అదే నమ్మకంతో అమరావతి నిర్మాణానికి రైతులు ముందుకొచ్చారని సీఎం తెలిపారు. తాను సైబరాబాద్‌ను నిర్మించిన అనుభవాన్ని చూసి రైతుల్లో విశ్వాసం పెరిగిందని, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి ప్రాంతాల రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారని పేర్కొన్నారు. రైతులు లేకపోతే అమరావతి లేదు రాజధాని నిర్మాణానికి రైతులు

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి ఇప్పుడే ప్రారంభమైందని, భవిష్యత్తులో దేశంలోనే నంబర్ వన్ రాజధానిగా అమరావతి నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రజలంతా అమరావతి అభివృద్ధిపై ఆలోచించాలని, రాబోయే రోజుల్లో రాజధాని నిర్మాణం అన్‌స్టాపబుల్‌గా కొనసాగుతుందని పేర్కొన్నారు. రాజధాని అమరావతిని అనుసంధానించే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ-3ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఉండవల్లి వద్ద సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానించే స్టీల్ బ్రిడ్జిల ప్రారంభానికి సూచికగా శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. 96 కి.మీ. ఇన్నర్ రింగ్ రోడ్డు.. 190 కి.మీ. ఔటర్ రింగ్ రోడ్డు అమరావతి చుట్టూ 96 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు, 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించబోతున్నామని చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టులకు కేంద్రం కూడా ఆమోదం తెలుపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పనులను ప్రారంభించారని, 2028లో భారతదేశం మెచ్చే అమరావతి ప్రారంభోత్సవానికి ప్రధాని మళ్లీ వస్తారని పేర్కొన్నారు. ఇక, అమరావతి వాస్తు పరంగా కూడా అద్భుతమైన ప్రాంతమని చంద్రబాబు అన్నారు. స్పీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తయిన తర్వాత అమరావతి అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణం ఒకవైపు వేగంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతుందని స్పష్టం చేశారు. అమరావతి ఉద్యమంలో పవన్ కల్యాణ్ కీలక పాత్ర గతంలో వైసీపీ నాయకులు రాష్ట్రంలో విధ్వంసానికి పాల్పడ్డారని చంద్రబాబు విమర్శించారు. అమరావతి రాజధాని ఉద్యమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా మద్దతుగా పోరాడారని గుర్తుచేశారు. ముళ్లకంపలను సైతం లెక్కచేయకుండా రైతులకు అండగా పవన్ నిలిచారని పేర్కొన్నారు. తన భార్య చేతి గాజులను కూడా అమరావతి కోసం విరాళంగా ఇచ్చారని చంద్రబాబు తెలిపారు. ఆధునిక మౌలిక వసతులతో రాజధాని అన్ని కష్టాలను అధిగమించి అమరావతి రాజధాని నిర్మాణాన్ని మళ్లీ ప్రారంభించామని చంద్రబాబు అన్నారు. రాజధానిలో విద్యుత్ తీగలు, కరెంట్ పోల్స్ కనిపించకుండా
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు కీలక ప్రాంతాల మధ్య రాకపోకలను వేగవంతం చేయాలన్న లక్ష్యంతో చేపడుతున్న హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్-సిటీ) ప్రాజెక్టులో మరో కీలక ముందడుగుపడింది. హెచ్-సిటీలో భాగంగా చేపట్టనున్న మూడు ప్రధాన రహదారి మౌలిక వసతుల పనులకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ బుధవారం జీవో 784ను జారీ చేసింది.ఈ పనులకు సంబంధించిన టెండర్ కాంట్రాక్టును కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్‌కు అప్పగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొత్తం రూ.231.87 కోట్ల ఐబీఎం విలువపై సంస్థ 4.68 శాతం అదనంగా రూ.242.72 కోట్లకు బిడ్ దాఖలు చేసింది. ప్రభుత్వ ఆమోదంతో ఇప్పుడు కాంట్రాక్ట్ ప్రక్రియను పూర్తి చేసి పనులను ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. హెచ్-సిటీ ప్యాకేజీలో భాగంగా మొదటగా ఒవైసీ ఫ్లైఓవర్‌కు లెఫ్ట్ ఆర్మ్ డౌన్ ర్యాంప్ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఫ్లైఓవర్ పరిసరాల్లో ట్రాఫిక్ కదలికలకు అనుగుణంగా అదనపు కనెక్టివిటీ అవసరం ఉన్న నేపథ్యంలో ఈ డౌన్ ర్యాంప్ కీలకంగా మారనుంది. ఫ్లైఓవర్‌పైకి, దిగువకు వెళ్లే వాహనాలకు మరింత సులభమైన రాకపోకలు కల్పించడం ద్వారా స్థానికంగా ట్రాఫిక్ ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది.దాంతో పాటుగా.. హఫీజ్‌బాబా నగర్ నుంచి బాలాపూర్–చర్చ్ రోడ్ వరకు ఆరు లైన్ల టూవే గ్రేడ్ సెపరేటర్‌ను నిర్మించనున్నారు. నగర దక్షిణ ప్రాంతంలో పెరుగుతున్న వాహన రద్దీకి అనుగుణంగా ఈ మార్గాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ప్రయాణ సమయం తగ్గించడంతో పాటు కీలక జంక్షన్ల వద్ద రద్దీని నియంత్రించేందుకు అవకాశం ఉంటుంది. బండ్లగూడ–ఎర్రకుంట క్రాస్‌రోడ్ వద్ద ఆరు లైన్ల ఫ్లైఓవర్‌ను నిర్మించనున్నారు. ఈ ప్రాంతంలో స్థానిక ట్రాఫిక్, ప్రధాన మార్గాలపై నుంచి వచ్చే వాహనాల రాకపోకల కారణంగా ఏర్పడే రద్దీని తగ్గించేందుకు ఫ్లైఓవర్ ఉపయోగపడనుంది. ఈ మూడు పనులు పూర్తయితే నగర దక్షిణ, ఆగ్నేయ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడే

హైదరాబాద్‌లోని ఆస్మాన్‌ఘడ్ డివిజన్ పరిధిలో మరమ్మతు పనుల కారణంగా గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. సైదాబాద్(హైదరాబాద్): హైదరాబాద్‌లోని ఆస్మాన్‌ఘడ్ డివిజన్ పరిధిలో మరమ్మతు పనుల కారణంగా గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. 11కేవీ జయనగర్ ఫీడర్ పరిధిలోని సైదాబాద్ కాలనీ, మెయిన్ రోడ్డు, రామాలయం, ఎస్బీహెచ్ ఆఫీసర్స్ కాలనీ, లక్ష్మీనగర్, సాయిబాబా టెంపుల్ పరిసర ప్రాంతాలలో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆనంద్ బిస్కెట్ ఫ్యాక్టరీ ఫీడర్ పరిధిలోని లక్ష్మీనగర్ ఎక్స్ రోడ్డు, రామాలయం, వాణినగర్, పటేలమ్మ మడిగలు, ఆనంద్ బిస్కెట్ ఫ్యాక్టరీ, ధోబీఘాట్ రోడ్డు పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ తెలిపారు. ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Amaravati Capital Road Network: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాజధానికి రాచమార్గంగా.. రవాణా వ్యవస్థకు వెన్నెముకగా సీడ్ యాక్సెస్ రోడ్డు నిలవనుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇ-3 సీడ్ యాక్సెస్ రోడ్డు రేపు ప్రారంభం కాబోతున్నది. సీడ్ యాక్సెస్ రోడ్డుతోపాటు బకింగ్‌హామ్ కెనాల్‌పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని రేపు ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ రోడ్డు ప్రారంభంతో రాజధాని ప్రాంతం అమరావతికి రాకపోకలు సాగించేందుకు సులువు కానుంది. రాజధానిలోకి రాకపోకలు మరింత వేగవంతం, సులభతరం చేసేందుకు సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఈ రోడ్డు నిర్మించారు. గ్రిడ్ తరహాలో అభివృద్ధి చేస్తున్న అమరావతి రాజధాని రహదారుల నిర్మాణానికి సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రాజెక్టు కీలక ముందడుగుగా నిలవనుందని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతిలోని ఎన్-1 నుంచి ఎన్-17 వరకు ఉన్న అన్ని ఎన్-సిరీస్ రహదారులను ఇ-3 అనుసంధానం చేస్తుంది. ఉత్తరం నుంచి దక్షిణం, తూర్పు నుంచి పడమర దిశల్లో గ్రిడ్ తరహాలో రహదారులను ఏపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఎలాంటి మలుపులు లేకుండా రాజధాని ప్రాంతంలోకి నేరుగా చేరుకునేలా ఈ రహదారి వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఈ, ఎన్ సిరీస్ రోడ్లలో కలిపి 34 ప్రధాన రహదారులు ఉండగా.. మొత్తం 350 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం జరుగుతోంది. భవిష్యత్‌లో పెరగనున్న ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని రాజధాని రవాణా వ్యవస్థకు ఇది వెన్నెముకగా ప్రభుత్వం భావిస్తోంది. సీడ్ యాక్సెస్ రోడ్డు వివరాలు దొండపాడు నుంచి ప్రారంభమయ్యే ఇ-3 రోడ్డు

ఇండియా ఇంధన రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. సాంప్రదాయ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి పై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ, హరిత ఇంధనం వైపు వేగంగా అడుగులు వేస్తోంది. గత నాలుగేళ్లలో దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తి ఏకంగా 138 శాతానికి పైగా వృద్ధి చెందింది. ఇది కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు. దేశ వ్యూహాత్మక ఇంధన అవసరాల దిశలో వచ్చిన అసాధారణ పరిణామం. విద్యుత్ డిమాండ్ ఏటా వేగంగా పెరుగుతున్న తరుణంలో.. పునరుత్పాదక శక్తి వనరులను విస్తరించడం ఆవశ్యకంగా మారింది. సుమారు 60 బిలియన్ యూనిట్ల స్థాయిలో ఉన్న సౌర విద్యుత్ ఉత్పత్తి.. ప్రస్తుతం 143 బిలియన్ యూనిట్లకు పైగా పెరిగింది. ఇదే సమయంలో దేశంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తి కూడా 1,484 బిలియన్ యూనిట్ల నుండి 1,840 బిలియన్ యూనిట్లకు పైగా పెరిగింది. విస్తరిస్తున్న ఈ డిమాండ్‌ను తట్టుకోవడంలో సోలార్ ప్రాజెక్టులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వేగంగా సౌర శక్తిని విస్తరిస్తున్న ప్రధాన దేశాల జాబితాలో భారత్ అగ్రగామిగా నిలుస్తోంది. దశాబ్దాల ప్రయాణం.. 3 గిగావాట్ల నుండి 129 గిగావాట్లకు.. సౌర రంగంలో ఈ స్థాయి పురోగతి ఒక్క రోజులో సాధ్యమైనది కాదు. గత పన్నెండేళ్లలో ప్రభుత్వ విధానాలు, విదేశీ, ప్రైవేట్ పెట్టుబడులు, ప్యానెల్ల తయారీలో సాంకేతిక విప్లవం, పోటీ బిడ్డింగ్ విధానాలు ఈ రంగాన్ని పరుగులు పెట్టించాయి. 2014 నాటికి దేశంలో సౌర విద్యుత్ స్థాపిత సామర్థ్యం కేవలం 3 గిగావాట్ల మేర మాత్రమే ఉండేది. కానీ ప్రస్తుతం ఆ సామర్థ్యం 129 గిగావాట్లకు చేరుకోవడం ఒక మైలురాయి. . గుర్తించాల్సిన అంశమేంటంటే.. స్థాపిత సామర్థ్యం (గిగావాట్లు) పెరిగినంత మాత్రాన, నిరంతర విద్యుత్ ఉత్పత్తి (బిలియన్ యూనిట్లు) జరగదు. వాతావరణ మార్పులు, మేఘావరణం, సూర్యకాంతి సమయం, గ్రిడ్ పరిమితులు వాస్తవ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం: గృహ వినియోగదారులకు సౌర కాంతి సాధారణ పౌరులను