
దిశా శాలియన్ మృతి కేసు.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ మృతి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ మృతి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

ఆ హీరో ఫ్యాన్స్ మీరున్న సిటీలో మీ కళ్ళ ముందు ఉండే ఉంటారు.. అచ్చు ఆ హీరోలాగానే హెయిర్ స్టైల్, డ్రెస్, ఫేస్ కట్స్ తో 24 అవర్స్ ఆన్ మై హీరో యాటిట్యూడ్ అనేలా ఉండటం కూడా ఆ హీరో ఫ్యాన్స్ నైజం. కానీ ఆ హీరో సుమారు 270 చిత్రాల్లో చేస్తే 180కి పైగా ప్లాప్స్. పైగా ముప్పై ఏళ్ల పాటు సరైన సోలో హిట్ లేదు. నిజం సైతం నిజామా అని ఆశ్చర్యపోయినా కూడా ఇది నిజమే. కానీ తన క్రేజ్, స్టార్డమ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఆయనే భారతీయ సినీ యవనికపై 'డిస్కో డాన్సర్'గా ముద్ర వేసుకున్న హీరో మిథున్ చక్రవర్తి. . 1976లో ప్రముఖ దర్శకుడు మృణాల్ సేన్ తెరకెక్కించిన 'మృగయ' అనే క్లాసిక్ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన మిథున్, తొలి సినిమాతోనే ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత 1982లో వచ్చిన 'డిస్కో డాన్సర్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించారు. అప్పట్లోనే ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆ కాలపు అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అక్కడ నుంచి మిథున్ ఇండియాలోనే మోస్ట్ డిమాండింగ్ స్టార్లలో ఒకరిగా మారారు. అయితే కాలం మారే కొద్దీ కథల ఎంపికలో వేగం, క్వాలిటీ కంటే క్వాంటిటీకే ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. 90ల కాలంలో ఏడాదికి పదుల సంఖ్యలో, తక్కువ బడ్జెట్ మరియు వేగంగా పూర్తయ్యే సినిమాల్లో నటిస్తూ రికార్డులు క్రియేట్ చేశారు. దీనివల్ల ఆయన ఖాతాలో ఓటములు ఎక్కువగా చేరుతూ వచ్చాయి. 1993 నుంచి 1998 మధ్యకాలంలోనే ఆయన నటించిన 33 చిత్రాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. అలా తన మొత్తం కెరీర్లో 350కి పైగా చిత్రాల్లో నటించగా, ఏకంగా 180కి పైగా సినిమాలు తీవ్రమైన డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. దాదాపు 30 ఏళ్ల పాటు బాక్సాఫీస్

ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ తన ఆత్మకథ ‘రెహ్మాన్: ఏ రెనైసాన్స్’పై కీలక ప్రకటన చేశారు. భారతీయ సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ (A. R. Rahman) అభిమానులకు శుభవార్త చెప్పారు. తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతోందని అన్నారు. రచయిత్రి రూపా చక్రవర్తి (Rupa Chakravarti) తో కలిసి తాను రాయబోయే ఆత్మకథ గురించి ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. ‘రెహ్మాన్: ఏ రెనైసాన్స్’ (Rahman A Renaissance) అనే పేరుతో రాయనున్న పుస్తకం కోసం రూపా చక్రవర్తి, తాను రచయితలుగా కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు. ఈ పుస్తకంలో ‘నా ప్రపంచాన్ని తీర్చిదిద్దిన సంగీతం, ఆలోచనలు, సవాళ్లు, ప్రభావాలు, సృజనాత్మక ప్రయాణంపై మీకు పూర్తి అవగాహన కల్పిస్తుంది’ అని పేర్కొన్నారు

ప్రముఖ నటీమణి శంకరమంచి జానకి... తన తొలి చిత్రం 'షావుకారు'నే ఇంటిపేరుగా మార్చేసుకుంది. 76 సంవత్సరాల క్రితం ఏప్రిల్ 7, 1950లో విడుదలైన ఆ సినిమా జానకి జీవితాన్ని మార్చేసింది. ప్రముఖ నటీమణి శంకరమంచి జానకి... తన తొలి చిత్రం 'షావుకారు'నే ఇంటిపేరుగా మార్చేసుకుంది. 76 సంవత్సరాల క్రితం ఏప్రిల్ 7, 1950లో విడుదలైన ఆ సినిమా జానకి జీవితాన్ని మార్చేసింది. నిజానికి జానకికి తొలి అవకాశం కె.వి. రెడ్డి దర్శకత్వం వహించిన 'గుణసుందరి కథ'కు వచ్చింది. అదెలాగంటే... మద్రాసు ఆకాశవాణిలో రేడియో అన్నయ్య, అక్కయ్య, వింజమూరి సీతాదేవి, టి.జి. కమలాదేవి, తెన్నేటి హేమలత, ఎ.పి. కోమల, కొంగర జగ్గయ్య, సిహెచ్. నారాయణరావు, ఎస్వీ రంగారావు, గుమ్మడి తదితరులతో పిన్న వయసులోనే జానకి పలు కార్యక్రమాలలో పాల్గొనేది. మొదటి నుంచి ఆమె వాచకానికి మంచి గుర్తింపు ఉండేది. ఒకసారి రేడియోలో జానకి వాయిస్ విన్న బి.ఎన్. రెడ్డి డైరెక్ట్ గా రేడియో స్టేషన్ కు వచ్చేశారు. జానకిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆ తర్వాత ఒకసారి బుచ్చిబాబు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడే ఉన్న బి.ఎన్. రెడ్డి జానకిని చూసి 'నువ్వెవరి పిల్లవు?' అని ప్రశ్నించారు. టేకుమళ్ళ వారమ్మాయిని'ని అని జానకి బదులిచ్చింది. 'సినిమాల్లో వేషం వేస్తావా' అని ఆయన అడిగేతే, మా నాన్నగారు పళ్ళు రాలగొడతారు... అని సమాధానం ఇచ్చింది జానకి. అప్పట్లో ఆయన 'గుణసందరి కథ' సినిమా తీస్తున్నారు. హీరోయిన్ గా అడిగితే, తండ్రి భయంతో ససేమిరా అనేసింది జానకి. అప్పటికి ఆమెకు కేవలం 15 సంవత్సరాల వయస్సే. ఆ తర్వాత ఆ పాత్రను ఎందుకు వదులుకున్నానా? అని బాధపడింది జానకి. 1947 నవంబర్ 5న ఆమె వివాహం శంకరమంచి శ్రీనివాసరావుతో అయ్యింది. ఆయన రేడియో ఇంజనీర్. అయితే ఆస్తిపంపకాలలో జరిగిన అన్యాయంతో శ్రీనివాసరావు వివాహానంతరం ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. దాంతో జానకి మనసు సినిమాలవైపు మళ్ళింది. దాంతో ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు

రియా చక్రవర్తి తన కొత్త ఇంటి ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఈ ఇల్లు తను ఊహించినట్లే చాలా స్టైలిష్‌గా ఉంది. ఫిల్మ్‌మేకర్, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్‌ను రియా తన ఇంటికి ఆహ్వానించింది. ఫరా ఖాన్ ఇంటిలోని ప్రతీ మూలను చూసి, దాని డిజైన్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఫరా ఖాన్ తన కుక్ దిలీప్‌తో కలిసి ప్రైవేట్ లిఫ్ట్ ద్వారా ఇంట్లోకి అడుగుపెట్టారు. మరోవైపు ఉన్న గ్లాస్ డోర్స్ వల్ల ఇల్లు మరింత విశాలంగా, ఓపెన్‌గా కనిపిస్తోంది. ఇంటి ఇంటీరియర్స్‌లో ఎక్కువగా తెలుపు రంగే వాడారు. ఇది ప్రశాంతమైన వాతావరణాన్ని ఇస్తోంది. లివింగ్ రూమ్‌ను ఓపెన్-ప్లాన్ లేఅవుట్లో డిజైన్ చేశారు. డ్రాయింగ్ రూమ్, డైనింగ్ ఏరియా కలిసిపోయి ఉన్నాయి. ఇంటిలో ఫ్లోర్ నుంచి సీలింగ్ వరకు ఉన్న కిటికీలు ప్రధాన ఆకర్షణ. వీటివల్ల గదిలోకి సహజమైన వెలుతురు బాగా వస్తుంది. దీంతో ఇల్లు మరింత విశాలంగా అనిపిస్తుంది. ట్రాక్ లైట్లు, ఆధునిక ఫిక్చర్స్ అన్నీ మినిమలిస్ట్ డెకర్‌లో చక్కగా కలిసిపోయాయి. ఫర్నిచర్ కూడా ఇంటికి ప్రత్యేక అందాన్ని తెచ్చింది. క్రీమ్ కలర్ రగ్ మధ్యలో ఒక రౌండ్ కాఫీ టేబుల్ ఉంది. దాని చుట్టూ ఒక వైట్ సోఫా, సేజ్ గ్రీన్ సోఫా, విక్టోరియన్-స్టైల్ యాక్సెంట్ చైర్ ఉన్నాయి. డైనింగ్ ఏరియాలో నాలుగు సీట్ల రౌండ్ టేబుల్ ఉంది. దానిపై ప్లేట్లు, గ్లాసులు, కత్తిపీటలు చక్కగా అమర్చారు. దగ్గర్లోనే పువ్వులతో అలంకరించిన వైట్ స్టోరేజ్ క్యాబినెట్ ఉంది. ఇండోర్ ప్లాంట్స్ లివింగ్ స్పేస్‌కు పచ్చదనాన్ని జోడిస్తున్నాయి. ఆ తర్వాత ఫరా ఖాన్, రియాను తన బెడ్రూమ్ చూపించమని అడిగింది. ఆ గది కొంచెం చిందరవందరగా ఉందని రియా చెప్పినా, లోపలికి అడుగుపెట్టిన ఫరా మాత్రం చాలా ఇంప్రెస్ అయ్యింది. ఆ గదిలో పెద్ద కిటికీలు, గ్లాస్ స్లైడింగ్ డోర్లు ఉన్నాయి. దీనివల్ల గది చాలా ప్రకాశవంతంగా, విశాలంగా కనిపిస్తుంది. ఇది గదిలా కాకుండా, ఓ ఇల్లులా

టీమిండియాను వరుస గాయాల సమస్య కలవరపెడుతోంది. కీలక ఆటగాళ్లందరూ ఒక్కొక్కరిగా గాయాల బారిన పడుతుండటంతో భారత జట్టు ప్రాక్టీస్ క్యాంప్ హాస్పిటల్ వార్డులా మారిపోయింది. ఏకంగా ఒక బలమైన జట్టునే నిర్మించేంత మంది ఆటగాళ్లు గాయపడటంతో బీసీసీఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు చేరుకుని, సిఓఈ హెడ్ వివిఎస్ లక్ష్మణ్‌తో అత్యవసరంగా భేటీ కావడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ సమావేశంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా వర్చువల్‌గా పాల్గొన్నారు. ప్రస్తుతం బెంగళూరులోని రిహాబ్ సెంటర్లో ఉన్న ఆటగాళ్ల జాబితా చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. బుమ్రా మోకాలి వాపు సమస్యతో ఇబ్బంది పడుతుంటే, సాయి సుదర్శన్ బొటనవేలి నొప్పితో బాధపడుతున్నారు. ఆకాష్ దీప్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి వంటి కీలక ఆటగాళ్లు వివిధ రకాల గాయాల బారిన పడ్డారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఆటగాళ్లను పూర్తి ఫిట్నెస్ సాధించకముందే మైదానంలోకి దించడంపై సెలెక్షన్ కమిటీకి, స్పోర్ట్స్ సైన్స్ విభాగానికి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడమే ఈ అత్యవసర సమావేశానికి దారితీసింది. స్పోర్ట్స్ సైన్స్ విభాగానికి శాశ్వత హెడ్ లేకపోవడం, ఆటగాళ్లు సరైన ఫిట్నెస్ ప్రమాణాలు పాటించకపోవడంపై బీసీసీఐ అసంతృప్తిగా ఉంది. హర్షిత్ రాణా ఓవర్ వెయిట్‌తో కనిపించడం, నితీష్ రెడ్డి బౌలింగ్ వేగం పెంచే క్రమంలో గాయపడటం చర్చనీయాంశమైంది. మరోవైపు బుమ్రా, సాయి సుదర్శన్‌ల లభ్యతపై వైద్య బృందం, సెలెక్టర్ల మధ్య అస్పష్టత నెలకొనడంతో ఇకపై తొందరపడి ఆటగాళ్లను మైదానంలోకి దించకూడదని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వయసుతో మీకేం పని? వైభవ్ సూర్యవంశీపై బ్రెట్ లీ ప్రశంసలు గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్న దానిని చూసి.. కాపరులు పరుగో పరుగు సామాన్యుడికి మరో షాక్.. సెప్టెంబర్‌లో

సినీ పరిశ్రమలో ఎంతోమంది నటులు జీరో నుండి హీరోలుగా ఎదిగారు. వారిలో ఈ దిగ్గజ నటుడు ఒకరు. సినిమాల్లోకి రాకముందు ఎన్నో కష్టాలను అనుభవించాడు. ఆయన జీవిత ప్రయాణం అత్యంత స్ఫూర్తిదాయకం. అన్నం లేక, డబ్బుల్లేక తీవ్ర కష్టాలను ఎదుర్కొని, అడుగడుగునా ఆకలి, నిరాశలను జయించి ఆయన స్టార్‌డమ్‌ను చేరుకున్నాడు. ఈ కష్టాల కడలిని ఈదుకుంటూ ముందుకు సాగిన ఆయన జీవిత కథ అనేకమందికి ఆదర్శం. ఆయన మరెవరో కాదు.. బాలీవుడ్ లెజెండ్రీ యాక్టర్ మిథున్ చక్రవర్తి. నటుడు మిథున్ చక్రవర్తి బాల్యం, యవ్వనం ఎన్నో సవాళ్లతో కూడుకున్నవి. ఒకానొక సమయంలో ఆయనకు కనీసం తినడానికి తిండి, నిద్రపోవడానికి చోటు కూడా దొరకలేదట. “అన్నం దొరకని సమయాల్లో ఖాళీ కడుపుతో రోజులు గడిపాను. ఆకలి కేకలతో నన్ను నేను తిట్టుకుంటూ, ఏడుస్తూ నిద్రపోయాను. నాకు ఎప్పుడు తిండి దొరుకుతుందా.?, నిద్రపోవడానికి కాస్త చోటు దొరికితే బాగుండు అని ఆలోచిస్తూ భారంగా కాలాన్ని నెట్టుకొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చాలాసార్లు నేను ఫుట్‌పాత్‌ల మీద నిద్రపోయాను” అని ఆయన తన గతాన్ని గుర్తుచేసుకున్నారు. కేవలం జీవనోపాధి కోసమే పనిచేయాల్సి వచ్చిన సందర్భాలు కూడా ఆయన జీవితంలో ఉన్నాయి. నాలుగు మెతుకుల కోసం పార్టీల్లో డ్యాన్స్ చేసేవాడినని, మంచి డ్యాన్స్ చేయగలిగే విలన్‌గానైనా అవకాశం దొరికితే బాగుంటుందని ఆశించేవాడినని మిథున్ చక్రవర్తి వివరించారు. ఇలాంటి తీవ్రమైన కష్టాల మధ్య, భవిష్యత్తుపై నమ్మకం సన్నగిల్లి, మిథున్ చక్రవర్తి ఒకానొక సమయంలో తన ప్రాణాలే తీసుకోవాలని ఆలోచించారు. తాననుకున్నది సాధించలేనేమో అన్న భయం, కలకత్తాకు తిరిగి వెళ్లలేని పరిస్థితి ఆయన్ను ఆ ఆలోచనకు పురిగొల్పాయి. అయితే, తన జీవితంలో ఎదుర్కొన్న ఈ చీకటి రోజులను గుర్తుచేసుకుంటూ, అందరికీ ఒక విలువైన సలహా ఇచ్చారు. “ఎవరూ జీవితాన్ని ముగించాలనుకోకండి. పోరాడండి. నేను ఫైట్ చేశాను. ఇదిగో ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాను” అని చెప్పుకొచ్చారు. మిథున్ చక్రవర్తి సినీ ప్రస్థానం 1976లో