
గోళ్లు విరిగిపోకుండా..!
అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవడానికి మార్కెట్లో లభించే వివిధ రకాల సౌందర్యోత్పత్తుల్ని ప్రయత్నిస్తుంటారు అమ్మాయిలు. అయితే ఇంట్లో అందుబాటులో ఉండే ఆముదం కూడా సౌందర్య సంరక్షణకు తోడ్పడుతుందని చెబుతున్నారు నిపుణులు.

అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవడానికి మార్కెట్లో లభించే వివిధ రకాల సౌందర్యోత్పత్తుల్ని ప్రయత్నిస్తుంటారు అమ్మాయిలు. అయితే ఇంట్లో అందుబాటులో ఉండే ఆముదం కూడా సౌందర్య సంరక్షణకు తోడ్పడుతుందని చెబుతున్నారు నిపుణులు.

ఆవిరి కుడుములంటే గణనాథుడికి మహా ఇష్టం. అందుకే వినాయక చవితి రోజున మోదకాలు చేసి ఆ పార్వతీ నందనుడికి నివేదిస్తాం. సాధారణంగా వీటిని బియ్యప్పిండితో తయారుచేస్తాం. అందులో స్టఫింగ్ కోసం కొబ్బరి తురుము, బెల్లం, నెయ్యి, డ్రైఫ్రూట్స్.. వంటివి వాడతాం.

గ్లోబల్ ఇన్వెస్టర్లు తిరిగి భారత మార్కెట్ వైపు మొగ్గు చూపుతుండటంతో కొత్త ఎఫ్‌పీఐల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగాయి. రెండు నెలల్లోనే ఏకంగా 49 కొత్త ఎఫ్‌పీఐలు సెబీలో నమోదు కావడం విశేషం. ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 2: భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FPI) కొనుగోళ్లు మళ్లీ పుంజుకుంటున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్లు పకడ్బందీ వ్యూహంతో తిరిగి భారత మార్కెట్ వైపు మొగ్గు చూపుతుండటంతో కొత్త ఎఫ్‌పీఐల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగాయి. రెండు నెలల్లోనే(జూలై-ఆగస్టు) ఏకంగా 49 కొత్త ఎఫ్‌పీఐలు సెబీ(SEBI)లో నమోదు కావడం విశేషం. పెరిగిన ఎఫ్‌పీఐల సంఖ్య: 2026 మొదటి ఆరు నెలల్లో (జనవరి-జూన్) 52 ఎఫ్‌పీఐలు మాత్రమే నమోదవగా, జులై, ఆగస్టు నెలల్లో ఆ సంఖ్య 49కి చేరింది. దీంతో భారత మార్కెట్లలో మొత్తం ఎఫ్‌పీఐల సంఖ్య 12,243కి పెరిగింది. మళ్లీ నెట్ బైయర్లు: ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రూ. 2 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించిన విదేశీ పెట్టుబడిదారులు, జులై, ఆగస్టు నెలల్లో భారీగా కొనుగోళ్లు జరిపారు. జులైలో రూ.40,031 కోట్లు, ఆగస్టులో రూ.25,492 కోట్ల విలువైన సెక్యూరిటీలను కొనుగోలు చేశారు. నెలవారీ సగటు: ఈ ఏడాది ఆరంభంలో నెలకు సగటున కేవలం 8 కొత్త ఎఫ్‌పీఐలు నమోదు కాగా, గత రెండు నెలల్లో ఆ వేగం పెరిగి నెలకు 25 కొత్త ఫండ్లు నమోదు కావడం గమనార్హం. విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు భారత ప్రభుత్వం ఇటీవలి కాలంలో పలు కీలక సడలింపులు, నిర్ణయాలు ప్రకటించింది. 1. పన్ను మినహాయింపులు(Tax Exemptions): జూన్ 5న కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సెక్యూరిటీలలో(G-Secs) పెట్టుబడి పెట్టే ఎఫ్‌పీఐలకు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్, వడ్డీ ఆదాయంపై పూర్తి పన్ను మినహాయింపును ప్రకటించింది. 2. FAR రూట్ విస్తరణ: లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు, గ్లోబల్ పెన్షన్ ఫండ్లు, సోవరిన్ వెల్త్ ఫండ్లను ఆకర్షించడానికి 15, 30, 40 ఏళ్ల జారీలతో

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ సంజు శాంసన్ జట్టులోకి వచ్చాడు. అటు యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా చోటు దక్కించుకున్నాడు. దీంతో ఓపెనింగ్ జోడీపై ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఇంటర్నెట్ డెస్క్: వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల ఈ యువ సంచలనం బ్యాటింగ్ చూడటానికి రెండు కళ్లు సరిపోవు. భారీ షాట్లతో బౌలర్లను బెంబేలెత్తించే వైభవ్.. అత్యంత పిన్న వయసులోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్ 13 నుంచి టీమిండియా.. అఫ్గానిస్థాన్‌లో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించిన జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ సంజు శాంసన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అటు వైభవ్ సూర్యవంశీ కూడా జట్టులో ఉన్నాడు. దీంతో అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌లో భారత ఓపెనింగ్ జోడీ ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన సంజును జట్టు నుంచి తప్పించి వైభవ్‌కు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు అభిషేక్ శర్మ-వైభవ్ సూర్యవంశీ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఇంగ్లండ్‌పై నిరాశపరిచిన వైభవ్.. జింబాబ్వేపై చెలరేగాడు. అయితే అఫ్గాన్ సిరీస్‌లో సంజు రాకతో వైభవ్ సూర్యవంశీకి షాక్ తగిలే అవకాశం ఉంది. ఎప్పటిలాగే సీనియర్ ప్లేయర్లు సంజు శాంసన్-అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తే.. వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది. అక్కడ సంజు లేదా అభిషేక్ విఫలమైతేనే వైభవ్‌కు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు, దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున వైభవ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 6 నుంచి ఫైనల్ మ్యాచ్‌లో ఆడనున్నారు. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 11 వరకు జరగనుంది. ఆ వెంటనే అఫ్గానిస్తాన్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇషాన్ కిషన్ ఈస్ట్ జోన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మరి ఈ ఇద్దరూ అఫ్గాన్ సిరీస్ కల్లా సిద్ధంగా ఉంటారా? లేదా? అనేది

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Chanakya Niti Rules: మన జీవితంలో కొన్నిసార్లు బయట వ్యక్తుల కంటే.. మనకు అత్యంత సన్నిహితంగా ఉండే సొంత మనుషులే ఎక్కువ బాధ పెడుతూ ఉంటారు.. మన ఎదుగుదలను చూసి ఓర్వలేక అసూయతో రగిలిపోయే బంధువులతో పాటు మిత్రులు మన చుట్టూనే ఉండిపోతూ ఉంటారు.. వాళ్లు మనపై కుట్రలు పన్నుతున్నారని తెలిసినప్పుడు చాలామంది ఆవేశంతో తప్పులు చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో వేల ఏల క్రితమే ఆచార్య చానక్యుడు తన చాణక్య నీతి శాస్త్రంలో స్పష్టంగా వివరించారు. సన్నిహితులు ద్రోహానికి పాల్పడినప్పుడు ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా.. చాణక్యుడు సూచించిన ఐదు పద్ధతులను పాటిస్తే మిమ్మల్ని మీరు సులభంగా కాపాడుకోవచ్చు.. ప్రశాంతంగా ఉండాల్సి ఉంటుంది.. మీరు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు మీకు ద్రోహం చేస్తున్నారని.. లేదా మీపై కుట్రలు చేస్తున్నారని తెలిసినప్పుడు వెంటనే ఆవేశపడకుండా ఉండడం చాలా మంచిది.. కోపంతో రగిలిపోతూ అప్పటికప్పుడు స్పందించడం వల్ల పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశాలు ఉంటాయని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది.. మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల మీకే నష్టం కలగవచ్చు.. కాబట్టి ఆ సమయంలో ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిదని.. ముఖ్యంగా మౌనంగా ఉండి పరిస్థితులను అంచనా వేయడం చాలా మంచిదని చాణక్యనీతి శాస్త్రం క్లియర్ గా చెబుతోంది.. మీ సీక్రెట్స్ ఎవరితో పంచుకోకూడదు.. కుటుంబంలో నమ్మకం చాలా ముఖ్యమైనదిగా భావించవచ్చు.. కానీ అందరితో అన్నీ పంచుకోవడం తెలివైన పని కాదని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది

టీమిండియాలోకి తిరిగి రావాలని ఎదురుచూస్తున్న ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో అతడు చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంటర్నెట్ డెస్క్: టీమిండియాలోకి తిరిగి రావాలని ఎదురుచూస్తున్న ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యకు మరోసారి నిరాశే ఎదురైంది. సెప్టెంబర్ 13 నుంచి అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు మంగళవారం బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. జట్టులో ప్లేయర్లను వరుస గాయాలు వెంటాడుతుండటంతో కృనాల్‌కు అవకాశం దక్కుతుందంటూ వార్తలు వచ్చాయి. ఐదేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడని అభిమానులు ఆశించారు. కట్ చేస్తే.. జట్టులో కృనాల్‌కు చోటు దక్కలేదు. ఈ క్రమంలో అతడు చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. కృనాల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘ఆశ ఇంకా సజీవంగానే ఉంది’ అన్నట్లు ఓ పోస్ట్ చేశాడు. దానికి ఫింగర్ క్రాస్(HOPE) ఎమోజీతో పాటు భారత జెండా ఎమోజీని జత చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. కృనాల్ పాండ్య చివరిసారిగా 2021లో భారత జట్టు తరఫున బరిలోకి దిగాడు. టీ20ల్లో భారత్‌కు 19 మ్యాచ్‌లు ఆడిన అతడు 10 ఇన్నింగ్స్‌ల్లో 124 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 15 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత అనూహ్య కారణాల వల్ల కృనాల్ జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల ఐపీఎల్లో ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న అతడిని.. జాతీయ జట్టులోకి తీసుకుంటారని భావించారు. అయితే వాషింగ్టన్ సుందర్‌కు ఫిట్నెస్ క్లియరెన్స్ రావాల్సి ఉంది. అతడు ఒకవేళ సుందర్ అందుబాటులోకి రాలేకపోతే.. కృనాల్ పేరును పరిశీలించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వంద కాదు 200 శాతం క్లారిటీ.. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం! ఇదేం విచిత్రం.. ఫీల్డింగ్ కోచ్ కోసం లింక్డిన్లో పాకిస్థాన్ ఓపెన్ హైరింగ్!

Hardik Pandya Injury: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పునరాగమనానికి మరోసారి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఫిట్నెస్ సాధించి జట్టులోకి వచ్చేందుకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో శిక్షణ తీసుకుంటున్న హార్దిక్‌కు తాజాగా కాలికి మరోసారి స్వల్ప గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతానికి బౌలింగ్‌కు దూరంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో హార్దిక్ పునరాగమనం చేస్తాడని భావించినా.. తాజా పరిణామంతో అతడి ఎంపికపై సందేహాలు నెలకొన్నాయి. టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఉంటాయి. ఈ నేపథ్యంలో హార్దిక్ పూర్తి ఫిట్నెస్ సాధించాడా? బౌలింగ్ చేయగలిగే స్థితిలో ఉన్నాడా? అన్నది సెలెక్టర్లకు కీలకంగా మారింది. గాయం నుంచి కోలుకున్న తర్వాత హార్దిక్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో పునరావాస కార్యక్రమం కొనసాగిస్తున్నాడు. ఇటీవల అతడి ఫిట్నెస్ మెరుగుపడటంతో త్వరలోనే మైదానంలోకి వస్తాడని అభిమానులు ఆశించారు. అయితే శిక్షణ సమయంలో కాలికి స్వల్ప ఇబ్బంది రావడంతో ప్రస్తుతం బౌలింగ్ చేయకుండా విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. దీంతో హార్దిక్ రీఎంట్రీపై మరోసారి అనిశ్చితి నెలకొంది. ఎక్కువమంది చదివినది: Video: 6 ఫోర్లు, 7 సిక్సర్లతో విధ్వంసం.. 26 బంతుల్లో 296 స్ట్రైక్ రేట్‌తో కాటేరమ్మ కొడుకు ఊచకోత చూశారా..? హార్దిక్ పాండ్యాను గాయాలు చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఐపీఎల్ సమయంలో ఎదురైన సమస్యల అనంతరం అతడు సీఓఈలో రిహాబిలిటేషన్ ప్రారంభించాడు. అనంతరం ఫిట్నెస్ పరీక్షల సమయంలోనూ కాలి కండరాలకు సంబంధించిన ఇబ్బందులు ఎదురయ్యాయి. పూర్తి ఫిట్నెస్ సాధించిన తర్వాతే పోటీ క్రికెట్లోకి అనుమతించాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకే హార్దిక్ విషయంలో సెలెక్టర్లు ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకపోవచ్చని తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా భారత టీ20 జట్టులో కీలకమైన ఆల్‌రౌండర్. బ్యాటింగ్‌లో భారీ షాట్లు ఆడటంతో పాటు.. మీడియం పేస్‌తో కీలక వికెట్లు తీయగలడు. ముఖ్యంగా జట్టు కూర్పులో అతడి బౌలింగ్ ఎంతో కీలకం

90sలో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన స్టార్ హీరోయిన్లలో రంభ ఒకరు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించి అప్పట్లో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగారు. 90sలో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన స్టార్ హీరోయిన్లలో రంభ (Rambha) ఒకరు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించి అప్పట్లో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగారు. అందం, అభినయం, డ్యాన్స్‌తో ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ సంపాదించుకున్న రంభ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. మధ్యలో దేశముదురు, యమదొంగ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో తళుక్కుమన్నారు. దాదాపు 17 ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె ప్రస్తుతం కుటుంబంతో కలిసి విదేశాల్లో జీవిస్తున్నారు. తాజాగా రంభకు సంబంధించిన ఓ సరదా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన పిల్లలు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా గడిపిన సమయంలో ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. తలకు టవల్ చుట్టుకుని, ఫుల్ ఎనర్జీతో బెల్లీ డ్యాన్స్ చేశారు. ఆమె డ్యాన్స్ చేస్తుంటే పిల్లలు కూడా గంతులు వేస్తూ సందడి చేశారు. దీంతో ఈ వీడియోను చూసిన అభిమానులు ‘రంభలో ఆ ఎనర్జీ ఇంకా అలాగే ఉంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే రంభ వివాహం చేసుకున్నారు. మలేషియాకు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న తర్వాత కెనడాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం పిల్లలు, కుటుంబంతో అక్కడే ఉంటున్నారు. సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు అభిమానులకు దగ్గరవుతూనే ఉన్నారు.ఇటీవల ఓ టీవీ రియాలిటీ షోకు జడ్జ్‌గా వ్యవహరించి బుల్లితెరపై కూడా సందడి చేశారు. మరోవైపు రంభ సెకండ్ ఇన్నింగ్స్‌పై కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాను మళ్లీ సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు గతంలో ఆమె వెల్లడించారు. ఇప్పుడు వైరల్ అవుతోన్న డాన్స్ వీడియో అందుకు నాంది అని

హాలీవుడ్ తెరపై ఎన్నో పాత్రలు వస్తాయి, కానీ కొన్ని పాత్రలు మాత్రం కాలంతో సంబంధం లేకుండా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి ఐకానిక్ క్యారెక్టర్లలో ‘కెప్టన్ జాక్ స్పారో’ ఒకటి. ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ ఫ్రాంచైజీలో జానీ డెప్ పోషించిన ఈ పాత్ర ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యింది. అందుకే మళ్లీ జాక్‌ని ఎప్పుడు తెర మీద చూస్తామా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. కానీ ఈ విషయంలో మేకర్స్ బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారన్న న్యూస్ వైరల్ అవుతోంది. హాలీవుడ్ ప్రొడ్యూసర్ జెర్రీ బ్రక్‌హైమర్ లేటెస్ట్గా ఇచ్చిన క్లూ హాలీవుడ్ వర్గాల్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ 6’ కోసం తాము జానీ డెప్తో చర్చలు జరుపుతున్నామని, స్క్రిప్ట్ వర్క్ నడుస్తోందని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఐదు భాగాల్లో దాదాపు 4.5 బిలియన్ డాలర్ల వసూళ్లను సాధించిన ఈ ఫ్రాంచైజీకి, జాక్ స్పారో పాత్రే కీలకం. అతడు లేని పైరేట్స్ మూవీని ఊహించుకోవడం ఫ్యాన్స్‌కు కష్టమే. ఈ పాత్ర వెనుక ఉన్న క్రేజ్ కేవలం నటన మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. జానీ డెప్ ఆ పాత్రను పండించిన విధానం, ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ.. ఇవన్నీ ఒక కొత్త ట్రెండ్‌ను సెట్ చేశాయి. అయితే, గత కొంతకాలంగా పర్సనల్ లైఫ్ ఇష్యూస్ వల్ల డిస్నీ ఆయనకు దూరమైందనే వార్తలు వినిపించాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఆడియన్స్ డిమాండ్ ముందు స్టూడియోలు కూడా తగ్గక తప్పడం లేదు. ‘పైరేట్స్ 6’లో మార్గోట్ రాబీ లీడ్ రోల్ ప్లే చేసే ఛాన్స్ ఉన్నా, జాక్ స్పారో పాత్రను కూడా ఈ మూవీలో కంటిన్యూ చేసే ప్లాన్‌లో ఉంది మూవీ టీమ్. అయితే జానీ డెప్‌ను హీరోగా కాకుండా సపోర్టింగ్ రోల్లో ఎంత వరకు యాక్సెప్ట్ చేస్తారు? అసలు సపోర్టింగ్ రోల్‌కు ఆయన గ్రీన్

దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక జంతర్ మంతర్ వద్ద మరోసారి హై టెన్షన్ నెలకొంది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసనకారులు ఒకే వేదికపైకి వచ్చారు. విశ్వవిద్యాలయ నిధుల సంఘం (UGC) ప్రవేశపెట్టిన నూతన ఈక్విటీ నిబంధనలను రద్దు చేయడంతో పాటు కుల ప్రాతిపదికన అమలవుతున్న ప్రస్తుత రిజర్వేషన్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. పలు అగ్రవర్ణ సంఘాలు, ఓపెన్ కేటగిరీకి చెందిన ఉద్యోగ, ఉపాధి అభ్యర్థులు, ప్రతినిధులు సమిష్టిగా తరలివచ్చి తమ నిరసన గళాన్ని గట్టిగా వినిపించారు.ఆర్థిక ప్రాతిపదికనే కొలమానం కావాలి: తీవ్ర ఉత్కంఠ మధ్య ధర్నాగత నలభై ఐదు రోజులుగా వివిధ రకాల ఆందోళనలకు నిలయంగా మారిన జంతర్ మంతర్ వద్ద ఈ నిరసన ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం కుల పరిమితుల ఆధారంగా కాకుండా పేదరికం, ఆర్థిక అత్యవసర పరిస్థితులను బట్టే ప్రభుత్వ రంగాలు, ఉద్యోగాల్లో రాయితీలు కల్పించాలని ఆందోళనకారులు స్పష్టం చేశారు. మెరిట్ ప్రాతిపదికన ప్రతిభను ప్రోత్సహించాలని, అర్హత కలిగిన నిజమైన పేద విద్యార్థులకు మాత్రమే ఉన్నత విద్యా సంస్థల్లో అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం దుర్వినియోగం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.రిజర్వేషన్ సంస్కరణల ఆందోళన్: హనుమాన్ చాలీసా పారాయణాలతో హోరెత్తిన ప్రాంగణంనీట్ అభ్యర్థి హర్ష్ దూబే నేతృత్వంలో రిజర్వేషన్ సంస్కరణల ఆందోళన్ పేరిట ఈ నిరసన ర్యాలీ సాగింది. రాజస్థాన్ నుంచి వచ్చిన జనరల్ సేన, చాణక్య సేన, ప్రసిద్ధ కర్ణి సేనతో పాటు సామాజిక మాధ్యమాల ఇన్ఫ్లుయెన్సర్లు ఈ ప్రదర్శనకు పూర్తి మద్దతుగా నిలిచారు. నిరసన సందర్భంగా ఆందోళనకారులు సమిష్టిగా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ జై శ్రీరామ్ నినాదాలు చేశారు. ఈ భక్తిపూర్వక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వ్యాపించడంతో ఈ అంశంపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ ప్రారంభమైంది.48 గంటల్లో మొదలుపెడతారా ? నన్ను రమ్మంటారా ?-అభిజీత్ బిగ్ వార్నింగ్..!అనుమతులపై

మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుండే పాజిటివ్ బజ్ తెచుకున్న ఈ సినిమా మంచి అంచనాల మధ్య ఈ రోజు థియేటర్స్ లో అడుగుపెట్టింది. ఓవర్సీస్ నుండి వస్తున్న టాక్ ఎలా ఉందంటే.. ఫస్టాఫ్ చాలా నేచురల్‌గా, క్లీన్‌గా సాగుతుంది. భావోద్వేగాలు చక్కగా పండాయి. ఇంటర్వెల్ వైపు వెళ్తున్న కొద్దీ కథలో కాస్త టెంపో, ఇంటెన్సిటీతో పాటు థ్రిల్లర్ సన్నివేశాల్లో కొన్ని లాజిక్ లోపాలు అనిపించినప్పటికీ, సినిమా మాత్రం ప్రేక్షకుడిని ఆద్యంతం ఎంజాయ్ చేసేలా ఆకట్టుకుంటుంది. రవితేజ ఎక్కడ ఓవర్ ది బోర్డు వెళ్లకుండా త్రినాథ్ పాత్రలో సూపర్బ్ పర్ఫామెన్స్ చేసాడు. సెకండాఫ్ ఎమోషనల్ డ్రామాను మరియు ట్విస్ట్‌ను డీల్ చేయడంలో దర్శకుడు శివ నిర్వాణ సక్సెస్ అయ్యాడు. అయితే, ట్విస్ట్ వెల్లడైన తర్వాత వచ్చే ఎపిసోడ్ ఇంకాస్త మెరుగ్గా తీయచ్చు అనిపించినా కానీ దర్శకుడు సినిమాను చాలా ఎమోషనల్ క్లైమాక్స్‌తో కథకు తగ్గట్టుగా మలిచాడు. ఇక ‘మల్లెపూల పల్లకి’ పాటతో కూడిన యాక్షన్ ఎపిసోడ్, ప్రేక్షకుల కోలాహలంతో థియేటర్‌ను హోరెత్తించింది. ఇటీవలి కాలంలో ఒక స్టార్ హీరో తన కమర్షియల్ ఇమేజ్ను పక్కనపెట్టి కథకు మాత్రమే నమ్మి చేసిన సినిమా ఇది. ఎక్కడా కమర్షియల్ హంగులు లేకుండా కథకు తగ్గట్టుగా కథనం సాగుతుంది. థ్రిల్లర్ పోర్షన్స్, ఎమోషనల్ పాయింట్ చాలా బలంగా ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుంది. ఒక స్టార్ ఇమేజ్ను పక్కన పెట్టి కథను నమ్మి నటించిన మాస్ మహారాజా రవితేజకు, అంతే నిజాయితీతో సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శివ నిర్వాణ మరియు మైత్రీ మూవీ మేకర్స్‌కు ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గ్యారెంటీ

ఒకప్పుడు ఇమ్రాన్ హష్మీ అంటే రొమాన్స్, మ్యూజిక్, ఇంటెన్స్ లవ్ స్టోరీస్ కానీ ఆ ఇమేజ్‌కి కాలం చెల్లిపోయిందనే టైమ్‌లో ‘ఆవారాపన్ 2’తో మళ్లీ బాక్సాఫీస్‌పై తన మార్క్ చూపించాడు. ‘ఆవారపన్ 2’... విడుదలైన ఐదు రోజుల్లోనే ఇండియాలో 100.75 కోట్ల నెట్, వరల్డ్‌వైడ్‌గా 144.13 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇమ్రాన్ హష్మీ మెయిన్ లీడ్‌గా నటించి 100 కోట్ల క్లబ్‌లోకి వెళ్లిన తొలి సినిమా ఇదే. అంటే చాలా కాలంగా ఎదురుచూస్తున్న సోలో సక్సెస్ ఇప్పుడు సీక్వెల్ రూపంలో దక్కింది. అసలు ఈ సక్సెస్‌కి బలం 2007లో వచ్చిన ‘ఆవారపన్’కున్న కల్ట్ ఫాలోయింగే. ఆ సినిమా అప్పట్లో థియేటర్లలో పెద్దగా ఆడకకపోయినా కాలక్రమంలో శివ్ పండిట్ క్యారెక్టర్, మ్యూజిక్, ఇమ్రాన్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్కి స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అదే నోస్టాల్జియా థియేటర్లలోకి ఆడియన్స్‌ను తీసుకొచ్చిందనే చర్చ జరుగుతోంది. రీసెంట్ టైమ్‌లో ఇమ్రాన్ హీరోగా మాత్రమే కాకుండా యాంటాగనెస్ట్, క్యారెక్టర్ రోల్స్ కూడా ఎంచుకున్నాడు ‘OG’, ‘G2’ వంటి సినిమాలతో కొత్త ఇమేజ్‌కి షిఫ్ట్ అవుతున్న టైమ్‌లో ‘ఆవారపన్ 2’ మాత్రం ఇప్పుడు సోలో హీరోగా తన మార్కెట్ ఇంకా ఉందని ప్రూవ్ చేసింది. అందుకే ఇది కేవలం మరో హిట్ కాదు ఒకప్పుడు తగ్గిపోయిందనుకున్న స్టార్ మార్కెట్‌ను మళ్లీ రీసెట్ చేసిన కెరీర్ కంబ్యాక్ అంటున్నారు ఫ్యాన్స్

రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారీ స్పందన కనిపిస్తోంది. ఆగస్టు 21న బుకింగ్స్ ప్రారంభం కాగా, బుక్ మై షోలో గంటకు 21.71 వేల టికెట్లు అమ్ముడుపోతున్నట్లు పలు వర్గాలు నివేదించాయి. ఆగస్టు 26న విడుదల కానున్న టాక్సిక్‌పై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తికి ఈ ప్రారంభ స్పందన సూచనగా నిలుస్తోంది. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత దాదాపు నాలుగేళ్ల విరామంతో యశ్ టాక్సిక్ ద్వారా తెరపైకి వస్తున్నారు. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామాలో యశ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కీయారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రల్లో నటించారు. వెంకట కె. నారాయణతో కలిసి యశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, ఇంగ్లిష్ భాషల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రస్తుతం పరిమిత మార్కెట్లలోనే అందుబాటులో ఉన్నప్పటికీ అమ్మకాలు వేగంగా సాగుతున్నట్లు సమాచారం. బెంగళూరు సహా కొన్ని ఉత్తరాది ప్రాంతాల్లో ఇప్పటికే లక్షల్లో టికెట్లు అమ్ముడైనట్లు బాక్సాఫీస్ ట్రాకింగ్ ఖాతాలు పేర్కొన్నాయి. దీంతో ఇప్పటివరకు సుమారు ₹4.91 కోట్ల గ్రాస్ నమోదైనట్లు ఆయా వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా, బుక్ మై షోలో టాక్సిక్‌పై ఆసక్తి చూపిన వారి సంఖ్య 10 లక్షలు దాటినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా బుకింగ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఈ గణాంకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. భారత్‌లో టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాకముందే అమెరికాలో ప్రీమియర్ అమ్మకాలకు మంచి స్పందన కనిపించినట్లు సమాచారం. వెంకీ బాక్స్ ఆఫీస్ గణాంకాల ప్రకారం అక్కడ ముందస్తు అమ్మకాలు 1.2 లక్షల డాలర్లను దాటాయి. వేల సంఖ్యలో టికెట్లు అమ్ముడవగా, టెక్సాస్ వంటి

మాస్ మహారాజా రవితేజ నుంచి ఒక సాలిడ్ సినిమా వచ్చి చాలా రోజులైంది. ఆ లోటుని తీరుస్తూ నేడు గ్రాండ్‌గా థియేటర్లలోకి అడుగుపెట్టిన 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ సునామీ సృష్టిస్తోంది. చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్న ఒకే ఒక్క మాట.. "ఇది రవితేజకు పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్". సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు ప్రతీ సీన్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే 'మల్లెపూల పల్లకి' పాట థియేటర్లలో పూనకాలు తెప్పిస్తోంది. ఆ పాట స్క్రీన్ మీద ప్లే అవుతుంటే ప్రేక్షకులు సీట్లలో అసలు కూర్చోలేకపోతున్నారు. థియేటర్లన్నీ ఒక్కసారిగా ఊగిపోతున్నాయి. కొందరైతే ఉత్సాహాన్ని ఆపుకోలేక స్క్రీన్ ముందుకు వెళ్ళి స్టెప్పులేస్తున్నారు. చాలారోజుల తర్వాత థియేటర్లు జాతరను తలపిస్తున్నాయి. ఒక మాస్ హీరో పవర్ఫుల్ కథతో, హై-వోల్టేజ్ ఎమోషన్‌తో వస్తే థియేటర్ల పరిస్థితి ఎలా ఉంటుందో 'ఇరుముడి' మరోసారి నిరూపించింది. రవితేజ యాక్టింగ్, ముఖ్యంగా 'మల్లెపూల పల్లకి' పాట ఇచ్చే గూస్బంప్స్ స్టఫ్.. ఖచ్చితంగా థియేటర్లో ఆస్వాదించాల్సిందే. రవితేజ 'ఇరుముడి' బుకింగ్స్ సునామీ: ఇదయ్యా నీ అసలు రూపం.!
.webp)
మాస్ మహారాజ్ రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'ఇరుముడి'. ఈరోజే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాపై ట్విట్టర్లో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. "రవితేజ ఈజ్ బ్యాక్" అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమా మొదలవ్వడమే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ఎమోషనల్ బాండ్ చుట్టూ నేచురల్‌గా నడుస్తుంది. సాధారణంగా రవితేజ సినిమాల్లో కామెడీ, మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి, కానీ ఇందులో రవితేజ ఒక సిన్సియర్, పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దుమ్మురేపారు. తండ్రిగా ఆయన పండించిన ఎమోషన్స్ థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తున్నాయి. ఆయన కూతురిగా నటించిన బేబీ నక్షత్ర యాక్టింగ్ అయితే ఈ సినిమాకే మెయిన్ హైలైట్ అని నెటిజన్లు పొగిడేస్తున్నారు. ఇక ఫస్ట్ హాఫ్ స్లో అండ్ స్టెడీగా సాగినప్పటికీ.. సెకండాఫ్‌లోకి ఎంటర్ అవ్వగానే కథ మలుపు తిరుగుతుంది. సెకండాఫ్‌లో వచ్చే ఆ కీలకమైన ట్విస్ట్ థియేటర్లలో ఆడియన్స్‌కి గూస్బంప్స్ తెప్పిస్తోంది. ముఖ్యంగా 'మల్లెపూల పల్లకి' సీక్వెన్స్ థియేటర్లను షేక్ చేస్తోందట. మాస్ ఆడియన్స్ కేరింతలు కొట్టేలా ఆ ఫైట్ బ్లాక్‌ను డిజైన్ చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్‌ను వేరే లెవెల్‌కి తీసుకెళ్లిందట. డైలాగ్ కింగ్ సాయికుమార్ పవర్ఫుల్ డైలాగ్స్, ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్ పాత్రలు కథకు మరింత బలాన్నిచ్చాయి. సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన సమస్యను ఎంచుకుని, దానికి ఎమోషనల్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ జోడించి శివ నిర్వాణ ఈ చిత్రాన్ని మలిచిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ట్విట్టర్లో రివ్యూవర్స్ మాటల్లో చెప్పాలంటే.. "ఇరుముడి ఒక పవర్ఫుల్ అండ్ హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ థ్రిల్లర్". కొన్ని చోట్ల రైటింగ్ కాస్త స్లో అయినప్పటికీ, క్లైమాక్స్ ఎమోషన్స్ మాత్రం ఆ లోపాలను పూర్తిగా మరిపించేలా ఉన్నాయి. చాలా మంది ట్విట్టర్

ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వానికి ఏదీ కలిసి రావట్లేదు. ఒకదాని వెంట వరుస దెబ్బలు తగులుతున్నాయి. కొన్ని కీలక విషయాల్లో చేతులు కాల్చుకోవాల్సి వస్తోంది. మొన్నటికి కాక్రోచ్ జనత పార్టీ ధాటికి ఏకంగా కేంద్ర మంత్రే రాజీనామా చేయాల్సొచ్చింది. దాని నుంచి తేరుకోకముందే.. బీహార్ లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో చేతు అనుభవాన్ని చవి చూసింది. సాక్షాత్.. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడే ఖాళీ చేసిన ఈ కంచుకోటను నిలబెట్టుకోలేకపోయింది.2010 నుంచి ఏకచ్ఛత్రాధిపత్యాన్ని వహిస్తూ వచ్చిన ఈ నియోజకవర్గాన్ని బంగారం పళ్లెంలో పెట్టి మరీ జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ చేతిలో పెట్టింది కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకు నాయకత్వాన్ని వహిస్తోన్న బీజేపీ. ఈ వరుస ఘటనల నేపథ్యంలో మడమ తిప్పక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోంది. కులం, విద్యార్థులకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను పునఃసమీక్షించుకుంటోండటం దీనికి నిదర్శనం.దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్శిటీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్ష నిరోధానికి తీసుకొచ్చిన నూతన యూజీసీ మార్గదర్శకాలను పునఃసమీక్షించుకోనుంది కేంద్రం. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు సైతం తెలియజేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అధికారికంగా సమాచారం ఇచ్చారు.యూజీసీ మార్గదర్శకాలను పునఃసమీక్షించుకోవడం అనేది.. కేంద్రానికి గట్టి ఎదురుదెబ్బే. ఈ నిర్ణయం వెనుక కీలక రాజకీయ పరిణామాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఇటీవలి కాలంలో ఈ నిబంధనలపై అగ్రవర్ణ సామాజిక వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీన్ని బాంకీపూర్ ఉప ఎన్నిక రెఫరెండంగా భావించినట్టయింది. ఇక్కడ ఓటమిపాలు కావడం.. ప్రజల్లో, ప్రత్యేకించి.. అగ్రవర్ణ సామాజిక వర్గాల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత పేరుకుపోయిందనేది స్పష్టమైంది.దాదాపు మూడు దశాబ్దాలుగా తమ కంచుకోటగా ఉన్న బంకీపూర్ అసెంబ్లీ స్థానాన్ని ప్రశాంత్ కిశోర్‌కు ధారాదాత్తం చేసుకోవడం వెనుక యూజీసీ నిబంధనలపై వ్యక్తమైన అగ్రవర్ణాల అసంతృప్తే కారణమని బీజేపీ అంతర్గత వర్గాలు విశ్లేషిస్తోన్నాయి

భారతీయ కార్ల మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఉన్న డిమాండ్ అంత ఇంత కాదు.. రికార్డు సేల్స్ తో మరోసారి ఇద నిరూపితమైంది. జులై 2026లో ఈ సెగ్మెంట్ చాలా స్ట్రాంగ్ సేల్స్ నమోదు చేసింది. చాలా కాలం తర్వాత హ్యాచ్‌బ్యాక్ కార్ల మొత్తం మంత్లీ సేల్స్ 1 లక్ష యూనిట్ల మార్కును దాటేశాయి. జులై 2026లో దేశంలో ఏకంగా 1,07,602 హ్యాచ్‌బ్యాక్ కార్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది అంటే జులై 2025లో ఈ సంఖ్య 74,475 యూనిట్లుగా మాత్రమే ఉండేది. అంటే ఏడాది కాలంలో అమ్మకాలు 33,127 యూనిట్లు పెరిగి, వార్షికంగా 44.48 శాతం గ్రోత్ నమోదు చేశాయి. స్టార్టింగ్ ప్రైస్ రూ. 4.99 లక్షలు ఉన్న మారుతి సుజుకి వాగన్ ఆర్ (WagonR) అమ్మకాల్లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. జులై 2026లో కంపెనీ 23,338 వాగన్ ఆర్ కార్లను విక్రయించింది. జులై 2025లో సేల్ అయిన 14,710 యూనిట్లతో పోలిస్తే ఇది 58.65 శాతం పెరుగుదల. మొత్తం హ్యాచ్‌బ్యాక్ అమ్మకాల్లో వాగన్ ఆర్ షేర్ 21.69 శాతంగా ఉంది. తక్కువ ధర, మంచి మైలేజ్, సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉండటంతో యూజర్లు ఈ కారును తెగ ఇష్టపడుతున్నారు. రెండో స్థానంలో మారుతి సుజుకి స్విఫ్ట్ నిలిచింది. జులై 2026లో స్విఫ్ట్ 21,538 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది జులైలో అమ్మిన 14,190 యూనిట్లతో పోలిస్తే ఇది 51.78 శాతం గ్రోత్. స్పోర్టీ డిజైన్, ఫీచర్ల కారణంగా ఈ కారు 20 శాతం మార్కెట్ షేర్ సాధించింది. ఇక మూడో స్థానంలో మారుతి బలేనో నిలిచింది. జులై 2026లో బలేనో 18,241 యూనిట్ల సేల్స్ సాధించి 45.89 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. బలేనో మార్కెట్ షేర్ 16.95 శాతంగా ఉంది. ఈ సేల్స్ రిపోర్ట్‌లో అందరినీ ఆశ్చర్యపరిచింది మారుతి ఆల్టో. జులై 2026లో ఆల్టో 12,534 యూనిట్లు అమ్ముడయ్యాయి

అసెంబ్లీ, శాసన మండలిని వైసీపీ సభ్యులు బహిష్కరించటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీని బహిష్కరించటం దేశ చరిత్రలోనే లేదని పేర్కొన్నారు. అమరావతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ, శాసన మండలిని వైసీపీ సభ్యులు బహిష్కరించటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) షాకింగ్ కామెంట్స్ చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీని బహిష్కరించటం దేశ చరిత్రలోనే లేదని పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చిస్తే వాటికి ఓ విలువ, గుర్తింపు ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈరోజు (బుధవారం) అసెంబ్లీ లాబీలో మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్‌చాట్ చేశారు. బయట కూర్చుని వైసీపీ సభ్యులు ఎంత మాట్లాడినా విలువ ఉండదని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అసెంబ్లీ అనేది అత్యున్నత స్థానమని సీఎం ఉద్ఘాటించారు. అలాంటి వేదికను ఓ పార్టీ మొత్తం బహిష్కరించటం తన రాయజకీయ జీవితంలో ఇలాంటిది చూడలేదని తెలిపారు 1978లో వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డిలు ఇద్దరే అసెంబ్లీని అల్లాడించారని ప్రస్తావించారు.1989 నుంచి1994 సమయంలో ఎన్టీఆర్ మధ్యలో అసెంబ్లీకి రాకపోయినా తామంతా పార్టీ తరఫున అసెంబ్లీకి వెళ్లి ప్రజల తరఫున పోరాడామని చెప్పారు. 2019 నుంచి 2024 మధ్య తాను సవాల్ చేసి బయటకొచ్చినా తమ ఎమ్మెల్యేలు చివరి రోజు వరకూ పోరాటం వదల్లేదని అన్నారు. గొడ్డలిపార్టీ నాయకుడికి రాజకీయాలు అవసరమా?.. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో తమ వాళ్లు చేసిన పోరాటమే అందరినీ ఆలోచింప చేసిందని సీఎం చెప్పారు. ప్రజలు సభ్యులను ఎన్నుకునేది అసెంబ్లీలో వారి సమస్యలపై పోరాడతారనే నమ్మకంతోనే అని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని చులకన చేసే గొడ్డలిపార్టీ నాయకుడికి రాజకీయాలు అవసరమా? అని ప్రశ్నించారు. గ్రూప్-1 అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకు సభకు రాకుండా బయట కూర్చోని డీఎస్సీపై వైసీపీ సభ్యులు బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. గొడ్డలి పార్టీ కోతపెట్టిన బీసీ రిజర్వేషన్లను తాము పునరుద్ధరించామని సీఎం స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం

హైదరాబాద్‌కు చెందిన అవినాశ్ ఓ ప్రముఖ కాలేజీ నుంచి బీటెక్ పూర్తిచేశాడు. ఎంటెక్‌లో ప్రవేశం కోసం పీజీఈసెట్ రాసి మంచి ర్యాంకు సాధించాడు.. పీజీఈసెట్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలంటే ప్రొవిజినల్ మెమో, టీసీ, బోనఫైడ్ సర్టిఫికెట్లు సమర్పించాలి. ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్న యాజమాన్యాలు పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సర్కారు ఇవ్వకపోవటంతో విద్యార్థులను అడుగుతున్న కాలేజీలు సర్టిఫికెట్ల కోసం నిరీక్షిస్తున్న రెండు లక్షల మంది విద్యార్థులు మంచి ర్యాంకులు వచ్చినా ఉన్నత చదువుల కోసం వెళ్లలేని పరిస్థితి ప్రభుత్వం తక్షణం చెల్లించాల్సిన బకాయిలు రూ.2,500 కోట్ల పైనే పాత బకాయిలు రూ.7,000 కోట్ల వరకు ఉంటాయంటున్న ఫాతీ హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన అవినాశ్ ఓ ప్రముఖ కాలేజీ నుంచి బీటెక్ పూర్తిచేశాడు. ఎంటెక్‌లో ప్రవేశం కోసం పీజీఈసెట్ రాసి మంచి ర్యాంకు సాధించాడు.. పీజీఈసెట్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలంటే ప్రొవిజినల్ మెమో, టీసీ, బోనఫైడ్ సర్టిఫికెట్లు సమర్పించాలి. వీటిని ఇచ్చేందుకు కాలేజీ నిరాకరిస్తోంది. ఏడాదికి రూ.35 వేల చొప్పున మూడేళ్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 1.05 లక్షలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. సర్కారు సకాలంలో ఇవ్వకపోవడంతో ఈ ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీ యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో కౌన్సెలింగ్‌లో అవినాశ్ దరఖాస్తు చేసుకోలేకపోతున్నాడు. ఇలాంటి సమస్యనే రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఇతర యూజీ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు భారీగా పెండింగులో ఉండటంతో కాలేజీలు సర్టిఫికేట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. గత నాలుగేళ్లలో ప్రభుత్వం కాలేజీలకు బకాయి పడిన ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం రూ.10 వేల కోట్ల వరకు ఉందని తెలంగాణ ఉన్నత విద్య ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘాల సమాఖ్య (ఫాతీ) అంటోంది. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని ఫాతీ ఏడాది కాలంగా కోరుతోంది. గత ఏడాదిలో ప్రభుత్వం దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకు విడుదల చేసింది

మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే ‘ఇరుముడి’. డివోషనల్ ఎలిమెంట్స్ తో సహా మంచి ఇంటెన్స్, ఎమోషనల్ మూమెంట్స్ ని కూడా దర్శకుడు దట్టించి మంచి సినిమా అందిస్తున్నట్టు మేకర్స్ అంతా ధీమాగా ఉన్నారు. అయితే తమ సినిమాలపై సంగీత దర్శకులు ఇచ్చే రివ్యూస్ కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ లో మరింత కాన్ఫిడెన్స్ నింపుతాయి. ఈ ట్రెండ్ అనిరుద్ నుంచి బాగా వైరల్ అయ్యింది. అయితే ఇప్పుడు ఇరుముడి సినిమాకి సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కూడా సింపుల్ రివ్యూ ఇచ్చేసాడు. ‘ఒక క్లాసిక్ రాబోతుంది’ అంటూ ఒక్క మాటలో సినిమా ఇరుముడి కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి మరింత కాన్ఫిడెన్స్ ని నింపేసాడు. అంతే కాకుండా సినిమా తాలూకా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు కూడా పూర్తి చేసినట్టు సాలిడ్ అప్డేట్ ని తాను అందించాడు. సో మొత్తానికి ఒక క్లాసిక్ వర్క్ ఈ ఆగష్టు 21న రాబోతుంది అని చెప్పొచ్చు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో బీసీల (BCs) రాజకీయ, సామాజిక హక్కుల అంశంపై మరోసారి చర్చ మొదలైంది. గత ప్రభుత్వ పాలనలో బీసీలకు తగిన ప్రాధాన్యం దక్కలేదని మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) విమర్శించారు. తెలుగుదేశం పార్టీ (TDP) మొదటి నుంచీ బీసీలకు అండగా నిలుస్తూ వారి సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మంత్రి ప్రస్తావించారు. బీసీలకు రాజకీయంగా అవకాశాలు పెరగాలంటే రిజర్వేషన్లు కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వెనుకబడిన వర్గాలకు పాలనా వ్యవస్థలో భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. గతంలో బీసీలకు 34 శాతం కోటా అమలు చేసే విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని అచ్చెన్నాయుడు ఆరోపించారు. బీసీల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, అయితే గత పాలనలో వారి హక్కులకు నష్టం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశంపై టీడీపీ నిరంతరం పోరాడిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. రాజకీయ ప్రాతినిధ్యంతో పాటు విద్య, ఉపాధి, ఆర్థిక అభివృద్ధి వంటి రంగాల్లో కూడా వెనుకబడిన వర్గాలు ముందుకు రావడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. బీసీ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలంలో వారికి ఉపయోగపడేలా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీసీల ఓటు బ్యాంకు కీలకంగా ఉంది. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో బీసీ వర్గాలకు గణనీయమైన జనాభా ఉంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు బీసీలను తమవైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటాయి. అయితే కేవలం ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం కాకుండా, అధికారంలో ఉన్నప్పుడు వారి అభివృద్ధికి స్పష్టమైన విధానాలు అమలు చేయాలని బీసీ సంఘాలు కోరుతున్నాయి

వర్షాకాలం వచ్చిందంటే చాలు... చినుకులు, తేమ వాతావరణం తెచ్చే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. బురద, ఆరని దుస్తుల గోల ఒకెత్తయితే, ఈ సీజన్ లో పెరిగే పాముల బెడద మరో పెద్ద తలనొప్పి. ఊళ్లలోనే కాదు, నగరాల్లోని అపార్ట్మెంట్లు, విల్లాల్లోకి కూడా పాములు వచ్చేస్తున్న వార్తలు చూస్తూనే ఉన్నాం. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే, వారు బయట ఆడుకునేటప్పుడు ఎంత భయంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, రసాయనాలు వాడకుండా మన పెరట్లో నాటే కొన్ని సహజసిద్ధమైన మొక్కల ద్వారా పాములను దూరంగా ఉంచవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ మొక్కలేంటో, అవి ఎలా పనిచేస్తాయో ఇక్కడ తెలుసుకుందాం. పాములకు వాసనను పసిగట్టే శక్తి చాలా ఎక్కువ. అందుకే తీవ్రమైన లేదా ఘాటైన సువాసనలు వచ్చే మొక్కల పరిసరాల్లోకి రావడానికి ఇవి ఇష్టపడవు. • సర్పగంధ: దీనికే పాతాళ గరుడ, పాతాళ గంధి అనే పేర్లు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఎక్కువగా వాడే ఈ మొక్క వేర్లు, ఆకుల నుంచి వచ్చే ఘాటైన వాసన పాములకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. • వెల్లుల్లి, ఉల్లి: మన వంటగదిలో వాడే వెల్లుల్లి, ఉల్లి మొక్కల్లో ఉండే సల్ఫర్, అల్లిసిన్ రసాయనాలు సహజ సిద్ధమైన స్నేక్ రిపల్లెంట్ లా పనిచేస్తాయి. వెల్లుల్లి రెబ్బలను నీటిలో కలిపి ఇంటి చుట్టూ చల్లడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. • దవనం, నిమ్మగడ్డి: పూలల్లో కలిపే దవనం తెచ్చే తాజా సువాసన మనుషులకు నచ్చినా పాములకు శత్రువే. అలాగే నిమ్మగడ్డిలో ఉండే సిట్రోనెల్లా వాసన పాములతో పాటు దోమలను కూడా తరిమికొడుతుంది. మన ఇంట్లో ఎంతో అందంగా పూసే ముద్ద బంతి, కారబ్బంతి పూల మొక్కలు కేవలం తోటకు అందాన్ని ఇవ్వడమే కాదు, పాముల నివారణలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. బంతి పూల వేర్లు, ఆకుల నుంచి వచ్చే ప్రత్యేకమైన వాసన, రసాయనాలు పాములను, ఇతర చిన్న కీటకాలను దూరంగా

టెలికాం రంగంలో టారిఫ్‌ల పెంపుపై తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో, రిలయన్స్ జియో తన కస్టమర్లకు తీపి కబురు అందించింది. సంస్థ పదేళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, 'జియో ప్రైమ్' మెంబర్షిప్ ప్రోగ్రామ్‌ను పునరుద్ధరించింది. ఇందులో భాగంగా రూ. 300 ఒకేసారి చెల్లించి, ఏడాది పాటు టారిఫ్‌లపై ధరల గ్యారెంటీ పొందవచ్చని వెల్లడించింది.ఈ మెంబర్షిప్ తీసుకున్న యూజర్లు, తాము ప్రస్తుతం వినియోగిస్తున్న ప్లాన్లతోనే 2027 సెప్టెంబర్ 5 వరకు రీఛార్జ్‌లు చేసుకోవచ్చు. భవిష్యత్తులో టారిఫ్‌లు పెరిగినప్పటికీ, ప్రైమ్ సభ్యులకు పాత ధరలే వర్తిస్తాయని సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుత ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లతో పాటు, ఇతర నెట్‌వర్క్‌ల నుంచి జియోకు మారే వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.ఇటీవల ప్రత్యర్థి సంస్థ ఎయిర్టెల్ రూ. 299 ప్లాన్‌తో సహా పలు ఇతర ప్లాన్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తమ అత్యంత ప్రజాదరణ పొందన రూ. 299 (రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్) ప్లాన్‌ను యథాతథంగా కొనసాగిస్తామని జియో ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో జియో ప్రైమ్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.ధరల గ్యారెంటీతో పాటు, ప్రైమ్ సభ్యులకు రూ. 600 విలువైన క్యాష్‌బ్యాక్ వోచర్లు కూడా లభిస్తాయి. కొత్త జియోహోమ్ లేదా జియోపీసీ కనెక్షన్‌పై రూ. 300, కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల కోసం కొత్త సిమ్ తీసుకుంటే మరో రూ. 300 వోచర్ అందజేస్తారు. వీటితో పాటు కొత్త ఉత్పత్తులు, సేవలకు ముందస్తు యాక్సెస్, ప్రత్యేక కస్టమర్ సపోర్ట్ వంటి అదనపు

తమిళ వర్సటైల్ నటుడు సూర్య వరుస ప్లాప్స్ ఎదుర్కొన్నాడు. 2013లో వచ్చిన ‘సింగమ్ 2’ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. ఆ తర్వాత నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆ రేంజ్ మ్యాజిక్ చేయలేకపోయాయి. అయితే ఇటీవల ‘వీరభద్రుడు’ (‘కరుప్పు’) చిత్రంతో ఆ రికార్డులను సూర్య బ్రేక్ చేశారు. కరుప్పు ఏకంగా రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సంచలన విజయం సాధించింది. ‘సింగమ్ 2’ బాక్సాఫీస్ నెంబర్లను దాటడానికి సూర్యకు ఏకంగా 13 ఏళ్ల సమయం పట్టడం విశేషం. ‘కరుప్పు’ విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుండి అపూర్వ ఆదరణ పొందిన ఈ సినిమా సూర్య కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘కరుప్పు’ విజయం అందించిన జోష్‌లోనే తాజాగా విడుదలైన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచే అద్భుతమైన పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కుటుంబ కథాంశంతో పాటు సూర్య నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో ఈ చిత్రం కూడా బ్లాక్‌బస్టర్ దిశగా వేగంగా దూసుకుపోతోంది. ఇలా కేవలం మూడు నెలల్లోనే రెండు భారీ హిట్లు కొట్టి తన పవర్ ఏంటో మరోసారి నిరూపించారు సూర్య. జస్ట్ రెండు రోజుల్లోనే ఈ సినిమా వందకోట్లకు అటు ఇటుగా వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకెళ్తుంది. తమిల్ కంటే కూడా తెలుగులో ఈ సినిమా అదరగోతుంది. శనివారం ఫస్ట్ షో, సెకండ్ షోస్ కు హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. ఒకప్పడు వరుస ప్లాప్స్ చూసిన సూర్య ఇప్పుడు జస్ట్ 3 నెలల్లో 2 బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేసాడు

పోస్టాఫీస్ అనేక పొదుపు పథకాలను తీసుకొచ్చింది. వాటిల్లో ఒకటి కిసాన్ వికాస్ పత్ర ఒకటి. దీనిని పోస్టాఫీస్ కేవీపీగా పిలుస్తారు. ఇందులో పెట్టుబడి పెడితే మీ డబ్బులు సురక్షితంగా ఉండటంతో పాటు మీ నగదుకు కేంద్ర ప్రభుత్వం కూడా హామీ ఇస్తుంది. దీంతో మీ డబ్బులు పూర్తి భద్రంగా ఉంటాయని చెప్పవచ్చు. అంతేకాకుండా మంచి వడ్డీ రేటు కూడా ఈ పథకంలో పొందవచ్చు. ఈ పథకంలో కేవలం రూ.వెయ్యి నుంచి పెట్టుబడి ప్రారంభించవచ్చు. గరిష్టంగా ఎంతవరకు అయినా ఇన్వెస్ట్ చేయవచ్చు. గరిష్ట పరిమితిపై ఎలాంటి నిబంధనలు లేవు. ఈ పథకంలో చేరాలంటే వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. మీ సమీపంలోని పోస్టాఫీస్‌కు వెళ్లి పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం వడ్డీ రేటు 7.5 శాతం ఉంది. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఈ పథకం ఎక్కువ వడ్డీ రేట్లను పొందవచ్చు. 2 సంవత్సరాల 6 నెలల తర్వాత మీకు అవసరమైతే నిధులును విత్ డ్రా చేసుకోవచ్చు. ఇందులో పెట్టుబడిన పెడితే 9 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. మీరు ఉదాహరణకు రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే 115 నెలల్లో రూ.10 లక్షలు అవుతుంది. ఇక రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే అది రూ.20 లక్షలు అవుతుంది. ఇది స్టాక్ మార్కెట్‌తో లింక్ అయి ఉండడు. అసలు స్టాక్ మార్కెట్ల అంచనాలతో ప్రభావితం అవ్వదు. దీంతో మీరు ఎలాంటి రిస్క్ లేకుండా మీ డబ్బును రెట్టింపు చేసుకోవచ్చు. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడనివారికి ఇది మంచి పథకంగా చెప్పవచ్చు. పోస్టాఫీసులో బాగా పాపులర్ అయిన పథకాల్లో ఇది కూడా ఒకటిగా చెప్పవచ్చు. దీంతో చాలామంది పెట్టుబడులు పెడుతున్నారు. వడ్డీ రేటు కూడా ఎక్కువగా ఉండటంతో డబ్బులు పొదుపు చేసుకోవాలనుకునేవారికి ఇది మంచి మార్గంగా చెప్పవచ్చు. ఆధార్, పాన్ సమర్పించి ఈ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది

ఒకప్పుడు ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు చేసిన రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు కేవలం ట్విట్టర్‌కే పరిమితమైపోయారు. ఒకవేళ కమ్‌బ్యాక్ ఇస్తానని చెప్పినా.. ఈ టైంలో వర్మను నమ్మడం కష్టమే. కానీ ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి అంటున్నారీయన. మరి RGV ఈసారి సీరియస్సా.. నిజంగానే కమ్ బ్యాక్ ఇస్తారా..? అసలు ఆయనేం సినిమా చేస్తున్నారు..? రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరులో ఒకప్పుడు క్రియేటివిటీ ఉండేది కానీ కొన్నేళ్లుగా కాంట్రవర్సీ మాత్రమే కనిపిస్తుంది. మనోడు మాట్లాడినా, మౌనంగా ఉన్నా వివాదమే. నేను మారిపోయానని చెప్పినా నమ్మడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. ఆ మధ్య నేను మారిపోయాను.. ఇకపై అన్నీ మంచి సినిమాలే తీస్తానన్నారు. అప్పట్నుంచి వర్మ నుంచి సినిమాలే రాలేదు. చాలా రోజుల తర్వాత వర్మ కొత్త సినిమా అనౌన్స్ చేసారు. ఆల్రెడీ పోలీస్ స్టేషన్ మే భూత్ అనే సినిమా చేస్తున్నా అది బయటికి రాలేదు. ఈ సమయంలో పోలీస్ కంపెనీ సినిమా ప్రకటించారు వర్మ. ఇట్ ఈజ్ మోర్ డేంజరెస్ దెన్ D కంపెనీ అనేది ట్యాగ్ లైన్. పోలీస్ వ్యవస్థకు అదనపు అధికారాలు ఇస్తే… అది క్రమంగా ఒక కంపెనీగా ఎలా మారుతుందనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దావూద్-చోటా రాజన్ విభేదాల తర్వాత ముంబై అండర్ వరల్డ్‌లో ఏర్పడిన పరిస్థితులు, గ్యాంగ్ వార్స్ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని.. 1997–2004 మధ్య 300 మందికి పైగా గ్యాంగ్‌స్టర్స్‌ను చంపిన స్పెషల్ పోలీస్ స్క్వాడ్ నుంచి ఈ కథకు స్ఫూర్తి పొందినట్లు వర్మ తెలిపారు. ఆ స్క్వాడ్ మెంబర్ దయా నాయక్ పాత్రలో హర్షవర్ధన్ రాణే నటిస్తున్నారు. మరి ఈ చిత్రంతో అయినా వర్మ ఫామ్‌లోకి వస్తారా అనేది చూడాలి. భారత్‌కు నాసా పిలుపు.. చందమామపై ఇల్లు కడదామంటూ ఆహ్వానం పిల్లలకోసం తల్లి సాహసం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో! నడిరోడ్డుపై వింత ఆకారం.. బొమ్మ అనుకొని పట్టుకోగా షాక్ ఏటా

దర్శకుడు శ్రీను వైట్ల.. ఈ పేరు వినగానే టాలీవుడ్ ప్రేక్షకులకు గుర్తొచ్చేది నాన్‌స్టాప్ కామెడీ, అదిరిపోయే కమర్షియల్ ఎంటర్టైనర్లు. తెలుగు సినిమాలో కామెడీ టైమింగ్‌కి సరికొత్త నిర్వచనం చెప్పిన దర్శకుల్లో ఆయన స్థానం ప్రత్యేకం. దర్శకుడు శ్రీను వైట్ల (Srinu Vaitla).. ఈ పేరు వినగానే టాలీవుడ్ ప్రేక్షకులకు గుర్తొచ్చేది నాన్‌స్టాప్ కామెడీ, అదిరిపోయే కమర్షియల్ ఎంటర్టైనర్లు. తెలుగు సినిమాలో కామెడీ టైమింగ్‌కి సరికొత్త నిర్వచనం చెప్పిన దర్శకుల్లో ఆయన స్థానం ప్రత్యేకం. వేగవంతమైన స్క్రీన్‌ప్లే, ఊహించని ట్విస్టులు, పొట్టచెక్కలయ్యే కామెడీ ట్రాక్స్‌తో బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించిన ఘనత ఆయన సొంతం. ‘ఆనందం’తో మొదలైన ఆయన విజయ ప్రస్థానం.. ‘వెంకీ’, ‘ఢీ’, ‘రెడీ’, ‘దూకుడు’, ‘బాద్షా’ లాంటి సినిమాలతో సాగింది. ఒకప్పుడు ఆయన సినిమా వస్తోందంటే చాలు.. థియేటర్లలో నవ్వుల పండగే అని సినీ ప్రియులు ఫిక్స్ అయిపోయేవారు. ముఖ్యంగా స్టార్ హీరోలతో చేసిన సరికొత్త ప్రయోగాలు, బ్రహ్మానందం లాంటి హాస్య నటులకు రాసిన విలక్షణ పాత్రలు వెండితెరపై నవ్వుల పూలు పూయించాయి. తెలుగు కమర్షియల్ సినిమాకు ఒక సరికొత్త ఫార్ములాను సెట్ చేసిన ఘనత ఆయనది. అయితే కాలక్రమంలో ఒకే తరహా ఫార్ములా రొటీన్ అవ్వడం, కథల్లో కొత్తదనం తగ్గడంతో ఆయనకు కొన్ని వరుస పరాజయాలు ఎదురయ్యాయి. అయినా సరే.. తన మార్క్ వినోదంతో పాటు నేటి ట్రెండ్‌కు తగ్గ కథనంతో బాక్సాఫీస్ వద్ద ఎలాగైనా అదిరిపోయే రీ-ఎంట్రీ ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారు శ్రీను వైట్ల. సరైన కథ కుదిరితే ఆయన కలం, కెమెరా ఎంతటి మ్యాజిక్ చేస్తాయో ప్రేక్షకులు ఇప్పటికే ఎన్నోసార్లు చూశారు. ఈ క్రమంలోనే టాలెంటెడ్ యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand)తో సరికొత్త సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ చిత్రం అత్యంత గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత అనిల్ సుంకర అత్యంత భారీ

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. BC Women Free Sewing Machine: తెలంగాణలోని మహిళలకు 1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామని.. ఇది నిరంతరం కొనసాగే పథకం అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. వంద శాతం సబ్సిడీపై ఒక్కో కుట్టు మిషన్ విలువ రూ.12 వేలు ఉందని.. వాటిని ఉచితంగా మహిళలకు ఇస్తామని తెలిపారు. బీసీ మహిళల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చి ఆర్థిక వృద్ధి సాధించడమే లక్ష్యం అని పేర్కొన్నారు. బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, కుట్టు వృత్తి ద్వారా స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించేందుకు ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం తీసుకువచ్చినట్లు వివరించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో గురువారం లాంఛనంగా పథకాన్ని ప్రారంభించిన అనంతరం పొన్నం ప్రభాకర్ కీలక ప్రసంగం చేశారు. బీసీ మహిళల స్వయం ఉపాధి, ఆర్థిక సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. బీసీ మహిళలకు 100 శాతం సబ్సిడీపై ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించి వారిని కేవలం ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా కాకుండా స్వయం ఉపాధి పొందే మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఒక్కో కుట్టు మిషన్ విలువ రూ.12,000 కాగా లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా వంద శాతం సబ్సిడీపై అందిస్తామని చెప్పారు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు అర్హులైన బీసీ మహిళల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు మంత్రి

ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించటం కోసం వైయస్ జగన్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఊహించని షాక్ తగిలింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో జగన్ గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం వైసీపీ నేతలతో పాటు జగన్ కు షాక్ ఇచ్చాయి.ఓర్వకల్లు విమానాశ్రయంలో జగన్ గోబ్యాక్ ఫ్లెక్సీలుఈ రోజు ఉదయం 9గంటలకు కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, 11 గంటలకు కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయానికి జగన్ చేరుకున్నారు. ఈ క్రమంలో ఓర్వకల్లు విమానాశ్రయం వద్ద వివాదాస్పద ప్లెక్సీలు వెలిశాయి.. జగన్ గో బ్యాక్ అంటూ పెద్ద అక్షరాలతో రాసిన ఫ్లెక్సీలను అక్కడ ఏర్పాటు చేశారు. ఇవి వైసీపీ శ్రేణులకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి.జగన్ ను టార్గెట్ చేస్తూ ఫ్లెక్సీలు.. తొలగించిన పోలీసులు ఎస్సీలపై దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యేని పరామర్శించడానికి సిగ్గులేదా అని, అలాగే డీఎస్సీ నియామకాలపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని జగన్ ను టార్గెట్ చేస్తూ వేర్వేరు ప్లెక్సీల్లో రాశారు. ఈ ప్లెక్సీలను పోలీసులు వెంటనే తొలగించారు. అదే సమయంలో విమానాశ్రయం వద్దకు పెద్ద సంఖ్యలో వైకాపా నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. ఎవరినీ లోపలికి అనుమతించకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.కర్నూలు జిల్లాలో రాజకీయ ఉద్రిక్తపరిస్థితిజగన్ పర్యటన సందర్భంగా ఆ పార్టీ నాయకులు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఇక తాజాగా జగన్ గో బ్యాక్ ఫ్లెక్సీల ఏర్పాటుతో కర్నూలు జిల్లాలో జగన్ రాకను పురస్కరించుకుని రాజకీయ ఉద్రిక్తత కనిపిస్తోంది. ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ అధినేత సందర్శనకు ముందే వ్యతిరేక ప్లెక్సీలు ఏర్పాటు కావటం, పోలీసులు వాటిని తొలగించడం, పార్టీ కార్యకర్తలు సమావేశం కావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.పోలీసుల భారీ బందోబస్తు.. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించనున్న జగన్ విమానాశ్రయం చుట్టూ ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Vishwambhara Release Line Clear: యూవీ క్రియేషన్స్ తెలుగులో తన కంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. ఈ ఇయర్ ఈ బ్యానర్ నుంచి విడుదలైన ‘కపుల్ ఫ్రెండ్లీ’ ఓ మోస్తరుగా నడిచింది. ఆ తర్వాత డాక్టర్ రాజశేఖర్, శర్వానంద్‌లు హీరోగా నటించిన ‘బైకర్’ మూవీకి క్రిటిక్స్ నుంచి మంచి అప్లాజ్ వచ్చినా.. కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఈ సినిమాతో 6 యేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్‌కు సోలోగా హిట్ దక్కింది. ఈ చిత్రం ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్తో కలిసి యూవీ క్రియేషన్స్ నిర్మించింది. గతంలో అనుష్క ‘ఘాటి’ సినిమా కూడా వీళ్ల కాంబినేషన్లో తెరకెక్కడం విశేషం. మధ్యలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గని’, ‘గాండీవధారి అర్జున’, ‘ఆపరేషన్ వాలెంటైన్’, మట్కా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఒక దాన్ని మించి ఒకటి డిజాస్టర్‌గా నిలిచాయి. తాజాగా గత శుక్రవారం విడుదలైన ‘కొరియన్ కనకరాజు’ సినిమా మూడు రోజుల్లో వాల్యూ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 13.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా 6 రోజుల్లో 16 కోట్ల షేర్ (రూ.30 కోట్ల గ్రాస్)ను కలెక్ట్ చేసి హిట్ అనిపించుకుంది. మొత్తంగా రూ. 2.5 కోట్ల లాభాలను థియేట్రికల్‌గా అందుకుంది. ఈ సినిమా

పాత పెన్షన్ (ఓపీఎస్) విధానంతోనే సీపీఎస్ ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా ఉంటుందని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (ఏపీఎస్టీఏ) పేర్కొంది. విజయవాడ: పాత పెన్షన్ (ఓపీఎస్) విధానంతోనే సీపీఎస్ ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా ఉంటుందని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (ఏపీఎస్టీఏ) పేర్కొంది. పెన్షన్ ప్రభుత్వ దానం కాదని ఉద్యోగి జీవిత కాల ప్రజాసేవకు లభించే చట్టబద్దమైన హక్కు అని ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొందని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాడిశెట్టి శ్రీనివాసులు, తమ్మినాన చందనరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సీపీఎస్ అనేది నిర్దిష్ట విరాళాల విధానమని, ఉద్యోగికి భవిష్యత్తులో ఎంత పెన్షన్ లభిస్తుందో ముందుగానే నిర్ధారించలేమని వెల్లడించారు. సీపీఎస్ ఉద్యోగుల ఆందోళనకు ప్రధాన కారణం ఇదేనని స్పష్టంచేశారు. కేవలం నియామక తేదీ ఆధారంగా ఒకరికి ఓపీఎస్, మరొకరికి సీపీఎస్ వర్తించడం.. సమాన పనికి సమాన సామాజిక భద్రత అనే సూత్రానికి అనుగుణంగా లేదన్నారు. దీనివల్ల నిర్దారిత పెన్షన్, డియర్ నెస్ రిలీఫ్, కుటుంబ పెన్షన్ వంటి ప్రయోజనాలు ఉండవని ఆవేదన వ్యక్తంచేశారు

ప్రతిసారీ వీకెండ్ వస్తే చాలు.. రొటీన్ మాల్స్, సినిమా థియేటర్లు, ట్రాఫిక్ గొడవలతో చిరాకు వస్తోందా? కొద్దిరోజులు ల్యాప్‌టాప్‌లు, ఆఫీస్ డెడ్‌లైన్స్ పక్కనపెట్టి ప్రశాంతమైన ప్రదేశంలో ఫ్రెష్ ఎయిర్ పీల్చాలని ఉందా? అయితే వేల రూపాయలు ఖర్చు పెట్టి కేరళ కోవలం లేదా విదేశాల్లోని మాల్దీవ్స్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ గుండెకాయ లాంటి దిండిబ్యాక్వాటర్స్, అలాగే విజయవాడలోని 'భవానీ ఐలాండ్' సందర్శిస్తే చాలు.. మీకు కచ్చితంగా విదేశీ రిజార్టులో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. చుట్టూ కొబ్బరితోటలు, పచ్చని కొండలు, నీటిపై తేలియాడే హౌస్బోట్లు.. ఒకే ఒక్క ట్రిప్‌తో మీ వారమంతా ఉన్న స్ట్రెస్ దూదిపింజలా ఎగిరిపోతుంది. కోనసీమ ప్రాంతంలోని దిండి వద్ద రాజమండ్రి/అమలాపురం పరిసరాల్లో ప్రవహించే గోదావరి పాయలు, నీలిరంగు బ్యాక్‌వాటర్స్ అచ్చం కేరళ ఆలేప్పి తరహాలోనే ఉంటాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, ప్రైవేట్ రిసార్టులు నడిపే హౌస్‌బోట్ ప్రయాణం ఈ ట్రిప్ సూపర్ ఉంటుంది. గంటల తరబడి నీటిపై ప్రయాణిస్తూ, ఏకాంతంగా డెక్ మీద కూర్చుని చల్లటి గాలిని ఆస్వాదిస్తుంటే వచ్చే కిక్కే వేరబ్బా. బోట్లోనే ఏపీ స్పెషల్ ఘుమఘుమలాడే వెజ్ అండ్ నాన్ వెజ్ భోజనం ఆస్వాదించవచ్చు. ఫ్యామిలీతో లేదా లైఫ్‌పార్ట్‌నర్‌తో కలిసి నైట్ స్టే చేయడానికి కూడా ఈ హౌస్బోట్లు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉంటే, ప్రకాశం బ్యారేజీ బ్యాక్‌వాటర్స్‌లోని భవానీ ఐలాండ్ మీకు రివర్ ఐలాండ్ అనుభూతిని ఇస్తుంది. భారతదేశంలోనే అతిపెద్ద నదీ ద్వీపాల్లో ఒకటైన ఈ ఐలాండ్‌కు వెళ్లాలంటే పున్నమి ఘాట్ నుంచి 6 నిమిషాల బోట్ జర్నీ చేయాలి. కృష్ణానది నీటి నడుమ పచ్చని చెట్లు, మడ అడవుల మధ్య ఉండే ఈ ద్వీపం ఒక మినీ వాటర్ పార్క్‌లా ఉంటుంది. కుటుంబంతో కలిసి వీకెండ్ స్పెండ్ చేయడానికి రిసార్టులు, సైక్లింగ్ ట్రాక్‌లు, రివర్ వాటర్ స్పోర్ట్స్, కయాకింగ్ వంటి అనేక అడ్వెంచర్ రిక్రియేషన్స్

టాలీవుడ్ లోక్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సురేఖ వాణి. ఒకప్పుడు హీరోయిన్లకు అక్క, వదిన, స్నేహితురాలు వంటి పాత్రల్లో కనిపించిన ఆమె.. ఆ తర్వాత క్రమంగా తల్లి, ఆంటీ పాత్రలకు షిఫ్ట్ అయ్యారు. టాలీవుడ్ లోక్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సురేఖ వాణి(Surekha Vani). ఒకప్పుడు హీరోయిన్లకు అక్క, వదిన, స్నేహితురాలు వంటి పాత్రల్లో కనిపించిన ఆమె.. ఆ తర్వాత క్రమంగా తల్లి, ఆంటీ పాత్రలకు షిఫ్ట్ అయ్యారు. తనదైన కామెడీ టైమింగ్, సహజమైన నటనతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే కొంతకాలంగా సురేఖ వాణి సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఇటీవల విడుదలైన ‘కెజెక్యూ’ సినిమాలో హీరోయిన్ యుక్తి కి అండగా నిలిచే ఆంటీ పాత్రలో కనిపించారు. ఈ సినిమా మినహా ఇటీవలి కాలంలో ఆమెకు చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమా అవకాశాలు కనిపించలేదు. మరో పక్క కూతురు సుప్రీతను హీరోయిన్గా పరిచయం చేసి ఆమె కెరీర్‌ను నిలబెట్టేందుకు సురేఖ వాణి కొంతకాలం ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సుప్రీతకు అవకాశాలు తీసుకురావడానికి కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. దీంతో ఇప్పుడు సుప్రీత కెరీర్‌తో పాటు తన సినీ ప్రయాణంపైనా సురేఖ వాణి మళ్లీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సురేఖ వాణి ఫిట్‌నెస్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తాజాగా ఆమె జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోలో సురేఖ వాణి ఫిట్‌నెస్‌పై చూపిస్తున్న శ్రద్ధ, ఎనర్జీ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. వీడియో చూసిన అభిమానులు, నెటిజన్లు వరుసగా కామెంట్లు చేస్తున్నారు. 'ఆంటీ మళ్లీ సినిమాల్లోకి వస్తున్నారా?”, “ఫిట్నెస్ చూస్తుంటే ఇంకా హీరోయిన్‌లానే ఉన్నారు' అంటూ కామెంట్లు పెడుతున్నారు. సురేఖ వాణి వయసు విషయంలో కూడా సోషల్ మీడియాలో చాలాకాలంగా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆమె తన వయసు 43

కంప్యూటర్లోని ఫొటోలు, వీడియోలను గూగుల్ డ్రైవ్ ద్వారా గూగుల్ ఫొటోస్‌లో ఆటోమేటిక్‌గా బ్యాకప్ చేసుకుంటున్నారా? అయితే ఈరోజు నుంచి ఆ సదుపాయం నిలిచిపోనుంది. 2026 ఆగస్టు 10 నుంచి ‘గూగుల్ డ్రైవ్ ఫర్ డెస్క్‌టాప్’ ద్వారా గూగుల్ ఫొటోస్‌కు ఆటోమేటిక్ బ్యాకప్ ఉండదని గూగుల్ స్పష్టం చేసింది. దీంతో కంప్యూటర్లోని ఎంపిక చేసిన ఫోల్డర్ల నుంచి కొత్త ఫొటోలు, వీడియోలు ఇక గూగుల్ ఫొటోస్‌లోకి ఆటోమేటిక్‌గా అప్లోడ్ కావు.ఇప్పటివరకు ‘డ్రైవ్ ఫర్ డెస్క్‌టాప్’లో కంప్యూటర్లోని ఓ ఫోల్డర్‌ను ఎంచుకుంటే అందులోని ఫొటోలు, వీడియోలు గూగుల్ ఫొటోస్‌కు ఆటోమేటిక్‌గా బ్యాకప్ అయ్యేవి. ఇకపై ఈ సదుపాయం పూర్తిగా నిలిచిపోతుంది. అయితే ఇప్పటికే గూగుల్ ఫొటోస్‌లో బ్యాకప్ అయిన ఫొటోలు, వీడియోలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అవి సేఫ్‌గానే ఉంటాయి.అలాగే గూగుల్ డ్రైవ్ సేవ కూడా ఆగిపోవడం లేదు. కంప్యూటర్లో ఫైళ్లను డ్రైవ్‌తో సింక్ చేసుకునే సదుపాయం యథావిధిగా కొనసాగుతుంది. డ్రైవ్ నుంచి గూగుల్ ఫొటోస్‌కు ఫొటోలు, వీడియోలను ఆటోమేటిక్‌గా పంపించే అనుసంధానాన్ని మాత్రమే గూగుల్ తొలగిస్తోంది.ఇక ఏం చేయాలి?కంప్యూటర్లోని ఫొటోలకు బ్యాకప్ కొనసాగించాలనుకునే వారు గూగుల్ ఫొటోస్‌లోనే కొత్తగా సెటప్ చేసుకోవాలి. గూగుల్ ఫొటోస్‌లో ‘+’ (ప్లస్) బటన్‌ను ఎంచుకుని ‘బ్యాకప్ ఫోల్డర్స్’ ఆప్షన్ ద్వారా కంప్యూటర్లోని ఫోల్డర్లను ఎంపిక చేసుకోవచ్చు.ఇప్పటికే గూగుల్ డ్రైవ్‌లో ఉన్న ఫొటోలను గూగుల్ ఫొటోస్‌లోకి నేరుగా ఇంపోర్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అయితే పాత డ్రైవ్ అనుసంధానంతో పోలిస్తే కొత్త విధానంలో ఓ తేడా ఉంది. గూగుల్ ఫొటోస్ వెబ్సైట్ బ్రౌజర్లో

భారత టెస్టు జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్ రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చాడు. అయితే జట్టులో స్థానం కోల్పోయిన అతడు.. రీఎంట్రీ ఇవ్వడం వెనుక ఎంతో కఠోర శ్రమనే ఉంది. ఏడాదిన్నరగా కశ్మీర్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ.. ఏకంగా 17 కిలోల బరువు తగ్గాడు. ఇంటర్నెట్ డెస్క్: భారత టెస్టు జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్ రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చాడు. శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌కు టీమ్ మేనేజ్మెంట్ అతడిని ఎంపిక చేసింది. స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశం దక్కింది. అయితే జట్టులో స్థానం కోల్పోయిన అతడు.. రీఎంట్రీ ఇవ్వడం వెనుక ఎంతో కఠోర శ్రమనే ఉంది. ఏడాదిన్నరగా కశ్మీర్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ.. ఏకంగా 17 కిలోల బరువు తగ్గాడు. అనూహ్యంగా జట్టులో చోటు సంపాదించుకున్న సర్ఫరాజ్.. ఈసారైనా నిరూపించుకుంటాడా? అనేది చూడాల్సి ఉంది. ముంబైలో వర్షాల కారణంగా సరిగ్గా సాధన చేసే అవకాశం లేకపోవడంతో సర్ఫరాజ్ కశ్మీర్‌కు వెళ్లాడు. అక్కడ నెట్ బౌలర్లు, రాష్ట్ర జట్టు ఆటగాళ్లతో కలిసి గంటల తరబడి బ్యాటింగ్ సాధన చేశాడు. అంతేకాకుండా ముంబైలోని ఎంసీఏ ఇండోర్ సదుపాయంలో ఆస్ట్రోటర్ఫ్‌పై స్కిల్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు. కుర్లాలోని ఎర్ర మట్టి పిచ్‌లపై స్పిన్‌ను ఎదుర్కొంటూ ప్రత్యేకంగా సాధన చేశాడు. ఐపీఎల్ తర్వాత ముంబై టీ20 లీగ్‌లోనూ సర్ఫరాజ్ ఆకట్టుకునే ఇన్నింగ్స్‌లు ఆడాడు. దీంతో తన ఆటను మెరుగుపరుచుకోవడంతో పాటు.. స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా సిద్ధమయ్యాడు. సాయి సుదర్శన్ గాయం ఇంకా పూర్తిగా తగ్గకపోవడంతో సెలక్టర్ల ముందు సర్ఫరాజ్, రుతురాజ్ గైక్వాడ్, షేక్ రషీద్ పేర్లు ఉన్నాయి. వీరిలో స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే విషయంలో సర్ఫరాజ్ సరైన ఎంపికగా భావించారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ తర్వాత ప్రస్తుత భారత జట్టులో స్పిన్‌ను అత్యుత్తమంగా ఆడగల బ్యాటర్లలో సర్ఫరాజ్ ఒకడని

Zaheer Khan: టీమిండియాలోకి సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ రీ ఎంట్రీపై చర్చ మళ్లీ జోరందుకుంది. గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న షమీ ఎంపికపై భారత మాజీ వేగవంతమైన బౌలర్ జహీర్ ఖాన్ స్పందిస్తూ సెలెక్టర్లకు క్లియర్ మెసేజ్ ఇచ్చారు. షమీ గనుక పూర్తిగా ఫిట్‌గా ఉండి, అందుబాటులో ఉంటే రాబోయే వరల్డ్ కప్ టోర్నీకి అతడిని ఖచ్చితంగా జట్టులో చేర్చుకోవాలని జహీర్ స్పష్టం చేశారు. షమీకి మద్దతుగా మాట్లాడిన జహీర్ ఖాన్, డొమెస్టిక్ క్రికెట్లో రాణిస్తున్న ఆటగాళ్లను నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు. “ఒక ఆటగాడు మైదానంలో నిలకడగా రాణిస్తున్నప్పుడు, అతడిని ఖచ్చితంగా టీమ్ ఇండియా ప్రణాళికల్లో భాగం చేయాలి. షమీ లాంటి బౌలర్ వరల్డ్ కప్ ఆడాలి, అతను జట్టులో ఉండటం చాలా అవసరం” అని జహీర్ వ్యాఖ్యానించారు. తుది నిర్ణయం కెప్టెన్, హెడ్ కోచ్, సెలెక్టర్లదే అయినప్పటికీ, ఫిట్‌గా ఉన్న సీనియర్ పేసర్‌ను పక్కన పెట్టడానికి ఎలాంటి బలమైన కారణం లేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం టీమిండియా మేనేజ్మెంట్ భవిష్యత్తు అవసరాల కోసం యంగ్ ఫాస్ట్ బౌలర్ల పూల్‌ను తయారు చేయడంపై దృష్టి పెట్టింది. అయితే, అనుభవాన్ని పూర్తిగా విస్మరించడం సరైనది కాదని జహీర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సౌతాఫ్రికా వంటి పేస్‌కు అనుకూలించే విదేశీ పిచ్‌లపై పర్యటించేటప్పుడు షమీ అనుభవం, బౌలింగ్ నైపుణ్యం భారత జట్టుకు ఎంతో ప్రయోజనకరంగా మారతాయని వివరించారు. ఫిట్‌నెస్‌పై షమీ వర్సెస్ అగార్కర్ సరసన సంచలన వ్యాఖ్యలు గతంలో షమీ రీ-ఎంట్రీ ఆలస్యం కావడానికి ఆయన ఫిట్‌నెస్‌పై లేవనెత్తిన ప్రశ్నలే ప్రధాన కారణం. ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా షమీ ఫిట్‌నెస్‌పై ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై షమీ స్వయంగా ఘాటుగా స్పందించారు. “నేను రంజీ ట్రోఫీలో రోజంతా బౌలింగ్ చేయగలిగినప్పుడు, వన్డే మ్యాచ్‌లో 10 ఓవర్లు వేయడం నాకు పెద్ద విషయం కాదు” అని స్పష్టం చేశారు. తాను

ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మేజర్ టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. దేశవాళీ ప్రతిష్టాత్మక రెడ్‌బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ 2026 సీజన్‌కు అతడు అందుబాటులో ఉండటం లేదు. టీమిండియా నుంచి అకస్మాత్తుగా పిలుపు రావడంతో.. సర్ఫరాజ్ ఖాన్ వెస్ట్ జోన్ జట్టును వీడాడు. కాగా దేశవాళీ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్‌కు ఉన్న రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫస్ట్క్లాస్క్రికెట్లో ఇప్పటికే ఐదు వేలకు పైగా పరుగులు సాధించిన ఈ ముంబైకర్.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2024లో ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్లో అడుగపెట్టాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున ఆరు టెస్టు మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్ ఖాన్.. 371 పరుగులు సాధించాడు. అయితే, అదే ఏడాది చివరగా న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌కు తర్వాత అవకాశాలు కనుమరుగయ్యాయి. దీంతో ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన సర్పరాజ్ ఖాన్.. భారీగా బరువు తగ్గి స్లిమ్‌గా తయారయ్యాడు. దేశీ క్రికెట్లోనూ మరోసారి సత్తా చాటాడు. అయినప్పటికీ టీమిండియా సెలక్టర్ల నుంచి సర్ఫరాజ్‌కు పిలుపు రాలేదు. అయితే, శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపికైన సాయి సుదర్శన్ గాయం నుంచి కోలుకోకపోవడం అతడి పాలిట వరంగా మారింది. దీంతో తాజాగా సాయి స్థానాన్ని సర్ఫరాజ్‌తో భర్తీ చేస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియాతో చేరేందుకు సర్ఫరాజ్ ఖాన్ శ్రీలంకకు పయనమయ్యాడు. ఈ క్రమంలో వెస్ట్ జోన్ జట్టుకు అతడు దూరం కాగా.. సెలక్టర్లు జై గోహిల్‌కు పిలుపునిచ్చారు. ఈ విషయం గురించి వెస్ట్ జోన్, ముంబై చీఫ్ సెలక్టర్ రాజేశ్ పవార్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘సర్ఫరాజ్ స్థానంలో గోహిల్‌ను ఎంపిక చేశాము. నిజానికి అతడు స్టాండ్ బై ప్లేయర్‌గా ఉండేవాడు. ఇప్పుడు ప్రధాన జట్టులోకి తీసుకున్నాము. రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున అతడు అద్భుత ప్రదర్శన కనబరిచాడు’’ అని రాజేశ్ పవార్ పేర్కన్నాడు. కాగా వెస్ట్ జోన్ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్

భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచాడు. 2027 వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో భువీని టీమిండియాలోకి తిరిగి తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇంటర్నెట్ డెస్క్: భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచాడు. 2027 వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో భువీని టీమిండియాలోకి తిరిగి తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అద్భుత ప్రదర్శన చేసిన భువీ.. 28 వికెట్లు పడగొట్టి వరుసగా జట్టు రెండోసారి టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం భారత పేసర్లను గాయాల సమస్య వేధిస్తుండటంతో భువీని జట్టులోకి తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు 14 నుంచి జరగనున్న యూపీ టీ20 లీగ్‌లో భువీ లఖ్‌నవూ ఫాల్కన్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ లీగ్‌కు ముందు భువీ మాట్లాడుతూ.. 2027 వన్డే ప్రపంచ కప్‌లో ఆడే అవకాశంపై స్పందించాడు. ‘జాతీయ జట్టు నుంచి పిలుపు వస్తే ఎందుకు వద్దంటాను? భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు ఎప్పుడూ సిద్ధమే. అయితే ఎంతమేర సిద్ధంగా ఉన్నానో కచ్చితంగా చెప్పలేను. నా పని క్రికెట్ ఆడటమే. అందుకే యూపీ టీ20 లీగ్‌లో ఆడేందుకు వచ్చా. మరో స్థాయికి వెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడి రాలేదు. ఐపీఎల్‌లోనూ జట్టు కోసం పరుగులు, వికెట్లు సాధించి మ్యాచ్‌లు గెలిపించాలనే ఉద్దేశంతోనే ఆడాను. ఎవరో ఏదో చెప్పారనో.. ఇంకా వేరే కారణాలతోనో ఇక్కడ ఆడటం లేదు. జాతీయ జట్టులో ఆడేందుకు ఎంత సిద్ధంగా ఉన్నానన్నది నా చేతుల్లో లేదు. నన్ను ఎంపిక చేయాలా? వద్దా? అనేది సెలెక్టర్ల నిర్ణయం’ అని భువీ స్పష్టం చేశాడు. ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానున్న యూపీ టీ20 లీగ్ నాలుగో సీజన్లో భువనేశ్వర్ కుమార్ లఖ్‌నవూ ఫాల్కన్స్‌కు నాయకత్వం వహించనున్నాడు. 24 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 34

Bhuvneshwar Kumar 2027 World Cup Comeback: భారత సీనియర్ స్టార్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అంతర్జాతీయ టీమిండియా రీఎంట్రీపై సంచలన ప్రకటన చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్‌లో జాతీయ జట్టు తరఫున ఆడేందుకు తాను పూర్తి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు. సెలెక్టర్ల నుంచి పిలుపు వస్తే కాదనే ప్రసంగే లేదని వెల్లడించాడు. ఈ ప్రకటన క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్సాహాన్ని, ఆసక్తిని నింపుతోంది. టీమిండియా పిలుపు వస్తే సిద్ధమే.. భువీ మనసులోని మాట! భారత స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ మళ్లీ నీలిరంగు జెర్సీ ధరించేందుకు తన పూర్తి సుముఖత వ్యక్తం చేశాడు. రాబోయే యూపీ టీ20 లీగ్ ప్రారంభానికి ముందు లక్నో ఫాల్కన్స్ శిక్షణ శిబిరంలో పాల్గొనేందుకు వచ్చిన సమయంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన చాలా స్పష్టమైన సమాధానాలు ఇచ్చాడు. "జాతీయ జట్టు నుంచి పిలుపు వస్తే నేను ఎందుకు వద్దంటాను? భారత జట్టు తరఫున ఆడేందుకు నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను" అని భువనేశ్వర్ నమ్మకంగా స్పష్టం చేశాడు. 2022 నవంబర్ నుంచి అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్న ఈ సీనియర్ పేసర్ నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. తన సుదీర్ఘ అనుభవం, ప్రస్తుతం ఉన్న అద్భుతమైన మ్యాచ్ ఫామ్ దృష్ట్యా 2027 వన్డే ప్రపంచకప్‌లో బరిలోకి దిగేందుకు సరైన అవకాశమని ఆయన భావిస్తున్నాడు. ఎక్కువమంది చదివింది: వరల్డ్ కప్ 2027 రేసు నుంచి ఆ 2 దిగ్గజ టీంలు ఔట్.. టీమిండియా పరిస్థితి ఏంటంటే? ఐపీఎల్లో వికెట్ల సునామీ.. మళ్లీ పాత రోజులు గుర్తొచ్చేలా! గత కొంతకాలంగా గాయాల సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడిన భువనేశ్వర్ కుమార్ ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్లలో అద్భుత ప్రదర్శనతో తిరిగి తన పాత వైభవాన్ని అందుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున మైదానంలోకి దిగిన

టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి మరోసారి నిరాశ ఎదురైంది. గాయాల కారణంగా పలువురు ఆటగాళ్లు జట్టుకు దూరమవుతున్నా.. 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాలు మొదలైనప్పటికీ.. షమీ పేరు సెలెక్షన్ చర్చల్లో కనిపించడం లేదు. ఈ పరిస్థితిపై భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ స్పందించాడు. జట్టులోకి రావాలనుకుంటే షమీ తన చేతిలో ఉన్న పనిపైనే దృష్టి పెట్టాలని సూచించాడు.‘‘ముందుకు ఎలా వెళ్లాలనేది షమీ నిర్ణయమే. మ్యాచ్‌లు ఆడుతూ బాగా రాణిస్తే జాతీయ జట్టుకు అందుబాటులో ఉన్నట్టే. ప్రస్తుతం జట్టు ఆలోచన మరోలా ఉండొచ్చు. కానీ ఆటగాడిగా మన ఆలోచన, మనం జట్టుకు ఎలా ఉపయోగపడగలమన్నది ముఖ్యం. షమీ ఇప్పుడు చేస్తున్నదే కొనసాగించాలి. మ్యాచ్‌లు ఆడటం, రాణించడం చాలా ముఖ్యం’’ అని జహీర్ చెప్పాడు.టీమిండియాలో పెరుగుతున్న గాయాలపైనా జహీర్ స్పందించాడు. జస్ప్రీత్ బుమ్రా వరుస సిరీస్‌లకు ఫిట్‌గా ఉండలేకపోతుండగా.. వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య వంటి ఆటగాళ్లు కూడా గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే గాయాలు ఆటలో భాగమేనని జహీర్ అన్నాడు.ఆటగాళ్ల పని భారం తగ్గించడం అవసరమే అయినా.. పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించాడు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ గాయపడినప్పుడు తన చేతిలో ఉన్న విషయాలపై నియంత్రణ సాధించడం చాలా ముఖ్యమని చెప్పాడు. గాయానికి అసలు కారణం ఏంటో తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని సూచించాడు

నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో తన కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి చేసిన రాజీనామాపై సంబల్పూర్ ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారిగా బహిరంగంగా మాట్లాడారు. దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ వ్యవహారంపై విద్యార్థుల నిరసనలు మిన్నంటిన వేళ, తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులపై ఆయన స్పష్టత ఇచ్చారు. భువనేశ్వర్‌లోని జిఎమ్ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయులు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నీట్ వివాదం తర్వాత ఆయన బహిరంగ వేదికపై మాట్లాడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ వివాదం నేపథ్యాన్ని పరిశీలిస్తే, నీట్ పేపర్ లీక్ అంశంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు. విద్యార్థుల నిరసనలు తీవ్రరూపం దాల్చడంతో జూలై 25న ధర్మేంద్ర ప్రధాన్ తన కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన దాదాపు రెండు వారాల తర్వాత ఆయన మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఈ అంశంపై మాట్లాడారు. ఒక సాధారణ రైతు కుమారుడిగా తాను ఎప్పుడూ ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. తన ప్రసంగంలో భాగంగా నీట్ నిరసనల సమయంలో కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా జెన్ జీ అని పిలిచే నేటి యువతను తప్పుదోవ పట్టించారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో యువతలో తీవ్ర గందరగోళం నెలకొందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, తన దృష్టిలో పదవి కంటే దేశ యువత ఆకాంక్షలే అత్యంత ముఖ్యమైనవని ఆయన తెలిపారు. మన దేశంలో ప్రతీ ఏటా దాదాపు 2 కోట్ల మంది పిల్లలు జన్మిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఈ తరం భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకే తాను స్వయంగా ప్రధాని మోదీ వద్దకు వెళ్లి రాజీనామా పత్రాన్ని సమర్పించానని వివరించారు. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడిన ప్రధాన్, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్