
ఆళ్ల నాని మృతిని తొలుత గుర్తించింది ‘మ్యాక్సీ’నే: వాచ్‌మన్
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మంగళవారం మృతి చెందారు. ఆయన మృతి చెందిన విషయాన్ని తొలుత పెంపుడు కుక్క (మ్యాక్సీ) గుర్తించిందని ఆళ్ల నాని ఇంటి వాచ్‌మన్ అప్పారావు తెలిపారు.

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మంగళవారం మృతి చెందారు. ఆయన మృతి చెందిన విషయాన్ని తొలుత పెంపుడు కుక్క (మ్యాక్సీ) గుర్తించిందని ఆళ్ల నాని ఇంటి వాచ్‌మన్ అప్పారావు తెలిపారు.

Ganesh Festival | మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్ ముల్కల్లలో శివగణేష్ భక్త మండలి ఆధ్వర్యంలో 33వ సంవత్సరం గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

నటి, సోషల్ మీడియా ఫేమ్ కుషిత కళ్లపు నేడు వినాయకచవితి సందర్భంగా ఇంట్లో పూజలు నిర్వహించి అనంతరం పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.

On Ganesh Chaturthi, the makers of Ramayana Part 1 released the divine Siya Ram poster featuring Ranbir Kapoor as Lord Ram and Sai Pallavi as Sita. గణేష్ చతుర్థి సందర్భంగా రామాయణ: పార్ట్ 1 చిత్రబృందం రణబీర్ కపూర్, సాయి పల్లవిలతో కూడిన దివ్యమైన సియా రామ్ పోస్టర్‌ను విడుదల చేసింది.

MLA Palla Rajeshwar Reddy | నేను కొన్నది భూదాన్ భూమి కాదు.. అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా..!

Sai Pallavi: ఆ స్టార్ హీరో సరసన సాయి పల్లవి.. మణిరత్నం డైరెక్షన్లో కొత్త ప్రేమ కథ.. లుక్ అదిరిపోయింది..

ఆళ్లగడ్డ పట్టణం: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భార్యే భర్తను హత్య చేయించింది. ఈ సంఘటన ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. ఈ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఆళ్లగడ్డకు చెందిన ఆంజనేయులు(32) పట్టణ శివారులోని సమీప పొలాల్లో మంగళవారం ఉదయం మృతిచెంది కనిపించాడు. సీఐ నాగరాజారావు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. తలపై ఎవరో బండరాయితో మోది అతడిని హత్య చేసినట్లు గుర్తించారు. భార్య సుబ్బులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. భార్యపై అనుమానం రావడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. చాగలమర్రి మండలం తోడేళ్లపల్లె గ్రామానికి చెందిన గురు ప్రసాద్‌తో సుబ్బులుకు వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో వారి బంధానికి ఆంజనేయులు అడ్డువస్తుండడంతో సుబ్బులు భర్త హత్యకు వ్యూహరచన చేసింది. సోమవారం రాత్రి తన ప్రియుడితో భర్తకు ఫోన్ చేయించింది. గురు ప్రసాద్ తనవెంట ప్రొద్దుటూరుకు చెందిన షరీఫ్‌ను వెంట తీసుకువెళ్లాడు. ముగ్గురు కలిసి పట్టణ శివారులో మద్యం సేవించారు. అనంతరం మత్తులో ఉన్న ఆంజనేయులు తలపై గురు ప్రసాద్ మద్యం సీసాతో కొట్టి, బండరాయితో మోదాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పరారయ్యారు. మద్యం సీసా మూతపై ఉన్న క్యూఆర్ కోడ్ సాయంతో పోలీసులు దానిని ఎవరు ఏ షాప్‌లో కొనుగోలు చేశారనేది సీసీ కెమెరాల ద్వారా గుర్తించి నిందితులను బుధవారం అరెస్టు చేశారు. ముగ్గురిని న్యాయస్థానంలో హాజరు పరుస్తామని డీఎస్పీ తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు

అల్లరి నరేష్ ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’ తో అలరించబోతున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘రంభ ఊర్వశి మేనక’ కథ ఎలా ఉండబోతుంది? -సాధారణంగా ఇలాంటి సోషియో ఫాంటసీ కథల్లో మానవులు ఇంద్రలోకం, యముడి వద్దకు వెళ్తుంటారు. కానీ ఇందులో ‘రంభ ఊర్వశి మేనక’ స్వర్గం నుంచి కిందకు వస్తారు. ఇందులో కథానాయకుడికి చిన్నప్పటి నుంచి ఒక డ్రామా కంపెనీ ఉంటుంది.‘రంభ ఊర్వశి మేనక’ను దేవతల్లా పూజిస్తుంటాడు. తనది కష్టపడకుండా హీరో అయిపోవాలనే క్యారెక్టర్. దేవతలు దీవిస్తే నెక్స్ట్ రాజమౌళి సినిమాలో తనే హీరో అనుకునే నమ్మకం ఉంటుంది. తన కుటుంబానికి ముత్తాతల నుంచి వస్తున్న ఒక పుస్తకం ఉంటుంది. అందులో ఒక ప్యాట్రన్ గీస్తే దేవతలు వచ్చి కోరికలు తీరుస్తారని నమ్మకం ఉంటుంది. హీరో ఆ ప్యాట్రన్ ఎలా గీశాడు, రంభ ఊర్వశి మేనక వచ్చిన తర్వాత ఎలాంటి సంఘటనలు జరిగాయనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దర్శకుడు ఈ కథ చెప్పిన తర్వాత మిమ్మల్ని ఎక్సైటింగ్ చేసిన ఎలిమెంట్స్ ఏమిటి? -చాలా రోజుల తర్వాత మంచి కామెడీ ఎంటర్టైనర్ విన్నట్టుగా అనిపించింది. ప్రేక్షకులు కూడా నా నుంచి ‘కితకితలు’, ‘బెండు అప్పారావు’ లాంటి కామెడీ సినిమాలు మిస్ అవుతున్నారు. అలాంటి కథ గురించి చూస్తున్నప్పుడు దర్శకుడు చంద్ర మోహన్ చెప్పిన ఈ కథ నాతో పాటు నాగార్జున గారికి, సుప్రియ గారికి, రాజేష్ గారికి, నిమ్మకాయల ప్రసాద్ గారికి అందరికీ నచ్చింది. సీజీ వర్క్ పరంగా ఎక్కువ బడ్జెట్ అవుతుందని తెలిసినా మంచి సినిమా అవుతుందని

'అల్లరి' నరేష్ ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’ తో అలరించబోతున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. ఈ నెల 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానున్న సందర్భంగా హీరో అల్లరి నరేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘రంభ ఊర్వశి మేనక’ కథ ఎలా ఉండబోతుంది? - సాధారణంగా ఇలాంటి సోషియో ఫాంటసీ కథల్లో మానవులు ఇంద్రలోకం, యముడి వద్దకు వెళ్తుంటారు. కానీ ఇందులో ‘రంభ ఊర్వశి మేనక’ స్వర్గం నుంచి కిందకు వస్తారు. ఇందులో కథానాయకుడికి చిన్నప్పటి నుంచి ఒక డ్రామా కంపెనీ ఉంటుంది. ‘రంభ ఊర్వశి మేనక’ను దేవతల్లా పూజిస్తుంటాడు. తనది కష్టపడకుండా హీరో అయిపోవాలనే క్యారెక్టర్. దేవతలు దీవిస్తే నెక్స్ట్ రాజమౌళి సినిమాలో తనే హీరో అనుకునే నమ్మకం ఉంటుంది. తన కుటుంబానికి ముత్తాతల నుంచి వస్తున్న ఒక పుస్తకం ఉంటుంది. అందులో ఒక ప్యాట్రన్ గీస్తే దేవతలు వచ్చి కోరికలు తీరుస్తారని నమ్మకం ఉంటుంది. హీరో ఆ ప్యాట్రన్ ఎలా గీశాడు, రంభ ఊర్వశి మేనక వచ్చిన తర్వాత ఎలాంటి సంఘటనలు జరిగాయనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దర్శకుడు ఈ కథ చెప్పిన తర్వాత మిమ్మల్ని ఎక్సైటింగ్ చేసిన ఎలిమెంట్స్ ఏమిటి? - చాలా రోజుల తర్వాత మంచి కామెడీ ఎంటర్టైనర్ విన్నట్టుగా అనిపించింది. ప్రేక్షకులు కూడా నా నుంచి ‘కితకితలు’, ‘బెండు అప్పారావు’ లాంటి కామెడీ సినిమాలు మిస్ అవుతున్నారు. అలాంటి కథ గురించి చూస్తున్నప్పుడు దర్శకుడు చంద్రమోహన్ చెప్పిన ఈ కథ నాతో పాటు నాగార్జున గారికి, సుప్రియ గారికి, రాజేష్ గారికి, నిమ్మకాయల ప్రసాద్ గారికి అందరికీ నచ్చింది. సీజీ వర్క్ పరంగా ఎక్కువ బడ్జెట్ అవుతుందని తెలిసినా మంచి సినిమా అవుతుందని మొదలుపెట్టాం. చంద్ర మోహన్ చాలా మంచి

అల్లరి నరేష్ కామెడీ సినిమాలకు కేరాఫ్. ఒకప్పుడు వరుసగా కామెడీ సినిమాలు చేసి మెప్పించారు. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేశారు. కానీ ఇప్పుడు సెలక్టీవ్‌గా వెళ్తున్నాడు. ఏడాదికి ఒక్క మూవీ కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అదే సమయంలో ఆయన యాక్షన్, థ్రిల్లర్ చిత్రాలు చేస్తూ వచ్చాడు. యాక్షన్ థ్రిల్లర్స్ ప్రారంభంలో విజయం సాధించాయి. కానీ ఆ తర్వాత అవి కూడా వర్కౌట్ కావడం లేదు. ఈ క్రమంలో ఇప్పుడు జోనర్ మార్చాడు. మళ్లీ తన కామెడీ జోన్లోకి వచ్చాడు. అందులో భాగంగా `రంభ ఊర్వశి మేనక` చిత్రంలో నటించాడు. కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సురభి, రాశీ సింగ్, విష్ణు ప్రియా భీమనేని, ప్రిషా సింగ్ హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిశోర్, నరేష్ వీకే ఇతర పాత్రలు పోషిస్తున్నారు. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహించారు. హాస్య మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకాలపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 4న విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. కామెడీ ప్రధానంగా సాగాయి. దీంతో మూవీపై అంచనాలు పెరిగాయి. అయితే తాజాగా ఇది సెన్సార్ పూర్తి చేసుకుంది. అలాగే ఫస్ట్ రివ్యూ రిపోర్ట్ బయటకు వచ్చింది. దీని బట్టి చూస్తే మూవీ ఎలా ఉందంటే? సినిమా బేసిక్ లైన్ ఏంటనేది చూస్తే, వీకే నరేష్, అల్లరి నరేష్ తండ్రీకొడుకులు. వీరికి వంశ పారంపర్యంగా ఒక మ్యాజిక్ బుక్ ఉంటుంది. దానిపై సరైన విధంగా ముగ్గు వేస్తే రంభ, ఊర్వశి మేనకలు వస్తారు, కోరిన కోరికలు తీరుస్తారు అని నరేష్‌కి వీకే నరేష్ చెబుతారు. నరేష్‌కి హీరో కావాలనే కోరిక ఉంటుంది. అందుకోసం 25ఏళ్లుగా ముగ్గులు వేస్తూనే ఉంటాడు. కానీ రంభ(రాశి సింగ్), ఊర్వశి(విష్ణుప్రియ), మేనక(ప్రిషా సింగ్) రారు. ఎట్టకేలకు నరేష్ ప్రయత్నం ఫలిస్తుంది. ముగ్గురు దేవకన్యలు వస్తారు. మరి హీరో అవ్వాలనే

'బలగం' సినిమాతో సుధాకర్ రెడ్డికి - మురళీధర్ గౌడ్ కి మంచి పేరు వచ్చింది. తెలంగాణ నేపథ్యంతో కూడిన సినిమాలలో వాళ్లకంటూ ప్రత్యేకమైన పాత్రలను క్రియేట్ చేసే స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నారు. అలాంటి వాళ్లిద్దరూ తండ్రీకొడుకులుగా నటించిన సినిమానే 'పళ్ల బురుసు'. ఉదయ్ చౌహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆగస్టు 14వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ రోజు (సెప్టెంబర్ 2)వ తేదీ నుంచి ఈ సినిమా 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. అది తెలంగాణ ప్రాంతంలోని ఒక పల్లెటూరు. అక్కడ శంభూ (సుధాకర్ రెడ్డి) అనే రైతు నివసిస్తుంటాడు. శంభూకి తిరుపతి (మురళీధర్ గౌడ్) అనే కొడుకు ఉంటాడు. ఆయన భార్య మారుతి .. కూతురు 'రేఖ' ఇదే ఆయన కుటుంబం. ప్రభుత్వ ఉద్యోగి అయిన తిరుపతి, తన తండ్రిని గురించి పెద్దగా పట్టించుకోడు. అందువలన శంభూ వేరే ఉంటూ, తనకున్న 'ఎకరం భూమి'ని సాగుచేసుకుంటూ ఉంటాడు. కొంతకాలంగా 'పంటి' సమస్యతో ఆయన బాధపడుతుంటాడు. డాక్టర్ చెప్పిన ప్రకారం 'పళ్ల బురుసు'(టూత్ బ్రష్) వాడాలని నిర్ణయించుకుంటాడు.శంభూ తనకి 'పళ్ల బురుసు' తెచ్చిపెట్టమని తిరుపతికి చెబుతాడు. అయితే అతను తన కూతురు 'రేఖ' పెళ్లిపనులలో ఉండటం వలన తీసుకురాలేకపోతాడు. ఉద్దేశ పూర్వకంగానే తన తండ్రిని పెళ్లికి పిలవడం మానేస్తాడు. తన మనవరాలి పెళ్లికి తనని పిలిచేదేమిటని భావించిన శంభూ ఆ పెళ్లికి వెళతాడు. అయితే తనని పట్టించుకోవడం మానేశారనే బాధ లోలోపల తొలిచేస్తూ ఉంటుంది. దాంతో అతను తన కొడుకు తనని పట్టించుకోవడం లేదంటూ కోర్టులో కేసు వేస్తాడు. తండ్రి తీసుకున్న ఈ నిర్ణయం తిరుపతిని షాక్ కి గురిచేస్తుంది.కూతురు పెళ్లి కోసం అయిన అప్పును తీర్చడం కోసం తన తండ్రి పేరుతో ఉన్న ఎకరం పొలాన్ని అమ్మేయాలని తిరుపతి భావిస్తాడు. తాను బ్రతికుండగా ఆ పొలాన్ని అమ్మేయడానికి ఒప్పుకోనని శంభూ తేల్చి చెబుతాడు. అప్పుడు తిరుపతి ఏం చేస్తాడు? శంభూ ఎలాంటి

కల్కి 2 (Kalki 2) సినిమా షూటింగ్ విషయంలో క్లారిటీ వచ్చింది. దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) స్వయంగా చెప్పాడు పది రోజులకు మించి ఇప్పటివరకు షూటింగ్ జరగలేదు. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇప్పుడే చెప్పలేను అన్నాడు. ఎందుకంటే ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. అవి పూర్తి చేసిన తర్వాత “కల్కి 2” షూటింగ్ మళ్ళీ మొదలు అవుతుంది ప్రభాస్ కి సంబంధించినంతవరకు. అంటే వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు ప్రభాస్. ఈ గ్యాప్ లో నాగ్ అశ్విన్ దీపిక పదుకోన్ స్థానంలో మరో హీరోయిన్ ని తీసుకోవాలి. దీపిక మొదటి భాగంలో నటించింది. రెండో భాగంలో మాత్రం నటించడం లేదు. ఆమె అడిగిన అధిక పారితోషికం, డిమాండ్ల వల్ల ఆమెని కొనసాగించడం లేదు. రెండో భాగంలో దీపిక ఉండదు అని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఆమె పోషించిన సుమతి పాత్రని సాయి పల్లవి (Sai Pallavi) పోషిస్తుంది అని అంటున్నారు. కానీ సాయి పల్లవి ఇంకా సైన్ చెయ్యలేదు. నిర్మాతలకు డేట్స్ విషయంలో క్లారిటీ రావడం లేదు. అందుకే ఆమెని ఇంకా అఫీషియల్ గా తీసుకోలేదు. ఫైనల్ గా దీపిక స్థానంలో సాయి పల్లవి ఉంటుందా లేదా అనే విషయంలో సస్పెన్స్ మరికొంతకాలం కొనసాగుతుంది. ఈ గ్యాప్ లో ఆమె ధనుష్ హీరోగా రూపొందుతోన్న “ఓం” చిత్రం, రణబీర్ కపూర్ రాముడిగా, తాను సీతగా నటించిన ‘రామాయణం’ మొదటి భాగం చిత్రాన్ని విడుదల చేసుకొని వస్తుంది
గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో అమెరికా అంతటా ‘తెలుగుకు పరుగు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. వల్లభాపురపు బాలాజీ, అల్లం శ్రీదేవి నాయకత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. తెలుగు భాష గొప్పతనాన్ని చాటిచెప్పడంతో పాటు ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే సందేశాన్ని సమాజానికి అందించడమే ఈ పరుగు ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అన్ని వయస్సుల వారు ఉత్సాహంగా పాల్గొని తెలుగు భాషపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగు భాషను భావితరాలకు అందించాలనే సంకల్పంతో భాషా సైనికులు, స్వచ్ఛంద సేవకులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మనబడి ‘తెలుగుకు పరుగు’ నిర్దేశకుడు వల్లభాపురపు బాలాజీ మాట్లాడుతూ మనబడి నిర్వహిస్తున్న తెలుగు భాషా తరగతులు, 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన నమోదు వివరాలను వెల్లడించారు. తెలుగు భాషను నేర్పడం, నేర్చుకోవడం ప్రతి తెలుగు కుటుంబ బాధ్యత అని గుర్తుచేశారు. మనబడి అధ్యక్షుడు కులపతి చమర్తి రాజు మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన వారందరికీ అభినందనలు తెలిపారు. ‘భాషా సేవయే భావితరాల సేవ’ అనే నినాదాన్ని గుర్తుచేస్తూ ఇప్పటివరకు లక్షా 10 వేల మందికి పైగా విద్యార్థులు మనబడి ద్వారా విద్యను పూర్తి చేసుకున్నారని చెప్పారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్ రెండో వారంలో 10 దేశాల్లో దాదాపు 300 కేంద్రాల్లో తరగతులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరానికి ఇప్పటివరకు 12,500 మంది పిల్లలు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఉత్తర అమెరికాలో మనబడికి పాశ్చాత్య పాఠశాలలు, కళాశాలల సంఘం గుర్తింపుతో పాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనుబంధ గుర్తింపు ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. ‘రన్ ఫర్ తెలుగు’ పోటీలను రెండు విభాగాల్లో నిర్వహించారు. ప్రతి ప్రాంతంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలను మనబడి పతకాలతో సత్కరించారు. పాల్గొన్న వారందరికీ ధ్రువపత్రాలు అందజేసి, ఆయా ప్రాంతాల్లో అల్పాహారం

Veenavanka: వీణవంక మండలం మల్లారెడ్డిపల్లిలో ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి! Veenavanka: కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం,మల్లారెడ్డిపల్లి గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకొని మల్లారెడ్డిపల్లి గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మల సమ్మన్న ముదిరాజ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనమైన నివాళులు అర్పించి గ్రామస్తులకు స్వీట్లు పంచినారు. ఈ సందర్భంగా టిపిసిసి సాంస్కృతిక సేన కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ పేద ప్రజల కోసం ఎన్నో ప్రభుత్వ పథకాలను తీసుకొచ్చి వారి అభివృద్ధికి,పేద ప్రజల ఉన్నతికి వారి జీవితాన్ని అంకితం చేసినారని వారి యొక్క సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గోనెల సమ్మన్న ముదిరాజ్, నిమ్మల సమ్మన్న ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ దూలం సమ్మన్నగౌడ్,మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి,93 వ బూత్ అధ్యక్షులు పల్లేర్ల కిరణ్,94 వ బూత్ అధ్యక్షులు మాజీ ఉప సర్పంచ్ ముద్దసాని బిక్షపతి,9వ వార్డ్ సభ్యులు గంధం ప్రశాంత్,డీలర్ కర్రె వెంకట నర్సయ్య, రాయణవేణి చంద్రయ్య, దూలం కిరణ్,మాజీ వార్డ్ సభ్యులు గోనెల సమ్మయ్య,అర్సం నాగేష్, దూలం వెంకటేష్, కర్రె రాజు, కర్రె కుమారస్వామి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

ఇటీవల థియేటర్లకు వచ్చిన అన్నపూర్ణ సంస్థ నిర్మించిన సినిమా ‘పళ్ల బురుసు’ సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చి షాక్ ఇచ్చింది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఇటీవల థియేటర్లకు వచ్చిన ప్రముఖ బ్యానర్ అన్నపూర్ణ సంస్థ నిర్మించిన సినిమా ‘పళ్ల బురుసు’ (Palla Burusu) సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చి షాక్ ఇచ్చింది. బలగం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మ, గోమతి, సుజాత కీలక పాత్రల్లో నటించగా ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ కలసి నిర్మించాయి. అయితే ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. కథ విషయానికి వస్తే.. తెలంగాణలోని పల్లెలో శంభ అనే వృద్థుడు ఒంటరిగా జీవిస్తుంటాడు. కొడుకు, కూతురు వేరే వేరే ఊర్లలో స్థిరపడి తండ్రి బాగోగులు అంతగా పట్టించుకోరు. తను పంటి నొప్పితో ఆసుపత్రికి వెళ్లగా డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి వేప పుల్ల స్థానంలో టూత్ బ్రష్ ఉపయోగించమని సూచిస్తారు. కొడుకు తిరుపతి (మురళీధర్ గౌడ్)ని టూత్ బ్రష్ (పళ్ల బురుసు), మందులు తెచ్చివ్వమని అడుగుతాడు. సొంత సమస్యల్లో బిజీగా ఉన్న తిరుపతి, తండ్రి మాటను అంతగా పట్టించుకోడు. కొద్ది రోజులకే కూతురు పెళ్లి ఖాయం చేసుకుని కనీసం తండ్రిని పిలవడు. ఇది గమనించిన శంభ లోలోపల కుమిలి పోలీసులను ఆశ్రయిస్తాయి. అక్కడ కూడా పరిష్కారం దొరక్కపోవడంతో కోర్టు మెట్లు ఎక్కుతాడు. అసలు తండ్రీకొడుకుల మధ్య గ్యాప్ రావడానికి కారణమేంటి? తనకున్న ఎకరం పొలంలో తన సమాధిని తానే ఎందుకు సిద్థం చేసుకున్నాడు? చివరకు ఏం జరిగింది అన్నదే కథ. వయసు మీద పడ్డ తల్లిదండ్రుల విషయంలో ఈతరం ఎలా వ్యవహరిస్తుందో చూపిస్తూ సాగే ఈ కథలో భావోద్వేగాలు అశించినంతగా బలంగా ఉండవు. కానీ శంభా తన సమాధి తానే సిద్ధం చేసుకునే సన్నివేశాలు, క్లైమాక్స్ మాత్రం గుండెను బరువెక్కిస్తాయి. కాగా ఇప్పుడు ఈ చిత్రం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే అమెజాన్

ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రమైన శ్రీశైలం అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవార్ల దివ్య దర్శనం. కానీ, ఈ పుణ్యక్షేత్రంలో చాలా కొద్దిమందికి మాత్రమే తెలిసిన, ఎంతో మహిమాన్వితమైన మరొక అద్భుత ప్రదేశం ఉంది. అదే దట్టమైన నల్లమల అడవుల మధ్య కొలువైన ఇష్టకామేశ్వరీ దేవి ఆలయం. భారతదేశం మొత్తం మీద ‘ఇష్టకామేశ్వరి’ పేరుతో దేవి ఆలయం ఉన్న ఏకైక ప్రదేశం శ్రీశైలం మాత్రమే. సాధారణంగా కామేశ్వరీ దేవి అంటే ఎనిమిది భుజాలతో కనిపిస్తుంది. కానీ ఇక్కడ అమ్మవారు నాలుగు చేతులతో ప్రత్యేక స్వరూపంలో దర్శనమిస్తారు. ఇష్టకామేశ్వరి దేవి ఆలయంలో జరిగే అద్భుతం భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక్కడ విగ్రహం రాతితో మలచబడినప్పటికీ, భక్తులు అమ్మవారికి కుంకుమ బొట్టు పెట్టే సమయంలో ఆమె నుదుటి భాగం మనిషి చర్మంలా ఎంతో మెత్తగా తగులుతుంది. విగ్రహాన్ని తాకిన ప్రతిఒక్కరూ ఈ అనుభూతిని పొంది ఒళ్లు జలదరింపజేసే అద్భుతాన్ని కళ్లారా చూస్తారు. రాయిలా ఉండే విగ్రహం నుదుటి వద్ద మాత్రం మనుషుల చర్మంలా మెత్తగా ఉండటం వెనుక ఉన్న రహస్యాన్ని చూడటానికి ఎంతోమంది భక్తులు సాహసాలు చేసి మరి ఇక్కడికి వస్తుంటారు. తన వద్దకు వచ్చే భక్తులు మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకున్నా, ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారు వెంటనే నెరవేరుస్తుందని నమ్ముతారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారి నుదుటన బొట్టు పెట్టి, మనసులోని కష్టాన్ని చెప్పుకుంటే 41 రోజుల్లో ఆ సమస్య తీరిపోతుందని ప్రతీతి. పూర్వం ఈ ప్రదేశం కాపాలికులు, సిద్ధులకు ప్రధాన ధ్యాన కేంద్రంగా ఉండేది. నాగార్జునుడు వంటి సిద్ధులు ఇక్కడి మూలికలతో ఎన్నో ప్రయోగాలు చేశారని కథనాలు ఉన్నాయి. ఇప్పటికీ ఇక్కడి గుహలో కాసేపు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేస్తే అద్భుతమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. శ్రీశైలం ప్రధాన ఆలయం నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుహాలయానికి చేరుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇక్కడికి సాధారణ

కర్ణాటక: విచారణ ఖైదీ అయిన శ్రీరంగపట్న ప్రభుత్వ అధికారి మహమ్మద్ హుస్సేన్‌కు సహాయం చేశారని, జైలులో డబ్బు చెల్లిస్తే రాజమర్యాదలు అందిస్తారని ఆరోపణలు రావడంతో జిల్లా జైలు ప్రధానాధికారి ఎం.శతమ్మను జైళ్ల చీఫ్ అలోక్ కుమార్ బళ్లారి సెంట్రల్ జైలుకు బదిలీ చేశారు. జైలులో అక్రమాలపై ఖైదీలు రాసినట్లుగా భావిస్తున్న ఒక లేఖ వైరల్ అయిన తర్వాత ఈ ఉత్తర్వు వెలువడింది. ఫోర్జరీ విచారణ ఖైదీగా ఉన్న మహమ్మద్ హుస్సేన్.. అనారోగ్యం లేకున్నా జబ్బు సాకుతో మిమ్స్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ ప్రత్యేక గదిలో ప్రియురాలితో గడుపుతుండగా కొందరు గుట్టురట్టు చేశారు. జిల్లా సెషన్స్ జడ్జి బృందం ఆసుపత్రిని తనిఖీ చేసి విచారించారు. ఈ కేసులో శతమ్మ నిర్లక్ష్యం స్పష్టం కావడంతో బళ్లారి జైలుకు బదిలీ చేసి ఆమె స్థానంలో ఫక్కీరప్ప బరకర్‌ను నియమించారు. చదవండి: రసోడా గ్యాంగ్ కి'లేడీ'ల కార్ఖానా హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు) పులివెందుల : భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్ (ఫొటోలు) ‘మిర్జాపూర్ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్ (ఫొటోలు) ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు) భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్ సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

సీరియస్ పాత్రలతో ప్రయాణం చేస్తున్న కామెడీ కింగ్ అల్లరి నరేశ్ చాలా కాలం తర్వాత తనదైన శైలిలో నవ్వులు పంచేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’ విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కింది. ఇందులో సురభి హీరోయిన్ గా నటించింది. రాశి సింగ్, విష్ణు ప్రియ, ప్రిషా సింగ్ ఓ డ్యాన్స్ నెంబర్ లో మెరిశారు. ప్రముఖ హాస్యనటుడు వెన్నెల కిశోర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. గత కొంతకాలంగా ‘నాంది’, ‘ఉగ్రం’ వంటి ఇంటెన్స్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన నరేశ్, మళ్లీ కామెడీ జోనర్లో సినిమా చేయడంతో ఆయన అభిమానులు, సినీ ప్రియులలో ఆసక్తి నెలకొంది.ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. సెన్సార్ పనులు కూడా పూర్తి కావడంతో, థియేట్రికల్ రిలీజ్ కోసం చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సినిమాతో అల్లరి నరేశ్ తన మార్క్ కామెడీతో మరో విజయాన్ని అందుకుంటారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది

భారతీయ సినిమా ఎనీ టైం గర్వించదగ్గ దర్శకుడు మణిరత్నం. ఆయన దర్శక మార్క్ ఎప్పుడూ ప్రత్యేకమే. సెన్సిటివ్ ఎమోషన్స్, విజువల్ వండర్స్ తో ప్రేక్షకుల హృదయాలని కొల్లగొట్టడంలో దిట్ట. ప్రెజెంట్ యుగంలో రావాల్సిన కధాంశంతో కూడిన చిత్రాలని ఇరవై ఏళ్ళ క్రితమే తెరకెక్కించాడు. ప్రస్తుతం వర్సటైల్ నటుడు 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి, నాచురల్ బ్యూటీ సాయిపల్లవి జంటగా చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రాబోయే 2027 పొంగల్ (సంక్రాంతి) కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్గా విడుదలైన లీక్డ్ పిక్చర్స్, వేగంగా జరుగుతున్న షూటింగ్ స్పీడ్ చూస్తుంటే ప్రేక్షకులకి ఈ మూవీ ఒక మరపురాని అనుభూతిని అందించబోతోందని స్పష్టమవుతోంది. విజయ్ సేతుపతి యాక్టింగ్, సాయిపల్లవి సహజ నటన, మణిరత్నం టేకింగ్, రెహమాన్ సంగీతం కలగలిసిన ఈ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి! ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చిత్ర బృందం కోల్‌కతాలోని ప్రసిద్ధ హౌరా బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో దాదాపు 10 రోజుల పాటు మొదటి షెడ్యూల్‌ని పూర్తి చేసుకోగా అక్కడ విజయ్ సేతుపతి, సాయిపల్లవిలపై చిత్రీకరించిన లీక్డ్ పిక్చర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2018లో వచ్చిన విజయ్ సేతుపతి క్లాసిక్ హిట్ '96' వైబ్స్‌ను ఈ లీక్డ్ పిక్చర్స్ గుర్తుచేస్తున్నాయంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కోల్‌కతా షెడ్యూల్ తర్వాత తదుపరి చిత్రీకరణ పుదుచ్చేరిలో జరుపుకోవడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేసింది. సాధారణంగా భారీ సినిమాల చిత్రీకరణకి నెలల తరబడి సమయం పడుతుంది, కానీ మణిరత్నం మాత్రం 40 రోజుల్లోనే పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. మద్రాస్ టాకీస్ మరియు లైకా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా అత్యున్నత నిర్మాణ విలువల తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ విజువల్ మ్యాజిక్కు ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మణిరత్నం-రెహమాన్ కాంబినేషన్
శ్రీ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నల్లమల సాగర్‌కు ఆగస్టు 31వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీటిని విడుదల చేసి జాతికి అంకితం చేశారు. నాలుగు జిల్లాల ప్రజల సాగు, తాగునీటి కష్టాలు తీర్చనున్న ఈ ప్రాజెక్టుకు భూములిచ్చిన గ్రామస్తులు మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం ముందు నుంచే ఆగస్టు నెలాఖరుకు నీళ్లు విడుదల చేస్తామని, గ్రామాలు ఖాళీ చేయాలంటూ ముంపు గ్రామాల ప్రజలకు చెబుతూ వచ్చింది. కానీ, కొందరు ఇంకా ఆ గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయలేదు. అయితే, ఇప్పుడు నీటిని విడుదల చేయడంతో ముంపు గ్రామాలకు ప్రభుత్వం రాకపోకలను నిలిపివేసింది.READ ALSO 'వెలిగొండ'లో కొట్టుకుపోయిన నలుగురు.. చెట్లెక్కి ఆర్తనాదాలు పెట్టిన ముగ్గురు, ఒకరు గల్లంతు! వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలైన సుంకేసుల , కలనూతల, గుండంచర్లకు వెళ్లే మార్గాన్ని అధికారులు నిలిపివేశారు. అయితే, గ్రామాల్లోని తమ ఇళ్లల్లో కొన్ని లక్షల రూపాయల సామాన్లు ఉన్నాయని.. బర్రెలు, గొర్రెలు కూడా అక్కడే వదిలేశామని.. వాటిని తీసుకొచ్చుకోవడానికి చివరి అవకాశం ఇవ్వాలంటూ ముంపు ప్రాంత ప్రజలు వేడుకుంటున్నారు. కానీ, అక్కడి సెక్యూరిటీ సిబ్బంది మాత్రం లోపలికి అనుమతించకపోవడంతో పుచ్చకాయలపల్లి- సుంకేసుల మధ్యలోని కొండవద్దే పడిగాపులు కాస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.నల్లమల సాగర్‌కు వెలిగొండ ప్రాజెక్టు నుంచి ఆగస్టు 31వ తేదీన రెండు టీఎంసీల నీటిని విడుదల చేశారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆగస్టు 31వ తేదీ రాత్రి సమయంలో ఒక బొలెరో వాహనం సుంకేసుల - కలనూతల రోడ్డు మార్గం నుంచి వస్తూ నీటి ప్రవాహాన్ని తట్టుకోలేక బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు గల్లంతవగా.. అందులోని ముగ్గురు దగ్గరలోని చెట్టు పైకెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు, మరో వ్యక్తి ఆచూకీ మాత్రం తెలియలేదు.నీటి ప్రవాహానికి బొలెరో కొట్టుకుపోయిందని, నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారన్న వార్తలు రావడంతో అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్, మార్కాపురం డీఎస్పీతో పాటు స్థానిక

రీసెంట్ డేస్ లో ఫోక్ సాంగ్స్ దుమ్మురేపుతున్నాయి.. సినిమా సాంగ్స్ ను మించి జానపద గీతాలు క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. యూట్యూబ్ లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి ఈ ఫోక్ సాంగ్స్. అంతే కాదు కొన్ని సాంగ్స్ పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటాయి. విదేశాల్లోనూ మన పాటలకు జనాలు ఊగిపోతున్నారు. అయితే ఇలా పాపులర్ అయిన పాటలను ఇప్పుడు సినిమాల్లోనూ వాడేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఫోక్ సాంగ్స్ సినిమాల్లో వినిపించాయి. అయితే రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ప్యారడైజ్ లోనూ పాపులర్ తెలంగాణ ఫోక్ సాంగ్ ను వాడేశారు... అదే ఏష నాగుల కట్టమీద. నాకంటే అతనే బాగా సూట్ అవుతాడు..! బ్లాక్ బస్టర్ సినిమాను ఆ హీరోకు ఇచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ తెలంగాణ జానపదగీతాల్లో ఈ పాటకు ప్రత్యేకత ఉంది.. తెలంగాణ కల్చర్ తోపాటు , మంచి మాస్ బీట్ కూడా ఉంది ఈ సాంగ్ లో.. ఇక ఈ సాంగ్ పాడిన ఫీమేల్ సింగర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె ఎవరు.? ఇంతకు ముందు ఏ పాటలు పాడింది అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాను గాలిస్తున్నారు. ఆమె పేరు ప్రభ బంగారిగళ్ళ. అంతగొప్ప వ్యక్తి మరణం నా సినిమాల మీద ప్రభావం చూపించింది.. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది ఎక్కడా శిక్షణ తీసుకోకుండా తన తల్లి వద్దే ఆమె పాటలు నేచుకుందట ప్రభ. జానపద గాయనిగా సోషల్ మీడియాలో ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ఆమె పాడిన పాటలు మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకున్నాయి. నిమ్మతోట వనములో, ఓ పిలగ వెంకటేశు.. ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనకు తెలుసు ఆ పాటలు పాడింది ప్రభనే.. ఇప్పుడిప్పుడే ఆమె సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది. మొన్నామధ్య విశాల్ మకుటం అనే సినిమాలో ఓ పాట పాడింది. ఇప్పుడు ఏష నాగుల

కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న రాత్రి కృష్ణాజిల్లా కంకిపాడు వద్ద నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. విజయవాడ, సెప్టెంబర్ 1: కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న(సోమవారం) రాత్రి కృష్ణాజిల్లా కంకిపాడు వద్ద నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే పోలీసులపై రాళ్లు రువ్వుతూ, కత్తితో దాడి చేసేందుకు యత్నించడంతో నిందితుడిపై సీఐ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. నిన్న తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల సమీపంలోని దేవరపల్లిలో పోలీస్ కానిస్టేబుల్‌పై యువకుడు కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. పెట్రోలింగ్ విధుల్లో భాగంగా జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టగా.. అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను కానిస్టేబుల్ గమనించాడు. వారి వద్ద ఉన్న బ్యాగులో ఏముందని ప్రశ్నిస్తుండగా.. ఇద్దరు యువకుల్లో ఓ వ్యక్తి అకస్మాత్తుగా తన వద్ద ఉన్న కత్తితో కానిస్టేబుల్‌పై దాడి చేశారు.. ఆపై నిందితులు ఇద్దరూ బైక్‌పై పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలించగా కంకిపాడు వద్ద ఉన్నట్లు తెలుసుకున్న సీఐ, కానిస్టేబుల్ శ్రీనివాస్.. రాత్రి 11 గంటల సమయంలో అక్కడకు వెళ్లారు. నిందితుడు అవినాధ్ను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. సీఐ, కానిస్టేబుల్‌పై రాళ్లు రువ్వడంతో పాటు కత్తితో దాడి చేశాడు. కానిస్టేబుల్ శ్రీనివాస్ ఛాతిలో కత్తితో పొడవంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అప్రమత్తమైన సీఐ.. అవినాధ్ కాళ్లపై కాల్పులు జరిపారు. ఆపై గాయపడిన యువకుడిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అవినాధ్.. పెనమలూరు గ్రామ వాసిగా గుర్తించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ శ్రీనివాస్, నిందితుడు అవినాధ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తిరుపతి విమానాశ్రయంలో విమాన వేళల్లో మార్పులు.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్ ఎన్ని అడ్డంకులు వచ్చినా స్థానిక ఎన్నికలు జరగడం ఖాయం: మంత్రి నారాయణ

* విశాఖలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన * సిరిపురం సర్కిల్ లో దివంగత ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేష్ * ‘ది స్టాట్యూ ఆఫ్ స్టేట్స్ మన్షిప్’ గా రోశయ్య గారి విగ్రహం నిలవాలని మంత్రి లోకేష్ ఆకాంక్ష * ఆయన రాజకీయ విలువలు, పార్టీలకు అతీతంగా సమాజానికి ఆయన చేసిన సేవ భవిష్యత్ తరాలకు తెలపాలని పిలుపు * విశిష్ట అతిథులుగా హాజరైన రోశయ్య గారి కుటుంబసభ్యులతో మంత్రి లోకేష్ ప్రత్యేక భేటీ * కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్, ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, వంశీ కృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, ఏపీ ఆర్యవైశ్య కార్పోరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, అభిమానులు

మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన ప్రేమలు సినిమా మేకర్స్ నుంచి వస్తున్న మరో ఫీల్ గుడ్ రోమ్కామ్ చిత్రం బెత్లెహేమ్ కుటుంబ యూనిట్. ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు సంబంధించిన గ్రాండ్ ప్రి-రిలీజ్ వేడుకను సెప్టెంబర్ 1వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ దాస్పల్లా హోటల్లో ఈ వేడుక చాలా వైభవంగా జరగనుంది. ఈ చిత్రంలో నివిన్ పౌలీ మరియు మమిత బైజూ ప్రధాన పాత్రల్లో నటించారు. మలయాళంలో ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బలమైన రన్ పూర్తి చేసుకుని మంచి ఆదరణ పొందింది. దీంతో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు మైత్రి మరియు ఫ్యూచర్ రన్అప్ సంస్థలు సంయుక్తంగా సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 4వ తేదీన బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ చిత్రాన్ని తెలుగు థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకునే అభిమానులకు మరియు ప్రేక్షకులకు చిత్ర బృందం ఒక తీపి కబురు అందించింది. ఈ వేడుకకు సంబంధించిన పాస్‌లను ఉచితంగా పొందే అవకాశాన్ని కల్పించింది. ఫలితంగా ఆసక్తి ఉన్న వారు యూ వి మీడియా డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా ఉచిత పాస్‌లను బుక్ చేసుకోవచ్చని నిర్వాహకులు వెల్లడించారు. ఈ నిర్ణయంతో అభిమానులు పెద్ద ఎత్తున వేడుకకు తరలివచ్చే అవకాశం ఉంది. గతంలో ప్రేమలు వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన దర్శకుడు గిరీష్ ఏడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది ఒక చక్కని పొరుగు ప్రాంతంలో జరిగే కుటుంబ కథా చిత్రంగా రూపొందింది. ఇందులో కథానాయకుడు నివిన్ పౌలీ ఎంతో సులువైన శైలిలో ఉండే ఎంపీ3 కింగ్ జస్టిన్ అనే పాత్రలో కనిపించనున్నారు. అదేవిధంగా మమిత బైజూ ఆష్లీ అనే ఆసక్తికరమైన పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. తెలుగు చిత్రసీమలో ప్రముఖ నిర్మాణ మరియు పంపిణీ సంస్థలైన మైత్రి మరియు ఫ్యూచర్

Sircilla: కర్రీ అడిగేందుకు వెళ్లిన వ్యక్తిపై గొడ్డలితో దాడి సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఇందిరానగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అన్నంలోకి కర్రీ కోసం పక్కింటికి వెళ్లిన వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఇందిరానగర్‌కు చెందిన మోతె రాజు అన్నంలోకి కర్రీ కోసం పక్కింట్లోని మామిడాల రాజు ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో పాత గొడవలను మనసులో పెట్టుకుని మామిడాల రాజు, అతని తల్లి అక్కవ్వ తన కుమారుడిపై దాడికి పాల్పడ్డారని మోతె రాజు తల్లి ఆరోపించారు. గొడ్డలితో దాడి చేయడంతో మోతె రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం

అది కేవలం నీటి ప్రవాహం కాదు, దశాబ్దాలుగా కరవు నేల చూస్తున్న కల సాకారమైన క్షణం. అందుకే, పరుగులు పెడుతున్న కృష్ణమ్మను చూసి అక్కడికి వచ్చిన జనం కేవలం కేరింతలు కొట్టడమే కాదు, ఆ నీటిని చేతులతో తాకి భక్తితో కళ్లకద్దుకున్నారు. ఎంతో పవిత్రంగా భావిస్తూ తలపై చల్లుకున్నారు. కొందరైతే తాము తెచ్చుకున్న బాటిళ్లలో ఆ పుణ్య జలాలను నింపుకుని ఇళ్లకు పట్టుకెళ్లారు. మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా కనిపించిన ఈ దృశ్యం, ఆ ప్రాంత ప్రజల గుండెల్లో కృష్ణా జలాలకు ఉన్న స్థానాన్ని, వారి నిరీక్షణ తీవ్రతను చెప్పకనే చెప్పింది.దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1ను ప్రారంభించారు. ఫీడర్ కెనాల్ గేట్లు ఎత్తి నల్లమల సాగర్‌లోకి కృష్ణా జలాలను విడుదల చేయడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా జల సంబరంతో పులకించింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ కల కళ్లముందే ప్రవాహమై పరుగులెడుతుంటే, అక్కడికి తరలివచ్చిన రైతులు, మహిళలు, ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.గేట్లు ఎత్తగానే కృష్ణమ్మ పరుగులు పెడుతుంటే, ప్రజల ఈలలు, కేరింతలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. చాలా మంది తమ సెల్ఫోన్లలో ఈ అపురూప దృశ్యాన్ని బంధించారు. తమ ప్రాంతానికి నీళ్లు వస్తాయో రావో అనే సందేహంతో బతికిన తాము, ఇప్పుడు కళ్లారా కృష్ణమ్మ పరవళ్లను చూస్తున్నామంటూ పలువురు రైతులు భావోద్వేగానికి గురయ్యారు. తమ జీవితాల్లో ఇదొక చారిత్రక మలుపు అని, తమ కరవు కష్టాలు తీరినట్టేనని ఆనందబాష్పాలతో తెలిపారు.సాధారణంగా సభ ముగియగానే జనం ఇళ్లకు

అందరూ ఫౌజీ, విశ్వంభర, టాక్సిక్ అంటూ బడా సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారు కానీ రాబోయే రెండు నెలల్లో చాలా క్యూట్ క్యూట్ లవ్ స్టోరీస్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడానికి వచ్చేస్తున్నాయి. అందులో కొన్ని సినిమాల్లో మిడ్ రేంజ్ హీరోలుంటే.. మరికొన్నింట్లో చిన్న హీరోలే ఉన్నారు. కానీ ఆ సినిమాలన్ని పెద్ద బ్యానర్స్ నుంచే రాబోతున్నాయి. మరి ఆ ప్రేమకథలపై ఓ లుక్కేద్దామా..? ఎపిక్: ది ఫస్ట్ సెమిస్టర్.. సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి రాబోయే ఈ క్యూట్ లవ్ స్టోరీలో బేబీ జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్నారు. ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్న ఎపిక్పై మంచి ఆసక్తే ఉంది. ఈ సినిమా సెప్టెంబర్ 11న రానుంది. అలాగే ఇదే బ్యానర్ నుంచి వస్తున్న మరో క్యూట్ ప్రేమకథ వీసా. గల్లా అశోక్, గౌరీ ప్రియా నటిస్తున్న ఈ సినిమాను ఉద్భవ్ తెరకెక్కిస్తున్నారు. వీసా అంటే వింటారా సరదాగా అని అర్థం.. అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 17న విడుదల కానుంది వీసా. అలాగే ఇదే సీజన్లో రానున్న మరో క్యూట్ లవ్ స్టోరీ రోమాంచకం. సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. వేణు గోపాల్ రెడ్డి తెరకెక్కిస్తున్న రోమాంచకం సినిమా సెప్టెంబర్ 3న విడుదల కానుంది. కథ నచ్చి ఈ సినిమాను నిర్మిస్తున్నారు సందీప్ వంగా. కేవలం లవ్ స్టోరీస్ మాత్రమే కాదు.. అల్లరి నరేష్ కామెడీ ఎంటర్టైనర్ రంభ ఊర్వశి మేనక సెప్టెంబర్ 4న విడుదల కానుంది. దాంతో పాటే మహేంద్రగిరి వారాహి, సిగ్మా, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ లాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ ఇదే సీజన్లో వస్తున్నాయి. పాన్,ఆధార్ వాట్సాప్‌లో పంపుతున్నారా? క్షణాల్లో రంగంలోకి సైబర్ నేరగాళ్లు.. రెప్పపాటులో బ్యాంకు ఖాతాలు గుల్ల బయటకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా

అద్భుతమైన సాహిత్యాన్ని సంగీత ప్రపంచానికి అందించిన కవికులాలంకార వేటూరి సుందరరామమూర్తి సాహితీ మహోత్సవం అమెరికాలోని డాలస్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఆదివారం ‘వేటూరి సాహిత్యాభిమాన సమితి ఆఫ్ అమెరికా’, ‘శుభం ఫౌండేషన’ సంయుక్త ఆధ్వర్యంలో ప్రిస్కో మెమోరియల్ హైస్కూల్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వేటూరి విరచిత ఎనిమిది సినీ, సినీయేతర గీత సంపుటాల ఆవిష్కరణ, వేటూరి ప్రత్యేక పాటల నృత్య, సంగీత విభావరి నిర్వహించగా.. దాదాపు 500 మందికి పైగా సంగీత, సాహిత్యాభిమానులు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ కవి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఈ సాహిత్య సంపుటాలను ఆవిష్కరించి.. తొలి ప్రతిని విశిష్ట అతిథి ‘ఈనాడు’ దినపత్రిక సంపాదకులు ఎం.నాగేశ్వరరావు, ప్రత్యేక అతిథులు వామరాజు సత్యమూర్తి, డా. కొమాండూరి రామాచారికి అందజేశారు. అమెరికాలోని వేటూరి సాహిత్యాభిమాన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డా.ప్రసాద్ తోటకూర, శుభం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గోపాల్ పోణంగి ఆధ్వర్యంలో ఆసక్తికరంగా సాగిన ఈ కార్యక్రమంలో సాహిత్య సంపుటాల ప్రచురణకు సహాయ సహకారాలు అందించిన డా.బుచ్చిబాబు పైడిపాటి, చంద్రహాస్ మద్దుకూరి, చంద్రశేఖర్ రెంటచింతల, గోకుల్ కిలారు, ప్రొఫెసర్ జగదీశ్వరన్ పుడూర్, మురళి వెన్నం, డా.నరసింహా రెడ్డి ఊరిమిండి, రామకృష్ణ పొక్కునూరి, రావు కల్వల, డా.సుబ్రహ్మణ్యం బోయారెడ్డి, విజయసారథి జీడిగుంట, వినోద్ ఉప్పులను ఘనంగా సత్కరించారు. జొన్నవిత్తులతో ప్రసాద్ తోటకూర ముఖాముఖీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుతో డా.ప్రసాద్ తోటకూర నిర్వహించిన ముఖాముఖి ఆకట్టుకుంది. పాత్రికేయుడిగా ఉన్న వేటూరి నందమూరి తారకరామారావు ఒత్తిడి మేరకు అయిష్టంగా రచయితగా సినీరంగ ప్రవేశం చేయడం, ఆ తర్వాత సినీ పరిశ్రమలో రాణించడం, కవి పండితులుగా వేటూరి కవితా వైభవం, ఆయన కలం నుంచి వెలువడిన గీతాల వెల్లువ, ఆయన వ్యక్తిత్వం, అందరినీ గౌరవించే తత్వం, ఆయన తెలుగు భాషాభిమానం, పాత్రికేయునిగా, సంపాదకుడిగా రచనా శైలి, కేవలం వేల కొద్దీ సినిమా గీతాలేగాక ఎన్నో విలువైన వ్యాసాలు, ‘జీవనరాగం’, ‘రాబిన్

ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల సినిమాలకు సంబంధించిన ఇండియా టాప్ 10 లిస్ట్ విడుదల చేస్తుంటుంది. ఇందులో హీరోలు, హీరోయిన్లు, సినిమాలు, పాటలు, ఓటీటీలో ట్రెండ్ అయ్యే చిత్రాలుంటాయి. అందులో భాగంగా హీరోయిన్లకి సంబంధించిన జులై లిస్ట్ ని తాజాగా విడుదల చేసింది. ఇందులో ఇద్దరు హీరోయిన్ల ప్లేసులు తారుమారు అయ్యాయి. ముఖ్యంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా దారుణంగా పడిపోయింది. శ్రీలీల అసలులిస్ట్ లోనే లేదు. కానీ నయనతార, త్రిష మాత్రం దుమ్ములేపారు. టాప్‌లోకి దూసుకొచ్చారు. మరి సమంత, కాజల్, సాయిపల్లవి, దీపికా, అలియా భట్ వంటి వారి స్థానాలు ఏంటనేది చూద్దాం. ఇండియా వైడ్‌గా టాప్ 10లో మొదటి స్థానంలో సమంత నిలిచారు. ఆమెకి మొదటి స్థానంలో తిరుగులేదని చెప్పొచ్చు. హీరోల్లో ప్రభాస్ మాదిరిగానే సమంత స్థానంలో మార్పు ఉండటం లేదు. మధ్యలో ఒకటి రెండు నెలలు డౌన్ అయ్యారు. కానీ ఇప్పుడు మళ్లీ పుంజుకొని తన ప్లేస్‌ని పదిలంగా ఉంచుకుంటున్నారు. ఇటీవల సమంత `మా ఇంటి బంగారం` చిత్రంతో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్‌గా ఉన్నారు. బేబీ బంప్స్ తో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. రెండో స్థానంలో అలియాభట్ ఉన్నారు. ఈమె స్థానంలో కూడా పెద్దగా మార్పు ఉండటం లేదు. ఆ తర్వాత మూడో స్థానంలో దీపికా పదుకొనె ఉన్నారు. ఊహించని విధంగా నాల్గో స్థానంలోకి నయనతార రావడం విశేషం. గతంలో ఆమె టాప్ 5లో కూడా ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఏకంగా టాప్ 4కి రావడం విశేషం. అయితే టాప్ 4లో ఉండాల్సిన రష్మిక మందన్నా మాత్రం డౌన్ అయ్యారు. ఆమె ఏడో స్థానానికి పడిపోవడం గమనార్హం. ఇది ఆమెకి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇక ఐదో స్థానంలో కాజల్ అగర్వాల్ ఉన్నారు. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. సినిమాలు లేకపోయినా.. నెట్టింట

హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్ డివిజన్ పరిధిలో విద్యుత్ ఫీడర్ల మరమ్మతు పనులు నిమిత్తం శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని సీబీడీ ఏడీఈ జి.నాగేశ్వరరావు తెలిపారు. చిక్కడపల్లి(హైదరాబాద్): హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్ డివిజన్ పరిధిలో విద్యుత్ ఫీడర్ల మరమ్మతు పనులు నిమిత్తం శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని సీబీడీ ఏడీఈ జి.నాగేశ్వరరావు తెలిపారు. ఇందిరానగర్, నల్లకుంట 11 కేవీ విద్యుత్ ఫీడర్ల పరిధిలో ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు, నారాయణగూడ, ప్రివెంటివ్ మెడిసిన్ పరిధిలో 11.30 నుంచి 12.30 గంటల వరకు, రాఘవేంద్రస్వామి పరిధిలో 12 నుంచి 12.30 గంటల వరకు, కమలానగర్ పరిధిలో మధ్యాహ్నం 3 నుంచి 3.45 గంటలవరకు విద్యుత్ సరఫరా ఉండదని, వినియోగదారులు తమ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. సైదాబాద్: టీజీఎస్పీడీసీఎల్ ఆస్మాన్‌ఘడ్ డివిజన్ పరిధిలో మరమ్మతు పనుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరా ఉండదని డీఈ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. అలాగే 11కేవీ ఆనంద్ బిస్కెట్ ఫ్యాక్టరీ ఫీడర్.. లక్ష్మీనగర్ ఎక్స్ రోడ్డు, రామాలయం, వాణినగర్, పటేలమ్మ మడిగలు, ఆనంద్ బిస్కెట్ ఫ్యాక్టరీ, దోబీఘాట్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో 2 నుంచి 3 గంటల వరకు కరెంట్ ఉండదని పేర్కొన్నారు. సాదత్‌నగర్ ఫీడర్.. పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు. ఏఎస్రావు నగర్: చర్లపల్లి సాయినగర్ ఫీడర్లో సాంకేతిక మరమ్మతుల కారణంగా శనివారం ఆ ఫీడర్ పరిధిలోని ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30వరకు ఎంఆర్ఆర్ కాలనీ, కృష్ణారెడ్డినగర్, సుభా్‌షనగర్, రెడ్డికాలనీ, సాయినగర్, ఎన్ఎన్ కాలనీ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో కొత విధిస్తున్నట్లు ఏఈ టి.బాలరాజు ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు గమనించి తమతో సహకరించాలని ఆయన కోరారు. కాప్రా: విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా ఆర్టీసీ కాలనీ ఫీడర్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ, జెడ్టీఎస్ తిరుమలనగర్, హనుమాన్‌నగర్, డాక్టర్ కృష్ణానగర్

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించిన ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ బజ్ సొంతం చేసుకున్న ఈ సినిమా, రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించే దిశగా అడుగులు వేస్తోంది. సినిమా విడుదలైన కేంద్రాల్లో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వ్యక్తమవుతోంది. థియేటర్ల వద్ద హారతులు, భజనలతో సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా చిత్రంలోని ‘మల్లెపూల పల్లకి’ పాటకు థియేటర్లలో పిల్లలు డ్యాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తుండగా, సంగీతంపై కూడా మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఉదయం షోల నుంచి మొదలైన ఈ జోరు షో టు షో మరింతగా పెరుగుతోంది. చాలా చోట్ల సెకండ్ షోలకు టికెట్లు పూర్తిగా అమ్ముడైపోయి హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అన్ని సెంటర్లలోనూ భారీ కలెక్షన్ల దిశగా సాగుతున్న ‘ఇరుముడి’, థియేటర్లలో సరికొత్త మాస్ జాతరను సృష్టిస్తోంది

మాస్ మహారాజా రవితేజ నుంచి ఒక సాలిడ్ సినిమా వచ్చి చాలా రోజులైంది. ఆ లోటుని తీరుస్తూ నేడు గ్రాండ్‌గా థియేటర్లలోకి అడుగుపెట్టిన 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ సునామీ సృష్టిస్తోంది. చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్న ఒకే ఒక్క మాట.. "ఇది రవితేజకు పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్". సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు ప్రతీ సీన్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే 'మల్లెపూల పల్లకి' పాట థియేటర్లలో పూనకాలు తెప్పిస్తోంది. ఆ పాట స్క్రీన్ మీద ప్లే అవుతుంటే ప్రేక్షకులు సీట్లలో అసలు కూర్చోలేకపోతున్నారు. థియేటర్లన్నీ ఒక్కసారిగా ఊగిపోతున్నాయి. కొందరైతే ఉత్సాహాన్ని ఆపుకోలేక స్క్రీన్ ముందుకు వెళ్ళి స్టెప్పులేస్తున్నారు. చాలారోజుల తర్వాత థియేటర్లు జాతరను తలపిస్తున్నాయి. ఒక మాస్ హీరో పవర్ఫుల్ కథతో, హై-వోల్టేజ్ ఎమోషన్‌తో వస్తే థియేటర్ల పరిస్థితి ఎలా ఉంటుందో 'ఇరుముడి' మరోసారి నిరూపించింది. రవితేజ యాక్టింగ్, ముఖ్యంగా 'మల్లెపూల పల్లకి' పాట ఇచ్చే గూస్బంప్స్ స్టఫ్.. ఖచ్చితంగా థియేటర్లో ఆస్వాదించాల్సిందే. రవితేజ 'ఇరుముడి' బుకింగ్స్ సునామీ: ఇదయ్యా నీ అసలు రూపం.!
స్టార్ హీరో రవితేజ , సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మించిన డివోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్ ' ఇరుముడి '. టీజర్, ట్రైలర్లతోనే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం నేడు (ఆగస్టు 21) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. ఫస్ట్ షో నుంచే ఈ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది.* ఒక ఆడదాని చుట్టూ 40 మంది మగాళ్లు... ఐటెమ్ సాంగ్స్‌తో ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం - సిద్ధార్ధ్సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ఒక భావోద్వేగ ప్రయాణాన్ని అనుభవిస్తున్నారు. ముఖ్యంగా థియేటర్ల వద్ద అభిమానుల సంబరాలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. వెండితెరపై రవితేజ అయ్యప్ప స్వామి మాలధారణలో కనిపించే సన్నివేశాలు రాగానే థియేటర్లు 'స్వామియే శరణం అయ్యప్ప' అనే నామస్మరణతో మార్మోగిపోతున్నాయి. భక్తి పారవశ్యంతో అభిమానులు స్క్రీన్ల వద్దకు వెళ్లి నేరుగా కర్పూర హారతులు పడుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం పూజలతోనే ఆగకుండా, సినిమాలో ఎంతో ప్రాధాన్యత కలిగిన 'మల్లెపూల పల్లకి' పాట, దాని వెనుక వచ్చే యాక్షన్ బ్లాక్ సమయంలో థియేటర్లలో ప్రేక్షకులు పూనకం వచ్చినట్లు ఊగిపోతూ స్క్రీన్ల ముందే డ్యాన్సులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.* రవితేజ ‘ఇరుముడి’ ట్విట్టర్ రివ్యూ... మాస్ మహరాజా ఈసారి గట్టిగా కొట్టాడా?కథ విషయానికి వస్తే.. మద్యపాన వ్యసనంలో కూరుకుపోయిన ఒక సాధారణ తండ్రి, తన ప్రాణ సమానమైన కూతురి ప్రేమ, నమ్మకాన్ని తిరిగి దక్కించుకోవడం కోసం పవిత్రమైన అయ్యప్ప దీక్షను స్వీకరిస్తాడు. అయితే దీక్షా సమయంలోనే ఊరిలోని అమాయక ఆడపిల్లల రక్షణ కోసం ఆ తండ్రి ఎదుర్కొన్న సవాళ్లు, చేసిన పోరాటం చుట్టూ కథ ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. తన రెగ్యులర్ మాస్ చిత్రాల

కొంటెచూపుతో క్యూట్ లుక్స్‌లో అనన్య నాగళ్ల స్టన్నింగ్ లుక్‌లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు) చీరలో మరింత అందంగా కనిపిస్తున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (ఫొటోలు) చీరకట్టులో సొగసుల విందు.. నివేదా థామస్ (ఫొటోలు) విజయవాడ : వరలక్ష్మీ వ్రతం... పూల మర్కెట్లో విపరీతమైన రద్దీ (ఫొటోలు) రజినీకాంత్ ‘ధర్మన్’ సినిమాలో విలన్‌గా నటించనున్న రామ్ పోతినేని? జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కూటమిపై సంచలన వ్యాఖ్యలు యువతిని కారుతో ఢీ కొట్టి చంపిన జనసేన MP కొడుకు అసలేం జరిగింది? ప్రియాంక తల్లిదండ్రుల మాటలు విని జగన్ కళ్లలో కన్నీళ్లు తిరిగాయి.. రిలీజ్ తరువాత జగన్ ను కలిసిన సీదిరి కుటుంబం

LB Nagar: ఎల్బీనగర్లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు! LB Nagar: నవ భారత నిర్మాత, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఎల్బీనగర్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ మల్రెడ్డి రాంరెడ్డి గారు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మల్రెడ్డి రాంరెడ్డి గారు మాట్లాడుతూ, దేశ అభివృద్ధి, ఆధునికీకరణ, యువత భవిష్యత్తు కోసం దూరదృష్టితో పనిచేసిన మహానేత రాజీవ్ గాంధీ అని కొనియాడారు. భారతదేశాన్ని 21వ శతాబ్దం వైపు నడిపించేందుకు ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు దేశ ప్రగతికి బలమైన పునాది వేశాయని అన్నారు. రాజీవ్ గాంధీ గారి సమర్థవంతమైన నాయకత్వం ఆధునిక భారత నిర్మాణానికి దిశానిర్దేశం చేసిందని తెలిపారు. ముఖ్యంగా కంప్యూటరీకరణ, టెలికమ్యూనికేషన్స్, సాంకేతిక రంగాలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యత భారతదేశంలో సాంకేతిక విప్లవానికి పునాది వేసిందన్నారు. భవిష్యత్ అవసరాలను ముందుగానే గుర్తించి దేశంలో సాంకేతికతను విస్తరించేందుకు కృషి చేసిన దూరదృష్టి గల నాయకుడు రాజీవ్ గాంధీ అని పేర్కొన్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడంలోనూ రాజీవ్ గాంధీ గారి ఆలోచనలు ఎంతో కీలకమైనవని మల్రెడ్డి రాంరెడ్డి గారు అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, స్థానిక సంస్థలకు అధికారాలు, బాధ్యతలు కల్పించడం ద్వారా గ్రామీణాభివృద్ధికి ఆయన బలమైన పునాది వేశారని తెలిపారు. ఓటు హక్కు వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించడం ద్వారా యువతకు తమకు నచ్చిన రాజకీయ నాయకులను ఎన్నుకునే అవకాశం కల్పించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా యువత రాజకీయాల్లో రాణించేలా, 25 ఏళ్ల వయస్సు కాకుండా 21 ఏళ్లకే చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం కల్పించాలనే ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్తున్నారు. 1980వ దశకంలోనే ప్రపంచంలో చోటుచేసుకుంటున్న సాంకేతిక మార్పులను గుర్తించి, భారతదేశం కూడా సాంకేతికంగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని రాజీవ్ గాంధీ

కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హీరో అల్లరి నరేశ్, చాలా కాలం తర్వాత మళ్లీ తన కామెడీ జానర్లోకి పూర్తిస్థాయిలో వచ్చేశారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'రంభ ఊర్వశి మేనక'. ఈ ఫన్ ఎంటర్టైనర్ నుంచి చిత్రబృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. ఈ క్రమంలో సినిమా నుంచి రెండో పాట 'బ్యాడ్ టైమ్ బ్యాండ్ బాజా'ను గురువారం విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.చంద్రమోహన్ చింతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని పాట వినసొంపుగా ఉండటమే కాకుండా, సినిమా కథా నేపథ్యాన్ని తెలియజేసేలా ఉంది. ముఖ్యంగా 'వెళ్లవే పేదరికం.. ఇక్కడే ఇల్లరికం' వంటి చరణాలు సినిమాలోని హాస్యభరిత సన్నివేశాలపై అంచనాలను పెంచుతున్నాయి. పేదరికం, కుటుంబ సమస్యల చుట్టూ అల్లరి నరేశ్ మార్క్ కామెడీ ఏ స్థాయిలో ఉండబోతోందో ఈ పాట స్పష్టమైన హింట్ ఇస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.గత కొంతకాలంగా 'నాంది', 'ఉగ్రం' వంటి సీరియస్, ఇంటెన్స్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన అల్లరి నరేశ్, ఈ చిత్రంతో మళ్లీ ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో ఆయనకు జోడీగా కథానాయిక సురభి నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి.ఈ చిత్రం కచ్చితంగా కుటుంబ ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని, నరేశ్ పాత కామెడీ టైమింగ్‌ను అభిమానులు మళ్లీ చూస్తారని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, 'రంభ ఊర్వశి మేనక' చిత్రాన్ని సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా

హైదరాబాద్‌లోని నల్లకుంటలో ఫీవర్ ఆసుపత్రి సమీపంలో ఓ టిప్పర్ అదుపు తప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి త్రుటిలో తప్పించుకున్నారు. డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని స్థానికులు ఆరోపించగా, ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక నాయకులు జోక్యం చేసుకుని డ్రైవర్‌ను పంపించేశారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని చర్యలు ప్రారంభించారు

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోకు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో ఇప్పటివరకు సక్సెస్ ఫుల్ గా తొమ్మిది సీజన్లు పూర్తయ్యాయి. పదో సీజన్ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రియాలిటీ షోలో సెలబ్రిటీలతో పాటు సామన్యులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. గత సీజన్ లో మాదిరిగానే ఈసారి కూడా కామనర్స్ ను హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా తీసుకురానున్నారు. అయితే సుమారు మూడేళ్ల క్రితమే ఏడో సీజన్ లో కామన్ మ్యాన్ గా అడుగు పెట్టాడు పల్లవి ప్రశాంత్. రైతు బిడ్డ ట్యాగ్ తో ఏకంగా టైటిల్ విజేతగా నిలిచాడు. అయితే విజేతగా నిలిచిన అనంతరం తన బిగ్ బాస్ ప్రైజ్ మనీ మొత్తాన్ని రైతులకు పంచు తానని పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. అయితే తీరా చూస్తే రైతులకు డబ్బు సాయం గురించి అసలు పట్టించుకోలేదు పల్లవి ప్రశాంత్. ఈ విషయంపై ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్నాడీ బిగ్ బాస్ విన్నర్. తాజాగా ఈ విషయంపై పల్లవి ప్రశాంత్ కూడా స్పందించాడు. ఇదే క్రమంలో బిగ్ బాస్ నిర్వాహకులపై సంచలన ఆరోపణలు చేశాడు. ప్రైజ్‌మనీ, కారు, నెక్లెస్ అని చెప్పి తనను పూర్తిగా మోసం చేశారంటూ వాపోయాడు. బిగ్ బాస్ రియాలిటీ షో నేను గెలుచుకున్న ప్రైజ్‌మనీ నా దగ్గరకు రావడానికి టైమ్ పట్టింది. కొందరు తెలియక నన్ను తిడుతూనే ఉన్నారు. దీంతో అసలు వీళ్లకు ఏం తెలుసు అని నేను బాధపడ్డా. కొన్నిరోజుల తర్వాత డబ్బు వచ్చింది. రూ.35 లక్షల్లో 40 శాతం జీఎస్టీ కట్ అయింది. కారు గిఫ్ట్ అని చెప్పారు కానీ అక్కడికి వెళ్లగానే రూ.8.5 లక్షలు కట్ చేశారు. డబ్బులిస్తేనే కారు తీస్కో లేదంటే ఇది ఇక్కడే ఉంటదని అన్నారు. మరి కారుకి డబ్బులు ఎందులో నుంచి ఇవ్వాలి? చివరకు ప్రైజ్‌మనీలో నుంచి తీసుకుంటామని

“రాజుల సొమ్ము రాళ్లపాలు, దొరల సొమ్ము దొంగలపాలు” అనే సామెత మన తెలుగు సంస్కృతిలో తరతరాలుగా వినిపిస్తూ వస్తోంది. పైకి చూస్తే ఇది రాజులు, దొరలు, వారి సంపద గురించి చెప్పిన మాటలా అనిపించినా, దీని వెనుక చాలా లోతైన జీవన సత్యం దాగి ఉంది. ఎంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా, ఎంత సంపద కూడబెట్టినా, దాన్ని సరిగ్గా కాపాడుకోలేకపోతే లేదా సరైన సమయంలో సద్వినియోగం చేసుకోలేకపోతే చివరికి ఆ సంపదకు విలువ లేకుండా పోతుందనే విషయాన్ని ఈ సామెత సూచిస్తుంది. పూర్వకాలంలో రాజులు, జమీందారులు, దొరలు ఎంతో సంపదను కూడబెట్టేవారు. భూములు, బంగారం, ధాన్యం, పశువులు, ఆస్తులు ఇలా ఎన్నో రకాల సంపద వారి అధీనంలో ఉండేది. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. రాజ్యాలు మారిపోయేవి, యుద్ధాలు జరిగేవి, పాలకులు మారేవారు. ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉన్న రాజభవనాలు కూడా కాలక్రమంలో శిథిలాలుగా మారిపోయేవి. సంపదను కూడబెట్టినవారు లేకపోతే, దాన్ని కాపాడే వారూ లేకపోతే ఆ సంపద చివరికి ఇతరుల చేతుల్లోకి వెళ్లేది. అందుకే “రాజుల సొమ్ము రాళ్లపాలు” అనే మాటలో సంపద శాశ్వతం కాదనే హెచ్చరిక కనిపిస్తుంది. అదే విధంగా “దొరల సొమ్ము దొంగలపాలు” అనే భాగం కూడా మనిషి సంపాదించిన ఆస్తిని జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది. ఒక వ్యక్తి ఎంతో కష్టపడి సంపాదించినా, అతని నిర్లక్ష్యం, దురాశ లేదా తప్పు నిర్ణయాల వల్ల ఆ సంపద ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోవచ్చు. కొన్నిసార్లు కుటుంబంలో వారసత్వ సమస్యలు, అప్పులు, ఆస్తి వివాదాలు, మోసాలు వంటి కారణాలతో ఎన్నో సంవత్సరాల కష్టం వృథా అవుతుంది. సంపదను కూడబెట్టడం ఎంత ముఖ్యమో, దాన్ని కాపాడుకోవడం, సద్వినియోగం చేసుకోవడం కూడా అంతే ముఖ్యమని ఈ సామెత వివరిస్తుంది. ఈ సామెతను కేవలం డబ్బు, బంగారం, భూములకే పరిమితం చేయాల్సిన అవసరం లేదు. మనిషికి ఉన్న జ్ఞానం, ప్రతిభ, అధికారం

చాలాకాలం తర్వాత కామెడీ కింగ్ అల్లరి నరేష్ మళ్లీ తనదైన మార్క్ అవుట్ అండ్ అవుట్ కామెడీ జోనర్లోకి రీ-ఎంట్రీ ఇస్తున్న చిత్రం రంభ ఊర్వశి మేనక. చాలాకాలం తర్వాత కామెడీ కింగ్ అల్లరి నరేష్ (Allari Naresh) మళ్లీ తనదైన మార్క్ అవుట్ అండ్ అవుట్ కామెడీ జోనర్లోకి రీ-ఎంట్రీ ఇస్తున్న చిత్రం రంభ ఊర్వశి మేనక (Ramba Oorvasi Menaka). చంద్రమోహన్ చింతడ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అల్లరి నరేష సరసన సురభి నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల ఆఫీషియల్ టీజర్ విడుదల చేసిన మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ బ్యాడ్ టైం బ్యాండ్ బాజా (Ram Miriyala) అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. భాస్కరబట్ల రవి కుమార్ (Bhaskara Bhatla Ravi Kumar) ఈ పాటకు సాహిత్యం అందించగా చైతన్ భరద్వాజ్ (Chaitan Bharadwaj) సంగీతంలో రామ్ మిర్యాల ఆలపించాడు

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి కొత్త ట్యాలెంట్ ని వెతికి పట్టుకోవడంలో, కొత్త కథలని తయారు చేయించుకోవడంలో ఎంతో అనుభవం ఉంది. తన కెరీర్ బిగినింగ్ నుంచి దిల్ రాజు కథపై ఎక్కువగా ఫోకస్ పెట్టడం చూస్తూనే ఉన్నాం. ఒక కథ నచ్చి అది వర్కౌట్ అవుతుంది అనిపిస్తే దిల్ రాజు వదిలిపెట్టరు. అందుకే దిల్ రాజుకి ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువ. మహేష్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు రిజెక్ట్ చేసిన కథతో దిల్ రాజు సూపర్ హిట్ కొట్టి చూపించారు. దీని గురించి దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హ్యాపీ డేస్ టైం నుంచి శేఖర్ కమ్ములతో పరిచయం ఉంది. హ్యాపీడేస్ చిత్రాన్ని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసి రిలీజ్ చేశారు. ఆ సినిమాకి మంచి పబ్లిసిటీ లభించడంలో దిల్ రాజు స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయింది. హ్యాపీడేస్ రిలీజ్ అయిన పదేళ్ల తర్వాత దిల్ రాజు నిర్మాణంలో శేఖర్ కమ్ముల చిత్రం ఖరారైంది. ఆ సినిమానే ఫిదా. ఈ చిత్రం విషయంలో తెరవెనుక చాలా కసరత్తు, పరిణామాలు చోటు చేసుకున్నాయి అని దిల్ రాజు తెలిపారు. దిల్ రాజు మాట్లాడుతూ.. ఫిదా స్టోరీ లైన్ విన్నప్పుడు ఈ సినిమాని నేనే ప్రొడ్యూస్ చేయాలి అని డిసైడ్ అయ్యాను. శేఖర్ కమ్ముల ఈ కథని ఎలాగైనా స్టార్ హీరోతోనే చేయాలి అనే పట్టుదలతో ఉన్నారు. నేను ఎంటర్ కావడానికి ముందే మహేష్ బాబుకి కథ వినిపించారు. మహేష్ కి కథ నచ్చింది. కానీ తన ఇమేజ్ కి సరిపోతుందా అనే డౌట్ తో పక్కన పెట్టారు. నేను ఎంటర్ అయ్యాక రాంచరణ్ కి కథ వినిపించాం. చరణ్ వద్ద కూడా అదే సిట్యుయేషన్. అల్లు అర్జున్ కూడా విని బావుంది అని అన్నారు. కానీ ఒక స్టార్ హీరోకి సరిపడే అంశాలు ఈ సినిమాలో

హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్, హైదరాబాద్ సిటీ-1 డివిజన్ల పరిధిలో విద్యుత్ ఫీడర్ల మరమ్మతు పనులు నిమిత్తం గురువారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు ట్రాన్స్ కో అధికారులు తెలిపారు. చిక్కడపల్లి(హైదరాబాద్): హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్, హైదరాబాద్ సిటీ-1 డివిజన్ల పరిధిలో విద్యుత్ ఫీడర్ల మరమ్మతు పనులు నిమిత్తం గురువారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు సీబీడీ ఏడీఈలు జి. నాగేశ్వరరావు, డి. వినోద్‌కుమార్ తెలిపారు. గోల్కొండ క్రాస్‌రోడ్ 11కేవీ విద్యుత్ ఫీడర్ పరిధిలో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, తాళ్లబస్తీ పరిధిలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, పోస్టాఫీస్ పరిధిలో మధ్యా హ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని వినియోగదారులు తమ సిబ్బందికి సహకరించాలని ఏడీఈలు కోరారు. కేపీహెచ్‌బీ కాలనీ: టీజీఎస్పీడీసీఎల్ బాలాజీనగర్ సెక్షన్ పరిధిలో జలమండలి పనుల నేపథ్యంలో గురువారం పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ భీమాలింగప్ప ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కేపీహెచ్‌బీ లోధా అపార్ట్మెంట్స్, ఇందూ అపార్ట్మెంట్స్, బీఎస్ఎన్ఎల్ క్వార్టర్స్, ఫిష్ మార్కెట్, ఎన్ఎస్ఎల్ మాల్, డీమార్ట్ ఏరియా, ఐదోఫేజ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాను మాజీ ఎమ్మెల్యే వల్లభనేని చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. విజయవాడలో వల్లభనేని వంశీ వంగవీటి రాధాను కలిశారు.. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వల్లభనేని వంశీ తన అనచరుడు కంఠమనేని శ్రీనివాసరావుతో వెళ్లి వంగవీటి రాధాను కలిశారు. కంఠమనేని శ్రీనివాసరావు తన కుమారుడి వివాహ వేడుకకు రాధాను ఆహ్వానించారు.. ఈ సందర్భంగా వంశీ, రాధాలుఒకర్ని ఒకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఈ ఇద్దరు మంచి స్నేహితులు.. గతంలో సన్నిహితంగా ఉండేవారు. రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నా సరే ఇప్పటికి వారి స్నేహం మాత్రం కొనసాగుతోంది. వంగవీటి రాధా , వల్లభనేని వంశీలు పార్టీలు వేరైనా సరే కుటుంబానికి సంబంధించి కార్యక్రమాలకు మాత్రం ఆహ్వానించుకుంటున్నారు. గతేడాది వంగవీటి రాధా కుమార్తె రుధిర నామకరణ కార్యక్రమానికి మాజీ మంత్రి కొడాలి నాని.. మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, జక్కంపూడి రాజాతో పాటుగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కొడాలి నాని, వల్లభనేని వంశీతో స్నేహం ఉండటంతోనే వీరిని రాధా ఆహ్వానించారు. ఆ సమయంలో వంగవీటి రాధా, కొడాలి నాని, వల్లభనేని వంశీలు కలిసి ఫోటోలు దిగగా.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే రాజకీయాలు, స్నేహాన్ని వేర్వేరుగా చూడాలని నెటిజన్లు స్పందించారు.వంగవీటి రాధాకృష్ణ తన తల్లిదండ్రుల వారసత్వంతో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన 2004 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 ఎన్నికలకు ముందు రాధా కాంగ్రెస్ పార్టీని వీడి మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడారు. వంగవీటి రాధా 2014 ఎన్నికల ముందు వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు.. 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత విజయవాడ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా, విజయవాడ సెంట్రల్

రవితేజ ‘ఇరుముడి’పై సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇరుముడి’ (Irumudi) చిత్రానికి చాలా అవార్డులు వస్తాయని సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ (GV Prakash Kumar) అన్నారు. ఎన్నో ప్రేమకథా చిత్రాలకు వినసొంపైన మెలోడీలు ఇచ్చి మ్యూజిక్ ప్రియులకు చేరువైన ఆయన, సంగీతం అందించిన తాజా చిత్రం ‘ఇరుముడి’. రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ నిర్మించిన చిత్రమిది. ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు జీవీ ప్రకాశ్‌కుమార్. ‘నేను ఇప్పటివరకూ చేసిన చిత్రాల్లో ‘ఇరుముడి’ చాలా ప్రత్యేకం. ఇదో ఇంటెన్స్ థ్రిల్లర్. దర్శకుడు శివ నిర్వాణ ఈ కథ చెప్పినప్పుడే ఇందులో పూర్తిగా లీనమైపోయాను. తెలుగు ప్రేక్షకులకు కొత్తదనమిచ్చే చిత్రమిది. ప్రతీ క్షణం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఇందులోని సంగీతానికి ఓ సైకలాజికల్ అప్రోచ్ ఉంటుంది. ‘మల్లెపూల పల్లకి’ పాటను రీక్రియేట్ చేసి అందరి అంచనాలను అందుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. ‘విక్రమార్కుడు’ తర్వాత రవితేజ నటించిన వాటిలో నా ఫేవరెట్ ‘ఇరుముడి’ చిత్రం. కచ్చితంగా ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుంది’ అని చెప్పారు

హైదరాబాద్‌లో జరిగిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యవర్గ సమావేశంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా జానీ, సుమలత మాస్టర్స్‌కు ఫెడరేషన్ షాకిచ్చింది. హైదరాబాద్‌లో జరిగిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యవర్గ సమావేశంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ సమావేశంలో డాన్సర్స్ అసోసియేషన్ మినహా మిగిలిన 23 క్రాఫ్ట్స్‌కు చెందిన ప్రతినిధులంతా పాల్గొని డాన్సర్స్ యూనియన్‌లో నెలకొన్న తాజా వివాదాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని (Anil Vallabhaneni) మీడియా సమావేశంలో పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. యూనియన్ నాయకులు చేసిన తప్పుల వల్ల సామాన్య డాన్సర్లకు అన్యాయం జరగకూడదని, ఫెడరేషన్ నిర్ణయాలకు కట్టుబడి ఉన్న ప్రతి డాన్సర్‌కు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. డాన్సర్స్ యూనియన్ ప్రస్తుత కార్యవర్గానికి ఫెడరేషన్ నుంచి ఎలాంటి సహకారం అందదని ఆయన తేల్చిచెప్పారు. ‘‘మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వంటి ఇండస్ట్రీ పెద్దలు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఫెడరేషన్ సూచనలను ఏమాత్రం లెక్కచేయకుండా సుమలత (Sumalatha) డాన్సర్లను రెచ్చగొట్టి ఫెడరేషన్‌ను ధిక్కరిస్తూ ఎన్నికలు నిర్వహించారు. వారి స్వేచ్ఛకు మేం భంగం కలిగించం కానీ, వారి కార్యవర్గ నిర్ణయాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు. వారిపై సహాయ నిరాకరణ కొనసాగుతుంది. అలాగే జానీ మాస్టర్ (Jani Master)పై ఉన్న సస్పెన్షన్‌ను కొనసాగిస్తున్నాం. ఇది 23 యూనియన్ల ఏకాభిప్రాయ నిర్ణయం. అంతేకాకుండా గతంలో జానీ మాస్టర్ ఫెడరేషన్‌కు విరాళంగా ఇచ్చిన మూడు లక్షల రూపాయలను తిరిగి ఆయనకే పంపించేస్తున్నాం’’ అని అనిల్ వల్లభనేని ప్రకటించారు. ఇక సినీ కార్మికుల వేతనాల పెంపు ప్రక్రియ వేగంగా జరుగుతోందని, సెప్టెంబర్ నాటికి దీనిపై పూర్తి క్లారిటీ వస్తుందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా టికెట్ రేట్ల పెంపులో 20 శాతం మొత్తాన్ని కార్మికుల సంక్షేమానికి కేటాయించాలని ఇప్పటికే జీవో ఇచ్చారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు ఆ బ్యాలెన్స్ మొత్తాన్ని వెంటనే ఫెడరేషన్

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మళ్లీ సస్పెన్షన్ విధిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎత్తివేసిన నాన్-కోఆపరేషన్ కాల్‌ను పునరుద్ధరిస్తున్నట్లు ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని నేతృత్వంలో జరిగిన 23 క్రాఫ్టుల అత్యవసర జనరల్ కౌన్సిల్ సమావేశంలో స్పష్టం చేశారు. ఫెడరేషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం మరియు ఇచ్చిన లిఖితపూర్వక హామీని ఉల్లంఘించడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలిపారు. జానీ మాస్టర్‌పై తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ మళ్లీ సస్పెన్షన్ విధించడంతో సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. ఈ వివాదానికి సంబంధించి జూలైలో డ్యాన్సర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఫెడరేషన్ జానీ మాస్టర్‌పై నాన్-కోఆపరేషన్ ప్రకటించినప్పటికీ, జూలై 19న చిరంజీవి మరియు బాలకృష్ణ మధ్యవర్తిత్వంతో సస్పెన్షన్ తాత్కాలికంగా తొలగించబడింది. ఇదిలా ఉండగా, అసోసియేషన్ అంతర్గత వ్యవహారాలు, ఆర్థిక అక్రమాలు మరియు నూతన ఎన్నికల నిర్వహణపై ఇరువర్గాల మధ్య విభేదాలు మళ్లీ మొదలయ్యాయి. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత ఏకపక్షంగా ఉపఎన్నికలు నిర్వహించడాన్ని ఫెడరేషన్ తీవ్రంగా పరిగణించి మద్దతును పూర్తిగా ఉపసంహరించుకుంది. దీంతో మెగాస్టార్ చిరంజీవి మరియు నిర్మాతల మండలి ఇచ్చిన సలహాలను పక్కనపెట్టి నిబంధనలు దాటడంపై ఫెడరేషన్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఎన్నికల ద్వారా కొలువుదీరిన నూతన కార్యవర్గానికి ఎలాంటి సహకారం అందించబోమని తేల్చిచెప్పిన ఫెడరేషన్, సాధారణ డ్యాన్సర్లు తమను ఆశ్రయిస్తే మాత్రం పూర్తి రక్షణ అందిస్తామని హామీ ఇచ్చింది. ఫలితంగా జానీ మాస్టర్‌పై తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ మళ్లీ సస్పెన్షన్ అమల్లోకి రావడంతో ఆయన ప్రస్తుతం పనిచేస్తున్న సినిమాల షూటింగ్‌లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. 23 క్రాఫ్టులకు చెందిన వర్కర్లు మరియు సాంకేతిక నిపుణులు ఆయన ప్రాజెక్టులకు సహకరించకపోవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలోని పలువురు బడా నిర్మాతలు మరియు

బీజేపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తన నిర్ణయానికి గల కారణాలను వెల్లడించారు. బీజేపీని వీడటం వెనుక రాజకీయ విభేదాలు లేవని, ఆర్థిక, వ్యక్తిగత పరిస్థితుల కారణంగానే పార్టీ నుంచి తప్పుకున్నానని ఆయన స్పష్టం చేశారు. ఇంటర్నెట్ డెస్క్: బీజేపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తన నిర్ణయానికి గల కారణాలను వెల్లడించారు. బీజేపీని వీడటం వెనుక రాజకీయ విభేదాలు లేవని, ఆర్థిక, వ్యక్తిగత పరిస్థితుల కారణంగానే పార్టీ నుంచి తప్పుకున్నానని ఆయన స్పష్టం చేశారు. రాజీనామా అనంతరం తొలిసారి ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన పరిస్థితులను వివరించారు (Shehzad Poonawalla Quits BJP). పూర్తికాలం రాజకీయాల్లో కొనసాగడం వల్ల తన వ్యక్తిగత ఖర్చులను నిర్వహించడం కష్టంగా మారిందని పూనావాలా తెలిపారు. రాజకీయ పార్టీలు తమ అధికార ప్రతినిధులకు లేదా కార్యకర్తలకు జీతాలు చెల్లించవని చెప్పారు. దీంతో ఇంటి అద్దె వంటి సాధారణ ఖర్చులను కూడా భరించడం కష్టంగా మారిందని వివరించారు. 'నేను నా ఇంటి అద్దె చెల్లించాలి. రోజువారీ ఖర్చులు చూసుకోవాలి' అని ఆయన తన పరిస్థితిని వివరించారు. పార్టీపై అసంతృప్తితో తాను ఈ నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు (BJP Spokesperson). బీజేపీని వీడాలనే ఆలోచన తనకు అకస్మాత్తుగా రాలేదని పూనావాలా తెలిపారు. పార్టీకి రాజీనామా చేసి ప్రైవేటు రంగంలోకి తిరిగి వెళ్లడం గురించి 2024 నుంచి ఆలోచిస్తున్నానని చెప్పారు (BJP Resignation Shehzad). కొన్ని వారాల క్రితం తాను మొదటిసారి రాజీనామా చేయాలనుకుంటున్నట్లు పార్టీ నాయకత్వానికి తెలియజేశానని, ఆ సమయంలో పార్టీ పెద్దలు తనతో మాట్లాడారని వెల్లడించారు. అయితే ఈసారి మాత్రం తన నిర్ణయం తుది నిర్ణయమని స్పష్టం చేస్తూ బీజేపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేసినట్టు తెలిపారు. నీట్ పేపర్ లీక్‌పై

ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు హవా నడుస్తుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడే కాదు ఎప్పుడో పాన్ ఇండియా సినిమాల సందడి మొదలైంది. 1970లోనే ఓ సినిమా ఏకంగా 50 దేశాల్లో విడుదలై సంచలనం సృష్టించింది. ఆ సినిమా ఎదో తెలుసా.? అది సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమా. 1971లో విడుదలైన మోసగాళ్లకు మోసగాడు తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోయింది. సూపర్‌స్టార్ కృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తొలి కౌబాయ్ చిత్రంగానే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలలో విడుదలైన తొలి పాన్ వరల్డ్ తెలుగు చిత్రంగానూ రికార్డు సృష్టించింది. ఈ రికార్డును ఇప్పటివరకు ఏ సినిమా కూడా బీట్ చేయలేకపోయింది. సూపర్‌స్టార్ కృష్ణ ప్రయోగాలకు పెట్టింది పేరు. తెలుగు సినిమాకు అనేక నూతన టెక్నాలజీలను, జానర్లను పరిచయం చేశారు. తొలి కౌబాయ్ సినిమా, తొలి జేమ్స్ బాండ్ సినిమాలను చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆ హీరోతో ఒక పాటలోనైనా కలిసి డ్యాన్స్ చేయాలి.. అదే నా కోరిక : ఇంద్రజ అప్పట్లో మద్రాసులో విపరీతంగా ఆడే కొన్ని ఇంగ్లీష్ చిత్రాల నుండి స్ఫూర్తి పొంది, అలాంటి సినిమాలు తెలుగులో ఎందుకు చేయకూడదని కృష్ణ ఆలోచించారు. తక్షణమే రచయిత ఆరుద్రను పిలిపించి, ద గుడ్, ద బ్యాడ్ అండ్ అగ్లీ వంటి హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో తెలుగు నేటివిటీకి తగిన కథను రాయమని కోరారు. ఆరుద్ర అద్భుతమైన కథను అందించగా, కృష్ణ తన సొంత బ్యానర్ పద్మాలయ స్టూడియోస్‌పై ఈ సినిమాను నిర్మించారు. అప్పట్లోనే కనీవినీ ఎరుగని రీతిలో 8 లక్షల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా రాజస్థాన్ ఎడారి నేపథ్యంలో జరిగింది. బొబ్బిలి యుద్ధం తర్వాత బ్రిటిష్ వారికి

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు(Veligonda Project) ముంపు బాధితులకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఒక పెద్ద ఊరటనిచ్చింది. ఈనెల 24వ తేదీ లోపు వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితులందరికీ పునరావాస ప్యాకేజీ డబ్బులు పూర్తిస్థాయిలో చెల్లించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) చేతుల మీదుగా 1600 ముంపు బాధిత కుటుంబాలకు ఏకంగా రూ.200 కోట్ల భారీ పరిహారాన్ని పంపిణీ చేయనున్నారు. వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్న ప్రభుత్వం.. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే మొదటి విడత కింద 2,565 ముంపు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం డబ్బులను విజయవంతంగా చెల్లించింది. మిగిలిన వారందరికీ కూడా ఈనెల 24 లోపు ప్యాకేజీ సొమ్మును అందజేసి పునరావాస ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మరోవైపు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అత్యంత కీలకమైన అప్డేట్ను కూడా ప్రభుత్వం వెల్లడించింది. నిర్వాసితులకు ప్యాకేజీ ప్రక్రియ ముగిసిన వెంటనే, ఈ నెలాఖరు నాటికి నల్లమల్లసాగర్ రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీనివల్ల ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందనుంది. దశాబ్దాల నాటి వెలిగొండ కల సాకారం కాబోతుండటంతో అటు నిర్వాసితుల్లోనూ, ఇటు రాయలసీమ, ప్రకాశం ప్రాంత ప్రజల్లోనూ సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది