
Akhilesh Yadav | ఉత్తరప్రదేశ్‌లో 151 అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసమయ్యాయి: అఖిలేష్ యాదవ్
Akhilesh Yadav | ఉత్తరప్రదేశ్‌లో 151 అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసమయ్యాయి: అఖిలేష్ యాదవ్

Akhilesh Yadav | ఉత్తరప్రదేశ్‌లో 151 అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసమయ్యాయి: అఖిలేష్ యాదవ్

Akhilesh Yadav | రీట్వీట్ చేయనందుకు మేనల్లుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మాయావతి.. ఎస్పీలోకి ఆహ్వానించిన అఖిలేష్

ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు (UP Assembly polls 2027) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కీలక నేతల భద్రతపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 52 మంది రాజకీయ నాయకులకు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు (Bulletproof Jackets) సమకూర్చినట్లు సమాచారం. ఈ జాబితాలో సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath), సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి సహా పలువురు నేతలు ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఒక్కో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధర రూ.10 లక్షలు ఉంటుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. వీటిని పొందిన నేతల లిస్టులో 11 మంది రాష్ట్ర మంత్రులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని మరో 98 మంది నేతలు, ప్రముఖ వ్యక్తులకు వివిధ స్థాయుల్లో భద్రత కల్పించనున్నట్లు తెలిపాయి. మరోవైపు ఎన్నికల (Assembly polls 2027) సన్నాహాల్లో భాగంగా వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని, అభ్యర్థుల అవకాశాలను అంచనా వేయడానికి భాజపా (BJP) సర్వేలు నిర్వహిస్తోంది. ఇదీ చదవండి: అత్యాచార కేసులో రూ.5 కోట్ల డిమాండ్.. సీఎం భార్యపై సంచలన ఆరోపణలు గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు