
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

అమెరికాలోని 29 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కలిసి ప్రముఖ టెక్ దిగ్గజం మెటాపై కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ ఫెడరల్ కోర్టులో చారిత్రాత్మక దావా వేశారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లు పిల్లలు మరియు యువతను సోషల్ మీడియాకు బానిసలుగా మారుస్తున్నాయనే తీవ్రమైన ఆరోపణలతో ఈ విచారణ ప్రారంభమైంది. ఆగస్టు 18 నుంచి ప్రారంభమైన ఈ సుదీర్ఘ విచారణలో మెటా సంస్థకు సుమారు 200 బిలియన్ డాలర్లు అంటే దాదాపు ₹19 లక్షల కోట్ల వరకు భారీ జరిమానా విధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాలిఫోర్నియా, కొలరాడో, కెంటకీ, న్యూజెర్సీ రాష్ట్రాలు ప్రధానంగా నాయకత్వం వహిస్తున్న ఈ కేసులో మెటాపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. తమ ప్లాట్‌ఫామ్‌లలో యూజర్లు ఎక్కువ సమయం గడిపేలా ఎండ్లెస్ స్క్రోల్, ఆటోప్లే, నోటిఫికేషన్లు మరియు ప్రత్యేక అల్గారిథమ్‌లను మెటా కావాలనే డిజైన్ చేసిందని వాదిస్తున్నారు. దీనితో పాటు తల్లిదండ్రుల ముందస్తు అనుమతి లేకుండానే పిల్లల డేటాను సేకరించి సీఓపీపీఏ చట్ట నిబంధనలను సైతం ఈ సంస్థ తీవ్రంగా ఉల్లంఘించిందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఫీచర్ల కారణంగానే టీనేజర్లలో ఆందోళన, డిప్రెషన్ మరియు ఆత్మహత్య ధోరణులు విపరీతంగా పెరుగుతున్నాయని రాష్ట్రాల లాయర్లు కోర్టులో ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కాలిఫోర్నియా డిప్యూటీ అటార్నీ జనరల్ మేగన్ ఓ’నీల్ స్పందిస్తూ యూజర్లను హుక్ చేయడం, డేటా సేకరించడం మరియు నిజాలను దాచడమే మెటా వ్యాపార నమూనా అని తీవ్రంగా విమర్శించారు. ఇదిలా ఉండగా ఇన్‌స్టాగ్రామ్‌ను నేరుగా ఒక ప్రమాదకరమైన మాదకద్రవ్యంతో పోల్చిన కంపెనీ అంతర్గత చాట్లను కూడా ఈ కేసులో ప్రధాన సాక్ష్యంగా సమర్పించారు. అయితే మెటా యాజమాన్యం తమపై వచ్చిన ఈ తీవ్రమైన ఆరోపణలను చాలా గట్టిగా ఖండించింది. ఫలితంగా సోషల్ మీడియా బానిసత్వం అనేది శాస్త్రీయంగా స్థాపితమైన మానసిక రుగ్మత కాదని, తమ ప్లాట్‌ఫామ్‌లు యువతకు ఎంతో సానుకూల అనుభవాలను కూడా ఇస్తున్నాయని మెటా తరఫు న్యాయవాది పాల్ ష్మిత్

ప్రముఖ టెక్ దిగ్గజం మెటాపై అమెరికాలో సంచలన కేసు నమోదైంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పిల్లలకు, టీనేజర్లకు హాని కలిగిస్తున్నారనే ఆరోపణలతో ఈ విచారణ ప్రారంభమైంది. ఏకంగా 1.4 ట్రిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 133 లక్షల కోట్ల జరిమానా విధించే అవకాశం ఉండటంతో అంతర్జాతీయంగా ఈ కేసు తీవ్ర చర్చనీయాంశమైంది. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ ఫెడరల్ కోర్టులో మంగళవారం ఈ కీలక విచారణ అధికారికంగా మొదలైంది. ఈ వివాదానికి బీజం 2023లో పడింది. అప్పట్లో దాదాపు 30 అమెరికన్ రాష్ట్రాలు మెటాపై ఉమ్మడిగా పిటిషన్ దాఖలు చేశాయి. తాజాగా కాలిఫోర్నియా, కొలరాడో, కెంటుకీ, మరియు న్యూజెర్సీ రాష్ట్రాలు ఈ కేసులో ప్రధాన వాదిగా నిలిచాయి. 13 ఏళ్ల లోపు పిల్లల సమాచారాన్ని తల్లిదండ్రుల అనుమతి లేకుండా సేకరించడం ద్వారా 'కాపా' చట్టాన్ని ఉల్లంఘించారని రాష్ట్రాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఫీచర్లపై రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇన్ఫినిట్ స్క్రోల్, లైక్స్, నోటిఫికేషన్లు, మరియు రికమెండేషన్ సిస్టమ్స్ వంటి ఫీచర్లను మెటా లాభాపేక్షతో రూపొందించిందని పిటిషనర్ల వాదన. దీంతో యువత ఈ వేదికలకు బానిసలై, తీవ్రమైన ఆందోళన, కుంగుబాటు వంటి మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారని కోర్టుకు వివరించారు. ఇదిలా ఉండగా, మెటా ఈ ఆరోపణలను కొట్టివేస్తూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ భారీ జరిమానా పట్ల మెటా యాజమాన్యం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ మొత్తం మెటా మార్కెట్ విలువకు సమానమని, వాస్తవాలకు దూరంగా ఉందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ మార్క్ జకర్బర్గ్, ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోసెరిలను కోర్టు విచారణకు పిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే న్యూ మెక్సికో కేసులో మెటాకు సుమారు రూ. 942 కోట్ల జరిమానా పడటం గమనార్హం. రాబోయే రోజుల్లో ఈ కేసు విచారణ మరింత వేడెక్కనుంది. టెక్ దిగ్గజాలు

కుభీర్ : ఆగస్టు 16: తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి మద్యం మత్తులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని మలేగాంవ్ గ్రామంలో చోటు చేసుకుందీ విషాదకరమైన ఘటన. మృతుడిని కుభీర్ మండలం మాలేగాం గ్రామానికి చెందిన పులొల్ల భోజన్న (39)గా గుర్తించారు పోలీసులు. కుభీర్ ఎస్సై కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మాలేగాం గ్రామానికి చెందిన పులొల్ల భోజన్న (39) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యడు. ఆదివారం ఇంటి నుండి బయటకు వెళ్లిన అతడు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామంలో అంతా వెతికారు. అయితే.. ప్రతిరోజు మద్యం మత్తులో ఉంటున్న భోజన్న జీవితంపై విరక్తి చెంది తన వ్యవసాయ పొలంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు విగతజీవిగా ఉండడం గమనించిన పలువురు శివారు రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు వెంటనే కుభీర్ పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేశారు. ఎస్సై కృష్ణారెడ్డి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని, పంచనామ నిర్వహించారు. భోజన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. భోజన్న మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు

ఫోన్‌ను గంటల తరబడి ఉపయోగించడం, ముఖ్యంగా తప్పు భంగిమలో చూడటం వల్ల మెడ, భుజాలు, వెన్ను భాగాల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఓ నటి తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకుంటూ, అవసరానికి మించి ఫోన్ వాడకుండా స్క్రీన్ టైమ్‌ను నియంత్రించుకోవాలని సూచించారు. ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్‌ఫోన్ మన రోజువారీ జీవితంలో ముఖ్యమైన భాగంగా మారిపోయింది. అయితే అవసరానికి మించి గంటల తరబడి ఫోన్ చూడటం, సరైన భంగిమలో కూర్చోకపోవడం లేదా పడుకుని ఫోన్ ఉపయోగించడం ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా దక్షిణాది నటి తన అనుభవాన్ని పంచుకున్నారు. ఓ నటి తన యూట్యూబ్ వ్లాగ్‌లో ఫోన్ వాడకం వల్ల తాను ఎదుర్కొన్న మెడ సమస్య గురించి వివరించారు. తాను మంచంపై పక్కకు తిరిగి పడుకుని వరుసగా నాలుగు గంటల వరకు ఫోన్లో గేమ్స్ ఆడేదాన్నని చెప్పారు. మధ్యలో టీ లేదా కాఫీ తాగడానికి మాత్రమే లేచి, మళ్లీ ఫోన్ పట్టుకునేదాన్నని తెలిపారు. గేమ్స్‌తో పాటు గంటల తరబడి వీడియోలు, రీల్స్ చూస్తూ గడిపేదాన్నని ఆమె చెప్పారు. ఇలా ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉండటం వల్ల క్రమంగా మెడలో తీవ్రమైన నొప్పి మొదలైందని వివరించారు. సమస్య తీవ్రం కావడంతో చెన్నైలోని మెడ్వే ఆసుపత్రిలో ఆమె మెడకు శస్త్రచికిత్స జరిగినట్లు తెలిపారు. ఈ చికిత్స కోసం సుమారు రూ.3 లక్షలు ఖర్చయ్యాయని చెప్పారు. శస్త్రచికిత్స అనంతరం కోలుకునే సమయంలో మెడకు సాఫ్ట్ సర్వైకల్ కాలర్ ధరించాలని వైద్యులు సూచించినట్లు ఆమె వెల్లడించారు. ఆపరేషన్ తర్వాత మంచం నుంచి లేవడం, భోజనం చేయడం వంటి సాధారణ పనులకు కూడా ఇతరుల సహాయం అవసరమైందని నటి తెలిపారు. తన మెడ సమస్యకు చికిత్సలో టైటానియం స్క్రూ ఉపయోగించినట్లు కూడా చెప్పారు. తన అనుభవాన్ని వివరిస్తూ ఆ నటి నెటిజన్లకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు ఓ సూచన చేశారు. ఫోన్ ఉపయోగకరమైన పరికరమే అయినప్పటికీ, అవసరానికి మించి ఉపయోగించకూడదని

గంటల తరబడి స్మార్ట్‌ఫోన్‌కు అతుక్కుపోవడం ఎంత ప్రమాదకరమో చెప్పడానికి సీనియర్ నటి షకీలా ఉదంతం ఒక హెచ్చరికగా నిలుస్తోంది. ఫోన్ వ్యసనం కారణంగా తీవ్రమైన నరాల సమస్య బారిన పడిన ఆమె, ఇటీవల మెడకు అత్యవసర శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ చేదు అనుభవాన్ని ఆమె స్వయంగా వెల్లడిస్తూ, స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను అప్రమత్తం చేశారు.గత కొంతకాలంగా తాను మంచంపై తప్పుడు భంగిమలో పడుకుని గంటల తరబడి ఫోన్లో రీల్స్ చూడటం, గేమ్స్ ఆడటమే అలవాటుగా మార్చుకున్నానని షకీలా తెలిపారు. కేవలం టీ, కాఫీ తాగేందుకు మాత్రమే విరామం తీసుకుని, మిగతా సమయమంతా ఫోన్‌తోనే గడిపానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దురలవాటు కారణంగా మెడలోని ప్రధాన నరాలపై తీవ్ర ఒత్తిడి పడి, సమస్య జఠిలమైందని వివరించారు. చివరికి ఈ అలవాటే తనను ఆపరేషన్ టేబుల్ వరకు తీసుకెళ్లిందని ఆమె వాపోయారు.ఈ మేజర్ సర్జరీ కోసం సుమారు రూ. 3 లక్షలు ఖర్చయిందని, శారీరకంగా తాను భరించలేని నరకాన్ని అనుభవించానని షకీలా కన్నీటిపర్యంతమయ్యారు. ప్రస్తుతం కనీసం మంచం దిగాలన్నా, ఆహారం తినాలన్నా ఇతరుల సహాయం తీసుకోవాల్సిన దీనస్థితిలో ఉన్నానని చెప్పారు. తన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ గుణపాఠం నేర్చుకోవాలని కోరారు.ఈ సందర్భంగా ఆమె స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. "దయచేసి ఎవరూ ఫోన్‌ను అతిగా వాడి ఆరోగ్యం పాడుచేసుకోవద్దు. స్క్రీన్ టైమ్ తగ్గించుకోండి" అని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను స్మార్ట్ఫోన్లు, ఇతర గాడ్జెట్లకు దూరంగా ఉంచాలని, లేదంటే భవిష్యత్తులో వారు కూడా

చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. క్షణాల్లో ప్రపంచం పిల్లల ముందుకొచ్చేస్తోంది. రీల్స్.. చాటింగ్.. నోటిఫికేషన్లు.. లైక్‌లు.. ఇలా సోషల్ మీడియా వారి రోజువారీ జీవితంలో భాగమైపోయింది. అయితే పిల్లలను సోషల్ మీడియాలోకి ఎప్పుడు అనుమతించాలన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. చిన్న వయసులోనే ఈ అలవాటు మొదలైతే చదువుపై ప్రభావం పడొచ్చని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది.11 ఏళ్లకే మొదలైతే..ఇటలీలో ఐదు వేల మందికిపైగా విద్యార్థులపై ఈ పరిశోధన జరిగింది. 11, 12 ఏళ్లకే సోషల్ మీడియా అకౌంట్ తెరిచిన పిల్లల పరీక్ష ఫలితాలను.. 14 ఏళ్ల తర్వాత అకౌంట్ తెరిచిన వారితో పోల్చారు. 13-14 ఏళ్ల వయసులోనే గణితం, ఇటాలియన్ భాషలో వీరి స్కోర్లు తక్కువగా కనిపించాయి.ఆరు నెలల చదువు తేడా!15-16 ఏళ్లకు చేరేసరికి ఈ వ్యత్యాసం మరింత స్పష్టమైంది. ముఖ్యంగా గణితంలో తేడా పెరిగింది. ఇటాలియన్ భాషలోనూ ప్రభావం కనిపించింది. మొత్తం వ్యత్యాసం దాదాపు ఆరు నెలల పాఠశాల విద్యకు సమానంగా ఉందని పరిశోధకులు అంచనా వేశారు. అయితే సోషల్ మీడియా వాడకమే దీనికి నేరుగా కారణమని అధ్యయనం నిరూపించలేదు.అసలు సమస్య ఇదే..ఫోన్‌ను ఎంతసేపు వాడుతున్నారనే దానికంటే.. ఎన్నిసార్లు చెక్ చేస్తున్నారన్నది ముఖ్యమని పరిశోధకులు చెబుతున్నారు. నోటిఫికేషన్లు, మెసేజ్‌లు, లైక్‌ల కోసం పదేపదే ఫోన్ చూడటం ఏకాగ్రతను దెబ్బతీయొచ్చు. చదువుతున్న సమయంలోనూ దృష్టి సోషల్ మీడియా వైపు మళ్లుతుంది. దీంతో ఎక్కువసేపు ఒక విషయంపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది.తల్లిదండ్రులు ఇలా చేయండిపిల్లలకు సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించాల్సిన అవసరం లేదని పరిశోధకులు స్పష్టం చేశారు. వీలైతే అకౌంట్