
చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటే చాలు.. క్షణాల్లో ప్రపంచం పిల్లల ముందుకొచ్చేస్తోంది. రీల్స్.. చాటింగ్.. నోటిఫికేషన్లు.. లైక్లు.. ఇలా సోషల్ మీడియా వారి రోజువారీ జీవితంలో భాగమైపోయింది. అయితే పిల్లలను సోషల్ మీడియాలోకి ఎప్పుడు అనుమతించాలన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. చిన్న వయసులోనే ఈ అలవాటు మొదలైతే చదువుపై ప్రభావం పడొచ్చని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది.11 ఏళ్లకే మొదలైతే..ఇటలీలో ఐదు వేల మందికిపైగా విద్యార్థులపై ఈ పరిశోధన జరిగింది. 11, 12 ఏళ్లకే సోషల్ మీడియా అకౌంట్ తెరిచిన పిల్లల పరీక్ష ఫలితాలను.. 14 ఏళ్ల తర్వాత అకౌంట్ తెరిచిన వారితో పోల్చారు. 13-14 ఏళ్ల వయసులోనే గణితం, ఇటాలియన్ భాషలో వీరి స్కోర్లు తక్కువగా కనిపించాయి.ఆరు నెలల చదువు తేడా!15-16 ఏళ్లకు చేరేసరికి ఈ వ్యత్యాసం మరింత స్పష్టమైంది. ముఖ్యంగా గణితంలో తేడా పెరిగింది. ఇటాలియన్ భాషలోనూ ప్రభావం కనిపించింది. మొత్తం వ్యత్యాసం దాదాపు ఆరు నెలల పాఠశాల విద్యకు సమానంగా ఉందని పరిశోధకులు అంచనా వేశారు. అయితే సోషల్ మీడియా వాడకమే దీనికి నేరుగా కారణమని అధ్యయనం నిరూపించలేదు.అసలు సమస్య ఇదే..ఫోన్ను ఎంతసేపు వాడుతున్నారనే దానికంటే.. ఎన్నిసార్లు చెక్ చేస్తున్నారన్నది ముఖ్యమని పరిశోధకులు చెబుతున్నారు. నోటిఫికేషన్లు, మెసేజ్లు, లైక్ల కోసం పదేపదే ఫోన్ చూడటం ఏకాగ్రతను దెబ్బతీయొచ్చు. చదువుతున్న సమయంలోనూ దృష్టి సోషల్ మీడియా వైపు మళ్లుతుంది. దీంతో ఎక్కువసేపు ఒక విషయంపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది.తల్లిదండ్రులు ఇలా చేయండిపిల్లలకు సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించాల్సిన అవసరం లేదని పరిశోధకులు స్పష్టం చేశారు. వీలైతే అకౌంట్
Recommended for you
Found this helpful?
Share this story with your network









