
యుద్ధ నిధుల కోసం పోర్న్ చట్టబద్ధం!

నేడు కార్తీ సర్దార్ 2 సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఇలా నలుపు తెలుపు చీరలో వచ్చి సందడి చేసింది.

నేడు కార్తీ సర్దార్ 2 సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ మాళవిక మోహనన్ ఇలా వైట్ డ్రెస్ లో వచ్చి సందడి చేసింది.

Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య

NRI news | అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం అప్రజాస్వామికం..!

అసలు రాష్ట్రంలో 22ఏ సమస్య ఎందుకొచ్చింది? - అధికారులను ఆరా తీసిన సీఎం రేవంత్ రెడ్డి

యుద్ధ నిధుల కోసం అశ్లీలతపై పన్ను.. ఉక్రెయిన్ సంచలన నిర్ణయం?

గోదావరి పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు.. బాసరలో రూ.20 కోట్లతో ఘాట్ల అభివృద్ధి పనులు

గ్రామాల నిధులు సర్పంచులకే అందేలా త్వరలో కొత్త బిల్లు: సీతక్క

అమెరికా ప్రతినిధులు జెలెన్స్కీతో చర్చలు జరుపుతున్నారు

గ్రామ నిధులు నేరుగా సర్పంచులకే అందేలా త్వరలో కొత్త బిల్లు: మంత్రి సీతక్క

రూ.20 వడా పావ్ కోసం... 15 వేలు ఖర్చు చేసి ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్ళింది..! ఒక వర్గానికి మీరు ఆదర్శం మేడం..!

Womens Asia Cup 2026 : మహిళల ఆసియాకప్ 2026లో భాగంగా దుబాయ్ వేదికగా హాంగ్‌కాంగ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఓపెనర్ స్మృతి మంధాన (124 ; 64 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీతో చెలరేగింది. ఈ క్రమంలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. దీంతో హాంగ్‌కాంగ్ ముందు 194 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. HUNDRED! 💯 Vice-Smriti Mandhana brings up her second T20I century 🥳 Updates ▶️ | #INDvHK — BCCI Women (@BCCIWomen) September 3, 2026 Rohit Sharma : మీటింగ్‌కు రాని అజిత్ అగార్కర్.. రోహిత్ శర్మ భవిష్యత్తుపై బీసీసీఐ కీలక వ్యాఖ్యలు.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ (28; 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) లు తొలి వికెట్‌కు శుభారంభాన్ని అందించారు. 7.6 ఓవర్లలో 74 పరుగులు జోడించారు. వేగంగా ఆడే క్రమంలో షఫాలీ ఔటైంది. వన్‌డౌన్‌లో వచ్చిన ప్రతీకా రావల్ (10), రిచా ఘోష్ (11), హర్మన్‌ప్రీత్ కౌర్(10) విఫలమైనప్పటికి కూడా మరో ఎండ్ స్మృతి మంధాన తనదైన శైలిలో దూకుడుగా ఆడింది. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ బౌండరీ వరద పారించింది. 57 బంతుల్లోనే సెంచరీ సాధించింది. టీ20ల్లో మంధానకు ఇది రెండో శతకం. సెంచరీ తరువాత కూడా స్మృతి దూకుడుగా ఆడింది. ఆఖరి ఓవర్లో రనౌట్ అయింది. స్మృతి రాణించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. హాంగ్ కాంగ్ బౌలర్లలో మరీనా లాంప్లో రెండు వికెట్లు తీసింది. రుచిత వెంకటేష్, జోయిలీన్ కౌర్‌లు చెరో ఓ వికెట్ సాధించారు

రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. భారత వాయుసేన (ఐఏఎఫ్), పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 'ఖగంతక్-243' అనే లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబు (ఎల్ఆర్‌జీబీ) డ్రాప్ ట్రయల్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షతో సుదూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించే సామర్థ్యం భారత వాయుసేనకు మరింత పెరిగింది.ఈ పరీక్ష నిర్దేశిత లక్ష్యాలన్నింటినీ అందుకుందని, 'ఆత్మనిర్భర్ భారత్', 'మేకిన్ ఇండియా' స్ఫూర్తితో రక్షణ రంగంలో సరికొత్త శిఖరాలను అధిరోహించామని సెప్టెంబర్ 2న 'ఎక్స్' సోషల్ మీడియా వేదికగా ఐఏఎఫ్ ప్రకటించింది. ఇది భారత వాయుసేనతో పాటు దేశీయ రక్షణ పరిశ్రమకు కూడా ఒక ముఖ్యమైన మైలురాయి అని పేర్కొంది.ఖగంతక్-243 ప్రత్యేకతలునాగ్పూర్కు చెందిన జేఎస్ఆర్ డైనమిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) సంయుక్తంగా ఈ బాంబును అభివృద్ధి చేశాయి. 300 కిలోల తరగతికి చెందిన ఈ బాంబులో 125 కిలోల శక్తివంతమైన వార్‌హెడ్ ఉంటుంది. సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానం నుంచి పొఖ్రాన్‌లో దీనిని పరీక్షించారు.ఈ గ్లైడ్ బాంబును సుమారు 12 కిలోమీటర్ల ఎత్తు నుంచి జారవిడిచినప్పుడు, తనకున్న రెక్కల సహాయంతో గాలిలో తేలుతూ 180 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా కచ్చితత్వంతో ఛేదించగలదు. దీనివల్ల, శత్రుదేశాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పరిధిలోకి వెళ్లకుండానే మన ఫైటర్ జెట్లు లోతైన ప్రాంతాల్లోని రన్వేలు, కమాండ్ సెంటర్లు వంటి వ్యూహాత్మక టార్గెట్లపై దాడి చేయవచ్చు.భవిష్యత్తులో మిగ్-29కె, మిరాజ్-2000 వంటి ఇతర విమానాల్లోనూ దీనిని అనుసంధానించనున్నారు. ఇప్పటికే పరిమిత సంఖ్యలో వీటి ఉత్పత్తి కోసం బీఈఎల్‌కు

పొట్టి ఫార్మాట్ అని పిలిచే టీ20 క్రికెట్లో సెంచరీ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. పరిమిత ఓవర్లు, తీవ్రమైన ఒత్తిడి మధ్య వంద పరుగులు పూర్తి చేయడం బాటన్స్కు పెద్ద సవాల్. అయితే ప్రపంచవ్యాప్తంగా లీగ్‌లు, అంతర్జాతీయ మ్యాచ్‌లలో కొందరు బ్యాటర్లు మైదానంలో విరుచుకుపడుతూ వరుసగా సెంచరీలు బాదారు. ప్రపంచ టీ20 లీగ్‌లు, ఇంటర్నేషనల్ మ్యాచులలో అత్యధికంగా సెంచరీలు చేసిన టాప్ 7 బ్యాటర్ల రికార్డులను ఇప్పుడు చూద్దాం. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన రికార్డు వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ పేరిట ఉంది. క్రిస్ గేల్ తన సుదీర్ఘ టీ20 కెరీర్లో ఏకంగా 22 సెంచరీలు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. తన కెరీర్లో మొత్తం 463 టీ20 మ్యాచ్‌లు ఆడిన గేల్ 14,562 పరుగులు చేశారు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ మైదానంలో పరుగుల సునామీ సృష్టించడంలో గేల్ తనదైన ముద్ర వేశాడు. అందుకే ఈ ఫార్మాట్లో ఇప్పటికీ మోస్ట్ సెంచరీల వరల్డ్ రికార్డు గేల్ పేరిటే పదిలంగా ఉంది. అత్యధిక సెంచరీల జాబితాలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ రెండో స్థానంలో ఉన్నారు. తన నిలకడైన బ్యాటింగ్‌తో సుదీర్ఘ కాలంగా పరుగులు సాధిస్తున్న బాబర్, టీ20 ఫార్మాట్లో ఇప్పటివరకు 13 సెంచరీలు సాధించారు. మొత్తం 359 టీ20 మ్యాచ్‌లు ఆడిన బాబర్ ఆజమ్ 12,493 పరుగులు చేసి తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. తక్కువ మ్యాచుల్లోనే అత్యధిక సెంచరీలు కొట్టిన ఆటగాళ్లలో బాబర్ ఒకరిగా నిలిచారు. టీ20 క్రికెట్లో పదేసి సెంచరీలతో ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు తర్వాతి స్థానాల్లో నిలిచారు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్లో 430 టీ20 మ్యాచ్‌లు ఆడి 10 సెంచరీలు సాధించారు. కోహ్లీ మొత్తం 14,218 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా 10 సెంచరీలతో సమానంగా ఉన్నారు. వార్నర్ 439

ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ) చైర్మన్‌గా మోహిత్ జైన్ ఎన్నికయ్యారు. బెన్నెట్ కోల్మన్ అండ్ కో లిమిటెడ్ (బీసీసీఎల్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (పబ్లిషింగ్), బోర్డు... న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ) చైర్మన్‌గా మోహిత్ జైన్ ఎన్నికయ్యారు. బెన్నెట్ కోల్మన్ అండ్ కో లిమిటెడ్ (బీసీసీఎల్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (పబ్లిషింగ్), బోర్డు సభ్యుడిగా ఉన్న మోహిత్ జైన్ 2026-27 సంవత్సరానికి గాను ఏబీసీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో 43 ఏళ్ల తర్వాత బీసీసీఎల్‌కు చెందిన ప్రతినిధి మరోసారి ఏబీసీ చైర్మన్ పదవిని చేపట్టినట్లయింది. ప్రింట్ మీడియా రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న మోహిత్ జైన్.. ప్రచురణ, వ్యాపార కార్యకలాపాలు, పరిశ్రమ వ్యవహారాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. కెమికల్ ఇంజనీరింగ్‌తో పాటు ఎంబీఏ చదివిన జైన్.. 2021-22లో ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) అధ్యక్షుడిగా సేవలందించారు. రెండు దశాబ్దాలకు పైగా ఐఎన్ఎ్సతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ప్రపంచ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ గ్లోబల్ సూపర్వైజరీ బోర్డులోనూ మోహిత్ జైన్ మూడేళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్ దక్షిణాసియా విభాగం బోర్డు వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. కాగా, ఏబీసీ డిప్యూటీ చైర్మన్‌గా విక్రమ్ సఖుజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

మహిళల క్రికెట్లో తొలిసారి నిర్వహించనున్న చాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భారత్‌కు ఆతిథ్య హక్కులను జారీ చేస్తూ బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ముంబై, వడోదర వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ టోర్నీలో టాప్-6 టీమ్స్ తలపడనున్నాయి. అయితే తొలుత మహిళల తొలి చాంపియన్స్ ట్రోఫీకి శ్రీలంక ఆతిథ్యమివ్వాల్సింది. కానీ ప్రస్తుతం శ్రీలంక పాలనా పరమైన సమస్యలతో సతమతమవుతున్న వేళ ఐసీసీ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను శ్రీలంక నుంచి భారత్‌కు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. శ్రీలంకలో టోర్నీ నిర్వహణ సాధ్యం కాకపోవడంతో జూలైలో జరిగిన ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో లంకకు బదులుగా టోర్నీని బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, భారత్ రూపంలో మూడు ప్రతిపాదనలు చేసింది. తాజాగా ఐసీసీ బుధవారం భారత్‌కు ఆతిథ్య హక్కులు కట్టబెడుతూ తుది నిర్ణయం తీసుకుంది. జూలై 6 అర్హత కటాఫ్ తేదీ నాటికి ఐసీసీ మహిళల టీ20ఐ టీమ్ ర్యాంకింగ్స్‌లో తమ స్థానాల ప్రకారం అర్హత సాధించిన ఆ ఆరు జట్లు రౌండ్-రాబిన్ లీగ్‌లో పోటీపడతాయి. ఇందులో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఫిబ్రవరి 28న జరిగే ఫైనల్‌కు చేరుకుంటాయి. కటాఫ్ ర్యాంకింగ్స్ ప్రకారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంకలు తొలి చాంపియన్స్ ట్రోఫీలో ఆడనున్నాయి. Read: ఆసీస్‌తో సిరీస్‌కు పక్కనబెట్టారు.. కట్‌చేస్తే ట్రిపుల్ సెంచరీ కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు) మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు) ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు) సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే snake plant ఈ మొక్కలని కిచెన్‌లో పెట్టుకుంటే.. మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై

ఇంటర్నెట్ డెస్క్: బంగారం అక్రమ రవాణా (Gold Smuggling)కు స్మగ్లర్లు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. తాజాగా కేరళంలోని ఓ విమానాశ్రయంలో 8 నెలల చిన్నారిని స్మగ్లింగ్‌కు ఉపయోగించుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. శిశువు డైపర్‌లో దాదాపు రూ.50లక్షల విలువైన బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆ ‘నవ్వే’.. పదేళ్లకు అతణ్ని కుటుంబంతో కలిపింది! యూఏఈలోని రస్ అల్ ఖైమా విమానాశ్రయం నుంచి మలప్పురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మంగళవారం రాత్రి కరిపుర్ (కాలికట్) అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాడు. బంగారం స్మగ్లింగ్ జరుగుతోందని పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు.. ఎనిమిది నెలల శిశువు, మరో ఇద్దరు చిన్నారులతో వచ్చిన సదరు వ్యక్తిని అడ్డుకున్నారు. తనిఖీ చేయగా శిశువు డైపర్‌లో రూ.50లక్షల విలువైన బంగారంతోపాటు అతడి వద్ద మరింత బంగారం లభించింది. మొత్తం విలువ రూ.కోటి ఉంటుందని అంచనా వేశారు. బంగారం స్మగ్లింగ్ మూలాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు.. శిశువును ఉపయోగించి గతంలో ఇటువంటి చర్యలకు పాల్పడ్డాడా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. లఖ్‌నవూలో మాజీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ నివాసం సమీపంలో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో రూన్ నదిలో చిక్కుకున్న ఇద్దరిని ఆర్మీ హెలికాప్టర్ రక్షించింది

HDFC బ్యాంక్ రూ.3 కోట్ల కంటే తక్కువ మొత్తంలో చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా వడ్డీ రేటును పెంచింది. 3 సంవత్సరాల 1 రోజు నుంచి 4 సంవత్సరాల 7 నెలల లోపు కాలపరిమితి ఉన్న FDలపై వడ్డీని 0.10 శాతం పెంచింది. గతంలో ఈ కాలపరిమితిలో సీనియర్ సిటిజన్లకు 7 శాతం వడ్డీ లభించేది. ఇప్పుడు దానిని 7.10 శాతానికి పెంచారు. ఈ కొత్త రేట్లు ఆగస్టు 19 నుంచి అమల్లోకి వచ్చినట్లు సమాచారం. HDFC బ్యాంక్‌లో సీనియర్ సిటిజన్లకు FD కాలపరిమితిని బట్టి 3.25 శాతం నుంచి గరిష్టంగా 7.10 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. అలాగే 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్న FDలపై 6.65 శాతం వడ్డీ అందుతోంది. సాధారణ కస్టమర్లకు గరిష్టంగా 6.50 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. ఫెడరల్ బ్యాంక్ కూడా రూ.3 కోట్ల కంటే తక్కువ మొత్తంలో చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. కొత్త రేట్ల ప్రకారం సీనియర్ సిటిజన్లకు కాలపరిమితిని బట్టి 3.50 శాతం నుంచి గరిష్టంగా 7.20 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. ఫెడరల్ బ్యాంక్‌లో సీనియర్ సిటిజన్లకు అందుతున్న కొన్ని ముఖ్యమైన FD వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. 7 నుంచి 29 రోజులకు 3.50%గా ఉండగా, 30 నుంచి 45 రోజులు 3.75%, 46 నుంచి 90 రోజులకు 4.75%, 91 నుంచి 180 రోజులకు 5%, 181 రోజులకు 6.50%, ఏడాదికి 6.75%, 1 సంవత్సరం కంటే ఎక్కువ నుంచి 15 నెలల లోపు 6.90%, 15 నెలలకు గాను 7.15%, 15 నుంచి 24 నెలలకు 6.90%, 24 నెలల కంటే ఎక్కువ నుంచి 48 నెలల లోపు పెట్టుబడికి 7%, 48 నెలలకు 7.20% వడ్డీ లభిస్తుంది. అదే 48 నెలల కంటే

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. మొట్టమొదటిసారిగా నిర్వహించనున్న ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ-2027 ఆతిథ్య హక్కులను శ్రీలంక నుంచి భారత్‌కు బదిలీ చేసింది. శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ)లో ప్రభుత్వ జోక్యం, కొనసాగుతున్న పరిపాలన సంక్షోభం కారణంగా ఈ మార్పు చేసినట్లు ఐసీసీ బుధవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.2027 ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ఈ టోర్నీ జరగనుంది. ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ), వడోదర అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలు మ్యాచ్‌లకు వేదికలుగా నిలవనున్నాయి. ఆసక్తికరంగా, 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకున్న నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం.లంక బోర్డులో సంక్షోభమే కారణం వాస్తవానికి ఈ టోర్నమెంట్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే, శ్రీలంక క్రికెట్ బోర్డులో అక్కడి ప్రభుత్వం జోక్యం చేసుకుని, రాజ్యాంగ, పరిపాలన సంస్కరణల కోసం ఓ తాత్కాలిక 'ట్రాన్స్ఫర్మేషన్ కమిటీ'ని ఏర్పాటు చేసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం క్రికెట్ బోర్డుల వ్యవహారాల్లో రాజకీయ జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రభుత్వ నియమిత కమిటీలను గుర్తించబోమని స్పష్టం చేసిన ఐసీసీ, ఆ కమిటీ ఏర్పడినప్పటి నుంచి ఎస్ఎల్సీ ప్రతినిధులను బోర్డు సమావేశాలకు దూరంగా ఉంచుతోంది. ఈ సంస్కరణలు పూర్తికాని నేపథ్యంలోనే టోర్నీని తరలించాలని నిర్ణయించినట్లు ఐసీసీ పేర్కొంది.శ్రీలంకకు ప్రత్యామ్నాయ ఆతిథ్య దేశం కోసం బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాల నుంచి కూడా ప్రతిపాదనలు రాగా, అన్నింటినీ పరిశీలించిన అనంతరం ఐసీసీ బోర్డు భారత్‌ను ఎంపిక చేస్తూ తుది నిర్ణయం తీసుకుంది.మహిళల

గ్లోబల్ ఇన్వెస్టర్లు తిరిగి భారత మార్కెట్ వైపు మొగ్గు చూపుతుండటంతో కొత్త ఎఫ్‌పీఐల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగాయి. రెండు నెలల్లోనే ఏకంగా 49 కొత్త ఎఫ్‌పీఐలు సెబీలో నమోదు కావడం విశేషం. ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 2: భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FPI) కొనుగోళ్లు మళ్లీ పుంజుకుంటున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్లు పకడ్బందీ వ్యూహంతో తిరిగి భారత మార్కెట్ వైపు మొగ్గు చూపుతుండటంతో కొత్త ఎఫ్‌పీఐల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగాయి. రెండు నెలల్లోనే(జూలై-ఆగస్టు) ఏకంగా 49 కొత్త ఎఫ్‌పీఐలు సెబీ(SEBI)లో నమోదు కావడం విశేషం. పెరిగిన ఎఫ్‌పీఐల సంఖ్య: 2026 మొదటి ఆరు నెలల్లో (జనవరి-జూన్) 52 ఎఫ్‌పీఐలు మాత్రమే నమోదవగా, జులై, ఆగస్టు నెలల్లో ఆ సంఖ్య 49కి చేరింది. దీంతో భారత మార్కెట్లలో మొత్తం ఎఫ్‌పీఐల సంఖ్య 12,243కి పెరిగింది. మళ్లీ నెట్ బైయర్లు: ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రూ. 2 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించిన విదేశీ పెట్టుబడిదారులు, జులై, ఆగస్టు నెలల్లో భారీగా కొనుగోళ్లు జరిపారు. జులైలో రూ.40,031 కోట్లు, ఆగస్టులో రూ.25,492 కోట్ల విలువైన సెక్యూరిటీలను కొనుగోలు చేశారు. నెలవారీ సగటు: ఈ ఏడాది ఆరంభంలో నెలకు సగటున కేవలం 8 కొత్త ఎఫ్‌పీఐలు నమోదు కాగా, గత రెండు నెలల్లో ఆ వేగం పెరిగి నెలకు 25 కొత్త ఫండ్లు నమోదు కావడం గమనార్హం. విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు భారత ప్రభుత్వం ఇటీవలి కాలంలో పలు కీలక సడలింపులు, నిర్ణయాలు ప్రకటించింది. 1. పన్ను మినహాయింపులు(Tax Exemptions): జూన్ 5న కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సెక్యూరిటీలలో(G-Secs) పెట్టుబడి పెట్టే ఎఫ్‌పీఐలకు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్, వడ్డీ ఆదాయంపై పూర్తి పన్ను మినహాయింపును ప్రకటించింది. 2. FAR రూట్ విస్తరణ: లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు, గ్లోబల్ పెన్షన్ ఫండ్లు, సోవరిన్ వెల్త్ ఫండ్లను ఆకర్షించడానికి 15, 30, 40 ఏళ్ల జారీలతో

మొట్టమొదటి మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఇవాళ ప్రకటించింది. స్పోర్ట్స్ డెస్క్: మొట్టమొదటి మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఇవాళ(బుధవారం)ప్రకటించింది. వాస్తవానికి ఈ టోర్నీ శ్రీలంకలో జరగాల్సి ఉంది. అయితే శ్రీలంక క్రికెట్ బోర్డు పరిపాలన వ్యవహారాల్లో ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందన్న కారణంగా ఆతిథ్య హక్కులను కోల్పోయింది. ఈక్రమంలో ఈ టోర్నీ నిర్వహించేందుకు భారత్‌కు అవకాశం లభించింది. వాస్తవానికి టోర్నమెంట్ నిర్వహణకు బంగ్లాదేశ్, భారత్, దక్షిణాఫ్రికాలను ఐసీసీ ఆప్షన్లుగా పెట్టుకుంది. అయితే చివరకు ప్రత్యామ్నాయ ఆతిథ్య దేశంగా భారత్‌ను ఐసీసీ సిఫార్సు చేసింది. ఈ నిర్ణయాన్ని ఇవాళ(సెప్టెంబర్ 2) ఐసీసీ బోర్డు ఆమోదించింది. ఇక టోర్నీ విషయానికి వస్తే.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు జరగనుంది. మ్యాచ్‌లు ముంబై, వడోదర అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. ఇక టోర్నీలో పాల్గొనే జట్ల అర్హతలను కూడా ఐసీసీ వెల్లడించింది. కటాఫ్ డేట్ అయిన జులై 6 నాటికి మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో తొలి ఆరు స్థానాల్లో ఉన్న జట్లు ఛాంపియన్స్ ట్రోఫీలో పోటీపడనున్నాయి. ఆ విధంగా చూస్తే.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి. ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న పాకిస్థాన్ ఈ టోర్నీకి దూరమైంది. టీ20 ఫార్మాట్లో మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతి జట్టు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. టాప్-2లో నిలిచిన జట్లు ఫిబ్రవరి 28న జరిగే ఫైనల్లో తలపడతాయి. నాకు టెస్ట్ క్రికెట్ అంటే చాలా ఇష్టం: తిలక్ వర్మ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ .. పడిపోయిన గిల్, బుమ్రా స్థానాలు!

90ల్లో పుట్టి పెరిగిన చాలామంది ఇప్పుడు 30స్లో ఉన్నారు. వీళ్లంతా చిన్నతంలో హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలు చూస్తూ పెరిగారు. అయితే 'మమ్మీ' ఫ్రాంచైజీ వీళ్లని చాలానే భయపెట్టింది. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే పలు భాగాలు రిలీజయ్యాయి. కానీ అవన్నీ అడ్వెంచర్ కామెడీ తరహాలో తెరకెక్కాయి. ఈ ఏడాది ఈ జానర్ నుంచి హారర్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో ఓ మూవీ వచ్చింది. అదిప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రకటన చేశారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) లీ క్రోనిన్ దర్శకత్వం వహించిన 'ద మమ్మీ' సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. హారర్ సినిమా లవర్స్‌ని ఆకట్టుకుని పర్లేదనిపించింది. అనంతరం మే నెలలో విదేశాల వరకు అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీల్లో అద్దె విధానంలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మన దేశంలో మాత్రం ఈ నెల 17 నుంచి హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో చూడొచ్చు. 'ద మమ్మీ 2026' విషయానికొస్తే.. ఎనిమిదేళ్ల క్రితం కనిపించకుండాపోయిన తన కూతురు తిరిగి రావడం చూసి ఓ కుటుంబం చాలా ఆనందపడుతుంది. కానీ ఆమెలో ఉన్న రాక్షస శక్తులు సదరు కుటుంబాన్ని దారుణంగా ఇబ్బంది పెడతాయి. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. ఇందులో హారర్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా భయపెట్టేలా ఉన్నాయి. (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు) ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు) పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు) సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే snake plant ఈ మొక్కలని కిచెన్‌లో పెట్టుకుంటే.. మళ్లీ

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు కూలిపోవడం, నదులు ఉప్పొంగడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు కూలిపోవడం, నదులు ఉప్పొంగడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే వర్ష సంబంధిత ఘటనల్లో 12 మంది మృతి చెందినట్లు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (SEOC), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) వెల్లడించాయి (Uttarakhand heavy rain). భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) బుధవారం డెహ్రాడూన్, నైనిటాల్, బాగేశ్వర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు (Uttarakhand rain alert). భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి (12 dead Uttarakhand). అల్మోరాలోని ఒడ్యూదా గ్రామంలో తెల్లవారుజామున ఓ ఇంటి గోడ కూలడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఘటనలో అల్మోరా పట్టణంలోని ధార్కితుని ప్రాంతంలో పాత ఇంటి గోడ కూలి ఇద్దరు నేపాలీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. డెహ్రాడూన్‌లోని కండోలీ బ్రిడ్జి సమీపంలో భారీగా ప్రవహించిన నీటిలో ఓ కారు కొట్టుకుపోయింది. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మరో మహిళను రక్షించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

దులీప్ ట్రోఫీ2026లో భాగంగా అద్భుత ప్రదర్శన చేసిన కెప్టెన్ తిలక్ వర్మ తన జట్టు సౌత్ జోను ఒంటిచేత్తో ఫైనల్ చేర్చాడు. ఈ క్రమంలో టెస్ట్ క్రికెట్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. స్పోర్ట్స్ డెస్క్: దులీప్ ట్రోఫీ2026లో భాగంగా అద్భుత ప్రదర్శన చేసిన కెప్టెన్ తిలక్ వర్మ తన జట్టు సౌత్జోను ఒంటిచేత్తో ఫైనల్ చేర్చాడు. నార్త్ జోన్‌తో జరిగిన సెమీ ఫైనల్లో సౌత్ జోన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జట్టును విజయపథంలో నడిపించిన తిలక్ వర్మ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు సొంతం చేసుకున్నాడు. ప్రజంటేషన్ సందర్భంగా తిలక్ వర్మ టెస్ట్ క్రికెట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘రెడ్ బాల్ క్రికెట్ ఆడడాన్ని ఎంతో ఇష్ట పడుతా. నాకు టెస్ట్ క్రికెట్ అంటే చాలా ఇష్టం. వైట్‌బాల్ క్రికెట్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తానని నేనెప్పుడు కల కనలేదు. అదంతా దేవుడే ప్లాన్ చేశాడని భావిస్తున్నాను. తొలుత టీ20ల ద్వారా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన నేను తర్వాత వన్డే క్రికెట్ కూడా ఆడాను. కానీ టెస్ట్ క్రికెట్లో నా బలాన్ని నిరూపించుకోవాలని ఎదురుచూస్తున్నా' అని తిలక్ పేర్కొన్నాడు. 'ఎప్పటికైనా భారత టెస్టు క్రికెట్ జట్టులో ఆడాలన్నదే నా కల. అది త్వరలోనే నెరవేరుతుందని ఆశిస్తున్నాను. ఐపీఎల్ కారణంగా వైట్‌బాల్ క్రికెట్లో టీమిండియాకు ఎంపికయ్యాను. కానీ ఐపీఎల్‌కు రాకముందే రెడ్ బాల్ క్రికెట్లో చాలా కష్టపడ్డాను. అందుకే టెస్టు క్రికెట్ ఆడడాన్ని ప్రేమించడంతో పాటు ఎంజాయ్ చేస్తాను. రంజీ ట్రోఫీ ఆడాలనుకుంటున్నప్పటికీ అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా అదీ జరగడం లేదు. అందుకే అవకాశం వచ్చినప్పుడే టెస్ట్ క్రికెట్లో వీలైనంత మేర రాణించాలని భావించాను' అని తిలక్ వెల్లడించాడు. కేరళ సీఎంతో రొనాల్డ్ సోదరి భేటీ.. వీడియో వైరల్ సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు.. నలుగురి బెయిల్ పిటిషన్ల డిస్మిస్

Womens Champions Trophy : మొట్ట మొదటి ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఐసీసీ వెల్లడించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఆరు జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయని తెలిపింది. ఈ టోర్నమెంట్ తొలి ఎడిషన్‌లోని అన్ని మ్యాచ్‌లు ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా, వడోదరలోని వడోదర అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. వాస్తవానికి ఈ టోర్నీ శ్రీలంకలో జరగాల్సి ఉంది. శ్రీలంక క్రికెట్ బోర్డు పరిపాలన వ్యవహారాల్లో ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందన్న కారణంగా ఐసీసీ ఆతిథ్య హక్కుల నుంచి శ్రీలంకను తప్పించింది. A new chapter in women's cricket is waiting to be written 🤩 The dates and venues for the inaugural Women's Champions Trophy in 2027 are locked in 🔒 — ICC (@ICC) September 2, 2026 ఇక ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి బంగ్లాదేశ్, భారత్, దక్షిణాఫ్రికా అభ్యర్థులను ఐసీసీ తన నిర్ధారిత ఆతిథ్య మూల్యాంకన ప్రమాణాల ప్రకారం అంచనా వేసి, ప్రత్యామ్నాయ ఆతిథ్య దేశంగా భారత్‌ను సిఫార్సు చేసింది. ఈ నిర్ణయాన్ని సెప్టెంబర్ 1న ఐసీసీ బోర్డు ఆమోదించింది. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 మహిళల క్రికెట్‌కు ఒక ఉత్తేజకరమైన కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది అని ఐసిసి ఛైర్మన్ జై షా అన్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొననున్నాయి. టీ20 ఫార్మాట్లో ఈ మెగాటోర్నీని నిర్వహించనున్నారు. ఈ ఆరు జట్లు రౌండ్-రాబిన్ లీగ్ పద్ధతిలో పోటీ పడనున్నాయి. అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఫిబ్రవరి 28న జరిగే ఫైనల్లో తలపడనున్నాయి

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. YSR Awards 2026: ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ఒక కోరిక తీరకుండానే మరణించాడని తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే ఆయన జీవిత లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కానీ ఆ కోరిక తీరలేదని చెప్పారు. రాహుల్ గాంధీని దేశానికి ప్రధాని చేయడమే వైఎస్సార్‌కు నిజమైన నివాళి అని ప్రకటించారు. దీనికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ ఆశయాల సాధనకు తాము పనిచేస్తామని తెలిపారు. ఢిల్లీలో జరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026 కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. 'రైతులకు ఉచిత విద్యుత్ పై తొలి సంతకం చేసిన గొప్ప వ్యక్తి వైఎస్సార్. ఆనాడు రూ.1,300 కోట్లు విద్యుత్ బకాయిలు రద్దు చేసి.. రైతులపై కేసులు ఎత్తివేసి రైతుల గుండెల్లో వైఎస్సార్ రారాజుగా నిలిచారు' అని రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణలో సాగునీరు అందిచేందుకు ప్రాణహిత చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రారంభించిన ఘనత వైఎస్సార్‌ది' అని వివరించారు. ఆనాడు వైఎస్సార్ ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల, ఎస్ఎల్బీసీ ఆగిపోయాయని.. ఆయన ఆశయాలను నూటికి నూరు శాతం కొనసాగిస్తామని ప్రకటించారు. 'వైఎస్సార్ చివరి కోరిక ఇంకా నెరవేరలేదు. ఆయన రెండోసారి ప్రమాణస్వీకారం చేశాక ఒకే ఒక్క మాట చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే ఆయన జీవిత లక్ష్యం అని ఒకే ఒక్క మాట చెప్పారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన మరణించారు. రాహుల్ గాంధీని దేశానికి ప్రధాని చేయడమే వైఎస్సార్‌కు నిజమైన నివాళి. ఆయన చివరి కోరిక నెరవేర్చాలంటే రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని

నెలకు రూ.2 లక్షల జీతం వస్తే.. ఇంకేం కావాలి.. ఇక జీవితానికి తిరుగులేదని చాలామంది భావిస్తారు. కానీ బెంగళూరుకు చెందిన టెక్ ప్రొఫెషనల్ శశాంక్ దీక్షిత్ మాత్రం ఇదే ఆదాయం ఒక దశలో కెరీర్‌కు ‘డేంజర్’గా మారొచ్చంటున్నారు. ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం ఉద్యోగ నెటిజన్లలో విస్తృత చర్చకు దారితీసింది. శశాంక్ దీక్షిత్ వాదన ప్రకారం.. నెలకు రూ.2 లక్షలు సంపాదించడం ప్రమాదకరమని చెప్పడానికి కారణం ఆ మొత్తం ఎక్కువగా ఉండటం కాదు. ‘జస్ట్ ఎనఫ్’గా అనిపించడం అసలు సమస్య. ఈ స్థాయి ఆదాయం ఒక వ్యక్తికి మంచి జీవనశైలిని అందించడంతో పాటు, ప్రస్తుత ఉద్యోగం, కెరీర్ గురించి కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదనే భావనను కలిగించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులకు ‘బాగానే సంపాదిస్తున్నా’ అని చెప్పడానికి, వారాంతాల్లో హాయిగా గడపడానికి, రోజువారీ ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ ఆదాయం సరిపోతుందని ఆయన పేర్కొన్నారు. దీంతో ఒక దశలో ఉద్యోగి తన సామర్థ్యాన్ని పెంచుకోవడం కంటే.. ప్రస్తుత జీతాన్ని కాపాడుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉందని వివరించారు. దీక్షిత్ చెప్పిన మరో కీలక అంశం ‘కంఫర్ట్ జోన్’. మంచి జీతం, సౌకర్యవంతమైన జీవితం అలవాటైన తర్వాత ఉద్యోగం వదిలి స్టార్టప్ ప్రారంభించడం, కెరీర్ మార్చుకోవడం లేదా తక్కువ జీతంతో కొత్త అవకాశాన్ని ఎంచుకోవడం రిస్క్‌గా కనిపిస్తుంది. ‘ఇప్పటికే కోల్పోవడానికి ఏదో ఉంది’ అనే ఆలోచన అక్కడ మొదలవుతుందని ఆయన అంటున్నారు. ఫలితంగా ఒకప్పుడు చేయాలనుకున్న పనులను ‘వచ్చే నెల’, ‘వచ్చే ఏడాది’ అంటూ వాయిదా వేసుకుంటూ వెళ్లే పరిస్థితి ఏర్పడవచ్చని హెచ్చరించారు. చివరకు ఆశయం పోయిందని కాదు.. దాన్ని పట్టించుకోనంతగా సంపాదించడం మొదలుపెట్టామని గ్రహించే పరిస్థితి రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దీక్షిత్ పోస్ట్‌కు పలువురు ఉద్యోగులు మద్దతు తెలిపారు. మంచి జీతం కొన్నిసార్లు ‘బంగారు పంజరం’లా మారుతుందని, సౌకర్యాన్ని వదులుకోవడం కష్టమవుతుందని కొందరు తమ అనుభవాలను పంచుకున్నారు. మరికొందరు మాత్రం

ప్రముఖ రైడ్ హైలింగ్ కంపెనీ ఉబర్ భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో సుమారు 3,300 మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ రైడ్ హైలింగ్ కంపెనీ ఉబర్ భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో సుమారు 3,300 మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతానికి సమానం. మేనేజ్మెంట్ స్థాయిలను తగ్గించడం, సంస్థాగత నిర్మాణాన్ని సరళీకరించడం, భవిష్యత్ వ్యాపారాలపై పెట్టుబడులను పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది (Uber layoffs 2026). గత ఏడాది చివరి నాటికి ఉబర్‌లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 34,000 మంది ఉద్యోగులు ఉన్నారు. తాజా లేఆఫ్స్‌తో ఉద్యోగుల సంఖ్య 30 వేల కంటే దిగువకు చేరనుంది. 2021లో కంపెనీ ఉద్యోగుల సంఖ్య ఏ స్థాయిలో ఉందో దాదాపు అదే స్థాయికి ఇప్పుడు చేరనుంది. కోవిడ్ మహమ్మారి తర్వాత ఉబర్ చేపడుతున్న అతిపెద్ద ఉద్యోగాల కోత ఇదే. 2020 మేలో కరోనా కారణంగా రైడ్ హైలింగ్ డిమాండ్ కుప్పకూలడంతో కంపెనీ సుమారు 6,700 ఉద్యోగాలను తొలగించింది (Uber job cuts). ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కంపెనీలోని మేనేజర్ల సంఖ్యను 20 శాతం తగ్గించనున్నారు (Uber manager layoffs). అయితే వీరందరూ ఉద్యోగాలు కోల్పోతారని కాదు. కొంతమంది మేనేజర్లను మేనేజ్మెంట్ బాధ్యతల నుంచి తొలగించి వేరే పాత్రల్లోకి మార్చనున్నారు. ఉద్యోగాల కోత మాత్రం మేనేజర్లకే పరిమితం కాకుండా ఇతర ఉద్యోగులపైనా ప్రభావం చూపనుంది. సంస్థను మరింత సరళంగా, వేగంగా మార్చడమే తాజా పునర్వ్యవస్థీకరణ లక్ష్యమని ఉబెర్ సీఈవో దారా ఖోస్రోషాహి తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

560GHz బ్యాండ్‌తో ఈ 112 Gbps స్పీడ్ 5జీ టెక్నాలజీతో పోలిస్తే 20 రెట్లు వేగం భారీ ఫైల్స్‌ను వేగంగా డౌన్లోడ్ చేయొచ్చు Japan 6G Device : 5G కాదు.. 6G వస్తోంది.. ఇక సెకన్లలో కాదు.. క్షణాల్లో భారీ డేటా ట్రాన్స్ ఫర్ చేయొచ్చు.. ఇటీవలే కొత్త కమ్యూనికేషన్ టెక్నాలజీపై జపాన్ సంచలన ప్రయోగం చేసింది. టోకుషిమా యూనివర్సిటీ రీసెర్చర్లు 560GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లో ఏకంగా 112Gbps డేటా ట్రాన్స్మిషన్ సాధించారు. ఈ సక్సెస్ 6G భవిష్యత్తుపై భారీ అంచనాలను పెంచుతోంది. దాంతో 6జీ టెక్నాలజీపై మళ్లీ ఆసక్తి పెరుగుతోంది. 5జీ కన్నా 20 రెట్లు స్పీడ్? : ఈ ప్రయోగంలో సాధించిన 112Gbps స్పీడ్ అనేది ప్రస్తుతం వినియోగంలో ఉన్న 5జీ టెక్నాలజీతో పోలిస్తే భవిష్యత్ వైర్లెస్ కమ్యూనికేషన్ ఎంత వేగంగా ఉండొచ్చో చెప్పొచ్చు. అంటే.. భారీ మొత్తంలో డేటాను చాలా తక్కువ సమయంలో ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. అయితే, ప్రస్తుతం మన ఫోన్లలో లభించే 6G స్పీడ్ కాదు. ఇది ల్యాబ్ స్థాయిలో చేసిన ప్రయోగం మాత్రమే. 6Gతో ఏం మారొచ్చు? : 6జీ కమర్షియల్‌గా వస్తే.. భారీ ఫైల్స్ డౌన్లోడ్లు, హై-క్వాలిటీ వీడియో స్ట్రీమింగ్, VR/AR, క్లౌడ్ గేమింగ్ వంటి డేటా-హెవీ సర్వీసులు మరింత వేగంగా పనిచేస్తాయి. రోబోటిక్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, రియల్‌టైమ్ కమ్యూనికేషన్ వంటి రంగాల్లోనూ కీలకంగా మారే అవకాశం ఉంటుంది. ఇంత స్పీడ్ ఎలా? : 560GHz వంటి అత్యంత హై ఫ్రీక్వెన్సీల వద్ద ట్రెడిషనల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్లకు లిమిట్స్ ఎదురవుతాయి. ఇలాంటివి అధిగమించేందుకు రీసెర్చర్లు లేజర్ ఆధారిత ఆప్టికల్ టెక్నాలజీ, ఆప్టికల్ మైక్రోకోంబ్ వంటి విధానాలను వాడారు. వైబ్రేషన్లు, టెంపరేచర్ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు ఆప్టికల్ ఫైబర్లను సిలికాన్ నైట్రైడ్ మైక్రోరెసోనేటర్ చిప్‌కు నేరుగా ఇంటిగ్రేట్ చేశారు. Read Also : Ration Card Update : రేషన్ తీసుకోలేకపోయారా? మరో ఛాన్స్

6.67-అంగుళాల HD LCD డిస్ప్లే అదుర్స్ 64MP ప్రైమరీ కెమెరా, 5,700mAh బ్యాటరీ అమెజాన్ ఇండియాలో ఈ ఫోన్ కొనేసుకోవచ్చు Philips S7221 5G Launch : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫిలిప్స్ నుంచి భారత మార్కెట్లోకి కొత్త ఖతర్నాక్ ఫోన్ వచ్చేసింది. అదే.. ఫిలిప్స్ S7221 5జీ.. ఇందులో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,700mAh బ్యాటరీ ఉంది. 64MP రియర్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్ (Philips S7221 5G Launch) అందిస్తుంది. సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఫిలిప్స్ S7221 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర వివరాలేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.. ధర ఎంతంటే? : ఫిలిప్స్ S7221 5జీ స్మార్ట్‌ఫోన్ 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,499 కాగా, 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,499గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, యాష్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : ఫిలిప్స్ S7221 5జీలో 720x1,600 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల HD LCD డిస్ప్లే ఉంది. ఆక్టా-కోర్ స్ప్రెడ్ట్రమ్ T765 చిప్సెట్తో రన్ అవుతుంది. 8GB LPDDR4 ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది. Read Also : Lava Virat V1 5G : వారెవ్వా.. లావా కొత్త 5G ఫోన్ వచ్చేసిందోచ్.. 128GB వేరియంట్ మీ బడ్జెట్ ధరలోనే..! ఆండ్రాయిడ్ 16తో రన్ అవుతుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5,700mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ కొలతలు 166mm పొడవు, 77mm వెడల్పు, 8.95mm మందం, బరువు 200 గ్రాములు ఉంటుంది. కెమెరా సెటప్ పరంగా.. ఫిలిప్స్ S7221 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ 64MP ప్రైమరీ కెమెరా
Bhagavanth Kesari బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి.

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. EPFO: ఈపీఎఫ్ఓ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ పరిధిలోని ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టులకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ భారీ ఊరట కల్పించింది. ఆదాయపు పన్ను చట్టం కింద గుర్తింపు పొంది.. ఈపీఎఫ్ చట్టం ప్రకారం.. అధికారిక మినహాయింపు ఉత్తర్వులు లేని పీఎఫ్ ట్రస్టుల కోసం వన్ టైమ్ పరిష్కార పథకాన్ని ప్రకటించింది. ఈ స్కీమ్ కింద అర్హులైన ట్రస్టులు తమ మినహాయింపు హోదాను క్రమబద్ధీకరించేందుకు డిసెంబర్ 28వ తేదీ వరకు గడువును విధించింది. ఈ మరకు 2026 జూన్ 29న కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. దీని ప్రకారం.. ఆదాయపు పన్ను చట్టం 1961 కింద గుర్తింపు ఉండి.. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మిసిలేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952లోని సెక్షన్ 17 లేదా కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020లోని సెక్షన్ 143 కింద అధికారిక మినహాయింపు లేని పీఎఫ్ ట్రస్టులకు ఈ ఆమ్నేస్టీ స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఇది ఒక పరివర్తన చర్యగా.. 6 నెలల పాటు అందుబాటులో ఉంటుందని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ స్కీమ్ అమలుకు సంబంధించిన పూర్తి కార్యాచరణ మార్గదర్శకాలతో ఈపీఎఫ్ఓ 2026 జులై 11న ఒక సర్య్కులర్ కూడా జారీ చేసింది. ఈ స్కీమ్ ద్వారా ట్రస్టులు తమ హోదాను గడిచిన కాలానికి వర్తించే విధంగా క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020లో నిర్దేశించిన పలు నిబంధనల నుంచి కూడా మినహాయింపు లభిస్తుంది. ముఖ్యంగా కనీస ఉద్యోగుల సంఖ్య, కనీస కార్పస్ పరిమాణం, 3ఏళ్ల
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. జనసేన జైకొట్టు లోగో ఆవిష్కరణ జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం పిఠాపురంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ యువజన విభాగం ‘జై కొట్టు’ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యకర్తలకు ఆడియో సందేశం ఇచ్చారు. చెయ్యొత్తి జై కొట్టు నినాదం మనందరినీ ఎంతో కదిలిస్తుంది. ఆ స్ఫూర్తిని మీకు అందించాలనే అధినేత పవన్ ఈ లోగో పెట్టారు. జై కొట్టు నినాదంతో ముందుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. రాజకీయాల్లో యువతకు ప్రత్యేక స్థానం కల్పించాలనే ఈ విభాగాన్ని ఏర్పాటు చేశాం. అరుపులు.. కేకలు కాదు.. క్రమశిక్షణ ఎంతో ముఖ్యం. అధినేత ఆదేశాలను జనసైనికులు క్రమశిక్షణతో పాటించాలి అని సూచించారు. ఈ వార్తకు సంబంధించిన
మేష రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి కృష్ణ జన్మాష్టమి వేళ కన్నయ్యకు ఎరుపు రంగు దుస్తులతో అలంకరించొచ్చు. ఇలా చేయడం వల్ల మీ వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు మానసికంగా ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు, కాబట్టి కృష్ణాష్టమి వేళ లడ్డూ గోపాలుడి అలంకరణ కోసం వెండి ఆభరణాలు లేదా వస్తువులను ఉపయోగించొచ్చు. ఇలా చేయడం వల్ల బాల వేణుమాధవుడి ప్రత్యేక ఆశీస్సులు పొందొచ్చు. మిథున రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు, కాబట్టి కృష్ణాష్టమి రోజున లడ్డూ గోపాలుడిని లహరియ(అలల వంటి లేదా చారల) డిజైన్ కలిగిన వస్త్రాలతో అలంకరించాలి. ఇలాంటి అలంకరణ ఎంతో శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది కన్నయ్యకు ఎంతో ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. శ్రీ కృష్ణ జన్మదినోత్సవం రోజున బాల గోపాలుడిని తెల్లని దుస్తులతో అలంకరించాలి. ఇలా చేయడం వల్ల మీరు ప్రతి పనిలో విజయం సాధించే అవకాశం ఉంది. సింహ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి కృష్ణ జన్మాష్టమి రోజున బాల గోపాలుడిని గులాబీ రంగు వస్త్రాలతో అలంకరించొచ్చు. ఇలా చేయడం వల్ల మీకు సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కన్య రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి కృష్ణా జన్మాష్టమి రోజున బాల గోపాలుడిని పచ్చని రంగు దుస్తులతో అలంకరించాలి. ఇలా చేయడం వల్ల మీకు కన్నయ్య ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. తులా రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. శ్రీ కృష్ణ జన్మాష్టమి వేళ బాల గోపాలుడిని కుంకుమ రంగు(కాషాయం వంటి) రంగు వస్త్రాలతో అలంకరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. వృశ్చిక రాశి
గ్రేటర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో భూముల ధరలు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే కోకాపేట, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో భూముల ధరలు భారీ స్థాయికి చేరిన విషయం తెలిసిందే. తాజాగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ)లో నిర్వహించిన భూముల బహిరంగ వేలం కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్లో హాట్‌టాపిక్‌గా మారింది. కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లోని 16 ఎంఐజీ ఓపెన్ ప్లాట్లకు బుధవారం నిర్వహించిన వేలంలో చదరపు గజం గరిష్ఠంగా రూ.2.70 లక్షలు పలికి.. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లోని 16 ఎంఐజీ ఓపెన్ ప్లాట్లకు తెలంగాణ హౌసింగ్ బోర్డు తాజాగా బహిరంగ వేలం నిర్వహించింది. ఈ వేలానికి ముందుగా చదరపు గజానికి కనీస ధరను రూ.1.60 లక్షలుగా నిర్ణయించారు. అయితే ప్లాట్లను దక్కించుకునేందుకు బిడ్డర్లు పోటీ పడటంతో ధరలు గణనీయంగా పెరిగాయి. వేలంలో ఒక ప్లాట్ చదరపు గజం రూ.2.70 లక్షలకు అమ్ముడైంది. మరో ప్లాట్‌కు గజం రూ.2.36 లక్షల ధర పలికింది. మరో 2 ప్లాట్లు చదరపు గజం రూ.2.06 లక్షల చొప్పున విక్రయం అయ్యాయి. దీంతో కేపీహెచ్‌బీ ప్రాంతంలో భూములకు ఉన్న డిమాండ్ మరోసారి స్పష్టమైంది.ఈ బహిరంగ వేలంలో మొత్తం 19 మంది బిడ్డర్లు పాల్గొన్నారు. తమకు నచ్చిన ప్లాట్లను దక్కించుకునేందుకు వారు పోటీపడటంతో పలు ప్లాట్లు హౌసింగ్ బోర్డు నిర్ణయించిన కనీస ధర కంటే అధిక మొత్తానికి అమ్ముడయ్యాయి. వేలం పూర్తి అయ్యే సమయానికి 16 ప్లాట్లకు కలిపి చదరపు గజం సగటు ధర సుమారు రూ.1.79 లక్షలుగా నమోదైంది. ఈ ప్లాట్ల విక్రయం ద్వారా తెలంగాణ హౌసింగ్ బోర్డుకు సుమారు రూ.47.14 కోట్ల ఆదాయం సమకూరింది.హైదరాబాద్‌లో కేపీహెచ్‌బీ ప్రాంతానికి ఇప్పటికే ప్రత్యేకమైన రియల్ ఎస్టేట్ గుర్తింపు ఉంది. నగరంలోని ప్రధాన ఐటీ, వాణిజ్య ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ, మెట్రో సహా రవాణా సదుపాయాలు, నివాస ప్రాంతంగా ఉన్న డిమాండ్ వంటి అంశాలు ఈ
ఆ కుటుంబంలో ఒకటి రెండు కాదు.. ఏకంగా ఏడెనిమిది తరాల నుంచి ఆడపిల్లే పుట్టలేదు. ఎన్నో తరాలు పాటు ఎదురుచూసిన ఆ కుటుంబం నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. రెండు శతాబ్దాల తర్వాత అమ్మాయి పుట్టడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని సంబరపడిపోయారు. మేళతాళలతో రథంపై ఊరేగించి ఘనంగా ఇంటికి తీసుకొచ్చారు. ఈ ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బీడ్ జిల్లాలో పార్లీ వైద్యనాథ్‌కు చెందిన లింబాజీ దహిపాలే కుటుంబంలో దాదాపు రెండు శతాబ్దాల నుంచి ఆడపిల్లే లేదు.లింబాజీ కుమారుడు హృషికేష్ భార్య ఆగస్టు 24న ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఆ చిన్నారికి ‘గార్గి’ అని పేరు పెట్టిన కుటుంబం.. ఆస్పత్రి నుంచి ఇంటి వరకు రథంపై ఊరేగించి, పూలవర్షం కురిపించి, మేళతాళాలు, డ్యాన్సులతో ఘనస్వాగతం పలికారు. దీనిపై లింబాజీ మాట్లాడుతూ.. ఆడపిల్ల కోసం 200 ఏళ్లుగా తమ కుటుంబం ఎదురు చూస్తోందని పేర్కొన్నారు. ఇన్నాళ్లకు మా ప్రార్థనలు ఫలించి మహాలక్ష్మి కరుణించి, తమ నట్టింట అడుగుపెట్టిందని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ‘కుటుంబంలో కూతురు ఉండటం గొప్ప అదృష్టం. ఎన్నో ఏళ్లుగా మాకు కూతురు లేదనే బాధ ఉండేది.. ఈరోజు ఆ లోటు తీరింది’ అన్నారు.అలాగే, తన ఇద్దరు కోడళ్లను సొంత కూతుళ్ళలా చూసుకున్నానని, మేళతాళాలు, డ్యాన్సులతో రథంలో తన మనవరాలిని ఇంటికి తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉందని లింబాజీ అన్నారు. ఆసుపత్రిలోనే తమ కుటుంబం ఘనంగా స్వాగతం పలకాలని నిర్ణయించుకుందని లింబాజీ భార్య సురేఖ దహిఫాలే చెప్పారు. ‘‘ఈరోజు లక్ష్మి మా ఇంటికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది’’ అని ఆమె అన్నారు. చిన్నారి గార్గి తండ్రి హృషికేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘‘ఇన్ని ఏళ్లుగా ముఖ్యంగా రక్షాబంధన్, భాయి దుజ్ వంటి పండుగలప్పుడు కుటుంబంలో ఆడపిల్ల లేని లోటు మాకు

దేశంలో కోడిగుడ్ల ధరలు సామాన్యులకు భారాన్ని కలిగిస్తున్నాయి. గత ఏడాది కాలంలో గుడ్ల ధరలు ఏకంగా 35 నుంచి 40 శాతం వరకు పెరిగాయని నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (ఎన్ఈసీసీ) వెల్లడించింది. ఇటీవలి వరకు ఫామ్ వద్దే ఒక్కో గుడ్డు ధర రూ. 7 ఉండగా, రిటైల్ మార్కెట్లో అది రూ. 8 నుంచి రూ. 9కి చేరింది. రాబోయే శీతాకాలంలో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉండటంతో, ధరలు ఇంకా పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'ఈ20' ఇంధన విధానమే ప్రధాన కారణమని తెలుస్తోంది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలపాలన్న లక్ష్యంతో మొక్కజొన్నను భారీగా వినియోగిస్తున్నారు. కోళ్ల దాణా తయారీ వ్యయంలో 65 నుంచి 70 శాతం మొక్కజొన్నదే కావడం గమనార్హం. దేశీయంగా ఉత్పత్తవుతున్న మొక్కజొన్నలో దాదాపు 37 శాతాన్ని ఇథనాల్ తయారీ పరిశ్రమలకే మళ్లించడంతో, కోళ్ల పరిశ్రమకు దాణా కొరత ఏర్పడి ధరలు గణనీయంగా పెరిగాయి.గత మూడేళ్ల కాలంలో టన్ను మొక్కజొన్న ధర రూ. 14,000 నుంచి రూ. 26,500కి పెరిగింది. ముఖ్యంగా గత ఐదు నెలల్లోనే ధరలు 20 శాతం పెరగడం గమనార్హం. 2024లో 6 మిలియన్ టన్నుల మొక్కజొన్నను ఇథనాల్ తయారీకి వినియోగించగా, ప్రస్తుతం ఆ వినియోగం 17 మిలియన్ టన్నులకు చేరింది.ఇథనాల్ విధానంతో పాటు అధిక ఉష్ణోగ్రతలు, కోళ్ల మరణాల రేటు పెరగడం వంటివి కూడా ఇటీవల ధరల పెరుగుదలకు ఇతర కారణాలని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు

భారత పేస్ బౌలర్ ఆకిబ్ నబీ ఇంగ్లండ్ కౌంటీల్లో అరంగేట్రం చేశాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా యార్క్‌షైర్‌తో మ్యాచ్ సందర్భంగా సర్రే జట్టు తరఫున ఎంట్రీ ఇచ్చాడు. కాగా కౌంటీ చాంపియన్‌షిప్ డివిజన్ వన్-2026లో భాగంగా లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో సర్రే- యార్క్‌షైర్ జట్ల మధ్య బుధవారం మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన సర్రే తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. యార్క్‌షైర్ బ్యాటింగ్‌కు దిగింది. రంజీల్లో దుమ్ములేపాడు జమ్మూ కశ్మీర్‌కు చెందిన 29 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన సంగతి తెలిసిందే. జమ్మూ కశ్మీర్ జట్టు తొలిసారి రంజీ టైటిల్ గెలవడంలో అతడిదే కీలక పాత్ర. గత రెండు సీజన్లలో కలిపి వందకు పైగా వికెట్లు తీసి ఆకిబ్ నబీ తానేంటో నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో భారత్-ఎ తరఫున ఇటీవలే అరంగేట్రం చేసిన ఆకిబ్.. శ్రీలంకతో టెస్టు సిరీస్ సందర్భంగా తొలిసారి టీమిండియాకు ఎంపికయ్యాడు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా వైదొలగగా.. అతడి స్థానంలో సెలక్టర్లు నబీని ఎంపిక చేశారు. అయితే, లంకతో రెండు టెస్టులు ఆడిన భారత తుదిజట్టులో మాత్రం నబీకి చోటు దక్కలేదు. కివీస్ టూర్ సన్నాహకాల్లో భాగంగా ఇక టీమిండియా తదుపరి టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్‌తో తలపడేందుకు అక్కడికి వెళ్లనుంది. కివీస్ టూర్లో బౌన్సీ పిచ్‌లపై నబీ సేవలను వాడుకోవాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. ఆ సన్నాహకాల్లో భాగంగానే అతడు ఇంగ్లండ్ కౌంటీల్లో అడుగుపెట్టేందుకు మార్గం సుగమం చేసినట్లు వార్తలు వచ్చాయి. కాగా ఆకిబ్ నబీ సర్రే తరఫున యార్క్‌షైర్‌తో పాటు.. హోవ్ వేదికగా సస్సెక్స్‌తో.. సర్రే సొంతమైదానంలో గ్లామోర్గాన్ జట్టుతో జరిగే మ్యాచ్‌లలో పాల్గొననున్నాడు. ఇదిలా ఉంటే.. సర్రే తరఫున ఆకిబ్ నబీ తాజాగా అరంగేట్రం చేయగా.. భారత ఆటగాడు రాహుల్ చహర్ కూడా తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇదే జట్టులో ఉన్న భారత ఆల్‌రౌండర్ మహిపాల్ లామ్రోర్

‘‘పుట్టామా..ఇంజినీరింగ్, మెడిసిన్, సీఏ లాంటి చదువులు చదివామా? మంచి ఉద్యోగం సంపాదించామా... జీవితం సక్సెస్’’ ఇది ఒకప్పటి బతుకు ఫిలాసఫీ. కానీ జెన్-జీలు ఇలా కాదంటోంది తాజా అధ్యయనం. అంతర్జాతీయ విద్యా సంస్థ ఎమిరైటస్ ‘‘ఇండియాస్ జెన్-జీ ఔట్లుక్ 2026: రీ కాల్కులేటింగ్ ఎడ్యుకేషన్, ఆంబీషన్ అండ్ సక్సెస్’’ పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనం నవతరం గురించి పలు ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తెచ్చింది. 1997- 2012 మధ్య పుట్టిన వాళ్లను మనం జెన్-జీ అని పిలుస్తున్నాం కదా.. వీరు దేశంలోని ప్రధాన మెట్రోల్లోని 15 - 28 ఏళ్ల మధ్య వయసున్న సుమారు వెయ్యి మందిని ప్రశ్నించి వారి ఆశలు, ఆశయాలు, విజయానికి నిర్వచనాలను సేకరించింది. ముందు తరం నడిచిన బాటను కాదని కొత్త అడుగులు వేస్తున్న వారి గురించి స్థూలంగా. మునుపటిలా చిన్న ఉద్యోగంతో మొదలుపెట్టి అంచలంచెలుగా పైకి ఎదగాలన్న సూత్రానికి వీరు విరుద్ధం. ఉద్యోగమిచ్చే మేనేజర్, జీఎం, వీపీ, ఛైర్మన్ వంటి హోదాల కంటే పనికి - జీవితానికి మధ్య బ్యాలెన్స్ ఉండాలనుకుంటున్న జెన్-జీలు సుమారు 74 శాతం. అసలు సక్సెస్ఫుల్ కెరియర్‌కు ఎగ్జిక్యుటివ్ లీడర్ కావాల్సిన అవసరమే లేదన్నది 65 శాతం మంది నమ్మకం. వీరి దృష్టిలో విజయం అంటే... నైపుణ్యాలు. అవసరానికి తగ్గట్టు మారిపోగలగడం. సంతృప్తినిచ్చే, అర్థవంతమైన పని లోకలే మేలు... ఒకప్పుడు ఎంతో పాప్యులర్ అయిన విదేశీ చదువులపై జెన్-జీకి పెద్ద ఆశలేం లేవు. పెరిగిపోతున్న ఖర్చులు, వీసా నిబంధనల్లో వస్తున్న మార్పులు, చదువు తరువాత ఉద్యోగాలు వస్తాయన్న గ్యారెంటీ లేకపోవడం వంటి కారణాల వల్ల నాణ్యమైన లోకల్ విద్యే మేలని 48 శాతం మంది అభిప్రాయపడ్డారు. కాలేజీ ముందునాటి చదువులు చదువుతున్న వారిలో 87 శాతం, కాలేజీల్లోకి అడుగుపెడుతున్న వారిలో 92 శాతం లోకల్ కోర్సులకు జై అంటున్నారు. విదేశీ విద్యా సంస్థలు స్థానికంగా అందించే కోర్సుల్లో చేరేందుకు అభ్యంతరం లేదని సుమారు 69

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజీ సినిమా ఎప్పటికీ ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. దర్శకుడు సుజీత్ ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌ను ప్రత్యేకమైన శైలిలో చూపించగా, ఈ సినిమా ఆయన కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓజీ యూనివర్స్‌ను మరింత విస్తరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు సుజీత్ విడుదల చేసిన ప్రత్యేక వీడియో ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ వీడియోలో దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు తమన్‌తో కలిసి పవన్ కళ్యాణ్‌తో ఓజీ యూనివర్స్‌కు సంబంధించిన క్రియేటివ్ చర్చ జరుపుతున్నట్లు చూపించారు. ఓజీ సినిమాల భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే అంశంపై ఈ ముగ్గురు చర్చించిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ఓజీ సీక్వెల్‌కు సంబంధించిన ఆలోచనలపై తమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓజీ సీక్వెల్ కథ భారతదేశంలో సాగుతుందని, అయితే ఆగ్నేయాసియా భావోద్వేగాలు, పాశ్చాత్య తరహా ప్రదర్శనతో ఈ చిత్రాన్ని రూపొందించే అవకాశం ఉందని తమన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా ఓజీ యూనివర్స్‌పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సుభాష్ చంద్రబోస్ అంశాన్ని ఇందులో చేర్చితే కథకు ఎంతో అవకాశాలు ఉంటాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ ఆలోచనకు సంబంధించిన అవకాశాలపై చర్చించిన అనంతరం మనం మన బెస్ట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు వీడియోలో కనిపించింది. దీంతో ఓజీ యూనివర్స్‌లో భవిష్యత్తులో ఎలాంటి కథలు, పాత్రలు ఉండబోతున్నాయనే అంశంపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. వీడియో చివర్లో రాబోయే ఓజీ సినిమాలకు సంబంధించిన కొన్ని యానిమేటెడ్ విజువల్స్‌ను కూడా చూపించారు. ముఖ్యంగా సమురాయ్ కోణానికి సంబంధించిన విజువల్స్ అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఓజీ యూనివర్స్‌లో సమురాయ్ అంశం కూడా భాగం కానుందనే సంకేతాలను ఈ విజువల్స్ ద్వారా ఇచ్చారు. మరోసారి పవర్ స్టార్‌పై తన అభిమానాన్ని తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ద్వారా ప్రదర్శించారు

'అల్లరి' నరేష్ ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’ తో అలరించబోతున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. ఈ నెల 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానున్న సందర్భంగా హీరో అల్లరి నరేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘రంభ ఊర్వశి మేనక’ కథ ఎలా ఉండబోతుంది? - సాధారణంగా ఇలాంటి సోషియో ఫాంటసీ కథల్లో మానవులు ఇంద్రలోకం, యముడి వద్దకు వెళ్తుంటారు. కానీ ఇందులో ‘రంభ ఊర్వశి మేనక’ స్వర్గం నుంచి కిందకు వస్తారు. ఇందులో కథానాయకుడికి చిన్నప్పటి నుంచి ఒక డ్రామా కంపెనీ ఉంటుంది. ‘రంభ ఊర్వశి మేనక’ను దేవతల్లా పూజిస్తుంటాడు. తనది కష్టపడకుండా హీరో అయిపోవాలనే క్యారెక్టర్. దేవతలు దీవిస్తే నెక్స్ట్ రాజమౌళి సినిమాలో తనే హీరో అనుకునే నమ్మకం ఉంటుంది. తన కుటుంబానికి ముత్తాతల నుంచి వస్తున్న ఒక పుస్తకం ఉంటుంది. అందులో ఒక ప్యాట్రన్ గీస్తే దేవతలు వచ్చి కోరికలు తీరుస్తారని నమ్మకం ఉంటుంది. హీరో ఆ ప్యాట్రన్ ఎలా గీశాడు, రంభ ఊర్వశి మేనక వచ్చిన తర్వాత ఎలాంటి సంఘటనలు జరిగాయనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దర్శకుడు ఈ కథ చెప్పిన తర్వాత మిమ్మల్ని ఎక్సైటింగ్ చేసిన ఎలిమెంట్స్ ఏమిటి? - చాలా రోజుల తర్వాత మంచి కామెడీ ఎంటర్టైనర్ విన్నట్టుగా అనిపించింది. ప్రేక్షకులు కూడా నా నుంచి ‘కితకితలు’, ‘బెండు అప్పారావు’ లాంటి కామెడీ సినిమాలు మిస్ అవుతున్నారు. అలాంటి కథ గురించి చూస్తున్నప్పుడు దర్శకుడు చంద్రమోహన్ చెప్పిన ఈ కథ నాతో పాటు నాగార్జున గారికి, సుప్రియ గారికి, రాజేష్ గారికి, నిమ్మకాయల ప్రసాద్ గారికి అందరికీ నచ్చింది. సీజీ వర్క్ పరంగా ఎక్కువ బడ్జెట్ అవుతుందని తెలిసినా మంచి సినిమా అవుతుందని మొదలుపెట్టాం. చంద్ర మోహన్ చాలా మంచి

కోలీవుడ్ వర్సటైల్ హీరో కార్తీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే సర్దార్ 2 రిలీజ్ కి రెడీగా ఉంది. కోలీవుడ్ వర్సటైల్ హీరో కార్తీ (Karthi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే సర్దార్ 2 రిలీజ్ కి రెడీగా ఉంది. ఇది కాకుండా కార్తీ చేతిలో రెండు, మూడు సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా మరో సినిమాకు ఈ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. కమర్షియల్ హంగుల దర్శకుడు సుందర్ సి (Sundar C) కాంబినేషన్లో కార్తీ హీరోగా ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఖరారైంది. వైవిధ్యమైన కథలతో పాటు వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన సుందర్ సి, కార్తీకి ఒక మంచి కథను వినిపించాడని, అది బాగా నచ్చడంతో హీరో కూడా వెంటనే ఓకే చెప్పాడట. ఈ విషయాన్ని సుందర్ సి.. సర్దార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అధికారికంగా ప్రకటించాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. మాస్, యాక్షన్, కామెడీ ఎలిమెంట్స్ కలబోతగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక సుందర్ సి.. ఈమధ్యనే రజనీకాంత్ సినిమా నుంచి తప్పుకున్న విషయం తెల్సిందే. రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ధర్మాన్ సినిమాకు మొదట సుందర్ సినే దర్శకత్వం వహించాల్సింది. మేకర్స్ అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ, ఆ తరువాత సుందర్ టను ఈ పెద్ద ప్రాజెక్టు ని హ్యాండిల్ చేయలేనని ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ తరువాత ధర్మాన్ అశ్వత్ మారిముత్తు చేతికి వెళ్ళింది. ఇక రజనీ సినిమా మిస్ అయ్యాక సుందర్.. కార్తీతో జతకట్టడం చాలా ఆనందంగా ఉందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరికొంతమంది .. కొంచెం గ్యాప్ ఇవ్వు అన్నా.. సర్దార్ 2 కూడా ఇంకా రిలీజ్ కాలేదు.. అప్పుడే ఇంకొకటా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు, చంద్రుల కలయిక వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఇది వ్యక్తుల జీవితంలో అదృష్టం, సంపద, కీర్తి, పురోగతి వంటి సానుకూల మార్పులను తెస్తుంది. ముఖ్యంగా, గజకేసరి యోగం ఏర్పడినప్పుడు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. సమాజంలో గౌరవం, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటాయని నమ్మకం. పండితుల ప్రకారం సెప్టెంబర్ 7 చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే ఆ రాశిలో ఉన్న గురుడితో కలిసి గజకేసరి యోగం ఏర్పరుస్తాడు. చంద్రుడికి సొంత రాశి అయిన కర్కాటకంలో ఈ యోగం ఏర్పడటం వల్ల 5 రాశులవారి అదృష్టం రెట్టింపవుతుంది. మరి ఆ రాశులేవో తెలుసుకోండి. వృషభ రాశి వారికి గజకేసరి యోగం ఆర్థికంగా మంచి రోజులు తీసుకురానుంది. ఆదాయాన్ని పెంచే కొత్త మార్గాలు కనిపిస్తాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు, కష్టానికి సరైన గుర్తింపు లభిస్తుంది. ఊహించని విధంగా కొత్త బాధ్యత లేదా ముఖ్యమైన అవకాశం మిమ్మల్ని వరించవచ్చు. వ్యాపారం చేసే వారికి కొత్త కస్టమర్లు లేదా బిజినెస్ కాంటాక్ట్‌ల ద్వారా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఇంటికి సంబంధించి చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్న కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసే అవకాశం ఉంది. మకర రాశి వారికి గజకేసరి యోగం అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇప్పటివరకు మనసులో ఉన్న గందరగోళం తగ్గి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా కాలంగా ఉన్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. భాగస్వామితో ఉన్న అభిప్రాయ భేదాలు తగ్గి, అవగాహన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మద్ధతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. ఆదాయం, పొదుపు సంబంధిత విషయాలలో సానుకూల మార్పులు వస్తాయి. కన్య రాశి వారికి ఈ గజకేసరి యోగం పురోగతికి కొత్త దారులు తెరుస్తుంది. ముఖ్యంగా డబ్బు, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి

Silver: వెండి కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త.. ఈ విషయం తెలుసుకోకపోతే మీకే నష్టం.. చాలామంది ఇది పట్టించుకోరు.. ఈ వార్తకు సంబంధించిన

అమెరికాలో గ్రీన్ కార్డ్ అందనంతదూరమేనా..? తాజా పరిణామాలు చూస్తుంటే అదే పరిస్థితి కనిపిస్తోంది. తమకలల నివాసానికి రాచబాట అయిన గ్రీన్ కార్డు కోసం ఐదేళ్లు, పదేళ్లు కాదు.. ఏకంగా వందల ఏళ్లు వెయిట్ చేయాల్సిన దారుణదుస్థితి దాపురించింది. అమెరికాలో ఉద్యోగం చేస్తూ శాశ్వత నివాసం పొందాలనుకునే భారతీయులు.. ఏకంగా ..179 ఏళ్లపాటు వేచి చూడాల్సి రావొచ్చని ‘నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ’ (ఎన్ఎఫ్ఏపీ) తాజా అంచనా వెల్లడించింది. అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో ఇతర దేశాల వారితో పోలిస్తే భారతీయులకే అత్యంత సుదీర్ఘ నిరీక్షణ ఉంటోందని తెలిపింది. డిసెంబరు 2025 నాటికి ఉద్యోగ ఆధారిత ఇమ్మిగ్రేషన్ పెండింగ్ దరఖాస్తులు 12 లక్షలు దాటాయి. వీటిలో దాదాపు 10 లక్షల మంది భారతీయులే ఉన్నారు. అంటే మొత్తం పెండింగ్ దరఖాస్తుల్లో భారతీయుల వాటా 79 శాతంగా ఉంది.జనవరి 2026 లేదా ఆ తర్వాత లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తు లేదా ఉద్యోగ ఆధారిత ఇమ్మిగ్రెంట్ పిటిషన్ దాఖలు చేసిన భారతీయులకు ఈబీ-2 కేటగిరీలో గ్రీన్‌కార్డ్ రావడానికి 179 ఏళ్లు, ఈబీ-3లో 38 ఏళ్లు, ఈబీ-1లో 5 ఏళ్లు పట్టే అవకాశం ఉందని ఎన్ఎఫ్ఏపీ పేర్కొంది. అమెరికా చట్టాల ప్రకారం ప్రతి ఏడాది ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డులకు సుమారు 1.40 లక్షల పరిమితి ఉంది. ఇందులో ఉద్యోగితో పాటు అతడి కుటుంబ సభ్యులకూ గ్రీన్‌కార్డులు ఉంటాయి. మరోవైపు దేశాల వారీగా కూడా కోటా పరిమితులు ఉన్నాయి. జనాభా భారీగా ఉన్న భారత్ వంటి దేశాలకు చిన్న దేశాలతో సమానంగా పరిమిత సంఖ్యలో గ్రీన్‌కార్డులు లభిస్తుండటంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. చైనాకు చెందిన ఈబీ-2 దరఖాస్తుదారులకు సుమారు 25 ఏళ్ల నిరీక్షణ ఉండొచ్చని ఎన్ఎఫ్ఏపీ అంచనా వేసింది. చైనా ఈబీ-3 దరఖాస్తుదారులకు దాదాపు 7 ఏళ్ల సమయం పడొచ్చని తెలిపింది. భారతీయుల ఈబీ-2 క్యూ ఎలా పెరిగిందో గత గణాంకాలు కూడా చెబుతున్నాయి. 2016లో 47,601 మంది భారతీయుల ఈబీ-2