
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Vega Leela Variety Publicity: కూటీ కోసం కోటి విద్యలు అన్నట్టు పబ్లిసిటీ కోసం నిర్మాతలు, దర్శకులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. తాజాగా ‘వేగ లీల’ మేకర్స్ తమ సినిమా టీజర్ చూసి స్టోరీ చెప్పమంటూ ప్రేక్షకులకు సరికొత్త ఛాలెంజ్ విసిరారు. ఘంటసాల నాగ విశ్వనాథ్ ఈ సినిమాకు రచనతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఈ సినిమా ఆన్లైన్ చాటింగ్, బ్లైండ్ డేటింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు ఈ టీజర్ చూస్తే తెలుస్తోంది.
సాధారణంగా ఓ సినిమా తెరకెక్కించే ప్రక్రియ చుట్టూ జరిగే కథలా కనిపిస్తున్నప్పటికీ.. టీజర్‌లోని కొన్ని సీన్స్ అసలు స్టోరీలో మరో ఆసక్తికరమైన కోణం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ‘వేగ లీల’ కథేంటి అనే బజ్ ఆడియన్స్‌లో క్రియేట్ అయింది. అసలు ‘వేగ లీల’ అనే టైటిల్ కూడా వెరైటీగా ఉండటంతో ఆడియన్స్ ఈ సినిమా కథ ఏమై ఉంటుందన్న ఆలోచన మొదలైంది.
స్ప్లాష్ కలర్ మీడియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై శ్రీ లక్ష్మి మణికర్ణిక ప్రొడక్షన్స్, జశ్రీత ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. సాయి కుమార్ మేడి, వేణు జయ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘వేగ లీల’ సినిమాలో జబర్దస్త్ ఫేమ్ ప్రియాంక సింగ్, ఆదర్శ్ పూంధీర్, సాయి ఆస్రిత్, రామ్ భూపతి, దీపకృతి రాథోడ్,అశోక్ వర్ధన్ కీ రోల్స్‌లో నటించారు. .
ఈ చిత్రానికి ఘంటసాల నాగ విశ్వనాథ్ కథ, మాటలతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. జి.వి. & పవన్ చరణ్ సంగీతం అందిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా పవన్ చరణ్‌కు ఇదే ఫస్ట్ మూవీ కావడం విశేషం. సినిమాటోగ్రఫీని దిలీప్ కుమార్ చిన్నయ్య, ఎడిటింగ్‌ను దిలీప్ కుమార్ నిర్వహిస్తున్నారు.వేగ లీల చిత్రాన్ని సెప్టెంబర్‌లో రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారు. టీజర్‌తో కథపై ఆసక్తిని పెంచిన చిత్ర బృందం.. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నట్టు చెప్పుకొచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.




