
బిగ్‌బాస్ తెలుగు 10 విజయవంతంగా ప్రారంభమైంది. 10 మంది సెలబ్రిటీలు, 6గురు కామనర్స్ హౌస్‌లో అడుగుపెట్టారు. తొలిరోజే నుంచే ఉత్కంఠగా సాగుతున్న బిగ్‌బాస్‌లో ఈసారి ఊహించన విధంగా ట్విస్టులు కనిపిస్తున్నాయి. కంటెస్టెంట్స్‌ చాలా జాగ్రత్తగా ఉంటూ ఆట ఆడుతున్నారు. ఎవరూ ఊహించని విధంగా తొలివారమే ఇద్దరు కంటెస్టెంట్స్‌ను ఎలిమినేట్ చేసి షాకిచ్చాడు బిగ్‌బాస్. బుల్లితెర నటి చైత్రా రాయ్, చరణ్‌లను ఇంటికి పంపారు. ఏమాత్రం ఊహించని ఈ ట్విస్ట్‌తో జనాలకు మైండ్ బ్లాంక్ అయ్యింది. దీంతో రానున్న రోజుల్లో గేమ్ ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.




