
లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రధాన పాత్రలో గతంలో వచ్చిన ‘అమ్మోరు తల్లి’ (మూకుత్తి అమ్మన్) చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘మహాశక్తి’ గ్రాండ్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. దర్శకుడు సుందర్ సి రూపొందిస్తున్న ఈ మైథలాజికల్ డివైన్ ఫాంటసీ చిత్రం టీజర్లో నయనతార చేతిలో త్రిశూలం ధరించి ఉగ్రరూపంలో కనిపించి ఆకట్టుకున్నారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై డాక్టర్ ఐశరి కె. గణేష్ దాదాపు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా విలన్‌గా నటిస్తుండగా, దునియా విజయ్, ఊర్వశి, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హిప్హాప్ తమిళా సంగీతం అందించిన ఈ పాన్-ఇండియా విజువల్ వండర్ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.




