
ఎనిమిది పదుల వయసులోనూ కుర్రాళ్లతోనూ సమానంగా బిజీగా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలీవుడ్ దిగ్గజం, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్. ఈ వయసులో కూడా దూకుడుగా సినిమాలే కాదు.. అందులో యాక్షన్ సీక్వెన్స్‌లలోనూ దుమ్మురేపుతున్నారు. వెండితెర మీదే బుల్లితెరపైనా తన మార్క్ చూపిస్తున్న అమితాబ్. కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్‌కు ఏకంగా 25 ఏళ్లు నుంచి ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. బిగ్‌బీ వల్లే ఈ షోకు ఈ స్థాయిలో ఆదరణ దక్కుతోందన్నది అందరికీ తెలిసిందే. అలాంటిది ఈ షో నుంచి అమితాబ్ రిటైర్ కానున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై బిగ్‌బీ స్పందించారు. ఈ వివరాల్లోకి వెళితే..




