
Repalle Ysrcp Leader Mopidevi Srinivasa Rao Suspended: వైఎస్సార్సీపీ మరో నేతపై సస్పెన్షన్ వేటు వేసింది. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నేత మోపిదేవి శ్రీనివాసరావును సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మోపిదేవి శ్రీనివాసరావు ఐదు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు.. ఇంతలోనే ఆయన్న పార్టీ నుంచి సస్పెండ్ చేయడం రేపల్లె నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది





