
భీంపూర్ (కలెక్టరేట్): సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని భాజపా మండల అధ్యక్షులు అంకం అశోక్ కోరారు. పార్టీ శ్రేణులతో కలిసి తహసీల్దార్ రమేష్‌కు వినతిపత్రం అందజేశారు. గతంలో బీఆర్‌ఎస్‌ మాదిరిగా.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వేడుకలను అధికారికంగా నిర్వహించడం లేదన్నారు. తెలంగాణ ప్రజల కలను సాకారం చేయడం లేదని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి కామన్కర్ సంజీవ్, టెకం దిలీప్, వామన్, సోమేశ్ తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.