
మదనపల్లె గ్రామీణం: వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా అధ్యక్షుడు రెడ్డప్ప, కార్యదర్శి గురు డిమాండ్ చేశారు. ఆ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మదనపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అర్హులైన వీఆర్ఏలను వీఆర్వోలుగా పదోన్నతి కల్పించాలని, నామిని వీఆర్ఏలను రెగ్యులర్ చేయాలని, వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు రమణ తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.