
డబ్ల్యూపీఎల్ 2027 (సీజన్-5) వేలాన్ని అక్టోబర్ 28, 2026న కొచ్చిలో నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. సెప్టెంబర్ 28లోగా ఐదు ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను సమర్పించాల్సి ఉంటుంది. టోర్నమెంట్ జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7, 2027 వరకు జరగనుంది. ముంబై, వడోదరలను ప్రధాన వేదికలుగా నిర్ణయించగా, ప్రతీ జట్టు రూ.15 కోట్ల బడ్జెట్తో వేలంలోకి వెళ్లనుంది. ఒక్కో ఫ్రాంఛైజీ గరిష్టంగా 18 మంది ఆటగాళ్లను (6 గురు విదేశీయులు) తమ జట్టులో ఉంచుకోవచ్చు.





