
రూ.86.21 కోట్లకు లెక్కలు ఎక్కడ? దేవాదాయ శాఖలో అవినీతి భోజ్యం జంగారెడ్డిగూడెంలో మద్ది ఆలయం ఈనాడు-ఏలూరు: జిల్లాలోని ఆలయాల్లో ఆడిట్‌ అభ్యంతరాలు కొండలా పేరుకుపోయాయి. 2024-25 వరకు 154 దేవాలయాల్లో రూ.86.21 కోట్ల విలువైన అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇంత పెద్ద సంఖ్యలో మిగిలిన జిల్లాల్లో లేవు. దీనిపై వివరణ ఇవ్వడానికి ఈవోలు ముందుకు రావడం లేదు. దేవాదాయ శాఖ జిల్లా అధికారులు అడగడం లేదు. కామవరపుకోట, లింగపాలెం, కొయ్యలగూడెం, ముసునూరు, టి.నరసాపురం, ద్వారకాతిరుమల, మండవల్లి, జీలుగుమిల్లి మండలాల్లోని దేవాలయాల్లో రూ.20 లక్షల నుంచి రూ.కోటి లోపు, మిగిలిన మండలాల్లో రూ.కోటికిపైగా అభ్యంతరాలు ఉన్నాయి. భక్తులు దేవుడిపై నమ్మకంతో కానుకలు సమర్పిస్తారు. ఇదే ఏ గుడికైనా ప్రధాన ఆదాయం. భూముల కౌలు, దుకాణాల లీజులు, కల్యాణ మండపాల అద్దెల రూపేణా కొంత సమకూరుతుంది. ఈ ఆదాయాన్ని హారతి కర్పూరంలా కరిగించేస్తున్నారు. పొంతన లేని ఖర్చులు రాసేసి దేవుడి సొమ్మును పక్కదారి పట్టిస్తున్నారు. 6 (ఏ), బీ, సీ, డీ పరిధిలోని అన్ని ఆలయాల్లో కలిపి 28,592 అభ్యంతరాలు వ్యక్తమైతే వాటిల్లో సగానికి కూడా సమాధానాలు రాలేదని తెలిసింది. జిల్లాలో సహాయ కమిషనర్, ప్రధాన దేవాలయాల ఈవోలు వాటికి బాధ్యత వహించాల్సి ఉంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





