
రాజాం: పట్టణంలోని ప్రశాంతినగర్‌కు చెందిన శెట్టి కన్నతల్లి (77)విశాఖలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వీరిది ప్రముఖ వైద్యుల కుటుంబంగా పేరుంది. ఈమెకు ఒకు కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. భర్త దివంగత రామినాయుడు పట్టణంలో పేరున్న వైద్యుడిగా గుర్తింపు పొందారు. కుమారుడు శ్రీనివాసరావు పెరుమాళి పీహెచ్‌సీలో, కుమార్తె ఉమాదేవి బాడంగి పీహెచ్‌సీలో ఆయర్వేద వైద్యులుగా సేవలు అందిస్తున్నారు. చిన్న కుమార్తె సత్యవాణి ప్రసూతి వైద్య నిపుణురాలు కాగా, అల్లుడు కరణం హరిబాబు చిన్న పిల్లల వైద్యనిపుణుడు. పెద్ద కుమార్తె శ్రీదేవి నర్సీపట్నం మండల వ్యవసాయాధికారిగా ఉన్నారు. అల్లుడు ప్రసాదరావు మత్తు వైద్య నిపుణుడు (అనస్థీషియన్). ఇంట్లో 15 రోజుల క్రితం దీపం వెలిగిస్తూ ప్రమాదవశాత్తూ చీరకు నిప్పంటుకుని కన్నతల్లి గాయపడ్డారు. అప్పటి నుంచి విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, తూర్పు కాపు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ కొల్ల అప్పలనాయుడు, జీఎంఆర్ కేర్ ఆసుపత్రి వైద్య విభాగం డైరెక్టర్ డా. దామెర రాజేంద్ర, పలువురు వైద్యులు, న్యాయవాదులు, ప్రముఖులు ఆమెకు నివాళులర్పించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




