
రెండు నెలల్లో 4,411 మందిపై కుక్కల దాడి గాజువాకలో ఓ ఇంటి ముందు వీధి కుక్కలు గాజువాక పీహెచ్‌సీలో నెల రోజుల్లో 95 మందికి 380 డోసుల రేబిస్‌ వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. రెడ్డికంచరపాలెం నుంచి జాషువానగర్‌ వెళ్లే రోడ్డులో సుమారు నెల రోజుల క్రితం ఓ వీధి కుక్క నాలుగు రోజుల వ్యవధిలో 11 మందిని కరిచింది. రెండు రోజుల క్రితం మధురవాడ పరదేశిపాలెంలోని ఓ వీధిలో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారుల(అయిదేళ్లు)పై కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఒకరికి మోచేయి వద్ద తీవ్ర గాయం కాగా, మరో బాలుడికి కాలి కండరం దెబ్బతింది. వారం రోజుల క్రితం 24వ వార్డు గాంధీనగర్‌ వీధిలో శునకాల గుంపు ఓ వాహన చోదకుడి వెంటపడటంతో బెదిరిపోయిన అతను వేగంగా వాహనం నడిపి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నెల రోజుల కిందట 14వ వార్డు బాలయ్యశాస్త్రి లేవుట్ పోర్టు స్టేడియం వెనుక మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన ఓ వృద్ధుడిపై కుక్క దాడి చేసింది. గురుద్వారా, గాజువాక, కంచరపాలెం, మధురవాడ, న్యూస్‌టుడే: వీధి కుక్కల దాడులతో నగర ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వృద్ధులు, మహిళలు, ఉద్యోగులు, చివరకు పాఠశాలలకు వెళ్లే చిన్నారులను సైతం దాడి చేసి గాయపరుస్తున్నాయి. యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌(ఏఆర్‌వీ) కోసం నిత్యం బాధితులు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. జిల్లాలో 66 యూపీహెచ్‌సీ, 9 పీహెచ్‌సీలు ఉండగా రెండు నెలల కాలంలో 4,411 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇక ప్రైవేటు ఆసుపత్రులకు ఈ సంఖ్యకు మించి వెళ్లారని సమాచారం. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకొని వీధి కుక్కల బెడద నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. వాటి భయానికి కారణాలివే..: సాధారణంగా కుక్కల సంతానోత్పత్తికి ఆగస్టు నుంచి నవంబరు వరకు అనువైన సమయమని జీవీఎంసీ వెటర్నరీ విభాగ అధికారులు తెలిపారు. ఈ సమయంలో అవి ఆందోళనతో ఉంటాయని, ఆహారం దొరక్క ఆగ్రహంతో జనంపై దాడికి పాల్పడుతుంటాయన్నారు. జంతు ప్రేమికులు ఎక్కడ పడితే అక్కడ వాటికి ఆహారం పెట్టకుండా యానిమల్‌ ఫీడింగ్‌ జోన్లలోని షెల్టర్లలో ఆహారం పెట్టే అలవాటు చేయడం ద్వారా కుక్క కాటు సమస్యను తగ్గించవచ్చని చెబుతున్నారు. 24వ వార్డు గాంధీనగర్‌ నగరంలో 1.43 లక్షల వీధి కుక్కలు..: జీవీఎంసీ లెక్కల ప్రకారంగా విశాఖ నగర వ్యాప్తంగా 1.43 లక్షల వీధికుక్కలు ఉన్నాయి. ఇందులో 92 వేల కుక్కలకు ఏబీసీ ఆపరేషన్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. నగర శివారులోని నరవ, ఆరిలోవ, కాపులుప్పాడలో ఆపరేషన్లు చేస్తున్నామని తెలిపారు. నిబంధనల ప్రకారం పట్టిన కుక్కలను శస్త్ర చికిత్సల అనంతరం మళ్లీ యథాస్థానంలో విడిచిపెడుతున్నట్లు పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




