
చోడవరం, న్యూస్‌టుడే: ఉమ్మడి విశాఖ జిల్లాలో స్వయంభువునిగా వెలసిన వినాయకుడి ఆలయం చోడవరంలోనే ఉంది. ఈ గణపతిని కొలిచి కోర్కెలు చెప్పుకొంటే నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. దీంతో కార్యసిద్ధి వినాయకుడిగా ప్రసిద్ధి చెందాడు. రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తుంటారు. భక్తుల సహకారంతో తూర్పు, పడమర రెండు రాజగోపురాలు ఇటీవల నిర్మించారు. ఇందుకోసం రూ.1.5 కోట్లకుపైగా వెచ్చించారు. తూర్పు గోపురం వైపు వినాయక, కుమార స్వామి విగ్రహాలను పదడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు. కొత్తగా చేపట్టిన నిర్మాణాలతో ఆలయానికి మరింత శోభ చేకూరింది. దక్షిణం వైపు గోపురం నిర్మిస్తే ఆలయానికి నాలుగు వైపులా రాజగోపురాలతో ఈ క్షేత్రం మరింత ప్రసిద్ధి చెందుతుంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.