
విఘ్నాలను తొలగించేవాడు వినాయకుడు. హిందువులు ఏ పని తలపెట్టినా విఘ్నేశ్వరుడ్నే ముందుగా పూజిస్తారు. ఏ పూజలు, నోములు, వ్రతాలు చేసినా గణపతి సంకల్పంతో మొదలవుతుంది. చేపట్టిన పనులు నిర్విఘ్నంగా సాగాలంటే గణపతిని తలచుకోవాలి. గణాలకు అధిపతి కాబట్టే ప్రతి కార్యంలోనూ ఆయన తొలిపూజ అందుకుంటాడు. అందుకే హిందువులు వినాయకచవితిని తమ తొలి పండుగగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులు వినాయక విగ్రహాలను పెట్టి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.





