
ఇంటర్నెట్‌ డెస్క్: విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘మహారాజ’ (Maharaja). నిథిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి.. ఆయన కెరీర్‌లోనే మంచి గుర్తింపు తెచ్చిన చిత్రంగా నిలిచిపోయింది. ఇప్పుడీ సినిమా హాలీవుడ్‌లో రీమేక్‌ కానుంది. ఎన్నో రోజులుగా దీనిపై వార్తలు వస్తున్నప్పటికీ తాజాగా హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ ‘ప్యాషన్‌ స్టూడియోస్‌’ ఈసినిమాను రీమేక్‌ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది (Maharaja Hollywood). దీనిని ఓ మైలురాయిగా పేర్కొన్న నిర్మాణ సంస్థ.. హాలీవుడ్‌లో రీమేక్‌ కానున్న మొదటి తమిళ సినిమాగా ఇది రికార్డు సాధించిందని తెలిపింది. ఇక ‘మహారాజ’ హాలీవుడ్‌ రీమేక్‌లో విజయ్‌ సేతుపతి పాత్రను ఆస్కార్ విన్నర్, స్టార్ హీరో మాథ్యూ (Matthew McConaughey) పోషించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే నటీనటుల వివరాలు వెల్లడించే అవకాశముంది. విజయ్‌ సేతుపతి 50వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మహారాజ’.. ఆయనకు ఉత్తమ నటుడిగా పలు అవార్డులు తీసుకువచ్చింది. తమిళ, తెలుగు భాషలతో పాటు చైనాలో విడుదల చేయగా అక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




