
తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy)పై మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ భగాయత్‌లో ఆర్య వైశ్య ఆత్మగౌరవ భవనానికి సీఎం రేవంత్‌ ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి టీజీ వెంకటేష్‌ హాజరై మాట్లాడారు. ‘‘రేవంత్‌ రెడ్డి మాటల్లోని గట్టితనం ఆయన చేతల్లో ఉండదు. ఆయన గట్టిగా ఉంటే తెలంగాణలో ఎంతో మంది జైలుకి వెళ్లేవారు. ఆయన చాలా ఓపికగా ముందుకు వెళతారు’’ అన్నారు. ఈ వీడియో చూశారా: మంత్రి పదవి పోయిందని ఇంట్లో కూర్చోం: కొండా సురేఖ






