
సూపర్‌స్టార్ మహేశ్ బాబు మరియు ప్రముఖ దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'వారణాసి'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్త సూపర్‌స్టార్ మహేశ్ బాబు మరియు ప్రముఖ దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'వారణాసి'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ నేపథ్యంలో, చిత్రంలో నెగిటివ్ రోల్లో నటిస్తున్న మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, ఈ సినిమా కథపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పృథ్వీరాజ్ మాట్లాడుతూ, 'వారణాసి సినిమా కేవలం టైమ్ ట్రావెల్ స్టోరీ కాదు. ఇది అంతకు మించిన స్థాయిలో ఉంటుంది. ఈ కథ డిఫరెంట్ టైమ్ ట్రావెల్స్ మధ్య సాగుతుంది' అని తెలిపారు. ఈ వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. అలాగే, రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు, ప్రియాంక చోప్రాతో కలిసి పనిచేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల, పృథ్వీరాజ్ సుకుమారన్ 'వారణాసి' చిత్రానికి సంబంధించిన తన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకున్నట్లు సమాచారం. మిగతా భాగానికి సంబంధించిన చిత్రీకరణను కూడా త్వరలోనే పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ను గ్లోబల్ స్థాయిలో ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారని సమాచారం. రాజమౌళి ప్రమోషన్స్‌కు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను ఇప్పటికే సిద్ధం చేసారని టాక్ నడుస్తోంది. ఈ చిత్రం పలు విదేశీ భాషల్లో విడుదల కానున్నందున, ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో ఉండనున్నాయి. రాజమౌళి తన సినిమాల షూటింగ్‌ను చాలా గోప్యంగా ఉంచడం ద్వారా ప్రసిద్ధి చెందారు. ఆయన రూపొందించిన ప్రతి సినిమాకు సంబంధించిన సమాచారం చాలా జాగ్రత్తగా నిర్వహించబడుతుంది.






