
Palnadu District Two Maoists Surrender: పల్నాడు జిల్లాలో ఇద్దరు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. నరసరావుపేటలోని అదనపు ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి సమక్షంలో కందర్ప దుర్గా ప్రసాద్, గొడ్డళ్ల లచ్చమ్మ లులొంగిపోయారు. కందర్ప దుర్గా ప్రసాద్ స్వస్థలం విశాఖపట్నం అక్కయ్యపాలెం కాగా.. లచ్చమ్మ స్వస్థలం పల్నాడు జిల్లాలో వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తండా. వీరిద్దరు భార్యాభర్తలు కాగా.. మావోయిస్టు పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరించారు.





