
MLA Talasani | మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్‌లోని పంచముఖ సంకట హర మహా గణపతిని దర్శించుని పూజలు చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ తలసానిని సన్మానించి గణపతి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద వినాయకుడిగా ఖైరతాబాద్ గణపతికి గుర్తింపు ఉందన్నారు. 69 సంవత్సరాల నుండి గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అతిపెద్ద ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి వస్తారన్నారు. ప్రజలందరిపై ఆ గణనాధుడి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉండాలి. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లు చేసిన ఉత్సవ కమిటీ కి శుభాకాంక్షలు తెలిపారు.