
ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి అవయవదానం.. అయిదుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. కామారెడ్డికి చెందిన కుడిక్యాల వినయ్(26) సాఫ్ట్వేర్ఉద్యోగి. ఈ నెల 16న బ్రెయిన్ ట్యూమర్ సమస్యతో ఇంట్లో ఉన్నట్టుండి కింద పడిపోయారు.
నిమ్స్‌: ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అవయవదానం.. అయిదుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. కామారెడ్డికి చెందిన కుడిక్యాల వినయ్‌(26) సాఫ్ట్‌వేర్‌ఉద్యోగి. ఈ నెల 16న బ్రెయిన్‌ ట్యూమర్‌ సమస్యతో ఇంట్లో ఉన్నట్టుండి కింద పడిపోయారు. కుటుంబీకులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యం అందించినా ఫలితం లేకపోవడంతో బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ఎస్‌వోటీటీవో తెలంగాణ వైద్యబృందం అవగాహన కల్పించింది. ఆయన వద్ద నుంచి కిడ్నీలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు సేకరించి ప్రాణాపాయ స్థితిలోఉన్న వారికి శస్త్ర చికిత్స ద్వారా అమర్చినట్లు నోడల్‌ అధికారి ప్రొఫెసర్‌ శ్రీభూషణ్‌రాజు పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





